మతమార్పిడుల ద్వారా తలెత్తే సమస్యలు - Problems arising through conversions

0
మతమార్పిడుల ద్వారా తలెత్తే సమస్యలు - Problems arising through conversions
: మతమార్పిడుల ద్వారా తలెత్తే సమస్యలు :
 మతమార్పిడులు జరిగినచోట మతం మారిన వారి సామాజిక స్థితిలో మార్పులు వస్తాయి. ప్రారంభంలో స్థానిక సమాజం వారిని అసహ్యంగా చూస్తుంది. వారితో కలిసి మెలిసి ఉండడానికి ఇష్టపడరు. పరస్పర ఉద్రిక్తతలు, నిరంతర ఘర్షణలు చోటు చేసుకుంటాయి. 
  • మతం మారిన వ్యక్తి మొదట్లో కొత్త మతం యొక్క ఆచార సంప్రదాయాలను అత్యుత్సాహంతో ఆచరిస్తాడు. పూర్వకాలపు తన హిందూ సంప్రదాయాలను తిరస్కార దృష్టిలో చూడడం, అవమానించడం కూడా చేస్తాడు. కనుక సమాజంలో అశాంతి చోటుచేసుకుటుంది. 
  • మతం మారడం వల్ల వివాహ సంబంధాలు, సహపంక్తిభోజన సంబంధాలు తెగిపోతాయి. ఈర్ష్యాద్వేషాలు జనిస్తాయి. వాటివల్ల హానికరమైన పరిణామాలు సంభవిస్తాయి. 
  • మతం మారిన వ్యక్తి, ఆ కొత్త మతానికి చెందిన తన ఆచార వ్యవహారాలను విశ్వాసాలను, వేషభాషలను స్వీకరిస్తాడు. అతడి ఆలోచనలలో మార్పు వస్తుంది. దీర్ఘకాలం ఆ వాతావరణంలోనే ఉండడం వల్ల అందులోనే తాదాత్మమ్ చెందుతాడు.
  • జాతీయతా భావనకుదూరమైపోతాడు. దేశాన్ని అవమానించే మనస్తత్వాన్ని అలవరచుకుంటాడు. "మతం మార్చుకోవడమంటే జాతీయతను మార్చుకోవడమే” అని స్వామి వివేకానంద అనేవారు.
అక్కున చేర్చుకోవలసిన సమయం వచ్చింది:
   ఈ భయానక సమస్యను జాగరూకమైన హిందూ సమాజం మాత్రమే ఎదుర్కొనగలదు. హిందూ సమాజం పెద్దమనసుతో ఆలోచించాలి. మన సోదరులు ఏ కాలంలోనో అసాధారణ పరిస్థితుల వల్ల మన నుండి దూరమై పోయారు. బలవంతంగా మన నుండి వేరు చెయ్యబడ్డారు. మనం వారిని రక్షించుకోవాలని ఉన్నాకూడా రక్షించుకోలేకపోయాం. ఇప్పుడు వారిని అక్కున చేర్చుకునే సమయం వచ్చింది. అక్కున చేర్చుకోవలసి ఉన్నది. వారు తమ సొంత ఇంటికి (సనాతన హిందూ ధర్మానికి) తిరిగి రావడానికి ద్వారాలను తెరవవలసి ఉంది. వారిని ప్రేమపూర్వకంగా మనలో కలుపుకోవాలి. తమదైన గౌరవ స్థానాన్ని వారికి తిరిగి ఇవ్వాలి.

పరిష్కారం దిశగా వినయపూర్వకమైన విజ్ఞప్తి:
   పూర్వకాలంలో ఏవో కారణాల వల్ల తప్పని పరిస్థితిలో మతం మారవలసి వచ్చిన ముస్లిం, క్రైస్తవ సోదరులకు మేము చేస్తున్న వినయపూర్వకమైన విజ్ఞప్తి ఏమిటంటే “మీ పూర్వీకులతో గల రక్త సంబంధాన్ని మరిచిపోవద్దు. మీ బంధువులైన హిందువుల ఆహ్వానాన్ని మన్నించి నిస్సంకోచంగా మీ సొంత ఇంటికి తిరిగి రండి. ఎవరి మోసంలోనూ పడవద్దు. మనం భారతమాత ప్రాంగణంలో కలిసి ఆనందం పంచుకుందాం, గతకాలపు బాధాకర గాధలు మరిచిపోదాం. ఉదార హృదయాలతో సగర్వంగా ఇలా అనండి - “మేము మీ వారమే, మాది మీ రక్తమే, మన పూర్వీకులు ఒక్కరే, మేము కూడా భారతమాత సంతానమే"

| భారత్ మాతాకీ జై |

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top