ఒక్క గోవు 🐮 – 30 ఎకరాల 'గో' ఆధారిత సాగు (సంక్రాంతి ప్రత్యేకం) - One cow- 30 acres Gou based cultivation

Vishwa Bhaarath
ఒక్క గోవు 🐮 – 30 ఎకరాల గో ఆధారిత సాగు
ఒక్క గోవు – 30 ఎకరాల 'గో' ఆధారిత సాగు
చ్చేది సంక్రాంతి పండుగ. సంక్రాంతి మార్పుకు సంకేతం.కాబట్టి సంక్రాంతి సందర్భంగా మనమూ మారే ప్రయత్నం చేద్దాం. ఈ సంక్రాంతికి మన ఇంటికి గోవును తెద్దాం.
  • - గో వధ ఉసురు వలనే ప్రకృతి వైపరీత్యాలు.
  • - రసాయన ఎరువుల వాడకం వల్ల పర్యావరణ సమస్యలు, కొత్త రోగాల పుట్టుక.
  • - గోవును మళ్ళీ తెచ్చుకుందాం.
  • - అనేక లాభాలు పొందుదాం.
  • - రైతులతో పాటు అందరం బాగుందాం.
ఒక్క ఆవు వేసే పేడ, మూత్రాల వల్ల రైతు 30 ఎకరాలలో సులభంగా, విష రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయవచ్చు. ఒక రోజుకు ఒక ఆవు ఇచ్చే 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం ద్వారా ఒక ఎకరాకు సరిపోను ఎరువు పొందగలడు. గోమూత్రంతో పురుగు మందులను కూడా తయారు చేయవచ్చు. ఎరువుల దుకాణానికి వెళ్ళే అవసరమే రాదు. ఆవు లేదా ఎద్దు చనిపోయే రోజు వరకు కూడా ఇంత లాభాన్నీ ఇవ్వగలదు.
   మరి గోవు తెచ్చుకుంటే ఏమిటి లాభం అని ఆలోచిస్తున్నారా.. మీ కోసమే ఈ వ్యాసం. చదవండి.
భారతీయులు సగర్వంగా చెప్పుకోదగిన, ప్రాచీన భారతీయ నాగరికతలోని అద్భుత విజ్ఞానం ‘గోవిజ్ఞాన’ సంపద. భారతదేశంలో గోవుకు దేవతాస్థానం ఇచ్చారు. భారతీయులకు గోవు అంతటి ముఖ్యమైనది. గోరక్షణ ఈ దేశానికి అతి ప్రధానమైన అంశం. ఎందుకంటే మన ఈ ప్రత్యేకమైన, ఉత్తమ గో సంపద ప్రపంచంలో ఎక్కడా లేదన్నది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం. గోవు తన మూపురంలోని సూర్యకేతు నాడి ద్వారా సూర్యశక్తిలోని దివ్యమైన ప్రాణశక్తిని గ్రహించి; దానిని పాలు, మూత్రం, గోమయం వంటి వాటి ద్వారా మనకు అందిస్తున్నది. అందుకే భారతీయ సంస్కృతిలో అమ్మ తరువాతి స్థానం గోవుదే.
   ఈ అద్భుత గోవిజ్ఞాన సంపదను మరచిపోయిన సుప్తదశలోని మన రైతు సోదరులు గోవులను భారంగా ఎంచి, సంతలలో 5 వేల నుండి 15 వేల లోపుకే కసాయి వారికి కోతకు అమ్ము కుంటున్నారు. దీనికితోడు మన ప్రభుత్వ యంత్రాంగం నిద్రావస్థలో ఉండటంతో వీటి రక్షణపై ఎవరి దృష్టి ఉండటం లేదు. రక్షించవలసిన ప్రభుత్వ విభాగాలు, వైద్యులు, పోలీసులు రాజ్యాంగం ఆవులకిచ్చిన జీవించే హక్కును కాలరాస్తున్నారు. వధశాలలు వారు కూడా వారి అత్యధిక లాభార్జనకు, పై బలహీనతలను సొమ్ము చేసుకొంటూ, యంత్రాంగాన్ని వారి గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. 500 నుండి 1000 ఆవుల పైన ఉన్న మండలాలను వేళ్ళపై లెక్క పెట్టవచ్చు. దీనివల్ల ప్రతి సంవత్సరానికీ పెరుగుతున్న నష్టాలు; జీవ వైవిధ్యం (బయోడేవర్సిటి), ప్రకృతి సమతుల్యత (ఎకో బాలెన్సింగ్‌) లలో తేడాల వల్ల మానవుడు ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నాడు.

