2. వర్తమాన పరిస్థితులలో అర్ఎస్ఎస్ కార్యంయొక్క భూమిక - The role of action RSS in present circumstances

0
వర్తమాన పరిస్థితులలో అర్ఎస్ఎస్ కార్యంయొక్క భూమిక -  The role of action RSS in present circumstances
RSS Karyakartas

:వర్తమాన పరిస్థితులలో కార్యంయొక్క భూమిక:
సంఘకార్యం ఎటువంటిదో తెలుసుకొనేందుకు ఆలోచించిన పిమ్మట మన దేశంయొక్క ఇప్పటి పరిస్థితులలో సంఘంయొక్క భూమికను స్పష్టంగా అర్థంచేసుకోవలసి ఉంది. ఇంతకు ముందు వివరించిన దీర్ఘకాలిక అంతిమ లక్ష్యంతోపాటు ఏదైనా తాత్కాలిక ప్రశ్నకూడా మనముందు ఉన్నట్లయితే, దానిని అర్థం చేసుకోవటం సులభమవుతుంది. హిందూ సమాజంలో అజేయమైన సామర్థ్యాన్ని నిర్మించటంతోపాటు, సంఘాన్ని ఒక నిత్య సిద్ధశక్తిగానూ నిలబెట్టాలి ఇందుకై ఒక విశిష్టమైన కార్యపద్దతి ఉన్నది. సంఘంయొక్క శాఖలు ప్రతిరోజూ కార్యకలాపాలు నడిపేవి గనుక సంఘం ఒక నిత్యసిద్ధశక్తిగా కనబడుతుంది. 
   మన కార్యం రాజకీయ సంస్థల కార్యకలాపాల వంటిది కాదు. దేశంలో తాత్కాలిక సమస్యలు ఎన్నో ఉండినా, వాటి నన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం సంఘం చేయటం లేదు కాస్తో కూస్తో శక్తి ఉన్న నాయకులు నిజంగా పరిష్కరించదలచిగాని, పదిమందికి కనబడటంకోసమేగాని అటూ ఇటూ పరుగులు తీస్తుంటారు. అంతు తేల్చేస్తామంటారు. కాని సంఘంమాత్రం ఇటువంటి విన్యాసాలు చేస్తున్నట్లుగా కనబడదు. ఇటువంటి తాత్కాలిక సమస్యల పరిష్కారానికి సంఘం ఏమైనా చేస్తుందా, లేదా- అన్న సందేహం సామాన్యజనులలోనూ, సంఘ స్వయంసేవకులలోనూ తలెత్తుతూ ఉండటం సహజం.

విషయసూచిక :

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top