తెలంగాణ " లవ్ జిహాద్ " కు అడ్డా !!

0
తెలంగాణ " లవ్ జిహాద్ " కు అడ్డా !! - Love Jihad in Telangana
Love Jihad
 • -- నిందితుల పేర్లు రాయని పత్రికలు...
 • -- విజువల్స్ చూపని ఎలక్ట్రానిక్ మీడియా...
 • -- మౌనం ప్రదర్శిస్తున్న మహిళా సంఘాలు....
 • -- మూడు కోతుల రీతిగా వ్యవహరిస్తున్న పోలీసులు...మహిళా సంఘాలు.. మీడియా..
 • -- నోరు మెదపని సెక్యులరిస్టులు...
 • -- ముస్లిం బాలికకు శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్....హిందూ పసిపాపకు జరిగిన దారుణంపై పెదవి విప్పక పోవడం దుర్మార్గం...
   తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హెదరాబాద్ లవ్ జిహాద్ కు అడ్డాగా మారింది! ఈ రాష్ట్రంలో వోటు బ్యాంకు రాజకీయాలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. దీంతో బాధితుడికి భరోసా కరువై బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే, నిందితులు మాత్రం కాలర్ ఎగరేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఘటన మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వస్తోంది. ఒక సంఘటనపై ఆందోళన చేయకముందే మరో సంఘటన వచ్చి పడుతోంది. ఇది ఇటీవల కాలంలో హైదరాబాదులో, తెలంగాణ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు, ఆశ్రయమిచ్చి ఆక్కున చేర్చుకోవలసిన మహిళా సంఘాలు, మహిళా కమిషన్'తో పాటు మీడియా వ్యవస్థ మూడు కోతుల పాత్ర పోషిస్తున్నాయి. 'చెడు వినకు-చెడు చూడకు-చెడు మాట్లాడకు' అనే రీతిలో ప్రవర్తిస్తున్నాయి. అన్ని విషయాలలో ఇలాగే జరుగుతుందా? అంటే అదేమీ లేదు. కేవలం హిందువులపై జరుగుతున్న దాడి విషయంలో మాత్రమే ప్రేక్షకపాత్ర, మౌనపాత్ర పోషిస్తున్నారు. ఈ సంఘటనల కారణంగా ఆకతాయిలు మరింత చెలరేగిపోతున్నారు. బయటికి వచ్చే లవ్ జిహాద్ కేసులు కొన్ని మాత్రమే! వెలుగు చూడని అనేక సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.

విలువలు మరచి మోకరిల్లిన మీడియా. :
  తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మరోవైపు మీడియా రంగం ఎవరూ హిందువుల ఆర్తనాదాలు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా కూడా హిందువులపై వివక్ష చూపుతోంది. జరిగిన సంఘటనలు, యదార్ధ వాస్తవాలను తొక్కి పెడుతోంది. 'ప్రతిక్షణం ప్రజల పక్షం’ 'నికార్సయిన జర్నలిజం' 'దమ్మున్న చానల్' 'ప్రజా వారధి' 'అక్రమార్కులు అవినీతిపరులకు గొడ్డలిపెట్టు' అంటూ పోటీపడి రకరకాల ట్యాగులు పెట్టుకుని చానళ్లు ఆర్భాటం చేస్తున్నాయి తప్ప వాస్తవాలు ఎక్కడా చూపడంలేదు! ఒకవిధంగా చెప్పాలంటే పత్రికలు, ఛానెళ్లు సర్కారు చేతిలో బందీ అయిపోయాయి.
రక్షణ కల్పించాల్సిన పోలీసులు, అక్కున చేర్చుకోవలసిన మహిళా సంఘాలు, మీడియా వ్యవస్థ ముూడు కోతుల పాత్ర పోషిస్తున్నాయి. అన్ని విషయాలలో ఇలాగే జరుగుతుందా? అంటే అదేమీ లేదు. కేవలం హిందువులపై జరుగుతున్న దాడి విషయంలో మాత్రమే ప్రేక్షకపాత్ర మౌనపాత్ర పోషిస్తున్నారు.
స్వలాభం కోసం మీడియా రంగం మొత్తం మోకరిల్లి పోయింది. వివిధ ఘటనల్లో మీడియా వ్యవహరిస్తున్న తీరు మరీ సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే అత్యాచారం చేసిన వ్యక్తుల పేర్లు దాచడం, రాయకపోవడం దుర్మార్ధపు ప్రక్రియ. కేవలం ముస్లింలు అనే కారణం చేత నిందితుల పేరు రాయకపోవడం మీడియా రంగానికే కళంకం.