గోవధ – నష్టాలు
అమ్మ వంటి గోవులను వధించడం వలన మానవ జాతి ఎన్నో నష్టాలను అనుభవిస్తోంది. 
  1. ఆగమ శాస్త్రజ్ఞుల విశ్లేషణల ప్రకారం గోవును వధిస్తున్నప్పుడు ఆ గోవు బాధతో కూడిన ఆక్రందనల ప్రకంపనల వల్లే నేటి భయంకర సునామీలు, భూకంపాలు అధికంగా వస్తున్నాయని తెలుస్తున్నది. 
  2. - సేంద్రియ ఎరువునిచ్చే గోవును వధకు పంపి, విషంతో కూడిన రసాయన ఎరువులను పొలంలో పంటల పెరుగుదలకు వాడటం వల్ల, అవి తిన్న మానవుడు అనేక కొత్త రోగాలకు గురవుతూ, మందులే పని చేయని స్థితిని, మునుపెన్నడూ ఎరుగని కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు. 
  3. - రసాయ నాలతో భూములు పాడై, వానపాములు వంటివి లేక, భూగర్భ జలాలు అడుగంటి, వర్షపాతము తగ్గి, ప్రజల జీవితము దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
రైతులు గతంలో (10-20 సంవత్సరాల క్రితం) గోసంపదతో కలిసి ఉండటం వల్ల అవి కామధేనువులై, పై పరిస్థితులన్నిటిని ఎదుర్కొంటూ, రైతుకు లాభాలనిస్తూ, అమృత తుల్యమైన పంటలనిచ్చేవి. దాంతో గృహాలు లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ, ఆనందమయంగా ఉండేవి. ఆరోగ్యం పుష్కలంగా ఉండేది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా!
సమయం మించిపోలేదు
ఇప్పటికీ సమయం మించిపోలేదు. మరల గోసంపదను మనం పెంచినట్లయితే మళ్ళీ మనం పూర్వవైభవం పొందగలం. దానికి తోడు నేటి అద్భుత గోవిజ్ఞానం ద్వారా కొన్ని విషయాలు మరల ఆలోచించ గలిగితే అనేక సమస్యలను తొలగించుకోవచ్చు.

గో రక్షణ – లాభాలు
ఒక్క గోవు – 30 ఎకరాల సాగు : ఒక్క ఆవు వేసే పేడ, మూత్రాల వల్ల రైతు 30 ఎకరాలలో సులభంగా, విష రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయవచ్చు. ఒకరోజుకు ఒక ఆవు ఇచ్చే 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం ద్వారా ఒక ఎకరాకు సరిపోను ఎరువు పొందగలడు. ఇలా రోజుకు ఒక ఆవు రూ.2000 ల విలువ కలిగిన ఎరువును ఇస్తుంది. అలాగే గోమూత్రం, కొన్ని రకాల చెట్ల ఆకులతో పురుగు మందులను కూడా తయారు చేయవచ్చు. ఎరువుల దుకాణానికి వెళ్ళే అవసరమే రాదు. ఇప్పటికే అనేక మంది ఈ పద్ధతులతో వ్యవసాయం చేస్తూ, అధిక లాభాలను పొందుతున్నారు. రైతు వద్ద ఉన్న ఆవు లేదా ఎద్దు చనిపోయే రోజు వరకు కూడా ఇంత లాభాన్నీ ఇవ్వగలుగుతుంది.
రైతుకు అవసరమైనది 
  1. అతి తక్కువ ఖర్చుతో వ్యవసాయం, 
  2. అధిక దిగుబడి, 
  3. వచ్చిన పంటలకు అధిక ఆదాయం. ఈ మూడు గోవు రైతులకిస్తుంది. అంతేకాక గోవు చనిపోయిన తరువాత రైతుకు ఆదాయమిస్తుంది.
