' డా|| హెడ్గేవార్ విద్యార్థి జీవనం ' - 'భవిష్య భారతం' డా. మోహన్ భాగవత్ జీ మొదటిరోజు ఉపన్యాసం Dr. Hedgewar student life

' డా|| హెడ్గేవార్ విద్యార్థి జీవనం ' - 'భవిష్య భారతం' డా. మోహన్ భాగవత్ జీ మొదటిరోజు ఉపన్యాసం   Dr. Hedgewar student life
Dr. Hedgewar student life
డా|| హెడ్గేవార్ విద్యార్థి జీవనం 
యనను మేము జన్మతః దేశభక్తుడు అంటాము. ఎందుకంటే ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పటి నుండే అలా కన్పించే వాడాయన. విక్టోరియారాణి రాజ్యారోహణ వజ్రోత్సవాల సందర్భం పురస్కరించుకుని భారతదేశంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. అది ఆంగ్లేయుల పాలనా కాలం కాబట్టి అన్ని పాఠశాలల్లో కార్యక్రమం జరపడం అనివార్యం,. దాంతో ఆయన చదివే పాఠశాలలోను కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఆ సమయంలో మూడవ తరగతి చదువుతున్నాడు. ఆ సందంర్భంగా మిఠాయి పంచారు. ఆయనకిచ్చిన మిఠాయిని చెత్తకుప్పలోకి విసిరేశాడు. దాంతో ఆ తరగతి ఉపాధ్యాయుడు., నీకు మిఠాయి అంటే ఇష్టం లేదా ? ఎందుకు చెత్తబుట్టలో పారేశావు ? అనడిగాడు. అపుడాయన, మన రాజ్యాన్ని వశం చేసుకుని మనల్ని బానిసలుగా చేసుకున్నవారి రాజ్యారోహణ కార్యక్రమం సందర్భంగా పంచిన మిఠాయి, మనకు మిఠాయి ఎలా అవుతుంది?, అలాగే ఈరోజు మనకు ఉత్సవదినం ఎలా అవుతుంది? ఇది శోకించవలసిన రోజు అవుతుంది కదా! అని జవాబిచ్చాడు.

