మతమార్పిడులు రాజ్యాంగ నిర్మాణ సభ- మతమార్పిడులు : Constituent Assembly - Religious Converts

The Hindu Portal
0
మతమార్పిడులు రాజ్యాంగ నిర్మాణ సభ- మతమార్పిడులు : Constituent Assembly - Religious Converts

రాజ్యాంగం - మత్తమార్పిడులు :
    భారత రాజ్యాంగంలో ఏయే ప్రాథమిక హక్కులను చేర్చాలనే విషయమై సూచన లిచ్చేందుకై భారత రాజ్యాంగ నిర్మాణ సభ (The Constituent Assembly) ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సలహా సంఘం (Advisory Committee) ప్రాథమిక హక్కుల ముసాయిదా ప్రతిని తయారు చేసేందుకై ప్రాథమిక హక్కుల ఉపసంఘాన్ని (Fundamental Rights Sub Committee) ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం తదనుగుణంగానే ప్రాథమిక హక్కుల ముసాయిదా ప్రతిని తయారుచేసి దానిపై అల్పసంఖ్యాక వర్గాల అభిప్రాయాన్ని వివరించేందుకై ఒక మైనారిటీ ఉపసంఘాన్ని (Minorities Sub Committec) నియమించింది.
     ప్రాథమిక హక్కుల ఉపసంఘం తన ముసాయిదా రిపోర్టులో వివిధ ప్రాథమిక హక్కులను పేర్కొంటూ ఒత్తిడి ద్వారా గాని అనుచిత ప్రభావం ద్వారా గాని చేయబడే మతమార్పిడులను శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించాలనే సూచనను కూడా అందులో చేర్చింది. ఈ ముసాయిదా రిపోర్టు యొక్క 23వ అ ధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. 
    Conversion from one religion to another brought about by coercion or undue influence shall not be recognized by Law and the exercise of such coercion or undue influence shall be an offence" (Framing of India's Constitution' by B.Shiva Rao, page 140). "ఒక మతం నుండి మరొక మతంలోకి ఒత్తిడి ద్వారాగాని, అనుచితమైన ప్రభావం ద్వారాగాని చెయ్యబడే మతమార్పిడులను చట్టం గుర్తించకూడదు. అటువంటి ఒత్తిడినిగాని, అనుచిత ప్రభావాన్ని గాని కలిగించడం అపరాధం కావాలి" (Framing of India's Constitution - రచయిత బి. శివరావు, 140వ పుట).
    ప్రాథమిక హక్కుల ఉపసంఘం సమర్పించిన ముసాయిదా రిపోర్టును పరిశీలించిన పిమ్మట మైనారిటీ ఉపసంఘం పైన ఉదహరించబడిన సూచన స్థానంలో ఈ క్రింది సూచనను ప్రాథమిక హక్కుల అధ్యాయంలో చేర్చాలని సలహా ఇచ్చింది. "No Conversion shall be recognized unless the change of faith is attested by a magistrate after the enquiry", ('Framing of India's Constitution' by B.Shiva Rao, Page 209) "ఒక మేజిస్ట్రేటు విచారణ జరిపి ఆమోదించిన పిమ్మట తప్ప ఏ మతమార్పిడులను చట్టం గుర్తించకూడదు" (Framing of India's Constitution - బి, శివరావు 9వ పుట).