  • గోసమాధి ఎరువు : ఆవు చనిపోయిన తరువాత దానిని ప్రత్యేకంగ ‘గో సమాధి ఎరువు’గా మార్చుకొంటే 4 నెలల నుండి 1 సంవత్సరం వరకు 10 ఎకరాలకు సరిపోయే, రూ.4 లక్షల విలువైన రసాయన ఎరువుగా తిరిగి రైతుకిస్తుంది. దాని ప్రభావం పొలంలో చాలా సంవత్సరాలు ఉంటుంది.
  • ఆవు పేడ, మూత్రం వాతావరణ కాలుష్యాన్ని నిరోధించి, భూసారాన్ని, భూగర్భ జలాలను పెంచి, ప్రకృతి వ్యవసాయం చేయడంలో రైతుకు తోడ్పడుతుంది. 100 గ్రాముల పేడ భూమిలో వ్యవసాయానికి పనికి వచ్చే వానపాములు వంటి 300 కోట్ల సూక్ష్మజీవులను ఉత్పత్తి చేస్తోంది. (జెర్సీ, హెచ్‌.ఎస్‌.వంటి విదేశీ ఆవులకు ఈ శక్తి లేదు.).
  • ఓం హోమా ఫార్మ్స్‌ : ఆస్ట్రేలియాలో ‘ఓం ¬మాఫార్మ్స్‌’ అనే ¬మం చేస్తారు. ఈ ¬మంతో వచ్చే బూడిదను ఎరువులు, పురుగు మందులలో వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ యజ్ఞం (హోమం) ద్వారా ప్రాపిలీన్‌ అల్మైడ్‌ వంటివి ఉత్పత్తి అయ్యి, వర్షం పడటానికి దోహదమౌతుంది. ¬మ ధూమానికి రోగ కారక కాలుష్యాలను, బాక్టీరియాను నిర్మూలించే శక్తి ఉన్నదని సైన్సు పరంగా ఋజువు అయ్యింది.
  • గోమూత్రంతో పరిశుభ్రత, ఆరోగ్యం : జైపూర్‌లోని వైద్యశాలల్లో గోమూత్రాన్నే పరిశుభ్రత కోసం వాడుతున్నారు. యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ మైక్రోబియల్‌ అయిన గోమూత్రం, గోమయం రోగ కారక, విషపూరిత క్రిములను, బ్యాక్టీరియాను రానివ్వదని నిరూపణ అయింది. అందుకే ఆవు పేడతో కళ్ళాపి చల్లడం, ఇల్లు అలకటం, గోమూత్రాన్ని ఇల్లంతా చల్లుకునే, సేవించే అలవాటు మనదేశంలో ప్రాచీన కాలం నుండి ఉన్నది.
  • గోమయం – రేడియేషన్‌ : ఆవు పేడతో చేసిన స్టిక్కర్ల ద్వారా సెల్‌ఫోన్ల రేడియేషన్‌ తగ్గి, రేడియేషన్‌ ప్రమాదాలను లేకుండా చేస్తుంది. అందుకే మన పూర్వులు ఇంటి గోడలు, నేలను ఆవు పేడతో అలికేవారు.
Homa Therapy Association of Australia - ఓం హోమా ఫార్మ్స్‌ : ఆస్ట్రేలియాలో ‘ఓం ¬మాఫార్మ్స్‌’
Homa Therapy Association of Australia - ఓం హోమా ఫార్మ్స్‌ : ఆస్ట్రేలియాలో ‘ఓం ¬మాఫార్మ్స్‌’ 
ఉపాధి : 
  • 1. గోవు వ్యవసాయం, వ్యవసాయేతర ఉపాధి, ఆదాయమునకు ముఖ్య వనరుగా ఉపయోగ పడుతుంది. తద్వారా గ్రామాలలో మహిళలకు, యువకులకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది. 
