'నేను' కాదు... మనం - దత్తోపంత్ ఠేంగ్డీ జీ - Dattopant Thengadi Ji

Vishwa Bhaarath
Dattopant Thengadi
Dattopant Thengadi ji
నేను' కాదు... మనం
దత్తోపంత్ ఠేంగ్డీ జీ, 'భారతీయ మజ్జూర్ సంఘ' స్థాపించిన సమయంలో ప్రపంచమంతా
సామ్యవాదం మోజులో ఉంది. ప్రతిచోటా ఆ విషయమే, దాని ప్రభావమే. అలాంటి సమయంలో జాతీయభావాలతో, స్వచ్ఛమైన భారతీయ ఆలోచనా విధానం ఆధారంగా మజ్జూర్ (కార్మిక) ఉద్యమాన్ని ప్రారంభించడం, అనేక ఆరోధాలూ, అడ్డంకులూ ఎదురైనప్పటికి దానిని నిరంతరాయంగా ముందుకు తీసుకుపోవడం (herculean task) కష్టమే. శ్రద్ధ, విశ్వాసం, నిరంతర పరిశ్రమ లేనట్లయితే అది సాధ్యం కాదు. ఆనాటి రేండ్లీజ్మా నసిక స్థితి ఎలాంటిదో అర్థంచేసుకోడానికి ఉపకరించే ఒక కథ జ్ఞాపకం వస్తుంది.
    ఇప్పుడు భారతీయ మజూర్ సంఘం దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా మనందరం చూస్తున్నాం. సంఘటనా సామర్థ్యం ఉన్న మంచి కార్యకర్త గుణమేమిటంటే, తాను ఎంత ప్రతిభావంతుడైనప్పటికి తనకు ఉపయోగపడే ఆలోచనలను, సలహాలను అవతలివారి నుంచి మన్ఫూర్తిగా స్వీకరించడం. యోగ్యమైన సలహాలను అందుకోవడం. అలాంటి గుణసంపన్నుడైన కార్యకర్త ఠేంగ్డీ జీ,.కార్మికరంగంలో పని చేయాలని నిర్ణయించినప్పుడు 'భారతీయ కార్మిక సంఘం' అన్న పేరుతో సంస్థ ఉండాలని భావించారు. కానీ, 'మనం ఏ సమాజంలోని ఏ వర్గంలో పని చేయాలనుకున్నామో వాళ్ల విసయంలో  'శ్రమిక' శబ్దం వాడటం సరియైనది కాదు. కొన్ని ప్రాంతాలలో దీనిని ఉచ్చరించడలో ఇబ్బందీ కలుగవచ్చు. అందుకే శ్రమిక బదులుగా 'మజ్జూర్'
శబ్దాన్ని వాడడం సబబుగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుందని కార్యకర్తల మొట్టమొదటి
సమావేశంలో అభిప్రాయపడ్డారు. దానినే స్వీకరించారు. అలా సంస్థ పేరును 'భారతీయ
మజూర్ సంఘ్' అని నిర్ధారించారు. 
    సంఘటనా కార్యం నిర్వర్తించడం అంటే 'నేను నుండి మనం'అనే యాత్ర సాగాలి. కర్వత్వశక్తి గల కార్యకర్తకు ఇది సులభమైన విషయం కాదు. అతడు 'నేను' అనే దాని ప్రేమలో పడిపోతాడు. ఏదో రూపంలో 'నేను' అనే భావన వ్యక్తమౌతూనే ఉంటుంది. అందుకే సాధుసంతులు, 'నేను' అనేది
విచిత్రమైనది. ఇది అజ్ఞానులను అంటుకోను కూడా అంటుకోదు. కాని జ్ఞానుల గళాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే, వదలించుకోవడం కష్టమైన పని' అంటారు. కాని సంఘటనా కార్యంలో, సంఘటనతో పాటు, ఆ కార్యంలో పనిచేసే వాళ్లు దీని నుండి బయటపడవలసి ఉంటుంది. ఠేంగ్డీజీ అందులో నుంచి బయపడినట్టు ఉండేవారు. వారు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక లోతైన విషయం గాని, ఒక ప్రధాన దృష్టికోణం గాని లేదా పరిస్కారం (solution) ఇచ్చేటప్పుడు 'నేను' ఈ విధంగా చెప్పాను అనకుండా 'మేము' ఈ విధంగా చెప్పామని అనడం నేను విన్నాను. ఈ 'నేను' అనే దానిని తొలగించడం సులభమేమి కాదు. కాని ఠేంగ్డీ ఇందులో మహారథులయ్యారు. ఈ గుణం ఒక సంఘటన కార్యానికి అత్యవసరం.
