డా॥ హెడగేవార్ జీవిత సంగ్రహం ( రెండవ భాగము) - Dr. Hedgewar Biography

Vishwa Bhaarath
0
డా॥ హెడగేవార్ జీవిత సంగ్రహం ( రెండవ భాగము) - Dr. Hedgewar Biography

మొదటిభాగం తరువాత కొనసాగింపు..

అనుభవ పరంపర

మాతృదేవి దాస్యవిముక్తికి అలమటించే దాక్టర్‌జీ హృదయం పర ప్రభుత్వాన్ని చూసి సంక్షోభించిపోయేది. 1920లో జరిగిన నాగపూర్‌ కాంగ్రెస్‌ సమావేశానంతరం ఆయన ఉపన్యాసాలన్నీ మహోద్రేకంగానూ, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సంపాదించే లక్ష్యం గలవిగాను ఉండేవి. 1921లో ప్రభుత్వం ఆయనమీద " కేసు ” నడిపినప్పుడు విచారణ నాడు నిండుకోర్టులో తమ కార్యక్రమాన్ని సమర్థించుకుంటూ ఆయన ఇచ్చిన ఉపన్యాసం '"కుక్కక్రాటుకు చెప్పుదెబ్బ' అనే సామెతకు ఉదాహరణగా ప్రసిద్ధి చెందింది. 
   ఆయన హృదయంలో కణకణలాదే అగ్నికణాలు ఆ ఉపన్యాసాలలో అక్కడక్కడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 1920వరకు అతివాద రాజకీయాలలోనూ, 1921లో సహాయ నిరాకరణోద్యమంలోనూ మహోద్రేకంతో ఆయన పాల్గొన్నారు. అనేక సంస్థలలోనికి జొరబడి తరచితరచి చూచారు. సమాజంకొరకు జరిగే అనేక కార్యక్రమాలలో ప్రవేశించి అచట కన్పించే వివిధ మనఃప్రవృత్తులను ఎంతో సూక్ష్మంగా పరిశీలించారు. వాటన్నింటినీ తమ అనుభవాల గీటురాయిపై పరీక్షించారు. కాని ఆయన విశాల హృదయానికీ, విశాల భావాలకూ నిరాశమాత్రమే గోచరించింది. ఇంతకూ ఆయన చూచినదేమిటి ? ఎటుచూచినా ఆత్మవంచనే: ఎటుచూచినా ఎందరో ఉదాత్త హృదయులు ఏమీ చేయలేక తపించడమే;: ఇంతేకాదు; కింకర్తవ్యతామూధత, పదవీలాలస, నాయకులుగా నటించేవారి స్వార్ధవ్యవహారం, (గ్రుడ్డిభక్తితో అనుసరించే అనుచరులను మోసగించడం, విభిన్న పార్టీలు సిగ్గువిడిచి తిట్టుకోడం- ఈ బురదలో పడి విలవిల తన్నుకునే సమాజ జీవితం: ఇదీ డాక్టర్‌జీ చూడగలిగింది. ఇదంతా చూచి ఆయన హృదయం విసిగిపోయింది.

