khilafat movement |
–డా . శ్రీరంగ్ గోడ్బోలే
ఖిలాఫత్ ఉద్యమం ( 1919 – 1924 ) 1919 అక్టోబర్ 27న మొదలైంది, ఆ రోజునే ఖిలాఫత్ దినంగా అనుసరించారు. సంవత్సరం తిరగక ముందే కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు లోకమాన్య తిలక్ మరణం, అదే సమయంలో గాంధీజీ భారతీయ రాజకీయ రంగంలో ప్రముఖ స్థానాన్ని అందుకోవటం జరిగింది . అంబేద్కర్ ఉటంకించినట్టు “ ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీజీ తన భుజాల మీదికి ఎత్తుకోవటం ఎంతోమంది మహమ్మదీయులకే ఆశ్చర్యం కలిగించింది.’’ (Pakistan or the Partition of India, B.R. Ambedkar, Thacker and Company Limited, 1945, p. 136). గాంధీజీ ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరచటమే కాకుండా తనతోపాటు కాంగ్రెస్ ను బలవంతంగా అందులోకి లాగారు. ఖిలాఫత్ ఉద్యమం గురించిన ముస్లిం నాయకులు, హిందూ నాయకుల చర్యలు వారి విధానాలు హటాత్తుగా వచ్చిన ప్రతిచర్యలు కాదు. 1857లో ప్రారంభమైన విధానమే. హిందూ నాయకత్వపు గుడ్డి నమ్మకం , బ్రిటిష్ వారి మోసపూరిత ఉపేక్ష 1857 నుండి 1919 వరకు ముస్లిం వర్గాల వ్యూహా రచన ఖిలాఫత్ ఉద్యమానికి ఎలా ఊపిరులు ఊదిందో మనం తెలుసుకోవాలి.
బ్రిటిష్ వారి వ్యూహాత్మక కార్యక్రమం మరియు విధాన నిర్ణయం
మన పాఠ్య పుస్తకాలలో, చలన చిత్రాలలో బ్రిటిష్ వారి “ విభజించు – పాలించు “ విధానం వల్లనే హిందూ, ముస్లింల మధ్య విరోధం ఏర్పడిందని అనుకోవటం సరైనదా, కాదా అని మనం ఇప్పటికైనా తర్కించి చూడాలి . అసలు ఈ “విభజించు – పాలించు“ అనేవి లాటిన్ భాషలో డివైడ్ ఎట్ఇంపెర ( విభజించు –గెలువు ) అని పురాతన రోమన్ లు వాడే మాటలు. అయితే “ విభజించు – పాలించు “ అనే విధానం బ్రిటిష్ వారి విధానం అని మనం అనుకోవటానికి ఈ క్రిందివ్యాఖ్యానాలు కారణం (India in Bondage: Her Right to Freedom, Jabez T. Sunderland; R. Chatterjee, 1928, p. 268):
- మే 1821 ఏసియాటిక్ రివ్యూ లో (డివైడ్ ఎట్ ఇంపెర( విభజించు – గెలువు అన్న విధానంలో మనం భారతీయ రాజకీయ, పౌర, సైనిక పరిపాలన సాగించాలి అని కర్నటికుస్ (Carnaticus) అనే పేరుతో ఒక బ్రిటిష్ ఆఫీసర్ ప్రకటించారు.
