దేశాన్ని అవమానించేవాడు దేశ ద్రోహి - The one who insults the country is a traitor

Vishwa Bhaarath
దేశ ద్రోహి
దేశ ద్రోహి
జంబు ద్వీపం అనేది కలియుగం నాటికి తొమ్మిది వర్షాలుగా విభక్తమై ఉండేది. ఇందులో భరతవర్షం ఒకటి. ఇట్టి భరత వర్షము ఇప్పుడు పశ్చమాసియాగా పిలుస్తున్న ప్రాంతంనుండి దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల వరకు, తూర్పు ఆసియాలోని అనేక దేశాల వరకు వ్యాపించి ఉండేది. రాజకీయ రాజ్యాంగ వ్యవస్థల పరంగా వేరువేరు ఖండాలుగా విభజించబడినప్పటికీ సనాతన సంస్కృతిగానే ఉండేది. భారత ఖండం దాదాపు నాలుగు వేల సంవత్సరాలనుండి విభజనకు గురవుతు చివరకు క్రీస్తుశకం 1947 ఆగస్టు 15 వరకు కొనసాగింది. అఖండ భారత ఖండం రాజకీయంగా రాజ్యాంగపరంగా ఖండించబడిన వేల సంవత్సరాల కాలంలో ఖండించమడిన ప్రాంతాలలో సనాతన సంస్కృతి ప్రభావం తగ్గిపోవడం జరిగింది. భరతవర్షం, భరత ఖండం ఒకదానికొకటి పర్యాయ పదాలుగా మారిపోతూ వేల సంవత్సరాల కాలంలో అతిపెద్దదైన భారతవర్షంలో భారత ఖండం ఒక భాగం కావడం అదే చివరకు భారతదేశంగా రూపాంతరం చెంది స్థిరపడింది.కలియుగాదిలో భారత వర్షం ఇప్పటి ఇరాన్, ఇరాక్, మధ్య ఆసియానుండి ఇండోనేషియా వరకు వుండేది. అలాగే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, టిబెట్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, బర్మా, బంగ్లాదేశ్,పాకిస్తాన్ భారతదేశం ప్రాంతమంతా ఒక కేంద్రీయ రాజకీయ ప్రాంతానికి చెందిన సామ్రాజ్యంగా ఉండేది. ఈ భూభాగం విస్తీర్ణం దాదాపు అరవై తొమ్మిది లక్షల చదరపు కిలోమీటర్లు. ఇట్టి భూభాగం 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి కేవలం 32,87,263 చదరపు కిలోమీటర్లకు కుదించుకపోయింది.
   భారతదేశం మత ప్రాతిపదికన ముక్కలైన సమయంలో కరుడుగట్టిన ఇస్లాం మత చాందసులు పాకిస్తాన్ వెళ్లగా, దేశ విభజనను అంగీకరించని ఈ ప్రాంత ప్రజలతో మమేకమైన దేశభక్తులైన ఇస్లాం మతస్తులు భారతదేశమే వారి మాతృభూమిగా భావించి ఇక్కడే ఉండిపోయారు. ప్రపంచంలో ఏ ఇస్లాం దేశంలో లేని హక్కులను పొందుతూ సర్వసుఖాలను అనుభవిస్తూ సుఖజీవనం చేస్తున్నారు. వీరికి ఇస్లాం మతస్తులకు రాజకీయనాయకుడుగానే కాకుండా రాబోవు రోజుల్లో మత నాయకుడిగా ఎదగదలిచిన స్వార్ధపరుడైన అసదుద్దీన్ ఒవైసీ అనుచిత వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండాలని తాపత్రయపడుతున్నాడు. భారత మాతాకీ జై అనడం ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపాదించిన నినాదం కాదు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్ వ్యక్తిగతంగా చెప్పింది కాదు. అనాదిగా వస్తున్న మాతృభూమిని గౌరవించే పవిత్ర భావం. ప్రతిభారతీయుడు భారత్‌మాతాకీ జై అనాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పిలుపును అవకాశంగా తీసుకుని నేను కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకించడంలో అందరికంటే నాదే పైచేయి కావాలనే భ్రమతో మెడపై కత్తిపెట్టినా భారత్‌మాతాకీ జై అనను అంటూ మాతృభూమిని అసదుద్దీన్ అవమానిం చాడు. మాతృదేశాన్ని అవమానించిన అసదుద్దీన్ ఒవైసీ మాటను పెడచెవిన పెట్టి వదిలిపెట్టినట్టయతే రాబోవు రోజుల్లో భారతదేశం మరొక్కసారి మతప్రాదికపైన విభజన చేయాలనే ప్రతిపాదనకు దారులుగా ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.
   ప్రపంచంలో దాదాపు 200 పైగా దేశాలు ఉన్నాయ. వాటిలో క్రైస్తవ మత దేశాలుగాను, ఇస్లాం మత దేశాలుగాను, బౌద్ధ మత దేశాలుగాను, యూదుల దేశంగాను, లౌకిక దేశాలుగా ఉన్నప్పటికి, ఆయా దేశాల ప్రజలు తమ దేశాన్ని మాతృదేశంగా, మాతృభూమిగా భావించి గౌరవించడం ప్రతి పౌరుని హక్కుగా బాధ్యతగా భావిస్తారు. ఇక్కడే జన్మించి, ఇక్కడే పెరిగి అన్ని హక్కులను అనుభవిస్తూ అదే దేశాన్ని అవమానించే వ్యక్తి ఏ హోదాలో ఉన్నప్పటికీ ఆ దేశానికి శత్రువు అవుతాడనేది అం దరూ వెలిబుచ్చే అభిప్రాయమే.

-బలుసా జగతయ్య - ఆంధ్రభూమి సౌజన్యంతో...
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top