ఆర్.ఎస్.ఎస్ లో తత్త్వజ్ఞానానికి, ధ్యేయనిష్ఠకు అత్యధిక ప్రాధాన్యం - Idealogical Atachment in RSS

0
ఆర్ఎస్ఎస్ సభ్యులు

: తత్త్వజ్ఞానమే ప్రధాన ఆధారం :

   సంఘకార్యపద్ధతిలో తత్త్వజ్ఞానానికి, ధ్యేయనిష్ఠకు (Idealogical Atachment) అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది. సమాజంలో ఒక నిత్యసంసిద్ధశక్తిని మనం నిర్మించు గోరుతున్నామని, సమాజంలో పరివర్తనను ఆశస్తున్నామని, మనకార్యానికి తగిన కార్యకర్తలను రూపొందించుకోగోరుతున్నామని-ఈ మౌలిక విధానాలు స్వయంసేవకులకు చక్కగా అవగతమవ్వాలి. బౌద్ధికవర్గలు, చర్చలు, ఇతర బౌద్ధికకార్యక్రమాలూ-ఇవన్నీ ధ్యేయనిష్ఠను మేల్కొలిపేందుకే రూపొందింపబడినవి. ఆటలు, ఇతర శారీరక కార్యక్రమాలు, శిబిరాలు మొదలైన కార్యక్రమాలుకూడా ఈ దృష్టితోనే నిర్వహింపబడుతున్నవి.

ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు కవాతులో
ఆర్ఎస్ఎస్ వాలంటీర్ల కవాతు

  వ్యక్తిగతంగా తమమీద ఏవిధమైన బరువు బాధ్యతలు లేని చిన్న వయస్సులో ఏదైనా ఒక పని చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తుంటారు. రకరకాలైన మోహాలు, ఇతరత్రాపనులు, ఇతర ఆలోచనా విధానాల ప్రభావమూ లేని వయస్సులో చాలామంది వస్తుంటారు. కాగా ఎవరిలోనైతే ధ్యేయనిష్ట గురించినకల్పన ఉంటుందో, వారు మాత్రమే ఆ శ్రేష్ఠమైన కార్యానికి అతుక్కొని ఉంటారు. అందుకనే వివిధసందర్భాల్లో సంఘంయొక్క ఆలోచనావిధానాన్ని వివరించడానికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది. పదేపదే ఈ విషయాలను ప్రస్తావించటమూ జరుగుతున్నది. వివిధ సందర్భాల్లో నిర్వహించే రకరకాల కార్యక్రమాలకూ ఇదే ముఖ్యభూమికగా ఉంటుంది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top