అందుబాటు ధరలలో టీకాలు, ఔషధాలు లభించాలి : స్వ‌దేశీ జాగ‌ర‌ణ మంచ్ దేశ‌వ్యాప్త ఉద్య‌మం - Immunization and medicines to be available at affordable prices: Swadeshi Jagarana Manch Nationwide Movement

0

పత్రికా ప్రకటన, స్వదేశీ జాగరణ మంచ్ – తెలంగాణ
ప్రపంచ జనాభా ఈరోజు కరోనా భయంతో అల్లకల్లోలమవుతుంది. ఈవ్యాధి నివారణకు మందులు, వ్యాక్సిన్లపై పేటెంట్ల కారణంగా పెద్ద కంపెనీలకు గుత్తాధిపత్య హక్కులు ఉన్నందున, అవి అందరికీ అందుబాటులోకి ఈ రోజుకీ రాలేదు. ప్రజలందరూ సమానంగా జీవించంచడమనేది సార్వత్రిక ప్రాథమిక హక్కు. వాక్సిన్ త‌యారు చేసిన కొన్ని కంపెనీలు పేటెంట్ల ద్వారా లాభాలు సంపాదించడానికి అపరిమిత హక్కులు ఇవ్వడం ద్వారా, కోట్ల మంది ప్రజల జీవన ప్రాథమిక హక్కు రాజీపడుతోంది, అలా జరగడానికి వీలులేదు.

ఈ టీకాలు, ఔషధాలను చౌకగా, అందుబాటులోకి తీసుకురావడానికి, ఈ వ్యాక్సిన్లు, ఔషధాల సాంకేతికతను పేటెంట్ ర‌హితంగా మార్చడానికి భారత ప్రజలు ఒక విస్తృతమైన ప్రచారాన్ని చేస్తున్నారు. కోవిడ్ చికిత్సకు సంబంధించిన అనేక మందులు స్థానికంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ, కరోనా సమస్య తీవ్రత కారణంగా పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి అందుబాటులో ఉన్న టీకాల పరిమాణం సరిపోదు.

ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్ దేశాల వయోజన జనాభాకు దాదాపుగా పూర్తి టీకాలు వేసిన కారణంగా ఈ దేశాలలో కరోనా సంక్షోభం ఇంచుమించు ముగిసింది. అందువల్ల, భారతదేశంతో సహా ప్రపంచంలోని మిగతా మొత్తం జనాభాకు వెంటనే టీకాలు వేయడం అవసరం. ఇందుకోసం, స్వదేశీ జాగరణ మంచ్ దేశం మొత్తంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది, కోవిడ్ వ్యాక్సిన్లు, ఔషధాలను పేటెంట్ ర‌హితంగా మార్చాలని, వాటిని ఉత్పత్తి చేయగల అన్ని ఉత్పత్తి దారులకు వాక్సిన్, మెడిసిన్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ “ప్రపంచం మొత్తానికి అందుబాటు ధరలలో టీకాలు, ఔషధాలు లభించాలి” అని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించబడింది.

ఈ ప్రయత్నంలో భాగంగా, వెబినార్లు, సెమినార్లు, ప్రదర్శనలు మొదలైనవి నిర్వహించబడుతున్నాయి. అదే విధంగా ఆన్ లైన్ సంతకాల సేకరణ ద్వారా పేటెంట్ ఫ్రీ టీకాలు కోసం జనాందోళనను స్వదేశీ జాగరణమంచ్ ప్రారంభించింది. భారతదేశ జనాభాలో కనీసం 70% మందికి టీకాలు వేయడానికి 200 కోట్ల డోసుల టీకాలు అవసరం. ఇందుకోసం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్నిబదిలీ చేయడానికి, పేటెంట్లు వాణిజ్య రహస్యాలతో సహా మేధోసంపత్తి హక్కులకు సంబంధించిన అడ్డంకులను అధిగమించడానికి అన్నిరకాల చర్యలు అవసరం.

“వ్యాక్సిన్ , ఔషధాల యూనివర్స‌ల్ యాక్సెస్” పిటిషన్ ద్వారా ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న వివిధ సామాజిక, సాంస్కృతిక సంస్థలు, విద్యాసంస్థలు, మేధావులు, విద్యావేత్తలు, న్యాయమూర్తుల నుండి స్వదేశీజాగరణమంచ్ చేపట్టిన మహత్తర కార్యానికి సహకారం కోరుతుంది. దీనికి సంబంధించి వివిధ విశ్వవిద్యాలయాలతో స్వదేశీ జాగరణ మంచ్, అసోసియేషన్ ఆఫ్ ఇండియ‌న్ యూనివర్సిటీలు కలిసి అంతర్జాతీయ సమావేశాన్ని 20 మే 2021 న నిర్వహించాయి. దీనిలో అమెరికా నుండి హోవార్డ్ విశ్వవిద్యాలయం వారు పాలు పంచుకోవడం జరిగింది.