   ఠేంగ్డీ జీలో మరో విశేషమేమిటంటే అతి సామాన్యమైన కార్మికునితో కూడా ఆత్మీయతతో మాట్లాడేవారు. అతని భుజం మీద చేయి వేస్తూ, అతనితో పాటు నడుస్తూ మాట్లాడేవారు. అలాంటప్పుడు ఏ కార్మికునికి కూడా ఒక అఖిల భారతీయ స్థాయి నాయకునితో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్తతో మాట్లాడుతున్నానని అనిపించకుండా ఆత్మీయుడైన పెద్దతో, కుటుంబ పెద్దతో మాట్లాడుతున్నాననే అనుభూతి కలిగేది. ఇలా వ్యవహరిస్తున్నప్పుడు ఠేంగ్డీ కూడా చాలా సహజంగానే కనపడేవారు. ఆయనది విస్తృతమైన, లోతైన అధ్యయనం. మాట్లాడుతున్నప్పుడు అనేక గ్రంథాలను, ఎందరో నాయకుల (anecdotes) జీవిత ముట్టాలను, అనుభవాలను, అభిప్రాయాలను ఉటంకించేవారు. హృదయాన్ని హత్తుకునే మరొక విషయం ఉంది. 
   ఠేంగ్డీ జీ తన ఉపన్యాసాలలో అనేక ఉదాహరణలు, చిన్నచిన్న కథలు చెప్పేవారు. వాటిని నాలాంటి అనుభవం తక్కువగా ఉన్న కార్యకర్త చెబుతూవుంటే ఇది నాకు తెలుసుననే భావనను వ్యక్తపరుచేవారు కాదు. ఇలాంటి సంయమనం పాటించడం సులభం కాదు. ఇది నాకు తెలుసని చెప్పే మోహం ఎంతో అనుభవజ్ఞలైన కార్యకర్తలకు కూడా ఉంటుంది. ఇది నేను చాలాసార్లు గమనించాను. కాని ఠేంగ్డీ జీ వాటిని మొదటిసారి వింటున్నట్లు శ్రద్ధగా (Intent listening) వినేవారు. వాటిపై భావయుక్తంగా స్పందించేవారు. ఆ తర్వాత దానికి సంబంధించిన మరో చిన్నకథ కూడా చెప్పేవారు. ఒక సామాన్య కార్యకర్తతో ఇంత సన్నిహితంగా ఆత్మీయతతో ఉండటం ఒక గొప్ప కార్యకర్త లక్షణం.

దత్తోపంత్ ఠేంగ్డీ జీ
దత్తోపంత్ ఠేంగ్డీ జీ
    పనిని విస్తరించే తపనలో ఉత్కంఠతో, దీక్షతో,ఆ ప్రయత్నంలో తలమునకలై ఉన్నప్పటికి తొందరపాటును ప్రదర్శించకుండా ఉండటం కూడా ఉత్తమ కార్యకర్త లక్షణమే. 'మెల్లమెల్లగా తొందరగా చెయ్యి' (hasten slowly) అని పూజనీయ గురూజీ చెబుతుండేవారు. ఏ పనిలోనైనా తొందరపడకూడదు. నా రైతు మిత్రుడు ఒకాయన మహారాష్ట్రలో 'శత్కారీ సంఘటన్' అనే రైతు ఉద్యమంలో విదర్భ ప్రాంత ప్రముఖ నాయకుడు. ఆ తర్వాత ఆ ఉద్యమానికి దూరమయ్యాడు. మా చిన్న తమ్మునితో చర్చించడం ప్రారంభించాడు. ఆ సమయంలో మా తమ్ముడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. కిసాన్ సంఘ పని అప్పుడిప్పుడే ప్రారంభమైంది, కాబట్టి, ఈ కర్సక (రైతు) నాయకుడిని కిసాన్ సంఘానికి జోడించాలని మా తమ్ముడు నాతో అన్నాడు. నాకు ఈ సలహా నచ్చింది. ఈయన పెద్ద రైతు నాయకుడు. ఠేంగ్డీ జీ  నాయకత్వంలో కిసాన్ సంఘ పని ప్రారంభమైంది. అందుకు ఈయన ఉపయోగపడుతాడన్న ఉద్దేశంతో మా తమ్మునితో కలసి నాగ్ పూర్ లో వున్న ఠేంగ్డీ ని కలిశాం. ఆ రైతు కూడా ఠేంగ్డీ జీకి తెలుసు. కిసాన్  సంఘం కోసం పేరు ప్రఖ్యాతులున్న నాయకుడు లభించినందువల్ల కిసాన్ సంఘానికి ఊతం లభిస్తుందనీ, ఠేంగ్డీ జీ వెంటనే ఆనందంగా ఆయన్ను స్వీకరిస్తాడనీ నాకు పూర్తి విశ్వాసముంది. ఉపోద్ఘాతం తర్వాత ఈ ప్రస్తావన వారి ముందుంచాను. ఠేంగ్డీ జీ వెంటనే తిరస్కరించారు. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత నాతో 'మన కిసాన్ సంఘ్ పని చాలా చిన్నది, అది ఇంత పెద్ద నాయకుడిని భరించలేదు. ఈ నాయకుడు కిసాన్ సంఘాన్ని తనతో పాటు లాక్కొనిపోతాడు. ఇలాంటిది మనం కోరుకోవడం లేదు' అని చెప్పారు. అప్పుడు నేనన్నాను, ఒకవేళ కిసాన్ సంఘం ఆయనను స్వీకరించనట్లయితే భారతీయ జనతా పార్టీ వాళ్లు కలుపుకొని ఎన్నికలలో పోటి చేయించగలరు కదా! అని. దానికి ఠేంగ్డీ జీ శాంతమైన స్వరంలో భాజపాకు తొందర ఉండవచ్చు, మనకు లేదు' అంటూ సుస్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చారు. ఇది నాకొక మంచి గుణపాఠం. గురూజీ చెప్పిన 'మెల్లమెల్లగా తొందరగా చెయ్యి' అనే వాక్యం నిగూఢార్థం అర్థమైంది.
    ఉత్తముడైన సంఘటనా కార్యకర్తెకాక, ఠేంగ్డీ జీ దార్శనికుడు (visionary) కూడా. వారితో మాట్లాడుతున్నప్పుడు భారతీయ చింతనకు సంబంధించిన లోతైన విషయాలు వ్యక్తమయ్యేవి.
    ఠేంగ్డీ జీ తన ఉపన్యాసాలలో అనేక ఉదాహరణలు, చిన్నచిన్న కథలు చెప్పేవారు. వాటిని నాలాంటి అనుభవం తక్కువగా ఉన్న కార్యకర్త చెబుతూవుంటే ఇది నాకు తెలుసుననే భావనను వ్యక్తపరుచేవారు కాదు. ఇలాంటి సంయమనం పాటించడం సులభం కాదు. ఇది నాకు తెలుసని చెప్పే మోహం ఎంతో అనుభవజ్ఞులైన కార్యకర్తలకు కూడా ఉంటుంది. ఇది నేను చాలాసార్లు గమనించాను. 
   మజ్జూర్ క్షేత్రంలో సామ్యవాదుల ప్రభావం, పెత్తనం ఉండేవి. అందువలన అన్ని కార్మిక సంస్థల
ఉపన్యాసాలు, నినాదాలు సామ్యవాదుల శబ్దావళినే అనుసరించి ఉండేవి. అటువంటి సమయంలో వారు సామ్యవాద నినాదాల స్థానంలో భారతీయ ఆలోచనా శైలిని వ్యక్తపరిచే కొత్త నినాదాలను అందించారు. భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్జూర్ సంఘ్ సంస్థలే కాకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్వదేశీ జాగరణ్ మంచ్, ప్రజ్ఞా ప్రవాహ, విజ్ఞాన భారతి మొదలగు సంస్థల పునాదులు కూడా ఠేంగ్డీ జీ సహాయ సహకారాల వల్లనే పడినాయి. వారు
భారతీయ కళాదృష్టి మీద రాసిన వ్యాసం ఆతర్వాత సంస్కారభారతికి మార్గదర్శకమైంది. ఠేంగ్డీ జీ లాంటి సమున్నత మేధావి, సంఘటనా కార్యకర్త, దూరదృష్టి కలిగిన (legendary) నాయకునితో పాటు చర్చిస్తూ, వారి నడక, లేవడం కూర్చోవడం, వారు సలహాలివ్వడం ఇదంతా ప్రత్యక్షంగా అనుభవించడం, నేర్చుకునే భాగ్యం లభించడం నా అదృష్టం. ఠేంగ్డీ జీ ఈ జన్మ శతాబ్ది. సందర్భంలో వారి పావన స్మృతికి నా వినమ్ర శ్రద్ధాంజలి.

వ్యాసకర్త: ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ - డా.. మన్మోహన్ వైద్య , ఢిల్లీ
__జాగృతి 
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top