"హిందుత్వమంటే ఏమిటి" ? డా. మోహన్ భాగవత్ జీ - రెండవ రోజు ఉపన్యాసము - Hindutva

హిందుత్వం - Hindutva
డా. మోహన్ భాగవత్ జీ
హిందుత్వమంటే ఏమిటి ?
కానీ దీని గురించి అనేక భ్రమలు ప్రచారంలో ఉన్నాయి. ఇందుకు కారణాల ఉన్నాయి. అలాంటి కారణాల్లో ప్రప్రథమమైనది హిందూ సమాజమే. నిన్న నేను చెప్పినట్లు 'హిందుత్వమంటే కొన్ని విలువల సమాహారం. భిన్నత్వంలో ఏకత్వం, సమన్వయం, త్యాగం, సంయమనం, కృతజ్ఞత' మొదలైనవి. ఈ విలువలకు ఆధారమైన సత్యాన్ని అన్వేషించడం ఇక్కడ జరిగింది. ప్రపంచం సుఖంకోసం బయట అన్వేషించింది. ఇలా బయట వెతుకుతూ వెతుకుతూ అలసిపోయింది. అప్పుడు మన పూర్వజులు కొందరు బయట సాగుతున్న అన్వేషణతోపాటు మన లోపలకు కూడా తొంగి చూసుకుంటే బాగుంటుంది కథా అనుకున్నారు. అలా బయటి జడజగత్తుతోపాటు లోపలి ఆధ్యాత్మిక ప్రపంచపు అధ్యయనం కూడా ప్రారంభమైంది. ఆ అన్వేషణ, అధ్యయనంలో మన అస్తిత్వపు ఏకత్వం మన పూర్వజులకు తెలిసింది. ఇది కూడా తర్కం ద్వారా కాదు. అనుభవపూర్వకంగా. ఇలా ఏకత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహానుభావుల పరంపర అప్పటినుంచి ఇప్పటివరకూ ఈ దేశంలో వస్తూనే ఉంది. ఇది తర్కానికో, సిద్ధాంతానికో పరిమితమైనది కాదు.
    మీరు దేవుడిని చూశారా?'అని స్వామీ వివేకానంద తన గురువైన రామకృష్ణపరమ హంసను అడిగారు. ఇదే ప్రశ్న అంతకుముందు అనేకమందిని అడిగారు. వారంతా తిన్నగా కాకుండా తిప్పితిప్పి సమాధానం చెప్పారు. తర్కం ద్వారా ఇలా చాలామంది చెప్పగలరు. మీరు చెప్పగలరు, నేను చెప్పగలను. కానీ తర్కంవల్ల పనికాదు. వాస్తవం ఏమిటన్నది తెలియాలి. ఇదే ప్రశ్నను రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారిని అడిగినప్పుడు ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు. 'నీ కళ్ళలో ఎంతో కాంతి ఉంది' అని మాత్రమే అన్నారు. ఇవన్నీకాదు నాకు సరైన సమాధానం కావాలని స్వామీ వివేకానంద పట్టుబట్టారు. దేవుడిని చూశారా అన్న ప్రశ్నకు ఎవరూ సరైన, సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో తత్వశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడు 'ట్రాన్స్' (ఆధ్యాత్మిక అనుభూతి) అనే మాటకు అర్థం తెలుసుకోవాలంటే దక్షిణేశ్వర్ వెళ్ళాలని చెప్పారు. దానితో వివేకానంద అక్కడికి వెళ్ళారు. ఒకటిరెండు రోజుల తరువాత ఆయన రామకృష్ణపరమహంసను నేరుగా 'మీరు భగవంతుడిని చూశారా ?' అని అడిగారు. రామకృష్ణపరమహంస నాలుగవ తరగతి కూడా చదువుకోలేదు, పైగా పైకి ఒక పిచ్చివాడిలా కనిపించేవారు. వివేకానందుడి ప్రశ్నకు ఆయన 'అవును' చూశాను నిత్యం చూస్తూనే ఉంటాను. నిన్ను ఇప్పుడు ఎంత దగ్గరగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూస్తున్నాను. భగవంతుడితో మాట్లాడతాను కూడా. నేను చూపే మార్గంలో వెళితే నువ్వు కూడా చూడగలుగుతావు’ అని సమాధానమిచ్చారు. 
   ఇలా ఈ విషయాన్ని ఇంత నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేవారు ఈనాటికీ ఈ దేశంలో కనిపిస్తారు. సత్యం ఒకటే. ఆ సత్యం ఏమిటి ? దాని వర్ణన నిన్న నేను చెప్పినట్లుగా రకరకాలుగా ఉంటుంది. అంతేకాదు పరస్పర వ్యతిరేకంగా కూడా కనిపిస్తుంది. కానీ ఆ సత్యం ఒక్కటేకాబట్టి ఈ వివిధత్వాన్ని అంగీకరించి, మన్నించాలి. మనం మార్గాన్ని శ్రద్ధాపూర్వకంగా అనుసరిస్తూనే ఇతర మార్గాలను గౌరవించాలి. కలిసిమెలిసి జీవించాలి ఇలాంటి సందేశాన్ని ఇచ్చే విలువల సముదాయమే హిందుత్వం.

- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:
{full_page} భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top