కార్యంవెనుక డాక్టర్జీ భూమిక - Doctorji's role behind the task

0
కార్యంవెనుక డాక్టర్జీ భూమిక - Doctorji's role behind the task
ఆర్.ఎస్.ఎస్ 
: కార్యంవెనుక డాక్టర్జీ భూమిక : :
డాక్టర్జీ ద్వారా నిర్మాణమైన మన యీ కార్యం వెనుక తగినంత పెద్ద భూమిక ఉంది. డాక్టర్జీ ఆంగ్లేయుల సామ్రాజ్యాన్ని పీకిపారేయటం కోసమే సంఘాన్ని స్థాపించారని కొందరు చెప్పుతుంటారు. కాని డాక్టర్జీకి ఉన్న ఆలోచనల ఏమిటంటే - అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో, మన శక్తిని క్రమంగా పెంచుకొంటూ ఆంగ్ల సామ్రాజ్యాన్ని పీకి పారేయగల స్థితికి తప్పక చేరుకుంటాం. ఆస్థితిలో అవసరమైనపుడు పూర్తి శక్తిని వినియోగించి దానికై పోరాడుతాంకూడా. 

  డాక్టర్టీ స్వయంగా విప్లవోద్యమాలలో పనిచేసినందున వారికిబాగా అనుభవముంది - కొద్దిమంది రహస్య కార్యకలాపాలు సాగిస్తూ శక్తిని సముపార్జిం చేయత్నాలు చేసేవారు. ఎక్కువమందిని భాగస్వాములను చేయడానికి ఆ ఉద్యమాలలో అవకాశం లేకపోయేది. కష్టపడి ఏదో ఒక విధంగా ఒక శక్తిని నిలబెట్టిన తర్వాతకూడా, అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉండేవి. నలుగురో-ఆరుగురో ఒక బృందంగా ఏర్పడటం పిస్తోలు ఉపయోగించటం, బాంబులు తయారుచేయటాల్లో శిక్షణ పొందటం, అవకాశం లభించినపుడు ఏదో ఒక సాహసకృత్యం చేయడం వీటిద్వారా ఏమవుతుంది? విప్లవకారులకు కూడా క్రమంగా తెలిసివచ్చింది. రెండుచోట్లనో, మూడుచోట్లనో నల్గురినో, అయిగురినో అంగ్లేయులను చంపినంతమాత్రాన ఆంగ్లేయుల సామ్రాజ్యం తొలగిపోదు.
డాక్టర్టీ ఆలోచన ఏమిటంటే దేశమంతటా ఇటువంటి కేంద్రాలను విస్తరింపజేయాలి.  ఉపయోగపడగల మంచి అవకాశం లభించినపుడు దేశవ్యాప్తంగా ఒకేసారి ఏదైనా చేయగలగాలి. వారి అనుభవంలోని మరొక విషయం ఏమిటంటే, ఈ నవయువకులు చేతికి పిస్తోలో, బాంబో లభించినపుడు యౌవనావేశంలో వారు తమను తాము నియంత్రించుకోలేకపోయేవారు. ఒకసారి లాలా లజపతిరాయ్ పై దెబ్బలు పడినవని ఆవేశపడిపోయారు. అలాగే మరెక్కడో ఇంకేదో జరిగినా దానికి ఉద్రిక్తులైపోయేవారు. ఆ విధంగా నిశ్చయంగా పనిచేయవలసిన దానికంటే ముందే విస్పోటనం జరిగిపోయేది. ఇలాంటివన్నీ అతిసన్నిహితంగా గమనించిన అనుభవంతోనే డాక్టర్టీ ఒక కార్యపద్ధతికి నాంది పలికారు- ఈ పద్ధతిలో అధికాధికంగా కార్యకలాపాలు బహిరంగంగానే జరుగుతాయి. దీనిలో అధికాధికంగా యువకులు భాగస్వాములు కాగలరు.

డాక్టర్జీ ఈ కార్యపద్ధతిని అవలంబించడానికి మరో కారణమూ ఉంది-ఆంగ్లేయులను ఈ దేశంనుండి వెళ్ళగొట్టవలసి ఉంది. సమాజంలో మనం ఏ పరివర్తన తీసికొని రాగోరుతున్నామో ఆ పరివర్తన తీసికొని వచ్చే లోపల ఏదైనా ఒక అవకాశం ఇందుకోసం లభిస్తే సంఘం తన పూర్తి శక్తిని వినియోగించి ఆంగ్లేయులను తరిమికొట్టడానికి యత్నించవలసిందే - ఈవిధమైన ఆలోచనకూడా డాక్టర్జీ మస్తిష్కంలో ఉంది. 
  ఆంగ్లేయులను తరిమికొట్టడానికని ప్రజలు రకరకాలైన కార్యక్రమాలు రూపొందించారు. ఈ మధ్యలోనే 1939లో రెండవ ప్రపంచయుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఇంగ్లాండుకు విజయం లభించింది. అయితే యుద్ధ సమయంలో జరిగిన నష్టాలతో దాని నడుం విరిగింది. దానితో ఇక్కడినుండి తట్టాబుట్టా సర్దుకొని స్వంత ఇంటికి వెళ్లిపోక తప్పని స్థితి ఏర్పడింది. ఆ మేరకు నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఆంగ్లేయులను వెళ్లగొట్టటంవంటి ఒకటి అరా సమస్యలు మరేవైనా వచ్చి ఉన్నా వాటి సమాధానం కోసం పూర్తిశక్తిని వినియోగించి సంఘం ప్రయత్నించడానికి సందేహించి ఉండేదికాదు. సంఘశక్తిని వినియోగించిన పర్యవసానంగా అందులో విజయంసాధించితీరాలి కాగా ఎక్కడ ఎంతశక్తిని వినియోగించాలి, ఎక్కడ వినియోగించకూడదు- ఈ విషయాలను నిర్ణయించే పనిని నేతృత్వానికి విడిచిపెట్టాలి.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top