- 1857 తిరుగుబాటు సమయం లో మొరాదాబాద్ ప్రాంతంలో సైన్యాన్ని నడుపుతున్న లెఫ్టినెంట్ కల్నల్ జాన్ కోక్ తన పైఅధికారికి ఈ విధంగా వ్రాసారు – “ మన అదృష్టం కొద్ది వివిధ మతాల మధ్య, జాతుల మధ్య వున్న శతృత్వం మనకు ఆధారం, వారిలో ఐక్యత , సఖ్యత ఏర్పడకుండా డివైడ్ ఎట్ ఇంపెర (విభజించు, విజయం సాధించు)అన్న విధానంలోనే భారత ప్రభుత్వాన్ని నడపాలి “
- లార్డ్ ఎల్ఫి స్టోన్ బొంబాయి నగర గవర్నర్ గా ఉన్నప్పుడు అధికార పత్రాలలో ఇలా వ్రాసుకున్నారు- “డివైడ్ ఎట్ ఇంపెర (విభజించు, విజయం సాధించు) విధానం పురాతన రోమన్ విధానం. అదే మన విధానం కూడా “
- ప్రఖ్యాత బ్రిటిష్ ఇండియన్ పౌర అధికారి, రచయిత సర్ జాన్ స్ట్రాచే “ భారత దేశంలో వివిధ మతాలు, జాతుల మధ్య శత్రుత్వమే మన అధికార ప్రాభవానికి, రాజకీయ స్థిరత్వానికి రక్ష “ అని అన్నాడు.
- “ విభజించు – పాలించు విధానం వల్లే బ్రిటిష్ అధికారం కొనసాగుతోందని “ ఏ ఓ హ్యుం తనతో అన్నారని గాంధిజీ చెప్పారు.
ఈ విభజించి పాలించే విధానం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం నడపటం అంత ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదు . ఆచరణాత్మక వ్యూహం లేకుండా ఒక్క విభజించి పాలించు అనే విధానంతో ఈ విశాల దేశాన్ని పాలించడం అసంభవం. ప్రతీ సమస్యకీ “ విభజించి పాలించు “ అనే విధానమే కారణం అనుకోవడం , ఆచరణాత్మక వ్యూహం ఏమిటి అని చర్చించకపోవటం మన ఆలోచనాత్మక నిష్క్రియత్వాన్ని తెలుపుతుంది.
నిజానికి హిందూ ముస్లిం శతృత్వం బ్రిటిష్ వారు సృష్టించిందేమి కాదు. వారు ఈ గడ్డ పై అడుగు పెట్టక ముందే ఈ శతృత్వం ఉంది. స్వాత్రంత్య పోరాటం లో “ హిందూ ముస్లిం భాయి భాయి “ అని ప్రత్యేకంగా ప్రకటించడానికి ప్రధాన కారణం ఏమిటీ అంటే హిందువులూ , ముస్లింలూ అప్పటికికలసివుండే వారు కాదు కాని స్వాతంత్య్ర సాధన కోసం వారు కలిసి పని చెయ్యాలి అని దేశ నాయకత్వం కోరుకుంది. “ హిందూ –పార్సీ భాయి భాయి “ అనో , “ హిందూ – క్రిస్టియన్ భాయి భాయి “ అనో నినాదాలు ఎందుకు ముందుకు రాలేదు? బ్రిటిష్ వారి వల్లే హిందూ ముస్లిం శతృత్వం ఏర్పడితే వారు దేశాన్ని వదిలి వెళ్ళగానే హిందూ ముస్లిం లు కలిసి పోవాలి కదా ? అలా ఎందుకు జరగలేదు ?.బ్రిటిష్ వారి పాలనలో లేని థాయిలాండ్ వంటి దేశాలలో ముస్లిం వర్గాలకి, ముస్లిమేతర వర్గాలకి ఎందుకు శతృత్వం ఏర్పడింది ? . ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే ఇద్దరు ముఖ్యులైన నాయకుల అభిప్రాయాలని మనం గమనించాలి. వీరు ఇరువురూ కాంగ్రెస్ సభ్యులు కాదు. వీరిద్దరూ ముస్లిం వ్యవహార విధానాన్ని బాగా అవగాహన చేసుకున్నవారు. ఒకరు వీర సావర్కర్ (1883-1966), రెండోవారు డా. బి ఆర్ అంబేద్కర్ (1891-1956)!