లవ్ జిహాద్ వరుస ఘటనలు :
   తెలంగాణలో మార్చి నెల ఒకటో తేదీన మొదలు పెడితే మహిళా దినోత్సవం రోజు కూడా వదిలిపెట్టకుండా మార్చి 2వ తేదీ వరకు వరుసగా హిందూ మహిళలపై ఆకృత్యాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.
 • మార్చి 1వ తేదీన కరీంనగర్ లో వెన్నెల అనే బీటెక్ చదువుతున్న అమ్మాయిని మొహమ్మద్ సాహిల్ అఫ్తాబ్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి లవ్ జిహాద్'కు పాల్పడ్డాడు. ఈ విషయంపై అక్కడి బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళన నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడమే కాక బాధితురాలిని నిందితునికి అప్పజెప్పారు. పైగా బజరంగ్ దళ్ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడ్డారు.
 • మార్చి 2వ తేదీ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం యాసోజి పేటలో పెళ్లి అయిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి ముస్లిం యువకుడు లవ్ జిహాద్'కు పాల్పడ్డాడు యువతి భర్త, తల్లిదండ్రులు కేసు పెట్టినా పోలీసులు స్పందించలేదు.
 • మార్చి 3వ తేదీన సికింద్రాబాద్ పరిధిలోని లాలాపేటలో హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు.
 • మార్చి 4వ తేదీన హైదరాబాద్ శివారు ప్రాంతంలోని జగగ్గిరిగుట్టలో ముస్లిం అబ్బాయి చేతిలో హిందూ అమ్మాయి మోసపోయింది. ఆ తర్వాత లవ్ జిహాద్ రూపంలో మత మార్పిడికి గురయింది.
 • మార్చి 5వ తేదీ హైదరాబాదులోని రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్ షాకోట్ ప్రాంతంలో హెయిర్సెలూన్లో పనిచేసే షారుక్ సల్మాన్ అనే యువకుడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యువతిని హత్య చేసేందుకు ప్రయత్నం చేశాడు. అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న షారూఖ్ సల్మాన్ హర్యానా నుంచి వచ్చి హైదరాబాద్'లో ఉద్యోగం చేస్తూ ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు. పెళ్లయిన విషయం తెలుసుకున్న యువతి అతన్ని దూరం పెట్టడంతో భరించలేక కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కడుపులో పొడిచాడు. చావు బతుకుల మధ్య ఉన్న యువతిని హిందూ సంఘాలు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇతర నేతలు కాపాడారు.
 • మార్చి 6వ తేదీన మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక ప్రేమ జంట సనత్ నగర్ ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించింది. హిందూ అమ్మాయిని లేపుకువచ్చిన ముస్లిం యువకుడు సనత్ నగర్లో ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్ర నుంచి అమ్మాయి తల్లిదండ్రులు రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.
 • మార్చి 7న బోయిన్ పల్లిలో ఆంధ్రప్రదేశ్'కు చెందిన ఒక ఒక దళిత మైనర్ బాలికపై మెదక్ జిల్లాకు చెందిన ఇర్పాన్ అనే ముస్లిం యువకుడు మసీదులో ఉంచి అత్యాచారం చేశాడు. అప్పటికే అతనికి పెళ్లి కూడా అయింది. కానీ పెళ్లి చేసుకోవాలని అమ్మాయిని బలవంతపెట్టి ఇబ్బందులకు గురిచేశాడు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు పోలీసులు, సాక్షి మీడియా ప్రయత్నం చేస్తుంటే.. బజరంగ్దళ్ ఆందోళన నిర్వహించి బాధితురాలికి అండగా నిలిచింది.
 • మార్చి 8న మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ మైలార్దేవ్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒరిస్సా ప్రాంతానికి చెందిన పరమేశ్వర్ కూతురు లీజాను అదే ప్రాంతానికి చెందిన అప్పుర్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఓకే కాలేజీలో చదువుతున్న వీరు ఇద్దరు కొంతకాలం బాగానే తిరిగారు. తర్వాత లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిని మతం మార్చేందుకు, బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నం చేయడంతో అమ్మాయి తిరస్కరించింది. దీంతో ఆమెను బలవంతంగా లాక్కొచ్చి తల వెంట్రుకలు కత్తిరించి బయటకు వెళ్లకుండా చిత్ర హింసలకు గురిచేశాడు. ఈ అవమాన భారం భరించలేక యువతి ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసును పోలీసులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేయగా, బజరంగ్ దళ్ ఆందోళన నిర్వహించింది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పింది. పోలీసులను నిలదీసి కేసు నమోదు చేయించింది.
 • అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మరొక సంఘటన వెలుగు చూసింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మహిళపై సాదత్ అనే ముస్లిం యువకుడు పెట్రోల్ పోసి తగులబెట్టాడు. బాధ భరించలేక అరుస్తూ అల్లాదుర్గం బస్టాండ్లోని జాతిపిత గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాల దగ్గరకు వచ్చి కుప్ఫకూలిపోయింది. చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, మార్చి 9వ తేదీన చనిపోయింది.
 • మార్చి 10వ తేదీన నౌసీన్ బేగం అనే ముస్లిం యువతి గగన్ అగర్వాల్ అనే యువకుడిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని హిందువుగా మతం మారినట్లు నటించింది. అగర్వాల్ ఆస్తిని అనుభవించేందుకు పథకం ప్రకారం నాటకం ఆడింది. మరో ప్రియుడితో కలిసి గగన్ అగర్వాల్ను చంపేసి ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ సంఘటన ఫిబ్రవరిలో జరిగితే మార్చి 10వ తేదీన వెలుగులోకి రావడం గమనార్హం. హైదరాబాదులోని వనస్థలిపురంలో ఈ సంఘటన వెలుగు చూసింది.
 • మార్చి 11న భైంసా మండలంలో ఇర్ఫాన్ అనే 17 సంవత్సరాల యువకుడు అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. మానవత్వం మంట కలిసేలా ఈ ఘోరం జరిగినా రాష్ట్రంలో ఒక్కరూ స్పందించలేదు. కానీ కూలీనాలీ చేసుకుని బతికే పసిపాప కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ బజరంగ్దళ్, భారతీయ జనతా పార్టీ పోలీసులపై ఒత్తిడి తెచ్చాయి, ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నం చేయగా నిలదీసి, మహిళా కమిషన్ స్పందించేలా ఆందోళనకు దిగి, విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.
 • తాజాగా కామారెడ్డిలోని గుమస్తా కాలనీలో ఒక లవ్ జీహాద్ బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021 జనవరి 7న తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి పట్టణంలోని గుమస్తా కాలనీకి చెందిన సల్మాన్ను స్రవంతి (19) అలియాస్ షేక్ సమీర (మతం మార్చినప్పుడు పెట్టిన పేరు) ప్రేమ వివాహం చేసుకుంది. రెండు నెలలు గా అత్తింటి వారి నుంచి వేధింపులకు గురికావడంతో భర్తతో కలిసి వేరుగా కాపురం ఉంటోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుంది. కుమార్తె మృతి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా స్రవంతి ఒంటిపై గాయాలున్నాయని, అత్త, మామ భర్తలే కొట్టి చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇలా మహిళా దినోత్సవం ఉన్న ఈ నెలలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై మానభంగాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటినీ మత కోణం, రాజకీయ కోణంలో చూడటంతో కేసులన్నీ నీరుగారిపోతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో సంఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. నిర్భయ చట్టాలు ఎన్నివచ్చినా పోలీసు యంత్రాంగ నిర్లక్ష్యంతో మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురి అవుతూనే ఉన్నారు. వీటన్నిటికీ చెక్ పడాలంటే తెలంగాణ రాష్ట్రంలో లవ్ జిహాద్ చట్టం వెంటనే అమల్లోకి తీసుకురావాలి.
భైంసా బాలిక అత్యాచారం గురించి మాట్లాడని కేటీఆర్ కరీంనగర్ బాలికకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం హిందూ వివక్షే //.
మార్చి 12వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు కరీంనగర్ లోని తన ముస్లిం కార్యకర్త కూతురికి జన్మదినం తెలియజేస్తూ గిఫ్ట్ పంపించడం గొప్ప విషయం, కానీ భైంసాలో నాలుగేళ్ళ హిందూ చిన్నారిపై అత్యాచారం జరిగినా కూడా స్పందించకపోవడం అమాన వీయం. మరీ ముఖ్యంగా కేటీఆర్ గొప్ప మానవతావాది అన్నట్లు ఈటీవీ రాత్రి 9 గంటల వార్తల్లో ప్రత్యేకించి చెప్పడం చాలా బాగుంది. కానీ భైంసా పసిపాప అత్యాచారం గురించి ఈ-టీవీ కనీసం విజువల్ చూపకపోవడం దుర్మార్గం.
  హిందూ వివక్ష! తెలంగాణ రాష్ట్రంలో పసిపాపపై లైంగిక వేధింపులు జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకుండా నిస్సిగ్గుగా వ్యవహరించడం మహిళా లోకానికి అవమానం. ఇంత జరుగుతున్నా సెక్యులరిస్టులం అని చెప్పుకునే పెద్ద మనుషులు, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, జర్నలిస్టులు, సామాజిక వేత్తలు నోరు మెదపకపోవడం దారుణం.

-- రచయిత విశ్వహిందూ పరిషత్
తెలంగాణ ప్రాంత సహ ప్రచార ప్రముఖ్

Tags

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top