  • 2. ఫినాయిలు, సబ్బులు, షాంపులు, దోమలు పారద్రోలే ద్రావణం, ధూప్‌ బత్తి, పాత్రలు తోమే పొడి, టాయిలెట్లు శుభ్రం చేసే పదార్థాలు, కాగితం, అట్టల తయారీ, వినాయక విగ్రహాలు, చిన్న చిన్న బొమ్మలు, స్టాండ్లు, పులకుండీలు, దుస్తులతో సహా – సుమారు 100 రకాల ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తారు. అంతేకాక 1 లీటరు గోమూత్రంలో 10 మిల్లీ గ్రాముల బంగారం లభిస్తోంది.
ఔషధ రంగం : 
  1. గోమూత్రం, గోమయం, గోవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వంటి పంచామృతాలు, పంచగవ్యాలను వైద్య చికిత్సలలో వందలాది తీవ్ర భయంకర రోగాలకు అద్భుత ఔషధాలుగా ఉపయోగించే విజ్ఞానం మన దేశం ప్రపంచానికి ఇచ్చిన వరం. 
  2. రోగాలకు ఔషధాలుగా కంటే, అసలు రోగాలే రాకుండా చేయగలిగే శక్తి గోవులకు ఉన్నది. 
  3. ఫిట్స్‌, ఫిస్చ్యులా, పైల్స్‌, ఎయిడ్యు, కేన్సర్‌, పక్షవాతం, టి.బి., చర్మ వ్యాధులు, జీర్ణాశయ బాధలు, గుండె, జ్ఞానాంగాలకు సంబంధించి, ఇంకా అనేక వ్యాధుల నివారణకు గో ఔషధాలు ఉపయోగపడతాయి. 
  4. గోవు స్పర్శ, దృష్టి, వాసన, సాహచర్యము కూడా ఆరోగ్యవంతులను చేస్తుంది. 
  5. గోవు తనలోని విశిష్ట శక్తితో – ప్రేమగా చూసే తన యజమానులకు వచ్చిన లేదా సమీపంలో రాబోవు అనారోగ్యాలను గుర్తించి, అవసరమగు ఔషధ మూలికలను తిని వస్తుంది. తద్వారా ఆ ఆవు పాలు తాగిన యజమాని అనారోగ్యం దూరమై చక్కటి ఆరోగ్యవంతులవుతారు.
లాభాలు:
  • 🐮 నేర స్వభావం తగ్గుదల : గో సాహచర్యము ద్వారా నేర ప్రవృత్తి, నేర స్వభావము తగ్గుతుంది. అందువలన జైళ్ళలోనూ గో పోషణ కేంద్రాలను కొన్ని చోట్ల ప్రారంభిస్తున్నారు.
  • 🐮 బయో ఇంధన శక్తి : 1. గోవు నుండి వచ్చే ఉత్పత్తులు ఇంధన శక్తిగా కూడా ఉపయోగ పడతాయి. గోబర్‌ గ్యాస్‌ ప్లాంటుల ద్వారా వంటగ్యాసు, విద్యుదుత్పత్తి, వాహనాలకు వాడే గ్యాసువంటి వనరులు లభిస్తున్నాయి. వీటిని కోల్‌కత్తాలో బస్సులలో ప్రయోగాత్మకంగా ఉపయో గించారు. బయో పెట్రోలు ప్రయత్నాలు జరుగు తున్నాయి. 2. ఇప్పటికీ ఖర్చులేని ముఖ్య రవాణా సౌకర్యంగా ఎడ్లబండి అనే విషయం నిర్వివాదం.
  • 🐮 అంత్యేష్టి సంస్కారం : మనిషి అంత్యేష్టి కార్యక్రమం కోసం ఎన్నో చెట్లను నాశనము చేయవలసి వస్తుంది. అంతేకాక కట్టెల ద్వారా వచ్చే ఉష్ణోగ్రత 11000ష మాత్రమే లభిస్తుండగా ఆవు పేడతో చేసిన ‘కండెలు’ ద్వారా 3,3000ష ఉష్ణోగ్రత లభిస్తుంది. ఇలా గోవు వృక్ష రక్షణకూ ఉపయోగ పడుతుంది. అందులోను గోమయంతో దహించటం పవిత్రమూ, కాలుష్య రహితం కూడా.