1939 వ సంవత్సరం అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షోపన్యాసంలో వీర సావర్కర్ ఈ మూర్ఖ వాదనను తూర్పారబట్టారు. ముస్లిం వర్గాలు బ్రిటిష్ వారి వల్ల హిందూల పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు అనుకోవటం శుద్ధ అబద్దమని, ముస్లిం వర్గాలను పట్టించుకోకుండా వదిలేస్తే వారు దేశ వ్యతిరేక , హిందూ వ్యతిరేక , కుటిల చర్యలు ఏవీ చేపట్టరని అనుకోవడం మూర్ఖత్వమనీ, ఈ మూర్ఖపు నమ్మకంతో వేలాది కాంగ్రేస్ హిందువులు మునిగిపోయారని బాధ పడ్డారు. మహమ్మద్ ఖాసిం , ఘజని , ఘోరి, అల్లాఉద్దిన్ ఖిల్జీ , ఔరంగజేబ్ లాంటి క్రూరులు బ్రిటిష్ వారి వల్లే హిందూ రాజ్యాలపై పైశాచిక, మత పరమైన దాడులు చేశారా ? పది శతాబ్దాల నుంచీ అవిచ్చిన్నంగా సాగుతున్న హిందూ ముస్లిం యుద్దాలు కాల్పనిక చరిత్రా ? అలీ , జిన్నా , సిఖందర్ వంటివారందరూ బ్రిటిష్ వారు చెప్పే చాడిలని నమ్మి తన పక్కింటి వారి మీద రాళ్ళ దాడి చెయ్యటానికి పాలు తాగే పసిపిల్లలా? బ్రిటిష్ వారు రాక ముందు మత కలహాలు వినలేదు అన్నది నిజమే ఎందుకంటే , అప్పుడు కలహాలు కాదు హిందూ ముస్లిం యుద్దాలే జరుగుతుండేవి. ఇది గమనించాల్సిన అంశం (Hindu RashtraDarshan, V.D. Savarkar, Maharashtra Prantik Hindusabha, pp.57, 58).
హిందూ ముస్లిం విరోధపు మూలాల పై అంబేద్కర్ మహాశయుని మాటలు
“ బ్రిటిష్ వారి ‘ విభజించు – పాలించు ‘ విధానం వల్ల హిందూ ముస్లిం విరోధం కొనసాగుతోంది, లేకపోతే ఎంతో ఐకమత్యం తో దేశం విలసిల్లేది “ అని మూర్ఖ వాదన చేస్తున్న హిందువులు ఈ పిచ్చివాదపు భ్రమలో ఉండొద్దు, బ్రిటిష్ వారి విధానం కొనసాగుతోంది అంటే, నిప్పు ఉంది కాబట్టి పొగ వస్తోంది. ఇది గమనించాలి. వివేకం గలిగిన వారు అర్ధం చేసుకోవాల్సిన సంగతి ఏమిటీ అంటే హిందూ ముస్లిం వర్గాల మధ్య శాశ్వతమైన , పరిష్కరించలేని వైరుధ్యం ఉంది. అది ఉద్రేకం వల్లనో, ఆవేశాల వల్లనో వచ్చినది కాదు. హిందూ ముస్లిం వైరుధ్యం చిన్న చిన్న విషయాల వల్ల వచ్చిన గొడవలు కావు. ఈ వైరుధ్యాలు చారిత్రాత్మిక , మత , సాంస్కృతిక , సామాజిక కారణాల వల్ల పుట్టిన వైరుధ్యాలు. సామాజిక వైరుధ్యాన్ని మాత్రం గమనించి హిందూ ముస్లిం లు సఖ్యంగా వుండాలి అని కలలు కనడం మానేసి మనం విధాన పరమైన వ్యూహాన్ని ఆలోచించాల్సిన సమయం ఇది. (Pakistan or the Partition of India, ibid, pp.322-323).