     మతమార్పిడి సమస్య గురించి రాజ్యాంగ నిర్మాతలు చక్కని అవగాహనను కలిగి ఉండడమేకాక, దాని గురించి ఆందోళనతో ఉన్నారని ఇందువల్ల తెలుస్తోంది. అందుకనే వారు ఒత్తిడి ద్వారా, లేక అనుచిత ప్రభావం ద్వారా చెయ్యబడ్డ మతమార్పిడులను చట్టం గుర్తించడకూడదని చెప్పడమే కాక అటువంటి ఒత్తిడినీ, అనుచిత ప్రభావాన్ని కలిగించడాన్ని నేరంగా ప్రకటించాలని సలహా ఇచ్చారు. మైనారిటీ ఉపసంఘం కూడా ఈ క్లాజును పూర్తిగా తొలగించాలనేందుకు ధైర్యం చెయ్యకుండా మేజిస్టేటు విచారణలో అది నిర్దోషమైనదని తేలితేనే గుర్తింపు ఇవ్వాలని సూచించింది. అంటే ఒత్తిడి లేదా అనుచిత ప్రభావం ద్వారా జరిగే మతంమార్పిడులను ఆమోదించకూడదనే విషయంలో వాళ్ళు కూడా సమ్మతినే ప్రదర్శించారు.
    సలహాసంఘం (Advisory Committee) లో పై అంశంపై చర్చ జరిగిన సమయంలో సమితి అధ్యక్షుడైన వల్లభాయి పటేల్ "మతమార్పిడులను నిరోధించే విషయమై క్లాజులను తయారుచేసే పనిని చట్ట సభలకు వదిలెయ్యాలి” అని సూచించారు. కాని చాలా మంది సభ్యులు రాజ్యాంగంలో కూడా అనుచితమైన మతమార్పిడులకు వ్యతిరేకంగా ఏదో ఒక క్లాజు ఉండితీరాలని పట్టుబట్టారు. అప్పుడు ఈ క్రింది సూచనతో సలహాసంఘం రాజ్యాంగ సభకు తన నివేదికను పంపింది.

     "Conversion from one religion to another brought about by coercion or undue influence shall to be recognized by Law. (clause 17, 'Framing of India's  Constitution' by B.Shiva Rao, page 298). "ఒత్తిడి ద్వారాగాని, అనుచిత ప్రభావం ద్వారా గాని ఒక మతంనుండి మరొక మతంలోకి చెయ్యబడే మతమార్పిడులను చట్టం గుర్తించకూడదు” (క్లాజు 17, Framing of India's Constitution -బి. శివరావు, పుట 298). 
    కాని పై క్లాజుతోబాటు మరికొన్ని క్లాజులు పునఃపరిశీలన నిమిత్తమై సలహా సంఘానికి తిరిగి పంపబడ్డాయి. పునఃపరిశీలన జరిపిన పిమ్మట సలహా సంఘం (This clause enunciated rather obvious doctrine) “పైన చెప్పబడిన క్లాజు ఒక సుస్పష్టమైన సిద్దాంతాన్నే ప్రతిపాదిస్తోంది” అని, ఆ కారణంగా దీనిని ప్రత్యేకించి రాజ్యాంగంలో ఒక సూత్రంగా చేర్చవలసిన అవసరం లేదని అభిప్రాయపడింది. (Framing of India's Constitution - బి.శివరావు, 304, 305, పుటలు). 

రాజ్యాంగ సభ నిర్ధారణ :

    రాజ్యాంగ నిర్మాతలకు “ఒత్తిడి లేక అనుచిత ప్రభావంతో జరిగే మతమార్పిడులు" చాలా ఆందోళన కలిగించిన విషయంగా ఉండేదని పైన ఇవ్వబడ్డ వివరణలను బట్టి సుస్పష్టమౌతుంది. అటువంటి మతమార్పిడులను అడ్డుకొనడానికి అవసరమైన శిక్షలు విధించే అధికరణం రాజ్యాంగంలో ఉండాలని కోరుకున్నారు. కాని అటువంటి అనుచితమైన మతమార్పిడులకు చట్టపరమైన అనుమతి ఎలాగా ఉండజాలదన్న నమ్మకంతో, అది స్పష్టము సర్వసమ్మతము అయిన విషయమే కనుక ఇక దాని గురించి రాజ్యాగంలో ప్రత్యేకించి ఒక అధికరణం ఎందుకు - అనే ఉద్దేశ్యంతో అనుచిత మతమార్పిడులను నిషేధించే అంశాన్ని రాజ్యాంగంలో  పొందుపరచలేదు. భవిష్యత్తులో అవసరమైతే చట్టసభలకు ఈ విషయమే శాసనం చెయ్యగల స్వాతంత్య్రం ఎలాగూ ఉంటుందనుకున్నారు. ఇప్పుడు మతమార్పిడుల సమస్య వికృతరూపం ధరించింది కనుక, మతమార్పిడుల కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కనుక రాష్ట్రాలు తమ శాసనసభల ద్వారా "మత స్వాతంత్య్రపు చట్టం" వంటి "మతమార్పిడి నిరోధక చట్టం" వంటి చట్టాలను జారీ చేస్తే అది రాజ్యాంగ బద్దమే అవుతుంది. రాజ్యాంగ సభ యొక్క సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగానే ఉంటుంది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top