ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ కు ముస్లింల వలసలపై VHP అభ్యంతరం - VHP objects to the migration of Muslims from Afghanistan to India

0
ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ కు ముస్లింల వలసలపై VHP అభ్యంతరం

VHP objects to the migration of Muslims from Afghanistan to India

విశ్వహిందూ పరిషత్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మంగళవారం (ఆగస్టు 24) ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి ముస్లింలు వలస రావడాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో యుద్ధంలో చిక్కుకున్న దేశం నుండి వలస వచ్చిన హిందువులు మరియు సిక్కులకు సహాయం చేయడానికి VHP కార్యకర్తలు ఇష్టపడతారని అన్నారు. ANI తో మాట్లాడుతూ, “హిందువులు మరియు సిక్కుల వలసలు చాలా సహజమే. ఎందుకంటే వారు అక్కడ మైనారిటీలు. దేశం తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్ళిపోయినా తరువాత మైనారిటీలు ఆఫ్ఘనిస్తాన్‌లో నివసించడం అసాధ్యం. కనుక వారు వలస రావడం సహజం. మా కార్యకర్తలు వారిని కలుసుకుని, సాధ్యమైనంత సహాయం చేస్తారు. కానీ ముస్లింలు భారతదేశానికి వలస రావడాన్ని మాత్రం మేం వ్యతిరేకిస్తున్నాం.

“బంగ్లాదేశ్ నుండి రోహింగ్యాలు కూడా ఇలాగే ఇక్కడకు వచ్చి ఆశ్రయం పొందారు. ఇప్పుడు వారు తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి ముస్లింలు రాకూడదు, వారికి హక్కు లేదు. వారిని స్వీకరించడానికి ఏ ఇస్లామిక్ దేశమూ సిద్ధంగా లేదు. ఇప్పుడు, వారి బాధ్యతలు తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు?” అని ఆయన ప్రశ్నించారు.

“ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లింలందరూ హిందువులను మరియు సిక్కులను హింసించలేదని నేను నమ్ముతున్నాను. ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులు మరియు సిక్కులపై దౌర్జన్యాలు జరిగినప్పుడు, ముస్లింలు మౌన ప్రేక్షకులుగా వుండి చప్పట్లు కొట్టారు. అందువల్ల, ఆఫ్ఘనిస్తాన్‌లో మైనారిటీ వర్గాలపై హింసకు వారు కూడా సమానంగా బాధ్యత వహిస్తారు. భారతదేశంలోని తాలిబాన్ మద్దతుదారులు భారతదేశంలోని ముస్లింలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్నారని అంటున్నారు. అందువల్ల వారు అక్కడే ఉండటం మంచిది.” అని శ్రీ జైన్ పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చిన హిందువులు మరియు సిక్కులకు భారత పౌరసత్వాన్నివ్వవలసిందిగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే సిక్కులకు పౌరసత్వం ఇవ్వడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మరియు అకాలీ నాయకులు సమర్ధిస్తారా? అని ఆయన నేరుగా ప్రశ్నించారు.

Source : Organiser
Tags

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top