"రాజకీయాలను నియంత్రించాలన్న కోరిక సంఘానికి లేదు": డా. మోహన్ భాగవత్ జీ - రెండవ రోజు ఉపన్యాసము - RSS does not want to control politics

Vishwa Bhaarath
డా. మోహన్ భాగవత్ జీ - రాజకీయాలను నియంత్రించాలన్న కోరిక సంఘానికి లేదు: RSS does not want to control politics
డా. మోహన్ భాగవత్ జీ 
రాజకీయాలను నియంత్రించాలన్న కోరిక సంఘూనికి లేదు!

ఫలానా పార్టీలో స్వయంసేవకులు ఎందుకున్నారు ? ఫలానా పార్టీ బాధ్యతల్లో ఎక్కువమంది స్వయంసేవకులు ఎందుకున్నారు ? ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్వయంసేవక్లు కాబట్టి వారు ఏం చేయాలి ? ఏం చేయకూడదన్నది నాగపూర్ నుంచి టెలిఫోన్ ద్వారా చెపుతుంటారని కొందరు అంటూ ఉంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు, ఇందులో ఏమాత్రం
నిజం లేదు. అక్కడ పనిచేస్తున్న రాజకీయ కార్యకర్తలు నాకంటే పెద్దవారు, లేదా నా వయస్సువారు. వాళ్ళు నాకు సీనియర్లు. కాబట్టి సంఘకార్యంలో నాకెంత అనుభవం ఉందో అంతకంటే ఎక్కువ అనుభవం రాజకీయరంగంలో వారికి ఉంది. కనుక వారికి ఎవరి సలహాలు అవసరం లేదు. రాజకీయరంగం గురించి మాకు ఏమీ తెలియదు. అందుకని సలహా కూడా ఏమీ ఇవ్వలేం. ఎవరైనా సలహా అడిగితే ఆ విషయంలో ఏదైనా చెప్పగలిగితే చెపుతాం. లేదంటే లేదు.
   వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదన్నది మేం చెప్పం. ప్రభుత్వ విధానాలపై మా ప్రభావం ఏమీ ఉండదు. ఆ రంగంలో పనిచేసే వారు కూడా స్వయంసేవకులే. దేశం గురించి ఎలా ఆలోచించాలన్నది వాళ్ళకి కొత్తగా చెప్పాల్సినదేవమిలేదు. ఇలా స్వతంత్రంగా, స్వావలంబనతో ఎవరి పని వారు చేస్తారు. అలా చేయాలన్నదే మా కోరిక. రాజ్యాంగం నిర్దేశించినదే అధికార కేంద్రంగా ఉంటుంది తప్ప మరొకటి కాడు. అలా కాకుండా బయటనుంచి మరొక నియంత్రణ కేంద్రం పనిచేయకూడదని అది సరికాదని మేం భావిస్తాం. కాబట్టి అలా బయట నుంచి నియంత్రించాలన్న ప్రయత్నం మేమెప్పుడూ చేయం.

   మరి సంఘానికి రాజకీయరంగానికి సంబంధం ఏమిటి ? ఎందుకు ఒకే పార్టీలో స్వయంసేవకులు ఉన్నారు ? ఇది మాకు సంబంధించిన ప్రశ్న కాదు. ఎందుకంటే ఇతర పార్టీలలో చేరడానికి స్వయంసేవకులు ఎందుకు ఆసక్తి చూపడంలేదన్నది ఆయా పార్టీలవాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. మేం ఏ ప్రత్యేకమైన పార్టీకో పనిచేయాలని ఏ ఒక్క స్వయంసేవక కు చెప్పం. దేశహితం కోసం పనిచేసే వారికి మద్దతుగా ఎక్కువమంది  నిలవాలని మాత్రం చెపుతాం. అది ఏ పార్టీ అయినా కావచ్చును. దేశహితాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ పౌరుడు కూడా ఆయిన స్వయంసేవక్ ఎంత చేయగలడో అంత చేస్తాడు. సంఘలో బాధ్యత కలిగినవారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయకార్యకలాపాల జోలికి వెళ్ళరు. అయితే స్వయంసేవకులకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనాలా, లేదా అన్నది వాళ్ళే నిర్ణయించుకుంటారు. స్వయంసేవక్ తనదైనందిన జీవితంలో తన తెలివితేటలు, వివేకం ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటాడు. అలా అతను ఏ విషయాన్ని గురించి నిర్ణయం తీసుకున్నా దానిపై సంఘ ప్రభావం ఉండవచ్చును. కానీ అలాంటి ప్రభావం ఉండాలని మేము ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించము. అలాంటి ప్రభావం కలిగితే దానికి మేము ఏమి చేయగలం? కాబట్టి సంఘానికి, రాజకీయాలకి సంబంధం ఇలా ఉంటుంది.
   దేశాన్ని గురించి మాత్రమే మేం మాట్లాడతాం. ఏదీ రహస్యంగా, ఎవరికీ తెలియకుండా చేయం. వ్యక్తినిర్మాణమే మా ముఖ్యమైన పని. దానినే మేం చేస్తాం. అలా సంస్కారాలను పొందిన వ్యక్తి నిష్క్రియుడిగా ఉండడు కదా? ఏదో ఒక పని చేస్తాడు కదా. అతను ఈ దేశపు పౌరుడు కూడా కదా. మిగిలిన అందరిలాగానే అతను కూడా దేశాన్ని గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. అందులో ఏ పార్టీ ప్రయోజనాలో, ఏ సిద్ధాంతపు ప్రచారమో లేవు. కేవలం దేశహితానికి సంబంధించిన ఆలోచన మాత్రమే ఉంటుంది. ఎవరిపట్ల ద్వేషం ఉండదు, అలాగని ప్రత్యేక స్నేహం కూడా ఉండదు. ఇది సంఘ స్వభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:

భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top