"భవిష్య భారతం: RSS దృష్టికోణం" - డా. మోహన్ భాగవత్ జీ - రెండవ రోజు ఉపన్యాసము - Bhavishya Bharatham

Vishwa Bhaarath
భవిష్య భారతం - Bhavishya Bharatham - ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్
 ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ జీ 
 భవిష్య భారతం
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం
 ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ జీ -రెండవ రోజు ఉపన్యాసము!
వేదికపై ఉపస్థితులైన మాననీయ సంఘచాలకులారా, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాతృమూర్తులు, సోదరసోదరీమణులారా !.. మన దేశంలో దేనికోసం, ఎలాగ సంఘ కార్యం ప్రారంభమైందో నిన్న మనం గమనించాం. వ్యక్తినిర్మాణమే మా సంఘ కార్యం అలా తయారైన వ్యక్తులు సమాజంలో అనుకూలమైన వాతావరణం ఏర్పరచి సమాజంలో పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇది స్వావలంబియై సామూహికంగా నడిచేకార్యం ఇది పూర్తిగా స్వచ్ఛందమైన కార్యం. ఇందులో పాల్గొనడానికిగానీ, విరమించుకోవడానికిగానీ ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేదు. ఇది చెయ్యాల్సిందేనని ఎవరూ బలవంతం చేయరు. ఉండేది కేవలం స్నేహబంధం మాత్రమే.
    స్వయంసేవకులకు లభించే శిక్షణ వ్యక్తినిర్మాణ కార్యసంబంధమైనది. కానీ సమాజహితానికై ఏఏ పనులు అవసరమవుతాయో వాటన్నింటినీ స్వయంసేవకులు చేపట్టుతారు. పని పెరుగుతూంటే శక్తి పెరుగుతుంది. శక్తి పెరుగుతున్న కొంది సంఘం నడవడానికే ఎక్కువ మంది స్వయంసేవకులు అవసరమౌతారు. సంఘకార్య నిర్వహణలో బాధ్యతలు లేని స్వయంసేవకులు ఖాళీగా కూర్చోరు. తమ పరిజ్ఞానము ఆవశ్యకతలనుసరించి ఏదోకటి చేస్తుంటారు. కొందరు అప్పటికే ఉన్న సంస్థలలో వారి అనుశాసనాన్ని పాటిస్తూ పనిలో నిమగ్నమౌతారు, లేదా క్రొత్త క్రొత్త పనులను వారే ప్రారంభిస్తారు. అలా సమాజంలోని దాదాపు అన్ని రంగాలలో స్వయంసేవకులు పని ప్రారంభించారు. అనేక సంస్థలు స్థాపించారు. ఆ సంస్థలన్నీ స్వతంత్రమైనవి, స్వావలంబన కలిగినవి. ఏ సంస్థకూడా సంఘ బైఠక్ (సమావేశాలు)లలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం నడవదు. అవి స్వయం సేవకులు ప్రారంభించినవి కనుక వారే తగిన నిర్ణయాలు తీసుకుంటారు. స్వశక్తి స్వీయ సామర్థ్యముల ఆధారంగా వాటిని నడిపించుతారు. సంఘతో వారికి పరిచయం, సంబంధం ఉంటుంది, స్వయంసేవకులంతా ఒకే రకం సంస్కారాలు పొందుతారు కాబట్టి వివిధ విషయాల్లో సంప్రదించుకోవచ్చును. కలిసి పనిచేయవచ్చును. అలాగే మంచిపని ఎవరు చేస్తున్నా, వాళ్ళు మనను సమర్థించేవారైనా, విరోధించేవారైనా, వారికి మద్దతు ఇవ్వాలన్నది స్వయంసేవకుల వైఖరి. దీనిప్రకారమే స్వయంసేవకుల సహకారం లభిస్తూ ఉంటుంది. సమన్వయ బైఠక్'లు ప్రణాళికలను, కార్యక్రమాలను యోజన చేయడానికి కాదు సంఘక్షేత్రానికి బయట పనిచేస్తున్న స్వయంసేవకులకు సంఘవాతావరణంలో గడపడానికి ఈ బైఠక్'లు అవకాశం కల్పిస్తాయి.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:

భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక .
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top