హిందుత్వాన్ని కూల్చివేయడం ఎలా ? వామపక్షవాదుల 3-రోజుల సమావేశం - Dismantling Hindutva is a Declaration of a War to Destroy Hindu Dharma

0
హిందుత్వాన్ని కూల్చివేయడం ఎలా ? వామపక్షవాదుల 3-రోజుల సమావేశం - Dismantling Hindutva is a Declaration of a War to Destroy Hindu Dharma

"ప్రపంచ హిందుత్వ  కూల్చివేయడం ఎలా"

   అనే ఈ ఈవెంట్‌ని  ఇస్లాం ఉగ్రవాదులను,  క్రిస్టియన్ మత మార్పిడి ముఠా ఆగడాలను వెనకేసుకు వచ్చే వామపక్ష భావజాలం గల భారతీయ మేధావులు, మెదడు నిండా వామపక్ష భావజాలం నింపుకుని 24 గంటలూ పెట్టుబడి దారీ దేశాలు అయిన అమెరికా, బ్రిటన్ లని తిడుతూ మళ్ళీ ఆ దేశాల్లోనే ఉద్యోగాలు, వ్యాపకాలు వెలగబెడుతో ఖరీదైన లగ్జరీ లైఫ్ గడుపుతున్న కొందరు భారతీయులు కలిసి ఈ సెప్టెంబర్ 11 నుండి  13వ తేదీ వరకు  "ప్రపంచ హిందుత్వ  కూల్చివేయడం ఎలా" అనే అతి ముఖ్య విషయం మీద 3-రోజుల సమావేశం నిర్వహిస్తున్నారు. 45కి పైగా విశ్వవిద్యాలయాల నుండి 60+ విభాగాలు లేదా కేంద్రాలచే ఈ సమావేశం స్పాన్సర్చే యబడింది.
 
దీనిలో పాల్గోనబోయే వక్తలు : 
 1. ఆనంద్ పట్వర్ధన్  
 2. ఆయేషా కిద్వాయ్ 
 3. బాను సుబ్రమణ్యం 
 4. భన్వర్ మేఘవంశీ 
 5. క్రిస్టోఫ్ జాఫ్రెలోట్  
 6. కవితా కృష్ణన్ 
 7. మీనా కందసామి 
 8. మొహమ్మద్ జునైద్ 
 9. నందిని సుందర్ 
 10. నేహా దీక్షిత్ 
 11. పి. శివకామి
కో స్పాన్సర్‌లలో నార్త్ వెస్ట్రన్, UC బర్కిలీ, యుచికాగో, కొలంబియా, హార్వర్డ్ ,UPenn, ప్రిన్స్టన్ ,స్టాన్‌ఫోర్డ్ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం హిందుత్వ వల్ల భారత్ కి ఎంత ప్రమాదమో ప్రపంచం దృష్టికి ఇంకా తీసుకురావడానికి ఏం చెయ్యాలో ఈ సమావేశం చర్చిస్తుంది.

నిర్వాహకుల మాటల్లోనే...
 • " భారతదేశంలో మిలిటెంట్ హిందూ గ్రూపుల పెరుగుదల మరియు మతపరమైన మైనారిటీలు మరియు ఇతర అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా హింస పెరగడం ప్రపంచ మీడియాతో సహా చక్కగా పబ్లిసిటీ ఇవ్వబడింది.
 • ఈ సమావేశం హిందూత్వ యొక్క ముప్పు తదితర అంశాలపై ప్యానెల్‌లను ఏర్పాటు చేస్తుంది. మేధావులు, పాత్రికేయులు మరియు కార్యకర్తలు హిందుత్వ యొక్క చారిత్రక అభివృద్ధి, భావజాల ఫాసిస్ట్ రూపాలు, ఇతర ఆధిపత్య ఉద్యమాలతో దానిని పరిశీలిస్తారు రాజకీయ, సామాజిక-సాంస్కృతిక మరియు ఆర్థిక సమస్యల పరిధిలో ఉన్న అన్నింటినీ నిర్వచిస్తారు. 
 • హిందుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి, ప్రతిఘటన చరిత్రను పరిశీలించడానికి ఈ సమావేశం ఒక స్థలంగా ఉండాలని కూడా మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. "
ఇదీ ఈ నిర్వాహకుల ఉద్దేశ్యం.
   సో, దేశ విదేశీ మీడియాలో హిందుత్వానికి ఇంత ఎక్కువగా వ్యతిరేక ప్రచారం జరుగుతూ వుండడానికి కారణం ఏమిటో ఇప్పటికీ మీకు అర్థం అయి వుంటుంది. ఈ ముఠా సభ్యులకు మోడీ అంటే ఎందుకు అంత కోపం అంటే గత ప్రభుత్వాలు వీరిని బుజ్జగించినట్లు ఇప్పుడు వీళ్లని బుజ్జగించడం పక్కన పెడితే మోడీ అసలు వీరిని లక్ష్య పెట్టడం మానేశాడు. అంతే కాదు ఒక NGO పెట్టడం కోట్ల కొద్దీ విరాళాలు సేకరించి ఎవడికి లెక్క చెప్పనవసరం లేకుండా ఖర్చు చేసుకునే వెసులబాటు పోయింది. పద్మశ్రీలు పోయాయి. ప్రభుత్వ కమిటీల్లో మెంబర్షిప్ తద్వారా వచ్చే ఉచిత గృహ, వాహన సదుపాయాలు పోయాయి. 

మరి వారికి కడుపు మండ దాండీ ?
అందుకే వీళ్లకు హిందు ప్రభుత్వం అధికారం లోకి రావడానికి కారణం అయిన హిందుత్వ అంటే మంట. మన ఫేస్ బుక్ మేధావులూ వీరికి వంత.. ఒక్కరూ తాలిబాన్ మీద పోస్ట్ పెట్టే ధైర్యం చేయలేరు కానీ 24 గంటలూ హిందుత్వ వల్ల వచ్చే ప్రమాదం గురించి రాస్తారు.

ఈ వామపక్ష మేధావుల అసలు రంగు ఇప్పటికైనా సాధారణ హిందువులు గుర్తించకపోతే మొన్న ఎన్నికల తరువాత బెంగాల్ లో హిందువులను వూచ కొత్త కోస్తే మౌనం వహించి నట్లు రేపు తాలిబాన్ వాళ్ళు భారత్ మీద పడి హిందువులను చంపేసినా అదే వ్యూహాత్మక మౌనం వహిస్తారు. వారికి వారి సిద్ధాంతమే ముఖ్యం దాని కోసమే ఈ పాట్లన్నీ....

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top