యతి నర్సిగానంద్ సరస్వతిపై హత్యకుట్ర భగ్నం, పోలీసుల అదుపులో ఉగ్రవాది!

0
యతి నర్సిగానంద్ సరస్వతి
యతి నర్సిగానంద్ సరస్వతి

ఢిల్లీలోని పహర్ గంజ్ ప్రాంతంలో 24 ఏళ్ల జైష్-ఎ-ముహమ్మద్ ఉగ్రవాదిని అరెస్టు చేయడంతో దస్నా దేవి ఆలయ ప్రధాన పూజారి యాతి నర్సిగాానంద్ సరస్వతిపై హత్యాకుట్రను ఢిల్లీ పోలీసులు సోమవారం భగ్నం చేసారు. పట్టుబడిన ఉగ్రవాది నుంచి ఒక .30 బోర్ పిస్టల్ తో పాటు రెండు మ్యాగజైన్ మరియు 15 లైవ్ రౌండ్లతో పాటు, పోలీసులు ఒక భగవాన్ కుర్తా, కాలవా, మాల మరియు ఉగ్రవాది నుండి చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ నిందితుడు , జమ్మూలోని పుల్వామాకు చెందిన 'మొహద్' దార్ అలియాస్ జహంగీర్, గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్లోని దస్నా దేవి ఆలయ ప్రధాన పూజారి ' యతి నర్సింగానంద్ సరస్వతిని హత్య చేసేందుకు నిందితుడికి రూ.41,000 చెల్లించినట్లు తెలుస్తోంది. సుమారు ౧౦ రోజుల క్రితం పహర్ గంజ్ లోని హోటల్ శివ నుండి అతన్ని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు అరెస్టురహస్యంగా ఉంచారు.

పోలీసుల విచారణ సమయంలో అతను ఇచ్చిన సమాచారంలో, పాకిస్తాన్ కు చెందిన అబిద్ అనే ఒకతను జైష్-ఎ-ముహమ్మద్ ఉగ్రవాద సంస్థలో పని చేయడానికి తనను నియమించుకున్నట్లు దార్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.  అతను తన స్వగ్రామానికి సమీపంలో వడ్రంగిగా పనిచేశాడని, అక్కడ డిసెంబర్ ౨౦౨౦-2020 లో అబిద్ ను కలిశానని చెప్పాడు. తాను జెఈఎం ఉగ్రవాద సంస్థ కు చెందినవాడిని అని అబిద్ చెప్పాడు మరియు వీరిద్దరూ ఏప్రిల్ 2021 లో మళ్లీ కలుసుకున్నారు.

"వారు వాట్సప్ లో ఒకరితో ఒకరు నిరంతరం చాటింగ్ చేసేవారు. ఫిబ్రవరిలో, గుండె జబ్బుతో ఉన్న తన మేనల్లుడి చికిత్స కోసం దార్ తన సోదరి మరియు ఆమె మామతో కలిసి ఢిల్లీకి వచ్చాడు.  అతను కాశ్మీర్ కు తిరిగి వచ్చిన తరువాత, దస్నా దేవి ఆలయ ప్రధాన పూజారి యాతి నర్సిగానంద్ సరస్వతిని హత్య చేసే పనిని అబిద్ అతనికి అప్పగించాడు" అని తెలిపినట్టు, ఈ విచారణ  వివరాలకు గోప్యాంగ ఉంచినట్టు పోలీసు అధికారి తెలిపారు.

source_Op india

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top