"మా కోడికూతతోనే సూర్యోదయం జరుగుతుందనే భ్రమలు లేవు": డా. మోహన్ భాగవత్ జీ మొదటిరోజు ఉపన్యాసం - RSS Do not seek publicity

Vishwa Bhaarath
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ జీ
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ జీ

భవిష్యభారతం: 
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక..
  మా కోడికూతతోనే సూర్యోదయం జరుగుతుందనే భ్రమలు లేవు.  మీరు ప్రచారం, కీర్తి ప్రతిష్టలకు ఎందుకు దూరంగా ఉంటారని మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. మేము దూరంగా ఏమీ పారిపోవడం లేదు. అలాగని వాటివెనక మేము పరుగులు తీయడం లేదు, సంఘ స్థాపన సమయంలో కూడా సంఘ సార్వజనిక కార్యక్రమాలు జరిగేవి. డా|| హెడ్దేవార్ స్వయంగా వాటి నివేదిక తయారుచేసి పత్రికలకు పంపించేవారు. ఆయన సంపాదకుడుగా కూడా పనిచేశారు. ఒక పత్రికకు వస్థాపకుడిగాను వ్యవహరించారు. సంఘానికి ఏ కార్యవిభాగం అవసరమనే విషయమై ఒక డాక్యుమెంట్ (దస్తావేజు) నాకు అభిలేఖాగారంలో లభించింది. అందులో ప్రసిద్ధివిభాగం గురించి వ్రాయబడి ఉంది. ఇది 1936 నాటి విషయం. అయితే మా  సంస్కారాలను ఇచ్చే కార్యంలో దాని ఉపయోగం ఏమీ లేదు. అందువల్ల ఎప్పుడైతే తగుమాత్రం పని జరిగిందో, కాసింత చేసి చూపామో, అప్పుడు మేము 1990 దశకంలో ప్రచార విభాగాన్ని రూపొందించాము. అది నేడు కొనసాగుతోంది. 
   మేము రాబోయే రోజుల్లో చేయబోయే దానికి ప్రచారం కోరుకోము. చేసిన పనికి మాత్రమే అదీ పరిచయం కావడంకొరకే ప్రచారం కోరుకుంటాం. మేము చేసేదేదైనా ఉదాహరణగా మారిపోతుంది. మేము అలా చేశామని చెబితే, ఇతరులకుకూడా దానినుండి ప్రేరణ లభిస్తుంది. చాలామంది మాతో కలుస్తారు కూడా. చాలామంది వ్యక్తిగతంగా అలాంటి పనిచేయడంలో నిమగ్నమవుతారు. మాకూ అందువల్ల ఆనందం కలుగుతుంది. దేశంలో సూర్యోదయం జరిగిందంటే, అది మా కోడికూత వల్లే జరిగిందనే ఆలోచన మాత్రం మాకు లేదు. సూర్యోదయం కావాలన్నదే మా కోరిక. దానికొరకు ఒక విశిష్టమైన సమాజం కావాలి, దానిని మేము రూపొందిస్తున్నాము.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:

భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక .
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top