అఖండ భారత్ దివస్ - AKHAND BHARAT Diwas

0
అఖండ భారత్ దివస్ - AKHAND BHARAT Diwas

: అఖండ భారత్ దివస్ :

   ఎందరో మంది వీరులు‌ విశ్రమించకుండా చేసిన లెక్కలేనన్ని పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ద్వారా 14 ఆగష్టు 1947 శుక్రవారం అర్ధరాత్రి  అమవాస్య నాడు వేయి సంవత్సరాల బానిసత్వాన్ని వదిలించుకున్న రోజు..._అదే రోజు భారత్ మూడు ముక్కలుగా (భారత్, పశ్చిమ‌‌ పాకిస్థాన్, తూర్పు పాకిస్థాన్) రెండు దేశాలు (భారత్, పాకిస్తాన్)గా విడిపోయింది. "Operation success but patient died" అన్నట్లుగా ఉంది.  స్వాతంత్ర్యం వచ్చింది కానీ, సంపూర్ణ స్వాతంత్ర్యం రాలేదు.

అఖండ భారత్ దివస్ - AKHAND BHARAT Diwas

అఖండ భారత్ అంటే?

భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్ (బర్మా), టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లను కలిపి "అఖండ భారత్" అంటారు. అంటే బ్రిటిష్ వారి పాలనకు ముందున్న భారతదేశం. బ్రిటీష్ వాళ్ళు విశాల దేశాన్ని "విభజించి - పాలించు సిద్దాంతం"తో కొన్ని దేశాలుగా చీల్చి, స్వతంత్రం ఇచ్చి వెళ్లిపోయారు.

అఖండ భారత్ ఖండిత భారత్ గా మారిన పరిణామ క్రమం.
 • 1876లో ఉపగణస్థాన్- అఫ్ఘనిస్థాన్ గా
 • 1904లో సాగరమాత- నేపాల్‌ గా,
 • 1906లో భూటాన్,
 • 1907లో త్రివిష్టపురం- టిబెట్ గా,
 • 1935లో శ్రీలంక- సిలోన్ గా,
 • 1937లో బ్రహ్మదేశం- బర్మా గా,
 • 1947లో పాకిస్థాన్,
 • 1971లో బంగ్లాదేశ్ లుగా విడిపోయింది._
ఒకప్పుడు 72 లక్షల చ.కి.మీల విస్తీర్ణం కలిగిన అఖండ భారతం, నేడు ఖండిత భారత్ గా 32 లక్షల చ.కి.మీల విస్తీర్ణానికి కుచించుకు పోయింది.

స్వాతంత్ర్యం వచ్చాక అసమర్థ రాజనీతి వల్ల భారత్ కోల్పోయిన భూభాగాలు.
 • _1948లో ఆజాద్ కాశ్మీర్ (POK),
 • _1962లో అక్సాయ్ చిన్.
మనం కోల్పోయిన కొన్ని చారిత్రక ప్రదేశాలు.
 • _గాంధార, "కాందహార్"గా మారింది.
 • _వేదాలకు పుట్టినిల్లుగా పిలవబడే సింధు నది వేద విద్రోహుల చేతుల్లోకి వెళ్లింది.
 • _నరసింహ స్వామి, ప్రహ్లాదుడికి ప్రత్యక్షమై హిరణ్యకశిపుని సంహరించిన "ప్రహ్లాదపురం" నేడు "ముల్తాన్"గా మారింది.
 • _శ్రీరాముడి కుమారుడు "లవుడు" నిర్మాణం చేసిన, మహారాజా రంజిత్ సింగ్ పాలించిన "లవపురి" నేడు "లాహోర్"గా మారింది.
 • _ప్రప్రథమ విశ్వవిద్యాలయంగా, చాణక్యుడు జన్మించిన భూమిగా ప్రసిద్ధి గాంచిన "తక్షశిల" నేడు టాక్సిల్ గా మారింది.
 • _52 శక్తి పీఠాల్లో ఒక్కటైనా "ఢాకేశ్వరీ" నేడు "ఢాకా"గా మారింది.
 • _సంస్కృత వ్యాకరణ కర్త "పాణిని" జన్మస్థలం పాకిస్థాన్ లో ఉంది.
 • _1929 డిసెంబరులో "సంపూర్ణ స్వరాజ్య తీర్మాణం" చేసిన రావి నది మనది కాకుండా పోయింది._
 • _నాడు బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ (బంగ్లాదేశ్), ఒడిషా, అసోం, ఛోటా నాగ్‌పూర్ పీఠభూమి, పిప్పెర కొండలు, చిట్టగాంగ్ లు కలిపి "బెంగాల్".
 • _1905లో లార్డ్ కర్జన్ మత ప్రాతిపదికన బెంగాల్ ను రెండు భాగాలుగా విభజిస్తే, ప్రజల ఉద్యమాలు, పోరాటాలతో 1911లో బ్రిటీష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను రద్దు చేసింది.
 • _ఏ ప్రజలైతే బెంగాల్ విభజనను ఆపగలిగారో 36 ఏళ్ల తర్వాత దేశ విభజనను ఆపడంలో ఎందుకు విఫలమయ్యారు?
East India Company పాలనా విధానాలకు వ్యతిరేకంగా 1857లో ఐక్యంగా పోరాటం చేసిన హిందువులు, ముస్లింలు ఎలా దూరమయ్యారు?
 • "I am a Nationalist, Nationalist first, Nationalist last" అన్న మహ్మదాలి జిన్నా ఎందుకు మారాడు?
 • 1857 సంగ్రామంలో ముస్లింలు ఎందుకు పాల్గొన్నారంటూ కవి "గాలిబ్" ఎందుకు ప్రశ్నించాడు?
 • "సారే జహఁసే అచ్ఛా హిందూస్థాన్ హమారా" అన్న మహ్మద్ ఇక్బాల్ "సారే జహాఁ సే అచ్ఛా పాకిస్తాన్ హమారా" అని పాడారెందుకు?
 • "ఒకే ఒరలో ఒకే కత్తి ఉన్నట్లు, ఒకే దేశంలో ఒకే జాతి ఉంటుంది" ఇది తెలిసిన కుటిల ఆంగ్లేయులు "ద్విజాతి సిద్ధాంతం" తీసుకువచ్చి, దేశ విభజనకు తెరలేపారు.
 • దానిలో భాగంగానే 1906లో "ఆగాఖాన్" నాయకత్వంలో "ముస్లింలీగ్"ను ప్రారంభించేలా చేసారు.
 • మత ప్రాతిపదికన నియోజకవర్గాల ఏర్పాటుకు "మింటో -‌ మార్లే సంస్కరణలు" తెచ్చారు.
 • తమ మతానికి వ్యతిరేకంగా ఉందని పూర్తి వందేమాతరం పాడడానికి విభేదించడంతో సంతుష్టికరణ కాంగ్రెస్ వాదులు వందేమాతరం గీతాన్ని ఒకే చరణానికి పరిమితం చేసారు.
 • ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా మన దేశానికి సంబంధంలేని "ఖిలాఫత్ ఉద్యమాన్ని" గాంధీజీ ముందుండి నడిపాడు.
 • ఈ ఉద్యమ సమయంలోనే మలబార్ తీరంలో గల "మోప్లా"లో వేల‌ మంది హిందువులను ఊచకోత కోసిన ఎవరు కిమ్మనలేదు.
అఖండ భారత్ దివస్ - AKHAND BHARAT Diwas

