ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ యొక్క భూమిక - Role of RSS Pracharak's

0
ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ యొక్క భూమిక - Role of RSS Pracharak's

: ప్రచారక్ యొక్క భూమిక :
   ఒక సాహిత్యవేత్త ఉన్నారు. ఆయన కథలు, నవలలు మాత్రమేగాక నాటక రచయితకూడా. ఆయనకు ప్రజలు ఫుల్ (e) అని పేరు పెట్టారు అతడు స్వయంగా ఏకాంకీ నాటకాలు రచించేవాడు. తానే వేషం ధరించి వేదికపై అభినయించేవాడు. ఆ ప్రదర్శనల ద్వారా లభించే ధనం మొత్తం ఆయనకు లభించేది. సంఘప్రచారక్ ఇటువంటి ఫుల్ కాజాలడు. సంఘకార్యక్రమాలలో అతడు ఆజ్ఞలిస్తాడు, అతడే ఘోష్ వాదన చేస్తాడు, శారీరక ప్రదర్శనలు చేస్తాడు, అతడే బౌద్ధిక్ (ఉపన్యాసం) ఇస్తాడు, అతడు వహించవలసిన పాత్ర ఇటువంటిది కాదు. ఎవడైనా ఒక స్వయం సేవక్ కి జ్వరం వచ్చి కదలలేని స్థితిలో ఉంటే, రాత్రంతా అతని వద్దనే కూర్చుంటాడు. ఏదైనా ఒక కుటుంబంలో పెళ్లో, మరో పెద్ద కార్యక్రమమో జరుగుతున్నపుడు 24 గంటలూ అతడు పనిచేస్తాడు.

    ప్రచారక్ తక్కువగా మేతమేసి ఎక్కువ పాలిచ్చే చాలా చిన్న కొమ్ములే ఉన్న ఆవువంటివాడు కాదు. ప్రచారక్ ఎలా ఉండాలి, అతనిలో ఎలాంటి గుణగణాలు ఉండాలి - ఇది వివరించి చెప్పటం చాలా కష్టం. ఒక సమస్యకూడా. కాని చేయవలసిన పని ఏమిటంటే- తమతమ వ్యక్తిగత జీవితాలలో తలమునుకలుగా ఉన్న సామాన్య ప్రజలలో ప్రేరణ కలిగింపజేస్తూ, వీలయినంత తక్కువ సమయంలో స్థానీయ కార్యకర్తలను తయారుచేసుకొనేవాడు. ప్రచారక్ ఒకచోటకు వెళ్లినపుడు, ప్రారంభంలో అన్ని పనులూ అతడే చేసుకోవలసి ఉంటుంది. కాని ఇరవై, ఇరవైఐదు మంది స్వయం సేవకులను కూడగట్టిన తర్వాత వారిలోనుండి ముగ్గురినో, నల్గురినో ఎంచుకొని, వారికి కొంత శిక్షణ ఇచ్చి, వారికి చిన్న చిన్న బాధ్యతలనూ ఇచ్చి వారు స్వయంగా పనిచేయటం మొదలు పెట్టేటట్లుగా చూడాలి. నెమ్మది నెమ్మదిగా పనిని ముందుకు నడిపించుతూ స్వయంసేవకులలో యోగ్యత, సామర్థ్యములను నిర్మించుకొంటూ సంఘచాలక్, కార్యవాహ, ముఖ్య శిక్షక్, ఉపశాఖలలో శిక్షకులు మొదలైన వారిని వీలయినంత త్వరగా తయారుచేసుకొని, వారిద్వారానే సంఘకార్యాన్ని ముందుకు నడిపింపజేయాలి.

   సామాన్య స్వయం సేవకులతో పనిచేయించటం ప్రచారక్ యొక్క పని. అధికారులుగా ప్రకటింపబడినవారు లేనిచోట, దొరికిన స్వయంసేవకులలోనుండే ఎవరో ఒకరిని మాట్లాడేందుకు (బౌద్ధిక్ ఇచ్చేందుకు) మరొకరిని ధన్యవాదాలు ప్రకటించేందుకు, మరొకరిని ముఖ్య శిక్షక్ గా వ్యవహరిస్తూ కార్యక్రమం నడిపించేందుకు నియోగించాలి. దీనికోసం వారిని ప్రత్యేకంగా సంసిద్ధులను చేయాలి. మిగిలినవారందరూ క్రొత్తవారుగదా, వారికి పనులు అప్పగిస్తే, కంగారుపడి అస్తవ్యస్తం చేస్తారని ఊహించుకొంటూ అన్ని పనులూ ప్రచారకే చేయాలనుకోవటం ఉపయోగకరం కాదని వారికి తెలియజెప్పాలి. ఆలోచించి గ్రహింపజేయాలి. ఎంత త్వరగా స్థానీయ వ్యక్తులద్వారా పనిచేయించటం వీలవుతుందో అంతత్వరగా వారితోనే చేయించాలని కోరుకోవటమే ఉపయోగకరమైన పద్ధతి. వీలయినంత త్వరగా అక్కడి దృశ్యం (పిక్చర్) నుండి ప్రచారక్ ప్రక్కకు తప్పుకోవాలి. ప్రచారక్ అక్కడినుండి వెళ్ళిపోయిన తర్వాతకూడా, అక్కడ పని చక్కగా జరుగుతూనే ఉందనే స్థితిని నిర్మించుకోవాలి.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top