TRIPS ఒప్పందంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పేటెంట్స్ ఫ్రీ కోరుతూ భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికాతో కలిసి అక్టోబర్లోనే పేటెంట్ ర‌హిత వ్యాక్సిన్లు, ఔషధాలను సులభతరం చేయడానికి ప్రపంచ వాణిజ్య సంస్థలో చేసిన ప్రతిపాదనకు 120 దేశాలు ఇప్పటి వరకు మద్దతు ఇచ్చాయి. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే దేశాలు/ కంపెనీలు/వ్యక్తుల సమూహాలను ఎటువంటి సంకోచం లేకుండా స్వదేశీజాగారణమంచ్ వ్య‌తిరేకిస్తూ, ప్రపంచ ప్రజల మానవత్వం కోసం, సమాజం మొత్తాన్ని భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు మద్దతు తెలపాలని స్వదేశీ జాగరణమంచ్ కోరుతుంది.

ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలను, WTO ని UVAM (Universal Access to Vaccines and Medicines) విజ్ఞప్తిచేస్తుంది:
  1.  ప్రస్తుతం టీకాలు ఉత్పత్తి చేస్తున్న అన్ని కంపెనీలు టీకాల ఉత్పత్తిని పెద్ద మొత్తంలో పెంచడానికి, సాంకేతిక బదిలీ, ముడి పదార్థాల లభ్యత, వాణిజ్య రహస్యాలు సహా అన్ని సౌకర్యాలను టీకాలు తయారు చేయడానికి ముందుకు వచ్ఛేఇతర కంపెనీలతో పంచుకోవాలి.
  2. రెమ్డెసివిర్, ఫావిరాసిర్, తోసిలుజుమాబ్, మోల్నుపిరవిర్ వంటి కొత్త ఔషధాలు సమృద్ధిగా ఉత్పత్తి కావడానికి చర్యలుతీసుకోవాలి.
  3.  ప్రపంచ స్థాయిలో టీకాలు, ఔషధాలు తగినంత ఉత్పత్తితో పాటు ధరలను సమర్థవంతంగా నియంత్రించండానికి చర్యలు తీసుకోవాలి.
  4. TRIPS ద్వారా పేటెంట్స్ లక్ష్యాన్ని సాధించడానికి WTO, G-7, G-20, ఇతర సంస్థల ద్వారా దౌత్యప్రయత్నాలను వేగవంతం చేయాలి.
స్వదేశీ జాగరణ మంచ్ ప్ర‌యత్నం ద్వారా భారతదేశంతో పాటు మరో 20 దేశాల నుండి డిజిట‌ల్ సంత‌కాల ప్రచారంలో ఇప్పటి వరకు దాదాపు నాలుగు లక్షల మంది పిటిషన్ పై సంతకం చేశారు. మరోపిటిషన్ లో భారతదేశం, విదేశాల నుండి 1600 మంది ఉన్నత విద్యావేత్తలు / వైస్ ఛాన్స్‌ల‌ర్లు ఈ విధంగా సంతకం చేశారు:
  1. ప్రపంచ వాణిజ్య సంస్థ మేధోసంపత్తి హక్కుల నిబంధనలను సడలించాలి.
  2. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ త‌యారీదారు , వ్యాక్సిన్ త‌యారీ సంస్థలు ప్రపంచ మానవాళి రక్షణ కోసం ఇతర తయారీ దారులకు సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో సహా పేటెంట్ ర‌హిత హక్కులను స్వచ్ఛందంగా ఇవ్వాలి.
  3. పేటెంట్ హోల్డర్లు కాకుండా అన్ని రకాల ఇతర ఔషధ తయారీ దారులు టీకాలు, ఔషధాల తయారీకి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి సామగ్రి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అటువంటి ఔషధ తయారీ దారులకు ప్రోత్సాహం ఇవ్వాలి.
  4. కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి, టీకాలు, ఔషధాలను ప్రపంచo మొత్తానికి లభించే విధంగా, దేశభక్తిగల ప్రజలు, సంబంధిత సంస్థలు ముందుకు వచ్చి మానవాళిని రక్షించే ఈ మహత్తర కార్యంలో పాలుపంచు కోవాలని కోరడమైనది.

CA ముక్కహరీష్ బాబు, స్వదేశీ జాగారణ మంచ్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ - విశ్వ సంవాద కేంద్రము

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top