రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థాపకులు - డా౹౹హెడ్గేవార్ వ్యక్తిత్వ వైశిష్ట్యం - Founders of Rashtriya Swayamsevak Sangh - Dr Hedgewar

Dr Hedgewar
Dr Hedgewar

డా౹౹హెడ్గేవార్ వ్యక్తిత్వ వైశిష్ట్యం
1940లో డాక్టర్జీ మరణించేనాటికి ఆయనద్వారా స్థాపింపబడిన సంఘటన – రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దేశమంతటా వ్యాపించింది. భారతదేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలలోనూ, పెద్దనగరాలలోనూ సంఘశాఖలు వ్యాపించినవి. మధ్యప్రాంతాల నాయకులకేగాక, దానికి అవతల ఉండే నాయకులకు కూడా సంఘ్ యొక్క అనుశాసనబద్ధులైన, సుశిక్షితులైన స్వయంసేవకులు ఆకర్షణ కేంద్రమైనారు. స్వయంగా మహాత్మ గాంధీ, విఠల్ భాయి పటేల్, ఎం.ఆర్.జయకర్, వీర్ సావర్కర్, సుభాస్ చంద్ర బోస్ వంటి శిఖరసమానులైన నాయకుల మనస్సులపై సంఘ్ ముద్ర గాఢంగా హత్తుకొంది. 
   అయితే ఈ సంఘటనకు సంచాలకుడు, సంస్థాపకుడూ అయిన వ్యక్తియొక్క స్వీయ ప్రవర్తన, సంపూర్ణ జీవనమూ ఒక విశిష్టమైన ఉదాహరణ. ప్రకృతి పరమేశ్వరుడూ ఈ ఇరువురి విశిష్ట యోజనవల్ల కొన్నిశతాబ్దాలకు ఎప్పడో ఒకసారి అరుదుగా మాత్రమే ఇటువంటి వ్యక్తులు జన్మిస్తారని ఆయనను గమనించినవారికి అనిపించక మానదు.

