సేవ: సామాజిక సమరసత - Samajika Samarasatha

Vishwa Bhaarath
సామాజిక సమరసత
సామాజిక సమరసత

మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు

సామాజిక సమరసత
   సేవాకార్యక్రమాలు సామాజిక సమరసతను నిర్మాణం చేస్తాయి. మనం సంఘస్థాన్ లో రకరకాల కార్యక్రమాల ద్వారా సామూహిక సంస్కారములను కలిగించిన విధంగానే సేవాకార్యక్రమాల మాధ్యమంగా సమాజంలోని విభిన్నవర్గాల వారిని ఒక దగ్గరకు తీసుకువచ్చి కలపాలి. అస్పృశ్యతా భావాన్ని తొలగించి మనమంతా ఒకే కుటుంబం అనే భావనను జాగృతం చెయ్యాలి. 
  బాల సంస్కార కేంద్రాలు, అభ్యాసికలు మొదలగు అనేక కార్యక్రమాలద్వారా ఆ వర్గాలకు చెందిన కుటుంబాలను కలవడం ద్వారా వారిని వ్యసనాల నుంచి, చెడుఅలవాట్ల నుంచి విముక్తి చేయాల్సి ఉంది. సమాజంలోని చెప్పుకోదగిన ఉన్నతవర్గాలు మరియు బలహీన వర్గాల బంధువులను ఒక దగ్గరకు చేర్చి వారిమధ్య ఏర్పడిన దూరాన్ని తొలగించి హిందుత్వ నిష్ఠను పెంపొందించాలి. చీమలకు చక్కెర వేస్తే పుణ్యం వస్తుందన్నట్టు సేవచేయడం ద్వారా పుణ్యము సంపాదించగలము అనే భావన సరియైనది కాదు. సేవ ఒక సాధనము - సమాజపరివర్తన సాధ్యము. ఈ సందర్భంలో అనేక ఉదాహరణలున్నవి. కర్ణాటకలో రాష్ట్రీయ స్వయంసేవక
సంఘ సేవావిభాగానికి అనుబంధంగా ఉన్న 'హిందూ సేవా ప్రతిష్టాన్' అనేసంస్థ ద్వారా రకరకాల సేవా కార్యక్రమాల గురించి యువతీ యువకులకు శిక్షణ ఇవ్వబడుతుంది. 
  ఆ సేవా కార్యక్రమాలలో సంస్కృత సంభాషణ నేర్పడం కూడా ఉంది. మామూలు వ్యక్తికూడా పదిరోజుల ప్రశిక్షణ పొంది సంస్కృతంలో మాట్లాడగలుగుతాడు. ఇలా సంస్కృత సంభాషణ శిబిరాలు నడపడానికి, సేవాకార్యక్రమాల కొరకు సమర్పితులైన సేవావ్రతులకు (పూర్తిసమయ కార్యకర్తలకు) కూడా ప్రశిక్షణ ఇవ్వబడుతుంది. సంఘ కార్యకర్తలు దక్షిణ కర్ణాటకలోని 'త్రిలోక కుండాపురము' తాలూకాలోని మొత్తం 108 గ్రామాల్లో ప్రజల సర్వాంగీణ వికాసం కొరకు క్రియాశీలురుగా ఉన్నారు.
  మార్చి-ఏప్రిల్ 1990లో ఆ తాలూకాలో 175 శిబిరాలు నిర్వహించి 8000 కన్నా ఎక్కువ మంది గ్రామస్థులను సంస్కృతంలో మాట్లాడగలిగేటట్టు తయారుచేశారు. ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా ఒక చిన్న గ్రామంలోనికి ఒక మహిళా సేవావ్రతి వెళ్ళి అక్కడ అన్ని  వర్గాలవారిని శిబిరంలో పాల్గొనేవిధంగా ప్రేరేపించింది. తరగతులు నిర్వహించడానికి ఒక పెద్దగది అవసరమైంది. ఆ ఊరిలో పదవీ విరమణ చేసిన ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక ధనిక బ్రాహ్మణుడు తన ఇంట్లోని పెద్ద గదిలో ఈ శిబిరం నడపడానికి అంగీకరించాడు. సేవావ్రతి అయిన మహిళా కార్యకర్త గ్రామంలోని అన్ని వర్గాలకు చెందిన 70 మందికి అదే స్థలంలో సంస్కృతంలో మాట్లాడే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇంటి యజమాని కూడా కుతూహలముతో ఆ శిక్షణను చూడడానికి వచ్చాడు అతనికి ఎంతో కుతూ హలము, ఆసక్తి కల్గింది. ఆయన కూడా సపరివారముగా అందులో పాల్గొన్నాడు. నాలుగు రోజుల తర్వాత ఆ మహానుభావుడు ఆ సేవావ్రతితో 'నేను ఆనందించాను. మీ ఉద్దేశ్యము నెరవేరినది' అని అన్నాడు. సేవావ్రతి ఆశ్చర్యపోతూ నాలుగు రోజులే అయినది ఇంకా ఆరురోజులు వున్నవి అప్పుడుగాని పని పూర్తి కాదు కదా! అన్నది. అప్పుడు ఇంటి యజమాని మాట్లాడుతూ “అమ్మా! మీరు సంస్కృత సంభాషణ శిబిరం నడిపిస్తున్నారు. కానీ మీ ఉద్దేశ్యము మరొకటని నాకు అర్థమైంది. నా ఇంట్లోకి ఇంతవరకు బ్రాహ్మణులు తప్ప మరే ఇతర నిమ్నకులాల వ్యక్తులు రావడానికి ధైర్యంచేసేవారుకారు. నా కుటుంబసభ్యులతో కలిసి కూర్చునేవారు కాదు. కాని మీ తరగతిలో అస్పృకులాలవారు కూడా పాల్గొంటున్నారు. నా కుటుంబ సభ్యులు కూడా వారితోపాటు కలిసి నేలపైన కూర్చొని శిక్షణ పొందుతున్నారు. పరస్పరం సంస్కృతంలో సంభాషించుకుంటున్నారు. మీరు ఉన్నత-నిమ్న భేదభావమును తొలగించారు. సంస్కృత సంభాషణ ఒక మాధ్యమమే. కానీ అందరిని ఒకటిగా చేయడం మీ ఉద్దేశ్యo అది నెరవేరుతున్నది. ఈ పవిత్ర కార్యమును కొనసాగించండి. భగవంతుడు మీకు విజయము చేకూర్చుతాడు” అని ఆశీర్వదించాడు.

