ఆర్ఎస్ఎస్ గురించి కొన్ని ముఖ్యవిషయాలు (సంక్షిప్తంగా) - Some important information about RSS

0
ఆర్ఎస్ఎస్ గురించి కొన్ని ముఖ్యవిషయాలు (సంక్షిప్తంగా) - Some important things about RSS
RSS

RSS "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని" స్థాపించిన పరమపూజనీయ డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్  గారు 1 ఏప్రిల్ 1889 న ,విక్రమశకం ప్రకారం ఉగాది పర్వదినాన ఓ పుణ్యదంపతులైన తండ్రి బలీరామ్ మరియు తల్లి రేవతిల కడుపునా జన్మించాడు, 1925న కేవలం ఆరుగురు స్నేహితులతో RSS సంఘశాఖని స్థాపించి ప్రారంభించారు .

డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్
డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్

   స్వామి వివేకానంద మరియు అరబిందో వంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల ప్రభావానికి లోనై ఈయన ఆర్.యస్.యస్. మౌలిక భావజాలాన్ని నిర్మించారు.హెడ్గేవార్  వైద్యవిద్యను అభ్యసించుటకు కోల్ కతా వెళ్ళినపుడు బెంగాల్ లోని నాటి రహస్య విప్లవ సంస్థలైనటువంటి అనుశీలన సమితి మరియు జుగాంతర్ మొదలైనవాటి ప్రభావానికి లోనయ్యారు. ఈయన 1929 వరకు హిందూ మహాసభలో సభ్యునిగా ఉన్నారు. 
   రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటిసారిగా 1925లో నాగపూర్ లోని ఒక చిన్న మైదానంలో విజయదశమి పర్వదినాన ఐదారుగురు సభ్యుల బృందంతో సమావేశమైనది. ఆర్.యస్.యస్. ప్రాథమికస్థాయి నిర్మాణాన్ని శాఖ అంటారు. దీనిద్వారా ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఒక బహిర్ మైదానంలో ప్రతిరోజూ ఒక గంట సమయం ఆ శాఖ లోని స్వయంసేవకులంతా సమావేశమై డ్రిల్లు, వ్యాయామం నిర్వహించి నినాదాలు ఉచ్చరిస్తారు. ఆర్.యస్.యస్. స్థాపన సమయంలో హెడ్గేవార్ను అనుసరించి ఉన్నవారిలో భయ్యాజి దాణె, భావురావ్ దేవరస్, బాలసాహెబ్ దేవరస్, వ్యంకప్ప పాట్కి, అప్పాజి జోషి ముఖ్యులు.

 హెడ్గేవార్ బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో 1921లో ఒక సంవత్సరం మరలా 1930 లో అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు . అందువలన వారికి రెండుసార్లు  జైలుశిక్ష కూడా పడింది . విదర్భలో అకోలా జైలులో ఆయనను నిర్బంధించారు . జైలులో  దేశభక్తులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి . 1940 జూన్ 9వ తేదీన నాగపూర్ సంఘ శిక్షావర్గ ముగింపు కార్యక్రమమైన దీక్షానంత సమారోప్  లో డాక్టర్ జీ మాట్లాడుతూ ఈరోజు నాకళ్ళముందు హిందూరాష్ట్ర సూక్ష్మ స్వరూపాయాన్ని చూడగలుగుతున్నానని అన్నారు డాక్టర్జీ జీవించి ఉన్నప్పుడే RSS దేశమంతటా విస్తరించింది ... 1940  జూన్ 21 న డాక్టర్ జీ పరమపదం పొందారు ,అప్పటికీ ఆయన వయస్సు కేవలం 51 సంవత్సరాలు మాత్రమే !

RSS - రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఏంటనీ?...చాలామందికి తెలియవలసిన విషయాలు.
కులజాతి వర్గ విభేదాలు ,వైషమ్యాలు లేకుండా ఒకే భగవద్వజం నీడ క్రింద , నిజమైన దేశభక్తులను తయారు చేసే పరిశ్రమ ఈ సంఘ శాఖ .  ఈ సంఘశాఖలో ప్రతిదినము జరిగే కార్యక్రమములు ... ధ్వజారోహణము / ధ్వజప్రణామము .. సూర్యనమస్కారముల ఆసనములు .. శారీరక వ్యాయమదండ ప్రహరణలు .. యోగ / ఆసనములు .. క్రీడలు /ఆటలు .. ముఖ్య సమాజహిత సూచనలు .. భక్తి భావపూరిత సంబంధిత పురాణపురుషుల వీరగాధలు/ కధలు .. గీతాలాపన / వక్త ప్రసంగములు .. ఒకరితో మరొకరి సత్సంబంధములు పెంచుకోవడము .. ప్రార్ధన /ధ్వజావరోహణము ఉంటాయి . పండుగలు మరియు కొన్ని శుభసందర్బములలో ప్రత్యేక కార్యక్రమములుంటాయి .

