హిందువుగా పేరు మార్చుకుని నలుగురు హిందూ యువతులను ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు

0
హిందువుగా పేరు మార్చుకుని నలుగురు హిందూ యువతులను ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు - Grooming Jihad: Abdul Salam trapped and sexually exploited 4 Hindu girls using different Hindu identities
మీరట్ పోలీసులు అబ్దుల్ సలామ్ అనే ముస్లిం వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గత 15 సంవత్సరాలలో కనీసం 4 మంది అమ్మాయిలను అతడు మోసం చేసినట్లు గుర్తించారు. అతడు హిందువుగా చెలామణీ అవుతూ హిందూ అమ్మాయిలను ఆకర్షించి మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు. నిందితుడు బాధితులను మోసం చేయడానికి వివిధ హిందూ పేర్లను ఉపయోగించాడు. వివాహం చేసుకుని లైంగికంగా వేధించాడు. అబ్దుల్ సలామ్ తన వలలో పడిన వారిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు కూడా ప్రయత్నించాడు. అబ్దుల్ సలామ్ పై అతని మొదటి భార్య పింకీతో పాటు అతని ఉచ్చులో పడ్డ మరో అమ్మాయి అతనిపై ఫిర్యాదు చేసింది. వారు మీరట్ పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మోసం, అత్యాచారం, బలవంతంగా మత మార్పిడి, ఫోర్జరీ చేసినందుకు పోలీసులు అబ్దుల్ సలాంపై పలు సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేశారు. మీరట్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు తన మత గుర్తింపును దాచడానికి సంవత్సరాలుగా ఉపయోగిస్తూ వచ్చిన.. హిందూ పేర్లతో ఉన్న అనేక నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 2021 ఆగస్టు 21, శనివారం నాడు పోలీసులు సలామ్ ను జైలుకు పంపారు. నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న నకిలీ పత్రాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. కొన్నేళ్లుగా అతనితో పరిచయం ఉన్న వ్యక్తులందరినీ కూడా వారు విచారిస్తున్నారు.

నిందితుడు గత 15 సంవత్సరాలలో కనీసం నలుగురు అమ్మాయిలను నమ్మించి మోసం చేశాడు. బులంద్‌షహర్ నివాసి అయిన అబ్దుల్ సలామ్ జీవనోపాధి కోసం మీరట్ వెళ్లాడు. అతను అక్కడ ఎలక్ట్రీషియన్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అబ్దుల్ తన డ్రైవింగ్ లైసెన్స్‌ను విక్కీ సింగ్ పేరుతో తయారు చేయించాడు. అతని ఆధార్ కార్డు అనిల్ సైనీ పేరు మీద తయారు చేయబడింది. సదర్‌లో నివసించే పింకీ అనే మహిళను ఆకర్షించడానికి అతను మొదట తన గుర్తింపును మార్చుకున్నాడు, ఆమెతో నిందితుడికి 15 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత మీరట్ తాండెల్ మొహల్లాకు చెందిన బాలికను ట్రాప్ చేయడానికి అబ్దుల్ కాస్తా అనిల్ సైనీగా నటించాడు. అతను ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో లైంగిక సంబంధాలు కూడా పెట్టుకున్నాడు. అదేవిధంగా, అతను ఇతర అమ్మాయిలను వివాహం మరియు లైంగిక సంబంధాల ద్వారా ఆకర్షించాడు. ఆ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చడానికి కూడా ప్రయత్నించాడు.

అబ్దుల్ సలామ్ మొదటి భార్య పింకీ.. రెండవ బాధితురాలిని కలిసినప్పుడు సలామ్ కు సంబంధించిన నిజం తెలిసింది. నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నిందితుడు సలామ్ తరచూ వివిధ హిందూ పేర్లను ఉపయోగించి మహిళలను ఆకర్షిస్తున్నాడని పింకీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. సలామ్ వారిని లైంగికంగా వేధించాడని.. వారిని ఇస్లాం మతం స్వీకరించమని బలవంతం చేశాడని సమాచారం ఇచ్చారు. సాదమ్ రూహి మరియు మోనికా అనే మరో ఇద్దరు అమ్మాయిలు కూడా సలామ్ వలలో చిక్కుకున్నారని.. వారిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించాడని పింకీ పోలీసులకు తెలిపింది.

Source : Nationalist Hub

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top