సంఘంలో శక్తిమంతం, కాంతి మంత్రం చేసే వాతావరణం - Powerful atmosphere in the Sangh

0
సంఘ్'లో శక్తిమంతమూ, కాంతి మంతమూ చేసే వాతావరణం - Powerful atmosphere in the Sangh

: శక్తిమంతమూ, కాంతి మంతమూ చేసే వాతావరణం :
   మనం మన కల్పనను అనుసరించి సమాజంలో మంచి మార్పులు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఇందుకు తగినంత శక్తిని కూడగట్టటమూ, వ్యయపరచటమూ అవసరమై ఉంది. ఈనాడు దేశంలో ఎంతగా శక్తి అవసరమై ఉందో, అంతశక్తిని మనం జాగృతం చేసి ఉండక పోవచ్చు. అయితే ఇప్పటి మన కార్యము, మన శక్తి ఏదైతే ఉన్నదో దానిని ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఇతర సంస్థలవారు కూడా వారివారి పద్ధతులలో పనిచేస్తున్నారు. కాగా నిత్యసంసిద్ధశక్తిని మేల్కొల్పే ప్రయత్నం మన కార్యపద్ధతిలోనే, సంఘకార్యం ద్వారానే సాధ్యమవుతూ ఉందనేది మన దృష్టి, తొలినాళ్ళలో కేవలం సాయంశాఖలు మాత్రమే ఉండేవి. స్వయంసేవకులు వయస్సులో పెద్దవారై, వారికి ప్రతిరోజూ సాయంశాఖకు రావటం కష్టంగా ఉందన్న విషయం దృష్టికి వచ్చినపుడు ప్రభాత్శాఖలు ఆరంభింపబడినవి. ఆ తర్వాత కొంతకాలానికి రాత్రిశాఖలు మొదలయ్యాయి.

   ఇన్నిరకాల శాఖలు ఏర్పరచుకొనడానికి ఒకటే కారణం-స్వయంసేవక్ ప్రతిరోజూ తప్పక శాఖకు రావలెనన్న విషయంలో, సమాజంలోని వ్యక్తులకు అత్యంత ప్రభావవంతమైన సంస్కారాలను అందించాలన్న విషయంలో మనకుగల పట్టుదల. సమాజంలోని వాతావరణం ఎంతగా దారితప్పిపోయిందంటే, ఎప్పుడో ఒకసారి లేదా అప్పుడప్పుడూ ఇచ్చే సంస్కారాలతో మనం ఆశించే మంచిమార్పులు సాధ్యపడవు శరీరానికి, మనస్సుకీ ఎన్నిరకాల సంస్కారాలు అవసరమై ఉన్నదో, వాటిని సంఘంలో ఇస్తూ ఉండటం కొనసాగిస్తూ ఉండాలి. దీనికోసమే దైనందిన శాఖలు, సంఘశిక్షావర్గలు గురుదక్షిణ తదితర కార్యక్రమాలను యోజనచేయటం జరుగుతున్నది.  వివిధ కార్యక్రమాలతో కూడిన ఒక సౌధంవంటి కట్టుదిట్టమైన వ్యవస్థ ఇక్కడ రూపొందించబడిన దానికి ఎంతో మహత్తు ఉన్నది. అది అత్యంత ఆవశ్యకమైనది కూడా.  

    దీనినిబట్టే సంఘ వాతావరణం విద్చుచ్ఛక్తితో ప్రకాశమంతమై, శక్తివంతమై విరాజిల్లుతున్నదని (Electrified) ప్రజలు గ్రహిస్తున్నారు. ఇందులోకి అడుగుపెట్టినవారు సంఘం మనుషులుగా మారిపోతారు. సంఘంలో అడుగుపెట్టినవారు ఒక విధంగా పిచ్చిపట్టిన వారవుతారని తొలినాళ్ళలో అంటూ ఉండేవారు. సంఘంలో ప్రవేశించిన వారందరినీ సంఘభూతం ఆవేశిస్తున్నదా లేదా అని ప్రశ్నిస్తూ ఆరోజుల్లో బౌద్దికులు కూడా ఉండినవి. పైన చెప్పిన ఈ విషయాలన్నింటిలో ఇమిడి ఉన్న ఉద్దేశం ఏమిటి? సంఘంలో వ్యక్తులకు ప్రభావవంతమైన సంస్కారాలు లభించాలి, వాటికి వ్యతిరేకమైన మార్పులేవీ రాకూడదు అన్నదే దీని సారాంశం. ఈవిధమైన దృఢమైన నిర్మాణంమన కార్యపద్ధతి ద్వారానే సాధ్యమవుతుంది. 

    నిత్య సంసిద్ధశక్తి గురించి మీ కల్పన ఏమిటని కొందరు అడుగుతూ ఉంటారు. సమాజంలో ఎటువంటి పరివర్తన రావాలనుకొంటున్నారు, హిందూ సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తి సంఘస్థాన్ కి రావలసిందేనని మీరు అనుకొంటున్నారా? అని కూడా అడుగుతారు.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top