ఆర్ఎస్ఎస్ గురించితెలుసుకోవలసిన కొన్ని ముఖ్యవిషయాలు ..!
    ఆర్ఎస్ఎస్ అంటే చాలు బారతదేశంలో ఓ సంచలనం. రాజకీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడుకునే మాటల్లో ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. 1925 సెప్టెంబర్ 25న డాక్టర కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్దమానంగా పెరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ గా పేరుపొందింది. భారతమాత కోసం పని చెయ్యాలనుకొనే, దేశం అంటే అభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. అందరం కలిసి దేశం కోసం మనం అన్న కోణంలో పుట్టుకొచ్చిందే ఆర్ఎస్ఎస్. దేశాభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా కూడా ఇందులో చేరవచ్చు కానీ ప్రపంచానికి ఎంతో పరిచయమున్న ఆర్ఎస్ఎస్ గురించి మీకు తెలియని తొమ్మిది నిజాలు..
  1. ఆర్ఎస్ఎస్ కు మనదేశంలో అనునిత్యం జరిగేవి 65 వేలు శాఖలు ఉన్నాయి . ఈ సంస్థను నడుపుతున్నవారు కూడా అందులోని సభ్యులే. భగ్వధ్వజ(కాషాయం జెండా) ఆర్ఎస్ఎస్ లో అధినాయకత్వం. ఇక్కడ వ్యక్తి పూజ లుండవు . ఆర్ఎస్ఎస్ లో ఉండే వాళ్లు కూడా ఈ జెండానే గౌరవిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో సేవకులు(వాలంటీర్లు) ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్. దాదాపు 60లక్షల మంది వాలంటీర్లతో ఎంతో మంది అభిమానులతో ఆర్ఎస్ఎస్ ఘననీయమైన సేవలను అందిస్తోంది.
  2. ఆర్ఎస్ఎస్ సభ్యత్వం తీసుకున్నా కానీ ఎవరికీ గుర్తింపు కార్డు(ఐడెంటిటి కార్డ్) కానీ బిజినెస్ కార్డ్ కానీ ఇవ్వరు. కేవలం భారతమాతకు సేవ చెయ్యాలని అనుకున్న వారు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. 
  3. ఆర్ఎస్ఎస్ రాజకీయేతర సంస్థ. కానీ మోదీ, వాజ్ పేయి, అడ్వానీ లాంటి బిజెపి నాయకులు మాత్రం ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వాళ్లు. అయితే చాలా మంది బిజెపి పార్టీలో ఆర్ఎస్ఎస్ భాగం అని అనుకుంటారు. ఒక్క బిజెపి పార్టీలోనే కాదు కాంగ్రెస్, ఆప్ పార్టీలలో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుండి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ధ్యేయం ఒక్కటే యువత వ్యక్తిత్వాన్ని మలిచడం ద్వారా దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడం.
  4. ఇండో చైనా యుద్దం జరిగే సమయంలో దేశ భ్రదతకు అందరు సరిహద్దుల వద్ద యుద్దంలో ఉంటే అప్పుడు దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ సంస్థ ముందుకు వచ్చింది. వేల మంది ఆర్ఎస్ఎస్ సేవకులు యుద్దసమయంలో సేవాకార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పుడు దేశంలో సంక్షోభం వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారు.
  5. ఆర్ఎస్ఎస్ అనేది ముస్లింలకో లేదా క్రిస్టియన్ లకో వ్యతిరేకం కాదు. దేశమంటే గౌరవం అభిమానం ఉండి సేవ చెయ్యడానికి సిద్దంగా ఉన్న వాళ్లు ఎవరైనా ఆర్ఎస్ఎస్ లో చేరవచ్చు. మన సంస్రృతి సంప్రదాయాలను కాపాడేందుకు, దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉంటుంది.
  6. ఆర్ఎస్ఎస్ లో కేవలం మగ వారికే కాదు మహిళలకు కూడా స్థానం ఉంది. "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" అని పురుషుల కోసం విబాగం ఉంటే, మహిళల కోసం "రాష్ట్రీయ సేవికా సమితి " అని ప్రత్యేక విభాగం ఉంది. కానీ రెండింటి లక్ష్యం మాత్రం ఒక్కటే.
  7. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నడూ కూడా ఆర్ఎస్ఎస్ ను విభేదించలేదు. కానీ 1948లో మాత్రం రాజకీయ వత్తిడిల నేపథ్యంలో కొన్నాళ్లు ఆర్ఎస్ఎస్ పై నిషేదం విధించారు. కానీ తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేశారు. అయితే నిషేదం ఎత్తివేసిన తర్వాత సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అంటూ ఆర్ఎస్ఎస్ గురించి లేఖ రాశారు.
  8. అతికొద్దిమంది మంది మహాత్మా గాంధీని చంపించింది ఆర్ఎసఎస్ అని ఆరోయిస్తుంటారు . కానీ నాధూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ లో వాలంటీర్ గా కొనసాగి, 1930లోనే ఆర్ఎస్ఎస్ నుండి బయటకు వెళ్లిపోయారు. మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు నాధూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ లో లేరు, ఎవరిసొంత అభిప్రాయాలు వారికుంటాయి కొందరు అవలంబించే పద్ధతులు నచ్చక, వారి మనస్సు ఏది చెబితే దానికి తలవంచి విధి వంచితులవుతుంటారు.
  9. జాతీయ ఉదార భావాలున్న ఆర్ఎస్ఎస్ ను మహాత్మాగాంధీ మరియు డాక్టర్ అంబెడ్కర్ గార్లు ఎంతో అభిమానించే వారు. 1963 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ పరేడ్(కవాతు) నిర్వహించారు. దాదాపు 3500 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఎర్రకోట సాక్షిగా రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నారు.
భారత్ మాతా కీ జై!!.....భారత్ మాతా కీ జై !!.....భారత్ మాతా కీ జై!!...

రచన. రవీందర్ గజవెళ్లి

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top