స్వతంత్ర సంగ్రామానికి దూరంగా ముస్లింలు
28 డిసెంబర్ 1885 లో కాంగ్రెస్ సంస్థ బ్రిటిష్ వారి ఆధ్వర్యం లో ఏర్పాటైంది. వైస్రాయి డఫేరిన్ , ఏ ఓ హ్యుం తదితరులు ఈ సంస్థను స్థాపించిన వారిలో ప్రముఖులు. 1890 లో బ్రిటిష్ వారు కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. అయినప్పటికీ, 1905 వరకూ ఆ సంస్థ బ్రిటిష్ విధేయ సంస్థగా నే ఉంది. కాంగ్రెస్ కు సమాంతరంగా సాయుధ తిరుగుబాటు, విప్లవ పంథా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సమాంతర ఉద్యమంలో ముస్లింల పాత్ర మచ్చుకైనా కానరాదు. 1900 వ సంవత్సరం తరువాత కాంగ్రెస్ నుంచీ ముస్లిం వర్గాలు విరమించుకోవడం ప్రారంభమైంది (The Khilafat Movement in India 1919-1924, A.C. Niemeijer, MartinusNijhoff, 1972, p. 24-27).
కాంగ్రెస్ వారి మొదటి సర్వసభ్య సమావేశాన్ని గురించిన వార్త లో (TheTimes of India dated 5 February 1886) “ ఊహించినట్టుగానే మహమ్మదీయులు ఈ సభలో పాల్గొనలేదు. వారు ఎప్పటిలాగానే తాము వేరే జాతి అని వేరే వర్గాలతో దూరంగా ఉంటామని నిరూపించారు “ అని వ్రాసింది. ముస్లిం వర్గం పూర్తి గా పెడసరంగా ఉందన్న ప్రచారం కాంగ్రెస్ నాయకత్వాన్ని చాలా కలవరపరచింది. (Source Material for A History of the Freedom Movement in India, Vol.2, 1885-1920, Bombay State, 1958, pp. 17, 22-23). 1886 లో కలకత్తా నగరంలో జరిగిన రెండవ సర్వసభ్య సమావేశానికి హజరవుదాం అనుకున్న కొంతమంది ముస్లిం ప్రతినిధులను, “ హిందూవులు మనకన్నా చాలా ముందు ఉన్నారు. మనమేమో వెనకబడి ఉన్నాము. మనం ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందాల్సిన అవసరం ఉంది. ఈ హిందువులతో కలిస్తే మనకేమి ప్రయోజనం? ” అని తోటి ముస్లిం వర్గాలు నిరుత్సాహపరచాయి. (Source Material, ibid, p. 34). ఎప్పుడైతే ముస్లిం వకీలు బద్రుద్దీన్ తయ్యాబ్జి 1888 మద్రాస్ సర్వసభ్య సమావేశం లో అధ్యక్ష పదవిని ఒప్పుకోవడంతో కాంగ్రెస్ నాయకత్వపు ఆనందానికి పట్టపగ్గాలు లేవు. తయ్యబ్జి మహాశయుడు తన నిజస్వరూపం, ఆలోచన సర్ సయ్యిద్ అహ్మద్ ఖాన్ కు 1888 ఫిబ్రవరి 18న వ్రాసిన లేఖలో ఈవిధంగా తెలియ పరచారు – “ కాంగ్రెస్ పట్ల మీ అభ్యంతరం వారు భారత్ ను ఒకే జాతిగా పరిగణిస్తున్నారు. నా అభిప్రాయంలో అలా ఆలోచిస్తున్న వారు ఎవరు లేరు. కావాలంటే నా అధ్యక్ష ఉపన్యాసంలో భారతదేశం ఒక జాతి కాదని అనేక జాతుల సముదాయమని నేను గట్టిగా చెబుతాను. ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో ముస్లిం వర్గాలకు ఎవరైనా నచ్చక పోతే వారికి వ్యతిరేకంగా తమకు కావలసిన చట్టాలు చేసుకునే వీలు కలిగించేటట్టు ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యవస్థ లోపల ఉండి పనిచేయటం వల్ల ఇలాంటి వెసులుబాటు మనకు లభిస్తుంది. (Source Material, ibid, pp. 72-73, emphasis not mine).
