డా. మోహన్ భాగవత్ జీ |
మనలో లోపాలు వదిలించుకోనిదే స్వాతంత్య్యఫలాలు సిద్ధించవు!
రవీంద్రనాథ్ టాగూర్ ది 'చిత్తజేథాశూన్య, ఉన్నతజేథాశిర్' అనే ప్రసిద్ధమైన కవిత ఒకటి ఉంది, దాని అనువాదం కూడా లభిస్తోంది. గీతాంజలిలోని ఈ కవిత చివరలో రవీంద్రులు 'ఓ పరమపితా జాగృతమయ్యేవిధంగా ఈ దేశానికి ఒక ఆఘాతం ఇవ్వు". ఈ 'ఆఘాతం' అనే మాట ఆ కవిత ఆంగ్గ అనువాదంలో లేదు. కానీ మనం తిన్నగా సజావుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే భగవంతుడు అలాంటి దెబ్బ వేయడం ద్వారా చెవిపట్టుకుని నడిపించడం ద్వారా మనల్ని మంచిమార్గంలో పెట్టాలి. అలా చేస్తాడు కూడా అనే భావం అందులో వ్యక్తం అవుతుంది. రవీంద్రుని కవిత ఆంగ్లానువాదం ఇలా ఉంది.
" Where the mind is without fear and the head is held high;
Where knowledge is free; walls;
Where words come out from the depth of truth;
Where the world has not been broken up into fragments by narrow domestic
Where tireless striving streches its arms towards perfection3;
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake. "
(ఎచట అంతరంగమున భీతియెరుగక మనిషి ఉన్నతశిరస్కుడై నిలువగలడో
ఎచట జ్ఞానలక్ష్మి నిర్బంధింపబడదో,
ఎచట సంకుచిత సామాజిక కట్టుబాటుల అడ్డుగోడలతోడ ఈ ప్రపంచము ఇంతింత చిన్నఖండములుగ విభాజితము కాదో,
ఎచట మాటలు సత్యపూతములై గుండెలోతులనుండి ప్రకటింపబడునో,
.ఎచట నిత్యసాధన పరాకాష్ఠచేరుటకునై అవిరళమ్ముగ ముందున కురకలిడునో,
ఎచట హేతువను నిర్మలపు నీటి సెలయేటి ప్రవాహము శిథిల ఆచారాల యెడారి
ఇసుకమేటలమధ్య ఇంకిపోదో,
.ఎచట మనస్సు జడత్వమంటకుండ నిత్య విస్తారమగు బుద్ధి కర్మలలోకి నీ కృపవలన నడుపబడునో,
తండ్రీ ! అట్టి స్వేచ్ఛాస్వర్గమున నాదేశమును మేల్కొనగనిమ్ము)
బెంగాల్లో ఉన్న రవీంద్రుడు ఇలా చెప్పగా అలాగే స్వాతంత్య్ర వీర సావర్కర్ కూడా స్వతంత్ర దేవతా కీ ఆరతి' అనే ప్రసిద్ధమైన మరాఠీ కవితలో ఇదే మాట చెప్పాడు
" ఈ ప్రపంచంలో ఉత్తమమైనవి, ఉదాత్తమైనవి
ఉన్నతమైనవి, మహామధురమైనవీ మాకు కావాలి
అవి స్వాతంత్య్యంతో కలిసి మాకు లభించాలి
ఓ స్వాతంత్య్ర భగవతీ ! నీ చేతిమీదుగా మేము అందుకోవాలి"
మన స్వతంత్రభారతం ఇలా ఉండాలని కోరుకున్నాం. మరి అలాంటి దేశాన్ని రూపొందించు కోవాలంటే సమాజం ఎలా ఉండాలి ? ఇక్కడ కూడా నేను నా సొంతమాటల్ని కాకుండా మహాత్మాగాంధీ చెప్పిన విషయాల్ని ప్రస్తావిస్తాను. మన సమాజం నుంచి తొలగించవలసిన ఏడు 'పాపాల' గురించి మహాత్ముడు చెప్పారు. ఈ పాపాలను వ్యక్తిగత జీవితాలనుంచి తొలగించుకుని మనం సంస్కారవంతులం కావాలి. వ్యక్తినిర్మాణం అంటే అదే. గాంధీజీ చెప్పిన ఆ ఏడు పాపాలు ఏమిటి?
"Wealth without work,
pleasure without conscience,
knowledge without character,
commerce without morality,
science without humanity,
religion without sacrifice,
politics without principle."
అకర్మణ్యతతో కూడిన సంపద ఆత్మ వివేచన లేని ఆనందం, శీలరహిత జ్ఞానం, నైతికత లేని వ్యాపారం, మానవత్వపు అనుభూతిలేని శాస్త్రవిజ్ఞానం, త్యాగభావనలేని మతం, ఉదాత్త ఆశయాలు లేని రాజకీయాలు.
స్వాతంత్య్రం తరువాత మన దేశంలో చాలా మంచి జరిగింది. కానీ ఈ లోపాలు కూడా అంతటా కనిపిస్తున్నాయి. వీటిని వదిలించుకోనంత వరకూ ఆ సంపూర్ణ ఫలాన్ని పొందడం కష్టం. కాబట్టి వీటిని తొలగించడానికి అందరితో కలిపి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ లోపాలు బయట ఎక్కడో ఉండవు. ఇవి మన మనస్సులలో ఉంటాయి. మనతో ప్రారంభించి మొత్తం ఈ దేశంలో నింగిని, నేలను ప్రక్షాళితం చేసే ఈ పని జరగాలి. ఈ పని ప్రారంభించడానికి సంఘం అందరినీ ఆహ్వానిస్తుంది. ఈ దేశపు భవిష్యత్తు తీర్చిదిద్దగలిగే అర్హతను సంపాదించుకో, అందరూ
అలా సంపాదించుకునేవిధంగా చూడు అన్నదే సంఘం పిలపు. అలాంటి అర్హత, సామర్థ్యం మనమంతా సంపాదించుకున్నప్పుడు అందరమూ కలిసి ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటాం. ఇదే సంఘ ఆలోచన. అయితే ఇది అర్థం చేసుకునేందుకు కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో ఎవరైనా ఏదైనా మంచి పని తలపెట్టితే అందరి మనస్సుల్లో ముందు సందేహాలు వస్తాయి. ఈ పని ఎందుకు చేస్తున్నాడు అని అంతేకాదు దీనికితోడు కావాలని అపోహలు, భ్రమలు సృష్టించి, ప్రచారం చేసేవారూ ఉంటారు. అయినా అలాంటివారిపట్ల కూడా మాకు సద్భావమే ఉంటుంది. వారికి కూడా మేలు జరగాలనే కోరుకుంటాం. జ్ఞానేశ్వరుడు చెప్పినట్లుగా వారి వంకరబుద్ధి సరిదిద్దబడాలని మాత్రం కోరుకుంటాం.
అయితే సంఘం ఏం చేయాలనుకుంటోంది, ఎందుకు చేయాలనుకుంటోంది హిందుత్వం గురించి ఎందుకు మాట్లాడుతుంది, సంఘం ఎదుట భారతదేశపు భవిష్యత్తు గురించిన కల్పన ఏమిటి అనే విషయాలను అందరికీ తెలియజేయాలని అనుకున్నాం. ఈ నాలుగు విషయాలను నేను మీ ముందుంచాను. ఇది విన్నతరువాత సంఘాన్ని గురించి మరింత తెలుసుకోవాలన్న జిజ్ఞాస మీలో కలిగిందని భావిస్తాను. ధన్యవాదాలు.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..