దేశ విభజన - విషాద గాథ :

 1. 1946లో "క్యాబినెట్ మిషన్ ప్లాన్" పేరు మీద పాకిస్థాన్ కోరే రాష్ట్రాలు ఒక వైపు, భారత్ కోరే రాష్ట్రాలు ఒకపైపు ఉండేలా నివేదిక ఇచ్చారు. 
 2. "Cabinet Mission Plan" is a fantastic nonsense అన్నాడు నెహ్రూ.
 3. "ముందు నా శరీరాన్ని ముక్కలు చేయండి తర్వాత నా దేశాన్ని ముక్కలు చేయండి" అన్నాడు గాంధీజీ.
 4. "తల్వార్ సే తల్వార్ బిడేగీ మగర్ దేశ్ కబీ న బాటేగీ" అన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్.
 5. దేశ విభజన వద్దంటున్నందుకు ముస్లిం లీగ్ మహ్మదాలి జిన్నా నేతృత్వంలో 16 ఆగష్టు 1946న  "Direct Action Day"కు దిగి కలకత్తాలో హిందువులను వేల సంఖ్యలో చంపడమే గాక, అత్యాచారాలు చేసారు. మానభంగానికి గురైన మహిళలను పరమార్శించడానికి "సుచేత కృపలాని" కలకత్తాకు సైనేడ్ టాబ్లెట్ తో వెళ్లిందంటే నాటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి.
 6. 3 జూన్ 1947న "సిమ్లా ఒప్పందం" జరిగి దేశ విభజనకు మార్గం సుగమం చేసారు బ్రిటిష్ వారు.ఇంత పెద్ద దేశాన్ని "సర్ రాడ్ క్లిఫ్" 40 రోజుల వ్యవధిలోనే విభజించి, కేవలం‌ 48 కిలోమీటర్ల సరిహద్దు రేఖ గీసాడు. గ్రామపంచాయతి భారత్ లో, గ్రామం పాకిస్థాన్ లో ఉండేటట్లుగా అస్పష్టంగా సరిహద్దు రేఖను గీసి, స్వాతంత్ర్యం వచ్చాక కూడా కొట్టుకు చచ్చేలా చేసారు.
అఖండ భారత్ దివస్ ఎందుకు జరుపుకోవాలి :

బెర్లిన్ గోడలు బద్దలు కొట్టుకుని జర్మనీ ఏకమైనట్లుగా, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాంలు కలిసి వియత్నాంగా మారినట్లు మనం కోల్పోయిన భూభాగాలన్ని ఏకం చేయడానికి ఏకాత్మత స్ఫూర్తి చెందేలా ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం.

"ఖండిత విగ్రహాన్ని పూజించడం అనర్థం. ఖండిత దేశాన్ని ఆరాధించడం అనర్థం." అన్న అరవింద ఘోష్ మాటలే స్ఫూర్తిగా అఖండ భారత్ సాధనే ధ్యేయంగా కదులుదాం.

భారత్ మాతాకీ జై ...

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top