హ్యుమ్, తయ్యాబ్జిల వారసత్వం
ముస్లిం వర్గాలు కలిసి రావేమో అన్న ఆతృతతో కాంగ్రెస్ నాయకత్వం, మరీ ముఖ్యంగా హ్యుం( అతను అతని బ్రిటిష్ సహచరులు ), తయ్యాబ్జి ( ముస్లిం వర్గాల కోసం వ్యవస్థను ఉపయోగించుకుంటాను అని నిర్ణయంతో పని చేస్తున్నవారు) కలిసి అనేక అర్ధరహితమైన ముస్లిం అనుకూల సూత్రాలు ప్రవేశ పెట్టారు. ఈ సూత్రాల ప్రభావం హిందువుల పై ఖిలాఫత్ ఉద్యమ సమయంలో బాగా పడింది. అప్పుడే కాకుండా ఈ రోజున కూడా వారిని అదే మాయలో ఉంచుతోంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే వైస్రాయ్ డఫ్ఫెరిన్ అటు కాంగ్రెస్ వారికి ( హ్యూమ్ కు), ఇటు కాంగ్రెస్ వ్యతిరేకి సర్ సయ్యిద్ అహ్మద్ కు తానే ఆదేశాలు, సూచనలు ఇస్తూ ఉండేవాడు. (Source Material, Vol. 2, p. 88). ఆ అద్భుతమైన సూచనలు ఏమిటంటే –
- 1. జాతీయ ఉద్యమం అనిపించుకోవాలి అంటే ‘ ముస్లిం ల ‘ భాగస్వామ్యం ఉండాలి : 1888 అక్టోబర్ 27న హ్యూమ్ కు రాసిన లేఖలో తయ్యాబ్జి ఇలా అన్నారు – “ ముస్లిం వర్గాలలో అనేకమంది ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నారు. మా ముస్లిం వర్గాలన్నీ కాంగ్రెస్ కి వ్యతిరేకం. అది తప్పా ఒప్పా అనే విషయం పక్కన పెడితే, కాంగ్రెస్ ను జాతీయ కాంగ్రెస్ అని పిలవలేము. అందువల్ల అది జాతికి మేలు చేసే స్థితిలో లేదు“ (Source Material, Vol. 2, p. 81).
- 2. ముస్లిం వర్గాల మద్దతు కావాలంటే వారిని బుజ్జగించాలి : 1888 జనవరి 22న తయ్యాబ్జికి వ్రాసిన లేఖలో హ్యుం ఇలా పెర్కొన్నాడు – “ మనం విజయం సాధించాలి అంటే కాంగ్రెస్ కు ఒక మహమ్మదీయ అధ్యక్షుడు అత్యవసరం. ఆ అధ్యక్షుడు మీరే గనక అయితే సర్ అహ్మద్ వదరుబోతు వ్యాఖ్యల ప్రభావం ఉత్తర భారత ముస్లిం వర్గాల మీద ఉండదు.” (Source Material, Vol. 2, p. 69).
- 3. ప్రజా సంబంధ వ్యవహారాలలో ‘ ముస్లిం వర్గాలకు ప్రత్యేక నిర్ణయాధికారం ఇవ్వటం ‘ : పయనీర్ పత్రికలో సంపాదకునికి వ్రాసిన ఒక లేఖలో తయ్యాబ్జి ఇలా ప్రకటించారు- “ నేను కాంగ్రెస్ కు స్పష్టంగా చెప్పాను, ఒక వేళ ముస్లిం ప్రతినిధులు ఎక్కువ మంది ఒప్పుకోక పోతే అటువంటి విషయం ఏదైనప్పటికీ , ఎటువంటి నిర్ణయమైనప్పటికీ కాంగ్రెస్ పూర్తిగా విరమించాల్సిందే. ఈ విషయాన్ని ఒప్పించడానికి చాలా శ్రమ పడ్డాను “(Source Material, Vol. 2, p. 82).
