దేశభక్తి (స్ఫూర్తి) 'స్వామీ భారతీకృష్ణతీర్థులు' - Swami Bharati Krishna Tirtha

0
దేశభక్తి (స్ఫూర్తి) 'స్వామీ భారతీకృష్ణతీర్థులు' - Swami Bharati Krishna Tirtha
1924లో బ్రిటన్‌ యువరాజు వేల్స్‌ భారతదేశ పర్యటన ఖరారైంది. తమ యువరాజును భారతీయులు గౌరవించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది. భారతీయులకు ధర్మాచార్యులు, సాధుసంతుల పట్ల నిష్ట ఉంటుంది కాబట్టి ఆ నిష్టను ఉపయోగించు కోవాలనుకుంది. పూరీశంకరా చార్యులైన స్వామీ భారతీకృష్ణతీర్థులకు ఒక ఉత్తరం వ్రాసింది. రాజును శ్రీమహావిష్ణువు అంశగా భావించే హిందువులకు వేల్స్‌ యువరాజును కూడా అలాగే భావించి గౌరవించాలని బోధించమని కోరింది.
   ఈ ఉత్తరానికి సమాధానంగా స్వామీజీ తిరిగి ఉత్తరం వ్రాశారు. ‘ఆంగ్లేయులు విదేశీ దోపిడీదారులు. వాళ్ళు ప్రజాపాలకులు కారు. కపటంతో మా మాతృభూమిని ఆక్రమించి మమ్మల్ని బానిసల్ని చేశారు. అలాంటి వాళ్ళును విష్ణువు ప్రతినిధిగా ఎలా ప్రకటించగలను?’ అంటూ అందులో వ్రాశారు.
    స్వామీజీ వ్రాసిన ఈ సమాధానం బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఆయనపై రాజద్రోహనేరం మోపి జైలులో బంధించింది. అయినా భారతీకృష్ణతీర్థులు తమ దేశభక్తిని మాత్రం వదులుకోలేదు.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top