హిందూరాష్ట్ర సిద్ధాంత కర్త వీర సావర్కర్ గారి జీవిత విశేషాలు (క్లుప్తంగా) - Biography of Veer Savarkar

0
Veer Savarkar
Veer Savarkar

: మే28 వీరసావర్కర్ జయంతి శుభాకాంక్షలు :

అపర దేశభక్తుడు, అసలు సిసలు స్వాతంత్ర పోరాట యోధుడు, హిందూరాష్ట్ర సిద్ధాంత కర్త వీర_సావర్కర్ గారి జీవిత విశేషాలు.....
వీరసావర్కర్ జననం నుండి మరణం వరకు క్షణం క్షణం కణం కణం భారతమాతకే సమర్పణం.
  • జననం 1883 మే 28, సోమవారం ఉదయం 10 గంటలకు నాసిక్ లో...
  • తల్లి మరణం... 1892 జులై లో..
  • 12 సంవత్సరాల వయసులో మొదటి మరాఠి పాట వ్రాశాడు ..
  • 1898లో చేసిన   ప్రతిజ్ఞ.." ఐతే ఛాపేకర్ సోదరుల వలె బలిదానం లేదా ఛత్రపతి శివాజీ వలె హిందూ సామ్రాజ్య ప్రతిష్ఠాపన చేస్తాను ...
  • తండ్రి , పిన తండ్రి ప్లేగు వ్యాధి సోకి మరణం 1899లో ...
  • స్వాతంత్య్రం కోసం రహస్య సంస్థ '#మిత్ర_మేళా' ప్రారంభం 1901లో ,....
  • 1902 లో 10th పాస్....
  • ఆర్యన్_వీక్లీ కొత్త పత్రిక ప్రారంభం 1903లో,
  • పద్యాల రచన...1.శివాజీ హారతి పాట 2.స్వాతంత్య్ర రూపక గీతం 
  • 1904 లో రహస్య మిత్ర మేళాను అభినవ భారత్ గా మార్పు,...
  • విదేశీ వస్త్రాల దహనం చేయటం సావర్కర్ కి 10 రూపాయల జరిమానా, హాస్టల్ నుండి తొలగింపు, పుత్రుడు జననం, ప్రభాకర్ నామధెయం(1905).
  • LLB చదువుల కోసం పుణే ప్రయాణం బిహారీ అను పత్రికకు ఎడిటర్ గా నియామకం (1906).
  • బాల గంగాధర్ తిలక్ సలహా తో శ్యాంజి క్రిష్ణ వర్మ ఇచ్చే స్కాలర్ షిప్ తో విదేశాల్లో చదువు(1906 మే).
  • భారత్ వదలి ఇంగ్లాండ్ ప్రయాణం,పడవలొనే 'మహాసాగర్'పద్య రచన(9 జులై).
  • ఇటలీ దేశ స్వాతంత్య్రం కోసం పొరాడిన మెజినీ యుద్దవీరుడి కథా రచన(జులై - సెప్టెంబర్).
  • శివాజీ అనుచరుడైన బాజీ ప్రభు దేశ పాండే పై రూపకం రచన...
  • తన ప్రేరణతో మదన్ లాల్ ధింగ్రా అను యువకుడు లండన్ వెళ్లి కర్జన్ వైలీని హతమార్చాడు(జులై). 
  • జైలులో వున్న ధింగ్రా ను కలిసి వచ్చాడు(జులై 22),ధింగ్రా కు మరణశిక్ష (ఆగష్ట్ 11), మహాత్మా గాంధీ సమక్షంలో విజయదశిమి రోజున  ఉపన్యాసం (అక్టోబర్ 24),
  • తన ప్రేరణతో అనంత లక్ష్మణ కన్హరే అను యువకుడు 'జాక్శన్' ఇంగ్లీష్ అధికారిని చంపివెసాడు(డిసెంబర్ 21).