   ప్రాథమిక పాఠశాలల్లో చదివే వయసులోనే ఈ విధమైన ఆలోచనా ప్రపంచంలో ఉండే బాలుడితడు. ఇలాంటి మానసిక స్థాయి (Mental make up) పుట్టుకతో ఎలా వచ్చిందనేది చెప్పుకోదగిన విషయం. తర్వాత రోజుల్లో చాలా కఠినమైన పరిస్థితులమధ్య చదువు కొనసాగింది. ఆయనకు 11 ఏళ్ళ వయస్సున్నపుడు, నాగపూర్లో ప్లేగువ్యాధి వ్యాపించింది. రోగులసేవలో నిమగ్నమైన ఆయన తల్లిదండ్రు లిరువురికీ ప్లేగువ్యాధి సోకి, ఒకే రోజున ఆ ఇరువురూ చనిపోయారు. ఇంట్లో సంపాదనకు ఎలాంటి మార్గమూ లేదు. దాంతో దారిద్ర్రం తాండవిస్తున్న పరిస్థితుల్లోనే తన చుదువును పూర్తి చేయాల్సి వచ్చింది. అలాంటి కఠినపరిస్థితుల్లో కూడా హెడ్గేవార్, ముందుకుసాగి వైద్యుడయ్యాడు. తన జీవితంలో రెండు విషయాలలో మాత్రం ఎపుడూ వెనకబడి ఉండలేదు. ఒకటేమో తన చదువులో ఎల్లపుడూ పాఠశాలలోని మొదటి పదిమంది
విద్యార్థులలో ఒకడుగా ఉండడంకాగా, రెండవది దేశంకొరకు ఎలాంటి ఉద్యమం జరిగినా దానిలో తను మన పూర్వకంగా భాగస్వామి కావడం.ప్రజాఉద్యమాలతో ముడివడిన దీక్ష ఆయన జీవితంలోకి బాల్యంలోనే ప్రవేశించింది. 
   తర్వాత రోజులలో వందేమాతరం ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని నాగపూర్లోని పాఠశాలల్లో నిర్వహించిన బృందంలో కేశవరావ్ హెడ్గేవార్ ప్రముఖుడు. పాఠశాల పర్యవేక్షణకొరకు అధికారి వచ్చినపుడు, ప్రతి తరగతి గదిలో ఆయనకు వందేమాతరం నినాదంతో స్వాగతం చెప్పబడింది. దాంతో సహజంగానే అప్పటి ప్రభుత్వం ఆగ్రహించింది. నాగపూర్లోని అన్ని పాఠశాలలను మూసివేసి, దీనివెనుక ఎవరున్నారనేది శోధించే పనికి ప్రభుత్వ యంత్రాంగం పూనుకుంది. అయితే ఆయన ఎంత గొప్పగా ఉద్యమాన్ని రూపొందించాడంటే, నాలుగు నెలలు గడిచినా ఎలాంటి పేరు బయటకురాలేదు. చివరకు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు కలిసి పాఠశాలలు పున:ప్రారంభింపజేయడానికి ఒక రాజీ సూత్రం రూపొందించారు. విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశించేటప్పుడు, ముఖద్వారం వద్దనే ప్రధానోపాధ్యాయుడు నిలబడి ప్రతి విద్యార్థిని తప్పు చేశావుగదా ? అని అడగటం, దానికి ఆ విద్యార్థి తల ఆడించి అవును అని చెప్పాలి. ఈ విధమైన కనీస క్షమాపణ కోరడంద్వారా విద్యార్థులందరికీ పాఠశాలలోప్రవేశించి చదువు కొనసాగించడానికి అవకాశం ఇవ్వబడింది. 
   అయితే నాగపూర్ లోని ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఈ కనీసపు క్షమాపణ కోరడాన్ని సహితం అంగీకరించలేదు. వారిలో ఒకరు డాక్టర్ హెడ్గేవార్. దాంతో ఆయనను పాఠశాలనుండి తొలగించారు. ఆరోజుల్లో జాతీయ ఉద్యమాలద్వారా చదువుకు అంతరాయమేర్పడిన బాలురకు వారి భవిష్యత్ దృష్ట్యా మన నాయకులు జాతీయ పాఠశాలలను నిర్వహించేవారు. అలాంటి జాతీయ పాఠశాలలో ఆయన చదువుకుని మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రైవేట్ విద్యార్థిగా పాల్గొని ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.
  ఆయనలోని క్రియాశీలత మరియు మనసులోని స్వాతంత్య్ర జ్వాలను నాగపూర్లోని ఆనాటి నాయకులు గమనించి, ఆయనకు కలకత్తాలోని నేషనల్ మెడికల్ కళాశాలలో చదువుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించి ఇచ్చి పంపించారు. చదువుఅనేది ఒక నెపంమాత్రమే. దేశంలోని విప్లవకారులకు సమన్వయ కేంద్రమైన కలకత్తాలోని అనుశీలన సమితితో సంబంధాలు ఏర్పరుచుకోవటము, సెలవులకు నాగపూర్ కు వచ్చినపుడు సెంట్రల్ ప్రావిన్స్ మరియు బెరార్ ప్రాంతాలలో విప్లవ కార్యకలాపాలను ప్రారంభించడం ఈ నిర్ణయంలోని ముఖ్య ఉద్దేశ్యం. ఈ రెండు పనులు డాక్టర్జీ సమర్థవంతంగా నిర్వహించారు. 
   మెడికల్ కళాశాల అంతిమ సంవత్సరపు పరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడవడమే గాక, ఆ నాలుగు సంవత్సరాలలో అతికఠినమైన పరీక్షలలో నెగ్గి అనుశీలనసమితి కోర్కమిటీలో భాగం కాగల్గినారు. ఆ సమయంలో ఆయన 'కొకేన్' అనే రహస్య నామంతో పనిచేశాడు. రాజస్థాన్ నుండి ఆంధ్ర వరకూ విప్లవకారులకు వసతి ఏర్పాట్లు, వారి జీవితానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం
వారికి అవసరమైన ఆయుధాలు అందించడం మొదలైన పనులన్నీ అత్యంత జయప్రదంగా నిర్వహించా రాయన. అయితే ఆ తర్వాత రోజులలో విప్లవోద్యమం విఫలమయ్యింది. ఆయుధాలు తీసుకొచ్చే ఓడలు భారతదేశపు తీరంలో పట్టువడి, దాని వెనకఉన్న ప్రణాళిక దొరుకుపోయింది. దాంతో మళ్ళీ అందరినీ కలిసి సర్దుబాటుచేసే పనికూడా ఆయన చేసారు.

    ఈ సమయంలో ఆయన తన జీవితాన్ని కేవలం మన దేశంకోసమే జీవించాలి. ఇదిగాక ఇంకేమి చేయరాదనే సంకల్పం స్వీకరించాడు. కళాశాలలో పరీక్ష ఉత్తీర్ణుడవగానే, కళాశాల ప్రిన్సిపాల్, ఆయనతో, నువ్వు వెళ్ళదల్చుకుంటే, బ్రహ్మదేశం (బలో ఒక మంచి ఉద్యోగం ఉందని, మూడు వేల రూపాయల వార్షిక వేతనం లభిస్తుందని కూడా చెప్పాడు. అయితే ఆయనతో డా॥ హెడ్గేవార్ నేను ఉద్యోగం చేయరాదని నిర్ణయించుకున్నా'నని చెప్పి, నాగపూర్ కు తిరిగివచ్చాడు. ఆ రోజుల్లో మొత్తం ప్రాంతంలో 75-100 కంటే ఎక్కువమంది డాక్టర్లు లేరు, ఒకవేళ వైద్యవృత్తి సాగించి ఉంటే చాలా ధనం సంపాదించి ఉండేవారు. అయితే ఆయన ధనం సంపాదించే ఉద్దేశం వదిలేసి పూర్తిగా దేశంకోసం పనిచేయడంలో నిమగ్న మయ్యారు. డాక్టర్ గా తిరిగివచ్చినందున, పెళ్ళి సంబంధాలు రావడం మొదలైంది. ఆయన తనకు సంరక్షకునిగా ఉన్న పినతండ్రికి ఉత్తరం వ్రాశారు. తల్లిదండ్రులు లేని ఆయనకు పినతండ్రే సర్వస్వమూ. ఆ ఉత్తరంలో తాను జీవితమంతా బ్రహ్మచారిగా ఉండాలను కుంటున్నానని, దేశంకోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ స్వీకరించానని వ్రాశారు. 'వివాహం చేసుకోవాలని లేదు' అనడంతో వివాహ ప్రస్తావనలు రావడం ఆగిపోయాయి.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం - డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
{full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top