వీర్ సావర్కర్ - Veer savarkar
Veer savarkar 
1937లోవీర్ సావర్కర్ విదర్భ ప్రాంతాన్ని పర్యటించారు. డా.హెడ్గేవార్ వారివెంట ఉన్నారు. తన పర్యటన చివరిమజిలీలో జరిగిన బహిరంగ సభలో సావర్కర్ సంఘాన్ని బహిరంగంగా ప్రశంసించటమే గాక, సభ నుండి నివాసానికి చేరుకొన్న తర్వాత “నేనుకూడా సంఘ స్వయంసేవక్ గా చేరేదా?” అని  డా.హెడ్గేవార్ ని అడిగారు. “మీరు సభలో సంఘాన్ని ఏమేరకు మెచ్చుకున్నారో అది చాలు. ఈ స్నేహాన్ని ఇలాగే ఉండనీయండి” అని డా.హెడ్గేవార్ జవాబిచ్చారు.
   1938లో సావర్కర్ గారి నాగపూర్ పర్యటన విజయవంతమైంది. దానిగురించి వార్తాపత్రికలు ఇలా ప్రకటించాయి. He came, he saw and he conquered.( ఆయన వచ్చాడు, కలయజూశాడు, అందరినీ వశపరచుకున్నాడు). కాగా శిబిరంలో స్వయంసేవకుల నుద్దేశించి మాట్లాడేసమయంలో వీర్ సావర్కర్ సంఘాన్ని విమర్శించడానికి వెనుకాడలేదు. “లాఠీ వాఠీ త్రిప్పుతూ,పెరేడ్ చేస్తూ కూర్చుంటే ఏమవుతుంది? సమాజంలోకి వెళ్లి మేల్కొలుపు తీసికొని రావాలి” అని అన్నారు. అది వింటున్న స్వయంసేవకులకు మంచిగా అనిపించలేదు. కోపావేశాలు రగులుతున్నాయి. కాని డాక్టర్జీ ఏవిధమైన ప్రతిక్రియనూ వ్యక్తంచేయలేదు. వార్తాపత్రికలకు కూడా సావర్కర్ చెప్పిన భావాత్మకమైన అంశాలు మాత్రమే పంపబడినవి.
   శిబిరంలో స్వయంసేవకులలో స్వాతంత్ర్య వీర్ సావర్కర్ ఉపన్యాసంవల్ల ఉత్పన్నమైన ప్రతిక్రియను వదిలించుకొని వారి దృష్టిని మళ్ళీ మూలకార్యంవైపు కేంద్రీకరింపజేయడానికి డా.హెడ్గేవార్ ‘పదమూడవ వార్షిక సింహావలోకనం’ అని పేరుపొందిన ఉపన్యాసాలను ఇచ్చారు. వాటిలో సంఘస్థాపన నాటినుండి అప్పటివరకు జరిగిన కార్యప్రగతి గురించిన వివరాలను తెలియ జేశారు. స్వాతంత్ర్య వీర్ సావర్కర్ సంఘంగురించి చేసిన విపరీత వ్యాఖ్యలేవైతే ఉన్నవో వాటివిషయంలో ఆయన మౌనంగానే ఉన్నారు. ఈవిషయమంతా సావర్కర్ కి తెలియకుండా ఉండిపోయిన దనుకోలేము. ఆ తర్వాత సంవత్సరం పూనా సంఘ శిక్షావర్గలో డా.హెడ్గేవార్ మాట్లాడవలసి ఉండగా, సావర్కర్ ముంబైనుండి పూనా వచ్చారు…వర్గ జరుగుతున్న చోటకు నేరుగా వచ్చారు. ఈవిషయం తెలిసి డాక్టర్జీ ఎంతో సంతోషించారు. స్వయంసేవకులతో ఇలా అన్నారు – “నేడు మనందరి అదృష్టం- తాత్యారావ్ సావర్కర్ మనమధ్యలో ఉండడానికి వచ్చారు. వారు మనకు మార్గదర్శనం చేయాలని ప్రార్థిస్తున్నాను.”
   సావర్కర్ గారుతమ ఉపన్యాసంలో చెప్పిన విషయాలను డాక్టర్జీ తన సౌమ్య స్వభావంద్వారా ఇతరుల హృదయాలను ఎలా జయిస్తుండేవారో, దానికి తార్కాణంగా పేర్కొనవచ్చు. “మావంటివారు చేసేపని కుంభవృష్టి లాంటిది. కొద్దిసేపు మాత్రమే ధారాపాతంగా వర్షం కురుస్తుంది. పరిసరాలన్నీ జలమయం అవుతాయి. ఆ నీరు కూడా వేగంగా ప్రవహించుకొంటూ వెళ్ళిపోతుంది. కాని డాక్టర్జీ పని తెలివైన రైతు చేసే పని. ఆ నీటిని వెళ్ళిపోనీయ కుండా కట్టవేసి ఆపి అవసరమైన పనికి మళ్లించుతారు.  మీరందరూ డా.హెడ్గేవార్ గారి మార్గాన్నే అనుసరించాలి” అని సావర్కర్ అన్నారు. డాక్టర్జీ వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని గుర్తించడానికి ఈ ఉదంతం ఉపయోగపడగలదని నేను ఆశిస్తున్నాను.

– ఇది డా౹౹రాకేశ్ సిన్హా రచించగా కేంద్ర ప్రభుత్వ ప్రచురణల విభాగం వారు ప్రచురించిన ‘కేశవ బలిరాం హెడ్గేవార్’ గ్రంథం నుండి సేకరింపబడినది. దానిని డాక్టర్ వడ్డి విజయసారథి గారు తెలుగులోకి అనువదించారు.

__విశ్వ సంవాద కేంద్రము  {full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top