నైరాశ్య పరిస్థితి

దేశంలోని వాతావరణమంతా చెడిపోయి స్వరాజ్యమూ, జాతీయత, హిందూ, శత్రువు, మిత్రుడు మొదలైన శబ్దాలకు అర్భాలుకూడా తారుమారై, తలక్రిందయ్యాయి. అందుకని ఈ శబ్దాల సరియైన అర్జాన్ని ప్రజలముందు వుంచడానికీ, నిజమైన స్వాతంత్ర్యమంటే ఏమిటో ప్రచారం చేయడానికీ డాక్టర్‌జీ నాగపూరులో “స్వాతంత్ర్య” అనే దినపత్రికను ప్రారంభించారు. ఈ పత్రికా సంపాదకులలో ముఖ్యంగా కీ.శే, అచ్యుతరావు కొల్పట్‌కర్‌, శ్రీ విశ్వనాథరావుకేల్మర్‌ మొదలయిన వారు ఉండేవారు. ఈ పత్రికద్వారా ప్రచారం సాగించారు. కాని డాక్టర్‌జీసంపాదకులుగా ఉన్నప్పుడే ప్రభుత్వం ఈ పత్రికపై కినుకచూపినందున ప్రచురణ ఆగిపోయింది. ఎటుచూచినా నిరాశ తాండవిస్తున్న రోజులవి. మితవాద, అతివాద, రాజకీయవర్గాలు కుంభకర్ణ నిద్రలోనో, ఊకదంపుడు తీర్మానాలతోనో, ఎన్నికల సుడిగుండాలలో పల్టీలు కొడుతూనో కాలం వ్యర్థంచేస్తూ వుండేవి. సాహితీపరులంతా సాహితీలోకంలోనో, లలితకళా ప్రపంచంలోనో విహరిస్తూ ఉండేవారు. మిగతా యువకులు కన్నుచైదిరే విలాస జీవితంలో వసంతాలాడుతా “ఫేషన్‌”లను కొలుస్తూ వుండేవారు. గోరక్షణ సంస్థలనీ, అనాథాశ్రమాలనీ, మహిళా శ్రమాలనీ, అనేక సంస్థలు వెలుస్తూ వుండేవి. గోదాలు, వ్యాయామశాలలు, సభలు, సంస్థలు అనేకంగా పుట్టుతూ వుండేవి. నాల్గువైపులా ఆపదలతో దాస్యబంధనాలలో చిక్కుకొని తపిస్తూన్న భారతాంబను రక్షించుటకు పూనుకొన్న ఈ సంస్థలు అపూర్ణము అస్థిరమునైన తమ కార్యక్రమాలతో దేశాన్ని రాహువై పట్టుకున్న ఈ దౌర్భాగ్యాన్ని ఎలా తుదిముట్టించగలవో డాక్టర్‌జీ గ్రహించలేకపోయారు. బాహ్యోపచారాలతో, పైపై పూతలతో, దేశాన్ని తొలచి తింటూవున్న ఈ క్రిములు నశిస్తాయంటే డాక్టర్‌జీ నమ్మగలరా !
     ఈ నైరాశ్య పరిస్థితిలోని చేదును చవిచూచిన తరువాత వారు ఒక నూతనమార్గాన్ని అన్వేషించ నారంభించారు. అంతవరకు తమ మిత్రులతో తమకు కలిగిన అనుభవాల పరిణామంవల్ల ఆయనకు ఒక అభినవతత్త్వం స్ఫురించింది. ఈతత్తమే ఆయన భవిష్యదాశయాలకు కేంద్రమైంది. దేశాఖిమానులు, విశ్వాసపాత్రులు అయిన మిత్రుల (ప్రేమపూర్ణ హృదయాలను వేరుచేయలేనంతగా సంఘటితపరచడమే ఈతత్తం. హృదయాలు కలసి, 'మనమంతా ఒకటి” అనేభావాన్ని అనుభవించి, దేశంలోని ప్రతివ్యక్తినీ తనవాడుగా విశ్వసించి, పరస్పరం ప్రేమించుకోడమే ఒక అద్భుతశక్తి. ఈ శక్తి వ్యాపించి మహత్స్వరూపంగా కనబడినప్పుడు నీరసించిన దేశంలో నవశక్తి ప్రవహించితీరుతుందని దాక్టర్‌జీ స్వానుభవంద్వారా తెలుసుకున్నారు. “త్యాగము” “ప్రేమి అనేవి అనంతంగా వృద్ధి చెందుతాయి. ఇవి ఎంత వృద్ధిపొందితే అంత కార్యాభివృద్ధి కూడా జరుగకతప్పదు.
   వ్యక్తులదృష్టి మార్చి, వారి హృదయంలో త్యాగభావాన్ని నాటడం తరువాయి. ఆతరువాత 'నీవు ఫలానా పనిచేయి” అనికూడా చెప్పనక్కరలేదు. ఇలా పవిత్రంగా, పట్టుదలతో పనిచేసే ఒక హృదయం మరో హృదయంలో ఈ జ్యోతిని వెలిగించడం ఆరంభిస్తే వేలసంఖ్యలో, లక్షలసంఖ్యలోనూ పట్టుదలకలిగిన దేశభక్తులను ఒకబలమైన కోటగా నిర్మించి విదేశీయుల కుతంత్రాలను ఎందుకూ కొరగానివిగా చేయవచ్చు. డాక్టర్‌జీలో ఈ నమ్మిక రోజురోజుకూ వృద్ధిచెందింది. అప్పట్లో ఉన్న రాజకీయసంస్థలలో పడి, విభిన్నభావాల వేరుపురుగులతో పత్రికా రాజకీయాల ఊబిలోపడి మురిగిపోతూన్న సమాజంలో స్వార్ధరహితులైన పవిత్ర వ్యక్తులు ఎందరు దొరికినా సరే వారినే ఒకచోటచేర్చి అభేద్యమైన సమైక్యతను నిర్మించే ప్రయత్నాన్ని డాక్టర్‌జీ ఆరంభించారు. ఈ కార్యమే దేశానికి విజయంచేకూర్చగలదనే విశ్వాసం కుదిరిన తరువాత ఇక జీవితంలో అనుక్షణం ఈ మహత్మార్యంకొరకే ఉపయోగింప బడాలనే పట్టుదలకూడా అధికతరమైంది. ఆ తరువాతనుంచి ఇదే ఆయనకు తారక మంత్రం.

