యూరీ రక్షకుడు జెమదార్ నంద్ సింగ్ - Jemadar Nand Singh

జెమదార్ నంద్ సింగ్ - Jemadar Nand Singh జెమదార్ నంద్ సింగ్ - Jemadar Nand Singh
జెమదార్ నంద్ సింగ్ - Jemadar Nand Singh
నిపోయిన ఆ సైనికుడిని శత్రువులు చిత్రవధ చేశారు. యమ యాతనలు పెట్టారు. కాళ్లు,
చేతులు పెడ విరిచి శిలువ వేసినట్టు ఒక బండికి కట్టేశారు. అయినా పాకిస్తానీల పగ చల్లారలేదు. తమ విజయాలను అడ్డుకున్న అతడిపై ఉన్న కసి మొత్తాన్ని చూపించేసుకున్నారు. ‘ప్రతి భారతీయుడికీ ఇదే శిక్ష’ అని అరుస్తూ అతని శవాన్ని ముజఫరాబాద్‌ (ఆక్రమిత కశ్మీర్‌ రాజధాని)లో ఊరేగించారు. చివరికి అతని శవాన్ని ఒక చెత్త కుప్పలో పడేశారు. ఆ వీరుడి శవం ఎప్పటికీ దొరకలేదు. ఏమైందో ఎవరికీ తెలియలేదు.
  ఈ సంఘటన జరిగి దాదాపు ఏడు దశాబ్దాలు గడిచిపోయినా పాకిస్తాన్‌ ఇప్పటికీ అతడిని తలచుకుని బెదిరిపోతూనే ఉంది. అతని పరాక్రమాన్ని కంసుడు కష్ణుడిని తలచుకున్నట్టు, ఔరంగజేబు గురుగోవింద్‌ సింగ్‌ను తలచుకున్నట్టు తలుచుకుంటూనే ఉంది. కానీ మనమే మన వీరుడిని మరిచిపోయాం. ఆ వీరుడి పేరు నంద్‌ సింగ్‌.
నంద్‌ సింగ్‌ పంజాబ్‌లోని భటిండాకి చెందిన వాడు. రెండో ప్రపంచ యుద్ధంలో అసమాన పౌరుష పరాక్రమాలను చూపించినందుకు ఆయనకు బ్రిటీష్‌ ప్రభుత్వం విక్టోరియా క్రాస్‌ ఇచ్చింది. అప్పట్లో ఆయన సాహసాలను సైన్యంలో కథలు కథలుగా చెప్పుకునేవారు.
అక్టోబర్‌ 1947లో జమ్మూ కశ్మీర్‌ను పాకిస్తాన్‌ నుంచి విముక్తం చేసేందుకు వెళ్లిన సేనల్లో నంద్‌ సింగ్ కూడా ఉన్నాడు. కశ్మీర్‌ లోయ రక్షణకు అత్యంత కీలకమైన యూరీని విముక్తం చేసిన వీరుల్లో ఆయన కూడా ఉన్నాడు. నవంబర్‌ 22న మరోసారి పాకిస్తాన్‌ యూరీపై దాడి చేసింది. యూరీని కబ్జా చేస్తే శ్రీనగర్‌ చేతికి చిక్కుతుంది. ఇది పాకిస్తాన్‌ వ్యూహం. దానిని కూడా మన జవాన్లు తిప్పి కొట్టారు. ఈ దాడిలో మన సైనికులు పదిహేను మంది గాయపడ్డారు. వారు పాకిస్తాన్‌ దాడిలో చిక్కుకుపోయారు. దాదాపు వారం, పది రోజులుగా ఇదే పరిస్థితి. వారిని ఎలాగైనా కాపాడాలి. ఈ బాధ్యత నంద్‌ సింగ్‌ తన నెత్తిన వేసుకున్నాడు. డిసెంబర్‌ 12న నంద్‌ సింగ్‌ తన దళంలో పాకిస్తానీలపై దాడి చేశాడు. తన కాలికి గాయమయినా, రక్త స్రావం అవుతున్నా పట్టించుకోకుండా ఆయన ముందుకురికాడు. తన తుపాకీ బ్యానెట్‌తో అయిదుగురిని పొడిచి చంపేశాడు. శత్రువు పలాయనం చిత్తగించాడు. పారిపోతున్న పాకిస్తానీలను పట్టుకునేందుకు నంద్‌ సింగ్‌ తన జవాన్లతో వారిని వెంబడించాడు. వారిలో ఒకడు తన లైట్‌ మెషీన్‌గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో నంద్‌ సింగ్‌ ఛాతీకి గాయాలయ్యాయి. ఆయన అక్కడే, యుద్ధ భూమిలో, చేతిలో తుపాకీతో ప్రాణాలు విడిచాడు. 

   అతని శవం పాకిస్తానీల చేతికి చిక్కింది. అతని శరీరంపై ఉన్న విక్టోరియా క్రాస్‌ రిబ్బన్‌ను చూసి అతడిని గుర్తించారు. ఆయన శవాన్ని ముజఫరా బాద్‌లో ట్రక్కుకి కట్టి ఊరేగించి, ఓడిపోయినందుకు కసిని, పగని చల్లార్చుకున్నారు. నంద్‌ సింగ్‌ భౌతిక కాయం ఇప్పటికి దొరకలేదు. ఇచ్చే సంస్కారం పాకిస్తాన్‌కి లేదు.

– ప్రభాత్‌ - జాగృతి సౌజన్యం తో 
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top