డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
:377వ అధికరణం:
ప్రశ్న : ఈ మధ్యనే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల తర్వాత 377వ అధికరణ మరియు సమాన లైంగికత్వం అనే విషయాలు చర్చాంశాలయ్యాయి. సంఘానికి వీటిపైనున్న అభిప్రాయమేమిటి దీంతోబాటు (ఆడ, మగ కాని) తృతీయవర్గపు సామాజిక స్థితి కూడా ఒక ప్రశ్నగా మారింది. దీని విషయంలో మీ ఆలోచన ఏమిటి?
జవాబు : సమాజంలోని ప్రతి వ్యక్తి తన భాష, ఇష్టపడితే కులం, తన వర్గంతోపాటు సమాజంలో ఒక భాగం. వీటితోపాటు మరికొన్ని విషయాలు కూడా సమాజంలోని వ్యక్తులలో ఉంటాయి. కనీసం ఇవి ఉంటే అతడు సమాజంలో భాగమవుతాడు. అతడికి అవసరమైన ఏర్పాట్లు చేసే పని సమాజమే చేయాల్సి ఉంటుంది. ఆ పని మన పరంపరలో, మన సమాజంలో జరిగిపోయింది.
కాలం మారుతున్నపుడు ప్రత్యామ్నాయ వ్యవస్థను చేయాల్సి వస్తుంది, చేసి తీరాలి. దాన్నే ఒక పెద్ద చర్చావిషయం చేసి, దేశంముందున్న అతిపెద్ద, ప్రముఖ సమస్య ఇదేన్నట్లుగా భావించి బెంబేలు పడటంవల్ల పని జరగదు. ఇది సహృదయంతో చూడాల్సిన విషయం. ఎదెనా అవకాశం ఉంటే ఆ మేరకు చేయడం; లేకపోతే ఎలా ఉందో అలా స్వీకరించి దాని సర్దుబాటుకై ఏదో ఒక వ్యవస్థ చేయాలి; దాంతో మొత్తం సమాజం ఆరోగ్యవంతమైన మనసుతో ముందుకు సాగిపోతుంది. ఏదైనా కారణంగా ఎవరిలోనైనా ఆనారోగ్యముండి.ఒంటరి భావనతో ఉండి సమాజంతో విడివడి వేరుగా వెళ్ళాలని భావించి, తమ జీవితంలోని కోరికలతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉండరాదు. సమాజమంతా దీనిగురించి దృష్టి పెట్టాలి. కాలం బాగా మారిపోయింది. కాబట్టి మనకు సమాజాన్ని ఎలా సర్దుకుంటు కలుపుకు పోవాలనే విషయం ఆలోచించాల్సి వస్తుంది.
ఇక చట్టం, తనలోని పదాల అర్థాన్ని స్వీకరించి ఏమేం చేయగల్గుతుందో అది చేస్తుంది. దానికి ఔషధం, చికిత్స ఏమీ లేదు. దాని గురించి మనం చర్చించబోతే అనేక విషయాలు ఎదురవుతాయి. సమస్య ఎక్కడి దక్కడే ఉండిపోతుంది. కాబట్టి సహృదయంతో, అన్ని రకాల వ్యక్తులను గమనిస్తూనే, సమాజం ఆరోగ్యవంతంగా ఉండేలా దాని వ్యవస్థ ఎలా ఉండాలనేది ఆలోచిస్తూ మనం ఒంటరి ధోరణితో బిర్రబిగుసుకు పోకుండా, ఏ గోతిలోనూ పడకుండా ఈ పనిచేయాలనేది నా భావన.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..