గో సంరక్షణ చట్టాలు, నిభందనలు - Cow Protection Laws,Rules & Regulations -

0
గో సంరక్షణ చట్టాలు, నిభందనలు - Cow Protection Laws,Rules & Regulations -
గోవుకు మన సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది.  గో సంపద, ఇతర పశు సంపద గ్రామీణ ప్రాంతాల్లో చాలా కీలకమైనది. గో సంపద ఆధారంగా అనేక కుటుంబాలు జీవనం సాగిస్తుం టాయి. నానాటికీ తరిగిపోతున్న గోవుల కారణంగా ఏర్పడుతున్న కరవు కాటకాల నేపథ్యంలో గో సంరక్షణ ప్రస్తుత కాలంలో ఒక తప్పనిసరి బాధ్యతగా మారింది. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ అనేక జాతి వ్యతిరేక పార్టీలు, సంస్థలు గోరక్షణ అంటే అదొక మతానికి వ్యతిరేకం అనే స్థాయికి తమ ప్రచారాన్ని తీసుకువచ్చాయి. ఈ క్రమంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని ప్రాణాలకు తెగించి మరీ అడ్డుకుంటున్న జంతుప్రేమికులు, రైతులు, సామాజిక కార్యకర్తలను మతవాదులుగా చూపిస్తూ, మతపరమైన అనేక తప్పుడు కేసులు ఇబ్బందులకు గురిచేస్తున్న దాఖలాలు అనేకం. నిజానికి భారతదేశంలో గో సంవర్ధన మరియు సంరక్షణ కొరకు అనేక చట్టాలు ఉన్నాయి. అవేమిటో క్లుప్తంగా పరిశీలిద్దాం.

వాహనాల్లో గోవుల రవాణాకు సంబంధించి జంతువుల రవాణా చట్టం 1978లోని నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

వ్యవసాయ నిమిత్తం గోవుని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించాల్సివస్తే ముందుగా అర్హత కలిగిన పశువైద్యుడి ద్వారా ఆ గోవు యొక్క ఆరోగ్యం ప్రయాణం చేసేందుకు (రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా) అనుకూలంగా ఉన్నట్టుగా సర్టిఫికెట్‌ ‌పొందాలి.
  • – రవాణా కోసం ఉద్దేశించిన గోవులకు ఎటు వంటి అంటువ్యాధులు లేవు అని ఆ సర్టిఫికెట్‌ ‌ద్వారా వైద్యుడు నిర్ధారించాలి.
  • – గోవులను తరలిస్తున్న వాహనంలో కచ్చితంగా ఒక గోవుల కోసం ఒక ప్రాథమిక చికిత్స సామాగ్రి ఉండాలి.
  • – గోవులను తరలిస్తున్న వాహనంలోని వ్యక్తి వద్ద.. ఆ గోవులను ఎవరు, ఎవరికి చేరవేస్తున్నారు, ఇరువురి చిరునామా, ఫోన్‌ ‌నెంబర్లతో పాటుగా ఎన్ని గోవులు ఆ వాహనంలో ఉన్నాయి, వాటికి ఏ విధమైన ఆహారపదార్ధాలు అందుబాటులో ఉంచారు వంటి వివరాలు కూడా కలిగివుండాలి.
  • – రవాణా చేస్తున్న వాహనంలోని గోవుల్లో ఒక్కో గోవుకు మధ్య సగటున కనీసం రెండు చదరపు అడుగుల స్థలం ఉండాలి.
  • – గోవులకు సరియైన ఆహరం, నీరు అందించిన తరువాతే వాహనంలోకి ఎక్కించాలి.
  • – గర్భంతో ఉన్న గోవును రోడ్డు మార్గంలో కాకుండా రైలుమార్గంలోనే చేరవేయాలి. అటువంటి గోవును ఇతర గోవులతో కలిపి వాహనంలో ఉంచరాదు. ఆ గోవుకు సరియైన గాలి, వెలుతురు అందేవిధంగా తగు చర్యలు తీసుకోవాలి.
గోవును వధిస్తే నాన్‌బెయిల్‌బుల్‌ ‌కేసు-సుప్రీం కోర్టు:
   గోవులు, పశుగణాలను వధించినా, గాయ పరిచినా నాన్‌బెయిలబుల్‌ ‌సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసే విధంగా ఐపిసి సెక్షన్‌ 429‌కు సవరణలు చేయాలని ఉమ్మడి హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను 2017లో ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌బి శివశంకరరావు ఆదేశాలు జారీ చేశారు. గోవధకు సంబంధించి దాఖలైన క్రిమినల్‌ ‌రివిజన్‌ ‌పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ ‌చేసింది. ఈ కేసులో ఆరోగ్యకరమైన ఆవు అనారోగ్యకరంగా ఉందని తప్పుడు ధ ృవీకరణ పత్రం ఇచ్చిన వెటర్నరీ వైద్యులపైన కూడా క్రిమినల్‌ ‌కేసులు, నాన్‌బెయిలబుల్‌ ‌కేసులు నమోదు చేసే విధంగా ఏపి గోవధ నిషేధం చట్టం 1977 సెక్షన్‌ 10‌నిబంధను చేర్చాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో ఎటువంటి పురోగతి కనపడడంలేదని హైకోర్టు పేర్కొంది. గోవులను హింసించడం, ఆహారంలో విషం కలిపి చంపడం, వధించడం, అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడే నిందితు లకు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 429 ‌ప్రకారం జరిమానా లేదా గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండింటిని విధించవచ్చు.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top