  • లండన్ లో  ప్రధమ స్వాతంత్య్ర పోరాటం1857,  50 సంవత్సరాల ఉత్సవాలు,
  • లండన్ లోని ఇండియా హౌస్ నిర్వహణ బాధ్యత.
  • 1857 స్వాతంత్య్ర పోరాటం చారిత్రక పుస్తక రచన. విప్లవ వీరులకు ఇది భగవద్గీత.ఈయన పుస్తకం చదివిన వారిని 15 సంవత్సరాలు మరియు అండమాన్ జైలు
  • లండన్ లో శివాజీ జయంతి ఉత్సవాలు జరిపాడు.
  • "1857 స్వాతంత్య్ర పోరాట గాథలు' పుస్తకం ఇంగ్లీష్ లోకి అనువాదం.
  • 21బ్రొనింగ్ పిస్టల్ లు ఒక వంట మనిషి ద్వారా భారత్ కి పంపించారు.
  • పుత్రుడు ప్రభాకర్ మరణం,పెద్దన్నయ్య గణేశ్ సావర్కర్ ని అండమాన్ జైలుశిక్ష (ఆజీవన కారాగారము) విధించి,పంపారు. (1909)
  • తీవ్ర అనారోగ్యం  కారణంగా విశ్రాంతి కోసం ప్యారిస్ ప్రయాణం(1910)
  • ప్యారిస్ నుండి తిరుగు ప్రయాణం లో లండన్ లో అరెస్ట్ అయ్యాడు (మార్చ్13).
  • జులై 1 న మొరియా స్టీమరులో భారత్ ప్రయాణం..
  • జులై 18న సముద్రంలో దూకి,ఈది ఫ్రాన్స్ సరిహద్దులు చేరి మళ్ళీ అరెస్ట్ అయ్యాడు.
  • జులై 22 నాసిక్  , ఎరవాడ జైళ్లో పెట్టారు.
  • డిసెంబర్ 24 ఆజీవన కారాగార శిక్ష విధించి అండమాన్ జైలుకి పంపారు.ఆయన ఆస్తుల్నీ జప్తు చేశారు.
  • 1911, జనవరి 31 రెండవసారి ఆజీవన కారాగార శిక్ష పడింది.జులై 4 అండమాన్ సెల్యులర్ జైల్ కి తీసుకుని వెళ్ళారు.
  • 1918 లో అనారొగ్యానికి గురయ్యారు.
  • 1919 ఎప్రిల్ లొ  సావర్కర్  వదిన యశువాహిని మరణం 
  • మే లో తమ్ముడి భార్య మాయి  వచ్చి కలిసింది.
  • 1921 రంగస్వామి అయ్యర్ కౌన్సిల్ లో సావర్కర్ అనారోగ్యం గురించి లేఖ వ్రాసి విడుదల చెయమన్నారు.
  • 1922 హిందూత్వ అను సైద్దాంతిక పుస్తకం వ్రాశారు.
  • 1923 ఎరవాడ జైలు కి పంపారు.
  • 1924 లో విడుదల,రత్న గిరి జిల్లా దాట వద్దని నియమాల తో కూడిన బెయిల్ తో విడుదల చేశారు.
  • 1924 మహరాష్ట్ర తరఫున 12000రూపాయలు సమర్పించారు.
  • 1925 న కూతురు పుట్టింది. ప్రభ అని పేరు పెట్టారు.
  • జనవరిలో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు.  హిందూ గణేష ఉత్సవాలు ప్రారంభం చేశాడు.
  • 1926 లో 'శ్రద్దానంద' పత్రికలో వ్యాసాలు వ్రాయటం మొదలయ్యింది.
  • 1927 లొ మహాత్మా గాంధీ సావర్కర్ ని కలవడానికి రత్నగిరికి వచ్చారు. 
