కౌటిల్యుడి ' ఆర్తశాస్త్రం మరియు భగవద్గీత 'ను భారత ఆర్మీ విద్యలో చేర్చాలని సూచించిన " కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ (సిడిఎమ్) " - Defence study recommends including Arthashastra, Gita in Army curriculum

Vishwa Bhaarath
0
కౌటిల్యుడి ' ఆర్తశాస్త్రం, భగవద్గీత 'ను భారత ఆర్మీ విద్యలో చేర్చాలని సూచించిన  " కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ (సిడిఎమ్) " - Defence study recommends including Arthashastra, Gita in Army curriculum
కౌటిల్యుని అర్థశాస్త్రం, భగవద్గీత వంటి ప్రాచీన భారతీయ గ్రంథాల నుండి 'సంబంధిత బోధనలను' ప్రస్తుత సైనిక శిక్షణా పాఠ్యప్రణాళికలో చేర్చే మార్గాలను అన్వేషించాలని " కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ (సిడిఎమ్") నిర్వహించిన ఇటీవలి అంతర్గత అధ్యయనం సిఫారసు చేసింది.  ఈ సంభావ్యతపై పరిశోధన చేయడానికి 'ఇండియన్ కల్చర్ స్టడీ ఫోరమ్' మరియు ప్రత్యేక అధ్యాపకులను ఏర్పాటు చేయాలని అధ్యయనం సూచించింది.

సికింద్రాబాదు లో ఉన్న ' సిడిఎమ్ ' ఒక ప్రధాన ట్రై సర్వీసెస్ మిలటరీ ట్రైనింగ్ సంస్థ,  ఇక్కడ ఆర్మీ, నేవీ మరియు భారత వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు ఉన్నత రక్షణ నిర్వహణ కోసం శిక్షణ పొందుతారు .

"పురాతన భారతీయ సంస్కృతి మరియు యుద్ధ పద్ధతుల లక్షణాలు" పేరుతో ఒక ప్రాజెక్ట్'ను చేపట్టాలని తద్వారా భారత సాయుధ దళాలలో వ్యూహాత్మక ఆలోచన మరియు నాయకత్వం లక్షణాలను పెంచే ఉద్దేశ్యంతో పురాతన భారతీయ లేఖనాలను ఎంచుకోవాలని పరిశోధన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక తెలిపింది. 

భారత ఆర్మీ పాఠ్యప్రణాళికలో అర్థశాస్త్ర మరియు గీతలను చేర్చాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది:

భగవత్ గీత, కౌటిల్య అర్థశాస్త్రాలను భారత సైన్యం శిక్షణలో చేర్చడం దేశ సాయుధ దళాలను రాజకీయం చేయడంతో సమానమని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Source Inputs: News 18 - Opindia
Tags

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top