దేశం గొప్పదికావటం జనసామాన్యంపై ఆధారపడిఉంటుంది - The greatness of the country depends on the masses

0
దేశం గొప్పదికావటం జనసామాన్యంపై ఆధారపడిఉంటుంది - The greatness of the country depends on the masses
దేశం గొప్పదికావటం జనసామాన్యంపై ఆధారపడిఉంటుంది !
- బొళాసాహబ్ దేవరస్

దేశం గొప్పదికావటం జనసామాన్యంపై ఆధారపడిఉంటుంది
  ఆంగ్లేయుల స్వభావంలో దాగి ఉన్న సామర్థ్యం ఏదైతేఉందో, విజయాన్ని సాధించిన మునత దానికే చెందుతుంది. యుద్ధకాలంలో ప్రతిరోజూ దేశంమీద బాంబులు వర్షంలాపడుతూ ఉండేవి. భవనాలు, ఇళ్లూ, ధ్వంసమౌతూ ఉండేవి. ప్రజలు నేలమాళిగలలో (బంకర్లలో) నిద్రపోవలసి వస్తుండేది. ఆరు -ఏడు సంవత్సరాలపాటు ఎంతో కఠినమైన, కష్టాలమయమైన జీవితం గడిపారు. ఒక్కరుకూడా లొంగిపోవాలనిగాని, ఎవరినో శరణుకోరాలని గాని సూచిస్తూతూ మాట్లాడలేదు. ప్రతిఒక్కరి సంకల్పబలమూ పదిలంగా ఉంచుకొని సంపూర్ణ సమాజం ఒకటిగా నిలిచి పోరాటం సాగించారు. సంకటములపై విజయం సాధించారు. దీనిని బట్టి- ఏ సమాజం స్వభావసిద్ధంగా శక్తిశాలి సాహసి అయివుంటుందో, ఆ సమాజం తనను తాను సురక్షితంగా ఉంచుకోగలదని అర్థమవుతుంది. ఎప్పటివరకైతే, ఇది సమాజంయొక్క స్వాభావిక అవస్థగా రూపుదిద్దుకోదో, అప్పటివరకు అంతర్, బాహ్య సమస్యలను పరిష్కరించుకోవటం సాధ్యంకాదు సంఘకార్యం యొక్క కల్పనకూడా ఇదే. ఏదేశం (జాతి-రాష్ట్రము) యొక్క గొప్పదనమైనా (పెద్దరికమైనా) ఆ దేశంయొక్క నాయకులు ఎంతటి మేధావులు, ఎంతటి శ్రేష్ఠలు అనే అంశంపై ఆధారపడి ఉండదు. ఆ దేశం (జాతి, రాష్ట్రం) ోని సాధారణ ప్రజలు ఎంతటి ధైర్యవంతులు, ఎంతటి సామర్థ్యశీలురు అనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. వారి ఆచార విచార వ్యవహారాలు ఎలా ఉంటున్నవనే అంశంపై ఆధారపడి ఉంటుంది. 
  ఏ సమాజంలోనైతే ప్రజలు స్వార్థపరులై సంపూర్ణ సమాజము, దేశములపట్ల ఏమాత్రం ఆలోచించనివారై వ్యవహరిస్తుంటారో, ఆ సమాజం ఎక్కువకాలం జీవించి ఉండజాలదు. మన హిందూధర్మంలో ఈ కారణాననే స్వార్గాన్ని విడిచి పెట్టి ఇతరులమేలుకోసం పాటుపడాలని చెప్పారు. ఏతే సత్పురుషాః పరార్థఘటకాః స్వార్ధాన్ పరిత్యజ్యయే (తమ కార్యంబు త్యజించియున్ పరహిత ప్రాపకుల్ సజ్జనుల్) అదే విధంగా ఇతరులకు మేలు చేస్తూకూడా అందులో తమకుకూడా కొంత ప్రయోజనం సిద్దించాలని, ఉభయులకూ ప్రయోజనకరంగా ఉండాలని చూసేవారు సామాన్యులు-మధ్యములు. 