   మరొక గ్రామంలో ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని సంస్కృత సంభాషణ శిబిరం ముగింపు కార్యక్రమానికి అధ్యక్షునిగా పిలిచారు. భావోద్వేగం చెందిన ఆయన ఆనంద బాష్పాలతో ఇలా అన్నారు. 'నేను అంటరానికులానికి చెందినవాడిని, నాకులానికి చెందినవారు కూడా వేదమంత్రాలను ఉచ్చరించగలరా? వేదమంత్రాలు పలకడం అటుంచండి, శూద్రులనేవారు వేదాలు విన్నట్లయితే వారి చెవుల్లో కరిగించిన సీసమును పోసేవిధానం ఉండేదని విన్నాను. కానీ నేడు నేను గ్రామంలోని బ్రాహ్మణులందరితోపాటు వేదమంత్రాలు పలుకుచున్నాను. నా కులానికి
చెందిన ఇతర బంధువులు కూడా మంత్రోచ్చారణ చేస్తున్నారు.  ప్రత్యక్షంగా చూస్తున్నప్పటికి నాకు విశ్వాసం కలగడం లేదు, అసలు ఎవరైనా దీన్ని ఊహించగలరా? నాకులం వారు వేదమంత్రాలు పలకగలరని నేను కలలో కూడా ఊహించలేదు, కానీ ఇదంతా సేవాకార్యంలో లీనమైన  సేవావ్రతుల ద్వారా జరుగుతున్న చమత్కారం. భగవంతుని కృపకూడా, పేదలు నిరక్షరులూ అయిన నా సోదరులు కూడా అభివృద్ధి చెందగలరని, అగ్రవర్ణ బంధువులతో కలిసిమెలిపి వుండగలరని ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది.
     దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఉదాహరణలు దొరుకుతాయి. మన సమాజంలోని అన్ని వర్గాలలో స్నేహపూరిత వాతావరణం, మనమందరం ఒక్కటే అనే సమానతా భావనను పెంపొందించడమే మన సేవాకార్య లక్ష్యం. డాక్టర్ హెడ్డేవార్ ఇలాంటి సామాజిక పరివర్తననే
కోరుకున్నారు. మొత్తం హిందూసమాజం ఒకే దేహము, ఒకే ప్రాణముగా నిలబడాలి అనే నిష్కర్షతోనే సంఘము ద్వారా సేవా కార్యక్రమాలు నడుపుచున్నాము. 

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

{full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top