డా. మోహన్ భాగవత్ జీ |
హిందూ శబ్దమే ఎందుకు ఉపయోగించాలి?
అయితే ఈ హిందువు, హిందుత్వం అనే మాట బయట నుంచి వచ్చింది. ప్రాచీన గ్రంథాల్లో ఈ మాట ఎక్కడా మీకు కనిపించదు. ఇప్పటికీ చాలామంది పండితులు, సంతులు 'సనాతనధర్మం' అనేమాటే వాడుతారు. ధర్మమని పిలుస్తారు. ఇతర మతాలవారు ధమ్మ అంటారు. హిందూ అనే మాట ఆ తరువాత కాలంలో వచ్చింది. 1929 ప్రాంతంలోఆచార్య మహావీర్ ద్వివేది ఒక కవిత రాశారు. అందులో ఆయన ప్రాచీన కాలంలో 'జరతృష్టుడు' పర్షియాకు వెళ్ళడం గురించి వ్రాశారు. జరతృష్టుడు పర్షియా (నేటి ఇరాన్) వెళ్ళినప్పుడు అక్కడివారు ఆయన్ని గురువుగా మన్నించారు. ఆయన వివరాలు, పరిచయం అడిగారు. అందుకు జరతృష్టుడు 'ఏం చెప్పను ? మా పూర్వీకులు సింధూనది అవతలవైపు నుంచి వచ్చినవారు అన్నాడు. పర్షియా భాషలో 'స' అనే శబ్దాన్ని 'హ' గా పలుకుతారు. అందువల్ల వాళ్ళు తమ గురువును హిందూ గురువుగా పిలుచుకున్నారు. పర్షియా నుంచి ఇజ్రాయిల్ వైపు కూడా వ్యాపార కార్యకలాపాలు సాగుతుండడంతో ఈ మాట అక్కడకు కూడా చేరింది. ఆ తరువాత అక్కడ నుంచి ఈ మాట మన దేశానికి వచ్చింది.
సుమారు 9వ శతాబ్దం నుంచి మన గ్రంథాల్లో కూడా ఈ మాట కనిపిస్తుంది. అంతకుముందు ఇది లేదు. అప్పుడు కూడా ఈ మాట జనసామాన్యంలోకి రాలేదు. కానీ విదేశీ దండయాత్రలు మొదలైనప్పుడు దురాక్రమణదారులు దుర్మార్గపూరితమైన దాడికి పాల్పడినప్పుడు ఇలా జరిగిందేమిటని ఇక్కడివారు ఆలోచనలో పడ్డారు. మీరంతా హిందువులు కాబట్టి మిమ్మల్ని మతం మారుస్తున్నామని దురాక్రమణదారులు సమాధానమిచ్చారు. అలా అప్పటి నుంచి హిందూ అనే మాట సామాన్యజనంలోకి వచ్చింది.
సాధారణంగా సాధుసంతులు సామాన్యప్రజానీకపు భాషలో ప్రవచనాలు ఇస్తారు. అలా మొదటిసారి గురునానక్ 'ఖురాసాన్ ఖసామానాకియా, హిందుస్థాన్ డరాయా, కాయా
కపడ్ టుక్ టుక్, హెూనీ హిందుస్థాన్ సమాలసీ బోలా అని అన్నారు. అలా అప్పటి నుంచి హిందూ' శబ్దం ప్రచారంలోకి వచ్చింది. అదే ఇప్పుడు స్థిరపడిపోయింది. మన పేర్లు మనలను అడిగి పెట్టినవికావు. అయినా మనం వాటికి అలవాటుపడిపోయాం. పేరుతోగాక మరేదోపేరుతో పిలిస్తే మనం పలకంకూడా. ఈ పేరు కూడా అలాగేవాడుకలోకి వచ్చి స్థిరపడిపోయింది. సమాజం ప్రగతి వ్యక్తి యాత్రలో కలిసి ప్రయాణించవచ్చును. మానవ సమాజ అభివృద్ధి, పర్యావరణాలలో కూడా ఎలాంటి వైరుద్ధ్యం లేదు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ఒకేసారి సాధ్యపడతాయి. ప్రపంచమంతటా ఒకే శక్తి నిండి ఉందికాబట్టి అందరూ కలిసి అభివృద్ధి సాధించవచ్చును. అలాగే అందరూ శ్రేయస్సును సత్యాన్ని పొందవచ్చుకూడ. అయితే ఈ ఆలోచనలను ముందు పెట్టి
మాట్లాడనారంభించ గానే ఎవరైనా వీటిని హిందూ భావనలు అంటున్నారు
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
{full_page} భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..