" హిందూ పండుగలు లేదా పరంపరలకు వ్యతిరేకత ": డా. మోహన్ భాగవత్ జీ తో మూడవరోజు ప్రస్నోత్తరాలు - Obstruction on Hindu Festivals

" హిందూ పండుగలు లేదా పరంపరలకు వ్యతిరేకత ": డా. మోహన్ భాగవత్ జీ తో మూడవరోజు ప్రస్నోత్తరాలు - Obstruction on Hindu Festivals
డా. మోహన్ భాగవత్ జీ
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
: హిందూ పండుగలు లేదా పరంపరలకు వ్యతిరేకత :
ప్రశ్న : పర్యావరణం పేరుతో హిందూ పండుగలు లేదా పరంపరలను వ్యతిరేకించడమనే అలవాటు మొదలైంది. దీనిమీద సంఘం అభిప్రాయం ఏమిటి ?
జవాబు : ఇలా ఏదో ఒకపేరు చెప్పి మాట్లాడటం తప్పుగదా ? ఏదైనా చెప్పదల్చుకుంటే చేయదల్చుకుంటే నేరుగా చెప్పాలి, చేయాలి. పర్యావరణం పేరిట పండుగలను వ్యతిరేకించడమా! చాలామందికి అనేక పండుగలున్నాయి. వాస్తవంగా పర్యావరణం గురించి ఆలోచించాలంటే, దాని గురించి చర్చ జరగాలి. పండుగల కర్మకాండ, హిందుత్వం కోసం అనివార్యమైన విషయం కాదు, అవి మారుతూ ఉంటాయి. నేటికీ వటసావిత్రి వ్రతం రోజున మహిళలంతా గ్రామగ్రామాన, పట్టణాలలో కూడా వటవృక్షం వద్దకెళ్ళి దారం కడుతుంటారు. 
    నేడు ముంబై, కోల్కత్తా లాంటి మహాసగరాలలో వటవృక్షాలే లేవు మరేమైంది ? దాని కొమ్మలను ఎక్కడినుండో నరికి తెస్తారు. దానికే దారం కడుతుంటారు ఇది ధర్మసమ్మతమేనా? ధర్మ సమ్మతం కాదు. అయినా అదొక సంస్కారానికి ప్రతీక అందువల్ల ఎలాగోలా పనికానిచ్చామనుకుంటున్నారు. మేము పటవృక్షానికి పూజచేయలేక పోయినా, కనీసం దాని కొమ్మకైనా పూజ చేశామనుకుంటారు. ఇలా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా పండుగల కర్మకాండ మారుతుంది. అలాగని అలా మారడానికి కూడా సంకోచించరాదు.
  టపాసుల విషయం ఉంది. కాలుష్యం విషయం చర్చకువస్తుంది. పాతరోజుల్లో టపాసులు కల్తీవి తయారయ్యేవి కాదు. అవి శుద్ధమైన మందుగుండుతో తయారయ్యేవి. పొలం పనులన్నీ అయ్యాక, ఒక పంట పండిన తర్వాత, వర్షాలొచ్చాక పుట్టుకొచ్చే పురుగుపుట్రా ఇబ్బందులు కల్పించేవి. టపాసుల నుండి వెలువడే పొగ కారణంగా అవి కాస్త నియంత్రణలోకి వచ్చేవి అలా టపాసులు ఉపయోగపడుతుండేవి. ఆ ఉపయోగం నేటికీ ఉందా అనేది గమనించదగిన విషయం. 
   నేడు అలాంటి ఉపయోగమేమీ లేదు, నష్టమే ఉందనుకోండి, అపుడు మార్చండి. అయితే నేరుగా చెప్పవచ్చుగదా? అది కూడా కేవలం హిందువుల పండుగల గురించే ఎందుకు ? అందరి పండుగల గురించి ఇలాగే పరిశీలించండి. దేశ కాల పరిస్థితుల ఆధారంగా మార్చండి. కర్మకాండ అనేది ఎలాంటి గీటురాయి కాదు. అది మారుతూ ఉంటుంది. ఆ విషయం హిందువులలో ప్రాధాన్యం లేనిది మీరు ఇంట్లో ఆలోచించండి, సరిగా ఆలోచించండి, యోగ్యమైన ఆలోచన చేయండి అంతేగాని నేను పండితుడిని, కాబట్టి మీరు మార్చుకోండి అని మాత్రం ప్రజలలో చెప్పకండి. 
    సమాజపు మానసికతను మార్చాల్సి ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పండి. అనునయంగా చెప్పండి. మాట్లాడేటపుడు హిందూధర్మంలోని 'దరిద్రపు' అలవాటు అని ఎందుకంటారు ? పర్యావరణానికి ఇది చాలా ప్రమాదకరం అని చెబితే, హిందువులలో మార్పును ఆహ్వానించే పరంపర ఉంది. దీనిగురించి ఆలోచించండి అంటే ప్రజలు తప్పక గౌరవిస్తారు. ఎలాంటి పద్ధతిలో ఇదంతా జరుగుతుందో, అలాంటి పద్దతి ద్వారా మనసులో అనుమానాలు పుట్టుకొస్తాయి. వాస్తవంగా ఈ ఉద్దేశ్యమే ఉంటే అది చేయకూడనిది, సదుద్దేశ్యమే గనుక మీలో ఉంటే, అది ప్రజల మనసులను, దృష్టిని ఆకర్షిస్తుంది. అలా చేయాలి. అపుడు మన ధర్మాచార్యులుకూడా దీనిగురించి ఆలోచిస్తారు. అలా ఎందుకు చేయరు ?

- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.

మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top