  • అంటరానితనం నిర్మూలన పై నాటకం వ్రాశాడు. 1910 నుండి 1921వరకు అండమాన్ జైల్లో పడ్డ యాతనలు వివరిస్తూ పుస్తకం వ్రాశాడు.
  • 1928 కొడుకు విశ్వాస్ జననం.
  • 1930లో సామూహిక భోజనాలు 1931 లొ పతిత పావన మందిరం నిర్మించారు. ఆ గుడిలో అన్ని వర్గాల వారికి ప్రవేశం కలిపించబడింది. 
  • 1932 లొ  ఎవరిదో హత్య గురించి అనుమానం తో మళ్ళీ అరెస్ట్. 1937హిందూ సభ కు అధ్యక్షుడిగా ఎంపిక.
  • 1937 న జైలు నుండి విడుదల.  ఆయన వ్రాసిన 'కాలాపానీ' పుస్తక ప్రచురణ జరిగింది.
  • 1938 మరాఠీ సాహిత్య సమ్మేళనం అధ్యక్షుడిగా ఎన్నిక. హిందూత్వ గురించి  దేశమంతటా పర్యటన. 
  • అక్టోబర్లో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్య సమాజం చేసె ఉద్యమాన్ని  సమర్ధిస్తు  భాగ్యనగర సత్యా గ్రహం ప్రసంగం పుణే లో ఇచ్చారు.
  • కలకత్తా,మద్రాస్ బీహార్, అమృతసర్ , నాగపూర్,బిలాస్ పూర్  పర్యటన. 
  • 1945 లొ అన్న గణేశ్ సావర్కర్ మరణం 
  • మే 28 న 68వ పుట్టిన రోజు సందర్భంగా  హిందూత్వ కార్యక్రమాలకు 50000 రూపాయలు నిధి సమర్పణ.
  • 1946 లో సావర్కర్ వ్రాసిన పుస్తకాలపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన నిషేదం ఎత్తివేత. 
  • 1947 లో స్వాతంత్య్ర దినోత్సవానికి స్వాగతం చెపుతూ జాతీయ జెండా తో పాటు భగవా ఝండా ఎగరెసారు. స్వాతంత్య్ర లక్ష్మీ కి జయ్ అంటూ నినాదం ఇచ్చాడు.
  • 1948 ఫిబ్రవరి  లో గాంధీజీ హత్యకు సంబంధం లేకున్నా మళ్ళీ అరెస్ట్. 1949 మే 10 న విడుదల 
  • అక్టోబర్ 19 తమ్ముడు్ నారయణ సావర్కర్ మరణం 
  • 1950 లో మళ్ళీ అరెస్ట్ (లియాఖత్ చర్చల పేరుతో).
  • 1952లో 10-12 మే లో విప్లవ వీరుల స్మృతి కి చిహ్నంగా దేశం లోనే మొదటిసారి పూణె మునిసిపాలిటీ స్మారక స్తంభం స్థాపన.
  • డిసెంబర్ లో ప్రసంగం 'మతం మారితే జాతీయత ను కూడా మార్చుకున్నట్లె 'అని.
  • 1954 లొ క్రైస్తవుల నుండి హిందు మతంలొకీ శుద్ది కార్యక్రమం ద్వారా హిందువుల పునరాగమనం ఏర్పాట్లు.
  • 1962 మహారాష్ట్ర గవర్నర్ ద్వారా సావర్కర్ ఇంట్లోనే సన్మానం 
  • 1963 లొ 'చరిత్ర లో ఆరు స్వర్ణ పుటలు' పుస్తకం ప్రచురణ 
  • 1965 పాకిస్తాను యుద్దం లో భారత సైన్యం లాహోర్ చేరుకొనేసరికి అత్యంత అనందం వ్యక్తం చేశారు.
  • 1966 ఫిబ్రవరి  1 న తీవ్ర అనారోగ్యం ఫిబ్రవరి 26 న స్వర్గవాసులయ్యారు. ఫిబ్రవరి 27 న పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు...

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top