- 4. ప్రపంచ వ్యాప్త ముస్లింల గురించి భారతీయులు అందరూ ఆలోచించాలి. అది వారి బాధ్యత అన్నట్లు వ్యవహరించాలి : 1888 ఆగష్టు 30న తయ్యాబ్జికి వ్రాసిన లేఖలో ఒక బ్రిటిష్ వ్యక్తి ఈ విధంగా వ్రాసాడు- “ కాంగ్రెస్ జాతీయ సంస్థ అయినట్టయితే హిందూవులు, తమ దేశం లో 50 మిలియన్ ముస్లిమ్ సోదరులకు విలువ ఇవ్వాలి. ప్రపంచలోని ఇతర దేశాలలో ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న కష్టాలకి వీరు ( హిందువులు ) సానుభూతి చూపి, ముస్లింలతో సంఘీ భావం ప్రకటించాలి. వచ్చే సమావేశంలోనైనా ప్రపంచవ్యాప్త ముస్లిం సోదరుల కష్టాలకు తమ బాధను వ్యక్తం చెయ్యాలి. అసలు ఇన్ని రోజులు అలా చెయ్యనందుకు సిగ్గుపడాలి .” (Source Material, Vol. 2, p. 74).
ముస్లింల వెనుకే బ్రిటిష్
భారత జాతీయ భావనను తొక్కివేయటానికి బ్రిటిష్ వారు ముస్లింలకు ఎన్నో తాయిలాలు ఇచ్చారు అన్నది జగమెరిగిన సత్యం. ముస్లింలకు వారి జనాభా సంఖ్యను మించి ప్రతినిదిత్వాన్ని కలిగించడం, దామాషా పద్దతిని దాటి ప్రతినిధులను ఎన్నుకోవటం జరిగింది. ముస్లింలను బుజ్జగించే అత్యుత్సాహంతో, ఒక వర్గాన్నైనా తన ఆధీనం లో ఉంచుకోవచ్చు అనే అత్యాశతో బ్రిటిష్ వారు ముస్లింలు అడిగిన దాని కంటే ఎక్కువ ఇవ్వటం ప్రారంభిస్తే, విషయ అవగాహన లేని కాంగ్రెస్ హిందూ నాయకత్వం బ్రిటిష్ విధానాన్ని అంగీకరిస్తూ పోయింది.
భారత జాతీయ భావనను తొక్కివేయటానికి బ్రిటిష్ వారు ముస్లింలకు ఎన్నో తాయిలాలు ఇచ్చారు అన్నది జగమెరిగిన సత్యం. ముస్లింలకు వారి జనాభా సంఖ్యను మించి ప్రతినిదిత్వాన్ని కలిగించడం, దామాషా పద్దతిని దాటి ప్రతినిధులను ఎన్నుకోవటం జరిగింది. ముస్లింలను బుజ్జగించే అత్యుత్సాహంతో, ఒక వర్గాన్నైనా తన ఆధీనం లో ఉంచుకోవచ్చు అనే అత్యాశతో బ్రిటిష్ వారు ముస్లింలు అడిగిన దాని కంటే ఎక్కువ ఇవ్వటం ప్రారంభిస్తే, విషయ అవగాహన లేని కాంగ్రెస్ హిందూ నాయకత్వం బ్రిటిష్ విధానాన్ని అంగీకరిస్తూ పోయింది.
