రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సమావేశాలు గుంటూరు జిల్లా నూతక్కిలో ప్రారంభమయ్యాయి. పరమపూజ్య సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ మోహన్ జీ భాగవత్ రక్తసేవా మొబైల్ యాప్ ఆవిష్కరించారు. ‘సేవాభారతి’, ‘ధనుష్ ఇన్ఫోటెక్ హైదరాబాద్’ సంయుక్తంగా రూపొందించిన రక్తసేవా మొబైల్ యాప్.. స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యకర్తను, రక్త దాతను, రక్తం అవసరం ఉన్న వ్యక్తులను అనుసంధానం చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలా అభివృద్ధి చేశారు.
పరమపూజ్య సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ |
ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘రక్త సేవా యాప్’ డౌన్లోడ్ చేసుకున్నాక, ఇన్స్టాల్ చేసుకుని పేరు, ఇతర ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వారి రక్తం/ ప్లేట్ లెట్స్/ ప్లాస్మా వివరాలు అందులో పొందుపర్చి రక్తం కోసం అభ్యర్థన చేయవచ్చు. అభ్యర్ధన చేసిన 3 గంటల లోపు దాతల నుండి అంగీకార సమాచారం వస్తుంది. ఒకవేళ దాతల నుండి సమాచారం లభించినట్లయితే ‘రక్త సేవా’ కాల్ సెంటర్ 040-4821-4920కి కాల్ చేయవచ్చు. కాల్ స్వీకరించిన సెంటర్ ‘రక్త సేవా’ ప్రతినిధులు సంబంధిత రక్త దాతలతో మాట్లాడి రక్తం అందేలా ఏర్పాటు చేస్తారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర సంఘచాలక్ శ్రీ నాగరాజు గారు (బెంగళూరు), ప్రాంత సంఘచాలక్ శ్రీ భూపతి రాజు శ్రీనివాస రాజు గారు, క్షేత్ర సహ సంఘచాలక్ శ్రీ దూసి రామకృష్ణ గారు , క్షేత్ర ప్రచారక్ శ్రీ సుధీర్ గారు, ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ గారు, సహ ప్రాంత ప్రచారక్ శ్రీ ఆదిత్య గారు, ప్రాంత కార్యవాహ శ్రీ వేణు గోపాల్ నాయుడు గారు పాల్గొన్నారు.
_విశ్వ సంవాద కేంద్రము