  • 🐮 ఇతర దేశాల ఆలోచన : 1. విదేశాలవారు భారతీయ గోవుల శక్తిని, పై విజ్ఞానాన్ని గ్రహించి – ఒంగోలు, గిరి వంటి ఉత్తమ జాతులను తీసుకొని వెళ్ళి, వారి దేశాభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. ఉదాహరణకు బ్రెజిల్‌లో ఒంగోలు జాతి గోసపంద కొన్ని కోట్లు ఉన్నవి. వారి దేశాభివృద్ధికి ముఖ్య ఆదాయ వనరు, అధిక ఆదాయం గోసపందతోనే వస్తోందని వారు ప్రకటించారు. 2. ఆవు పాల నుండి ‘కర్క్యుమెన్‌’ వంటి కేన్సర్‌ను తగ్గించే రసాయనాన్ని తైవాన్‌ దేశంవారు తయారు చేశారు. 3. ప్రపంచ దేశాల మేధావులలో, శాస్త్రవేత్తలలో ఇలాంటి విషయాలపై దృష్టి, ఆసక్తి, జిజ్ఞాస పెరిగి; విష రసాయనాలు, ప్రమాదకర కల్తీలు లేని – స్వచ్ఛ, ప్రకృతి, గో ఆధారిత వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు.
  • 🐮 ఆదర్శ గ్రామం : కొన్ని స్థలాలలో గోవుల కేంద్రంగా, ఆదర్శ గ్రామాలుగా, సంపూర్ణ గ్రామ వికాసం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో గో పోషణ ద్వారా 1.పాడి, 2. సేంద్రియ పంటలు, 3. ఉపాధి, 4. వైద్యం, 5. భూ-జలవనరుల వికాసం, 6.కాలుష్య నివారణ, 7. ఇంధన వనరులు, విద్యుత్తు, 8. గ్రామంలో రవాణా, 9. ఆధ్యాత్మిక కేంద్రంగాను – గోవుల నుండి లబ్దిపొందుతూ – తక్కువ ఖర్చుతో, సుఖవంతమైన ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితం సాధ్యమని చూపుతున్నారు.
  • 🐮 రైతుల, గోపోషకుల అన్ని రకాల సమస్యలకూ పరిష్కారం చూపే శక్తి కలది గోవు. ఇంటి ముందు ఉన్న గోవు లక్ష్మీప్రదం. సకల శుభాలనిచ్చు తల్లి అని అనుభవజ్ఞులు చెబుతున్నారు. సంతానం లేని వారికి సంతానం కలగటం నాటి కాలములోనే కాదు, నేటికీ జరుగుతోంది. అటువంటి సకల శుభాలిచ్చే గోవు నుండి ఇప్పటి తరమైన మనమూ పూర్తి లాభం పొందుటకు ఉద్యమిద్దాం.
ఇన్ని ప్రయోజనాలున్న గోవును నిర్లక్ష్యం చేసి, వధించి ప్రమాదకర ఫలితాల వైపు ప్రయాణించరాదు. గోవధ దేశ ద్రోహమే. మనలను మనం వధించుకుంటున్నట్లే. మనదేశంలో ఒక్క ఆవు కూడా వధకు గురికాకుండా చూసే బాధ్యతను పంచుకుందాం. గోరక్షణ అంటే మన రక్షణే. తిరిగి గోవులను ఆదరిస్తూ – ప్రతీ ఇంటిలో ఆవుపాలు, వాటి ఉత్పత్తులను వాడుతూ, నేర రహిత, పుష్కల సంపదతో తులతూగే, ఆదర్శ సమాజ నిర్మాణంలో పాలు పంచుకుందాం.
  • గో దర్శనం – పాపహరణం
  • గో స్పర్శ – పుణ్య ప్రదం
  • గో దానం – పుణ్యలోక సోపానం
  • గో ప్రదక్షిణం – భూ ప్రదక్షిణం
  • గో పూజ – సర్వ సంపద ప్రదం
  • గోవు సర్వ సంపదలకు మూలం  – అధర్వణ వేదం

– ఆకుతోట రామారావు, తెలంగాణ ప్రాంత గోసేవా ప్రముఖ్‌ (జాగృతి సౌజన్యం తో) __విశ్వ సంవాద కేంద్రము. {full_page}  
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top