అల్ ఇండియా ముస్లిం లీగ్ ( 30 డిసెంబర్ 1906 స్థాపించబడింది ) 1907 కరాచీ సమావేశంలో అధ్యక్షుని ఉపన్యాసాన్ని ఉటంకిస్తూ, జేమ్స్ రామ్సే మాక్ డోనాల్డ్ ( లేబర్ పార్టీ వ్యవస్థాపకుడు , మూడు పర్యాయాలు బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ) ఈ విధంగా అన్నారు “ ముస్లిం ఉద్యమం పూర్తిగా స్వార్ధపరమైన ప్రయోజనాలతో కూడినది. భారతీయ పరిపాలనలో తమకు ప్రత్యేక హక్కు కావాలన్నది వారి అత్యాశ. వారు త్వరగా తృప్తి చెందరు. వారు తమని తాము అధ్వితీయులమనీ, బ్రిటిష్ వారితో ప్రత్యేక అధికారాన్ని పంచుకునే అర్హత కలిగినవారమని నమ్ముతారు. భారత దేశం విషయంలో తమను పాలకులుగా గుర్తించమని వారు కోరుతారు. జన సంఖ్యతో సంబంధం లేకుండా తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని వారు కోరుకుంటారు. ఆంగ్లో-ఇండియన్ అధికారులు కొందరు వీరి ప్రభావానికి గురై , సిమ్లాలోనూ, లండన్ లోనూ తమ సిఫారసులతో హిందూ, ముస్లిం అనైక్యతను ఎగదోసి ముస్లిం వర్గాలకు ఎన్నో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. అందువల్ల వారి జనాభా నిష్పత్తితో సంబంధం లేకుండా అనేక పదవులు, అధికారాలు పొందారు. హిందువులకు రావాల్సిన పదవులు అధికారాల కంటే చాలా ఎక్కువ సంఖ్యలో ముస్లింలకు ఇవ్వటం గమనించాల్సిన అంశం. “ (The Awakening of India, J. Ramsay MacDonald, Hodder and Stoughton, 1910, pp.280-284).
విభజించు – పాలించు అనేది విధానం కావచ్చు కాని ఆచరణాత్మక వ్యూహం ఏమిటీ అంటే మతపరమైన విభజన లో కూడా ముస్లిం వర్గాల సంఖ్య కంటే ఎక్కువగా వారి ప్రతినిధులను నిర్ణయించడం, తద్వారా హిందువుల ప్రయోజనాలను దెబ్బతీయటం(Sunderland, ibid, pp.270, 271)!
వ్యూహాత్మక ముస్లిం డిమాండ్ లు
“ అనంతమైన ఈ ముస్లిం వర్గాల గొంతెమ్మ కోరికల చిట్టా “ కు సరైన వ్యాఖ్యానం కావాలంటే అంబేద్కర్ మహాశయుడు రచించిన పాకిస్తాన్ పార్టిషన్ అఫ్ ఇండియా గ్రంధం లోని “ మత తీవ్రవాదం “ ( communal aggression ) అనే అధ్యాయం (pp. 239-261) పూర్తిగా చదివితే చాలు. ఇండియన్ కౌన్సిల్ చట్టం ( 1892 ) లో ముస్లింలకు ప్రత్యేక ప్రతినిదిత్వపు సూత్రం ప్రతిపాదించారు. కాని ఈ ఆలోచన 1888 లోనే ప్రతిపాదించబడ్డది. వైస్రాయ్ డఫరిన్ సలహా ప్రకారం ఇంగ్లాండ్ లో మాదిరిగా కాకుండా , భారత దేశంలో మాత్రం అవసరాలకు అనుగుణంగా ప్రతినిదిత్వం ఇవ్వాలి అని నిర్ణయించారు.(p.240).
➧ “ ప్రత్యేక ప్రతినిదిత్వపు ఆలోచన బ్రిటిష్ వారిదే కాని , ముస్లిం వర్గాలు ఈ ప్రత్యేకత వల్ల ఓనరే సామాజిక విలువను వెంటనే గుర్తించడం జరిగింది. 1909 లో ఎప్పుడైతే ప్రతినిధి చట్టాల సవరణ గురించిన చర్చలు మొదలైనాయో ఒక ముస్లిం ప్రతినిధి బృందం పకడ్బందీగా తమ కోరికల చిట్టా వైస్రాయ్ మింటోకు అందజేశారు. వెనువెంటనే ఈ కోరికలన్నీ ఆమోదించబడ్డాయి. అవి (1) ముస్లిం ప్రతినిధులను ముస్లింలే ఎన్నుకొనే అధికారం ( 2 ) ముస్లిం ప్రతినిధులు మిగిలిన ప్రతినిదుల్లా కాకుండా ప్రత్యేక పద్దతిలో ఎన్నుకొనే అధికారం ( 3 ) ముస్లింలను ఎన్నుకొనే ప్రత్యేక అధికారాలతోబాటు సాధారణ ప్రతినిధులని ఎన్నుకోవటానికి కూడా హక్కు ( అంటే రెండు ఓట్లు వేసే హక్కు ) ( 4 ) దామాషా పద్ధతిలో కూడా ప్రతినిదిత్వపు హక్కు . (pp.242, 243).