   సామాన్యస్తు పరార్థ ఉద్యమ భృతః స్వార్ధావిరోధేన యే (తమ కార్యంబు ఘటి పుచున్ పరహితార్థప్రాపకుల్ మధ్యముల్) ఈ ప్రాచీన సుభాషిత చెప్పుతున్నదానిని బట్టి సామాన్య మానవులనుకొనేవారు కూడా - ఇతరుల మంచి గురించి ఆలోచిస్తూ ఉండాలి, శ్రమిస్తూ ఉండాలి. స్వార్ణంలో లీనమై ఉండేవారిని మన పెదలు రాక్షసులతో పోల్చారు - తే మనుష్యాః రాక్షసాః యే స్వార్థరతా. సామాన్యవ్యక్తులు స్వార్థరహితులై ఉన్నంతవరకు వారున్న సమాజం సహజంగా, స్వాభావికంగా సామర్ధ్యాన్ని పెంపొందించుకోగల్గుతుంది. ఇంగ్లాండు, జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్, భారతదేశాల కొంత ప్రయోజనం సిద్ధించాలని, ఉభయలకూ ప్రయోజనకరంగా ఉండాలని చూసేవారు పునర్నిర్మాణ చరిత్ర రెండవ ప్రపంచయుద్ధం తర్వాత మొదలైంది. గడచిన రెండు దశాబ్దాలలో జర్మనీ, గతంలో కంటే ఎక్కువ సామర్థ్యం గల్గిన దేశంగా పైకి వచ్చింది. జపాను, ఇజ్రాయెల్  దేశాలు కూడా గొప్ప చమత్కారం చేసి చూపించినవి. ఇజ్రాయెల్లో ఉండే యూదుల గురించి వీళ్లు వ్యాపారులు-అంతకంటే ఏమీ చేయలేరు అనే అభిప్రాయం అందరికీ ఉండేది. డబ్బుకి జీవితానికి ఎప్పటికీ తెగని లంకె ఉంటుందని, లోభులని, పిరికివాళ్లని, యుద్ధమంటే ఏమిటో తెలిసినవారు కారని అందరూ వీరి గురించి వ్యాఖ్యానిస్తుండేవారు. అయితే ఇప్పుడు గత 16 సంవత్సరాలుగా ఆ యూదులే పాలస్తీనాలో యుద్దం సాగిస్తూ ఉన్నారు.

   ఇజ్రాయిల్ జనాభాలో సగంమంది ఇండ్ల పైకప్పులమీదకెక్కి శత్రువులతో యుద్ధం చేస్తూ ఉండగా, మిగిలిన సగంమంది నేలమాళిగలో నిర్మించుకున్న కార్టానాలలో పనిచేస్తూ ఉంటారు. అరబ్బులు ఎప్పుడువచ్చి మీదపడతారోనన్న భయం వారిలో ఎప్పటికీ ఉంటుంది. అయితే ఇప్పుడు అరబ్బులే వీరిని చూచి హడలిపోతున్నారు. వీరు అటువంటి పట్టు సంపాదించారు స్వల్పకాలంలోనే వారు తమ అంతరిక వ్యవస్థలను ఉన్నతీకరించుకున్నారు. దృఢపరుచు కున్నారు. బయటకు పోయి ఆక్రమించుకోగల సామర్థ్యాన్నికూడా పెంపొందించుకున్నారు ఇదంతా ఎలా సాధ్యమైంది? దీనికి ఒకటే కారణం- అక్కడి సామాన్య వ్యక్తుల వ్యవహారంద్వారా సమాజంయొక్క స్వాభావికమైన సామర్థ్యం జాగృతమైంది. కొద్దిమంది బహుశా తమ కుటుంబాలవరకే పరిమితమై ఆలోచిస్తున్నవారూ ఉండి యుండవచ్చు. అయినా వారుకూడా సంకటకాలం వచ్చినపుడు స్వభావానుగుణంగా లేచి నిలబడుతారు. మామూలు రోజులలో విభిన్న సమాజాలు జీవితం గడిపే తీరుతెన్నులలో పెద్దగా అంతరమేమీ కనబడదు. ఒకానొక ప్రత్యేక సమయం వచ్చినపుడు సమాజంయొక్క వైశిష్ట్యమేమిటో బయటపడుతుంది. అయితే అన్ని సమాజాలూ ఈ విధంగా తమ సహజ ఆంతరిక సామర్థ్యాలను ప్రకటించుకోజాలవు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లక్ష్యము-కార్యము

సంస్కృతంలో ఒక సుభాషితముంది
కాక కృష్ణః పికః కృష్ణః కో భేదో పిక కాకయోః
వసంత సమయే ప్రాప్తే కాకః కాకః పికః పిక

  రెండూ నల్లగా ఒక తీరున ఉన్నందున కాకులమధ్య ఉండే కోకిలలను మామూలు రోజులలో గుర్తించలేము. కాగా వసంతకాలం రాగానే వానిలోని సహజగుణం (గొంతెత్తి పాటపాడటం) బైటపడుతుంది. కాకులకు భిన్నంగా కోకిలలను గుర్తించగల్గుతాం. అదే విధంగా సంకటకాలం వచ్చినపుడు బలిష్ఠమైన సమాజమేదో, నిర్మల సమాజమేదో ప్రకటితంచేసే భేదాలు వ్యక్తమౌతాయి. మన సమాజపు సామాన్య వ్యక్తులలో ఉండే శక్తికిగల వాస్తవికస్రోతస్సు అయిన స్వాభావిక సామర్థ్యాన్ని మేల్కొలపడానికి సంఘకార్యం నడుస్తున్నది. ఇది ఎంత శీఘ్రంగా జరుగుతుందో అంత శీఘ్రంగా సంఘకార్యం పూర్ణత్వాన్ని పొందగలదు. 

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top