➧ “ 1916 అక్టోబర్ లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు 19 మంది వైస్రాయ్ చెమ్స్ ఫోర్డ్ ను కలిసి కోరికల చిట్టా సమర్పించారు. అవి – ( 1 ) ప్రత్యేక ప్రతినిధిత్వ చట్టాన్ని పంజాబ్ ప్రాంతానికి , సెంట్రల్ ప్రాంతానికి అనుసరింపజేయడం ( 2 ) ముస్లిం ప్రతినిధుల సంఖ్యను నిర్ణయించి స్థిరపరచడం ( 3 ) చట్టాల ద్వారా ముస్లిం మత విశ్వాసాలకు , మత వ్యవహారాల్లో ఎటువంటి జోక్యం చేసుకునే అవకాశం లేకుండా చూడటం. ఈ విషయం లో చర్చలు జరిగి సంప్రదింపులు జరిగిన ఫలితం గా హిందూ ముస్లిం ల మధ్య ఒక ఒడంబడిక ఏర్పడింది. అదే లక్నో ఒడంబడిక. (p.243).
ఈ లక్నో ఒడంబడికను రచించింది దురదృష్టవశాత్తు శ్రీ లోకమాన్య తిలక్ గారు. ఈ ఒడంబడిక ప్రకారం ముస్లింలకు ప్రత్యేక ప్రతినిధిత్వం వారి జనాభా కన్నా చాలా ఎక్కువ లభించింది. ముస్లిం ప్రాతినిధ్యం సెంట్రల్ ప్రావిన్స్ లో 340 శాతం, మద్రాస్ లో 231 శాతం, యునైటెడ్ ప్రావిన్స్ లో 214శాతం , బొంబాయిలో 163 శాతం, బీహార్ , ఒరిస్సాతో కలిపి 268 శాతం (p.246).
గమనించి చూస్తే ముస్లిం వర్గాల దురాశ హిందువుల సామరస్వత వల్ల పెరిగిపోతూపోయిందని తెలుస్తుంది. పైగా ఎప్పుడైనా హిందువులు ఏదైనా విషయంలో ఒప్పుకోకపోతే ఏది ఒప్పుకోరో అదే విషయాన్ని పదే పదే అడుగుతూ , తాము అడిగినాదానితోపాటు ఇతర లాభాలను సాధించుకోవటం ముస్లింల విధానంగా మారింది. (p.259).
సంతుష్టికరణగా మారిన సర్దుబాటు
1885 నుంచీ 1919 వరకు కాంగ్రెస్ కు చెందిన హిందూ నాయకత్వం, ముస్లిం వర్గాల మద్దతు కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ముస్లింలు మాత్రం బ్రిటిష్ వారి అండతో చెలరేగి పోయారు, ప్రత్యేక సదుపాయాలు, అధికారాలను హిందువుల ముక్కు పిండి మరీ సాధించుకున్నారు. వారి దృష్టి పూర్తి గా ముస్లిం వర్గాల అభ్యున్నతి మీదే ఉంది. 1919 కి ముందు కాంగ్రెస్ విధానం హిందూ ముస్లిం ఐక్యత కోసం స్వాతంత్ర పోరాటం లో భాగంగా ఉన్నా , 1919 తరువాత మాత్రం అది ఒక తప్పనిసరి అంశంగా మారి ముస్లిం నాయకుల గొంతెమ్మ కోరికలు , ముస్లిం మత వ్యాప్తి కోసం వారి ప్రణాళికలు ఎక్కువై స్వాతంత్ర్యం కంటే ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి.
(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)
మూలము: విశ్వ సంవాద కేంద్రము
{full_page}