హిందూరావానికి తారకమంటత్రం

హిందూత్వమే “యదార్ధ భారత జాతీయత” అనే సిద్ధాంతం చాలాకాలంగా ఆయన ఆలోచనల్లో వ్రేళ్ళుపాతుకుని ఉండేది. హిందూదేశం నాడు బానిసదేశమనీ, ఎంతపతనం సంభవమో అంతా జరిగిందనీ ఆయనకు పూర్తిగా తెలుసు. ఐనా హిందూ జాతీయ సూత్రమే ఈ దేశాన్ని సముద్ధరించగలదనే నమ్మకమూ, ఆ నమ్మకంపట్ల విశ్వాసమూ నిరంతరం పెరిగిపోతూవుండేవి. “ప్రగతివాదుల” మనుకుంటూ తెలివిగల బానిసి లనిపించుకుని గర్వించే మూర్ధవర్గాన్నిచూచి దాక్టర్‌జీ దుఃఖావ మానాలతో క్రుంగి పోయేవారు. నేనీ పవిత్ర హిందూజాతిలోని ఒక “అవయవాన్ని! అనే అభిమానం ప్రతి హిందూహృదయంలోనూ మేలుకోవాలని ఆయనకోరిక. సమాజమంతా కుంభకర్ణనిద్రను పుణికిపుచ్చుకున్నందున ఈ కార్యం కఠినమైనదని ఆయన (గగ్రహించలేకపోలేదు. "కట్టె విరుగని పాము చావని” ఉద్యమాలతో ఈ 'రాష్టపురుషుడు” మేలుకోడని ఆయన గ్రహించారు. అందుకే ఆయన రెండువైపులా పదునుగల కత్తిని చేబట్టారు. ఒకటి సమాజంలో నిద్రిస్తున్న వారిని లేపడం, రెందోది-అలా మేల్మొని కొంత జాగృతి పొందిన వారిని ఏకసూత్రంలో సమైక్యపరచదం. ఇంత మహత్మార్యాన్ని నడిపే బాధ్యతను డాక్టర్‌జీ స్వయంగా ఉత్సాహంతో స్వీకరించారు. ఇంతేకాదు, ఈ పనికొరకు తన జీవితాన్నంతా వినియోగించాలని నిశ్చయించుకున్నారు. హిందూరాష్రాన్ని సముద్ధరించాలని ఆయన కంటున్న కలలు కలలుగా కాక ప్రత్యక్షంగా కనపడాలి; గత వైభవశ్రీ పాదాల మైల వ్రాలగా ఆనందంతో చిరునవ్వులు వెదజల్లే మాతృదేవి సుందర స్వరూపాన్ని సందర్శించాలి; దేశం దాస్యబంధనాలను తెగత్రెంచుకొని స్వాతంత్ర మహోత్సవం నెరపుకొనే దివ్యపర్వం ఈ ఒంటితో ఈ కంటితో చూడాలి. ఇదే దాక్టర్‌జీకిగల ఏకైక వాంఛ ఆయన జీవిత లక్ష్యమూ, చరిత్రలో ఆయన నేర్చుకున్న పాఠమూ ఇదే. ఈ శుభప్రదమైన ధ్యేయాన్ని స్మరిస్తూ, తన సర్వస్వం ఆ ధ్యేయపూర్తికై వినియోగించాలని కృతనిశ్చయులైనారు. ఈ నిశ్చయమే 'రాష్ట్రీయ స్వయంసేవక సంఘ' స్వరూపంలో అవతరించిందని వేరే వ్రాయనవసరం లేదు.

రాష్ట్రీయ సంఘటనోద్యమం

తనకు స్ఫూర్తినీ ఉత్సాహాన్నీ ప్రసాదించిన సిద్ధాంతాని కొకరూపాన్ని ఏర్పరచి ఆచరణలోకి తెచ్చే బాధ్యతకూడా తనపైననే ఉన్నదని ఆయన నిశ్చయించుకున్న మీదట శా.శ. 1847 (క్రీ.ఈ. 1925) విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి అంకురార్పణ చేశారు. “ధ్యేయనిష్టతో కర్తవ్యాన్ని నెరవేర్చే యువకుల సమైక్యత ఉన్నప్పుడే, దేశంలో చైతన్యం, బలం ఉండడం నంభవం” అనే సార్వకాలిక సత్యాన్ని ఆయన మనకీ విధంగా తిరిగి కనబరిచారు. 
    నివురుగప్పిన నిప్పులా నిద్రాణమైన హిందూరాష్ట్రశక్తిని తిరిగి కనబరచి, జాగృత మొనరించే మహత్తర కార్యాన్ని ఆయన విజయవంతంగా జేసి చూపారు. పరమేశ్వరుడదాయనకు అపారమైన ధ్యేయనిష్టనూ, నిర్మలమైన హృదయాన్ని, అనంతమైన ఆత్మవిశ్వాసమూ, అసామాన్యమైన సంఘటన శక్తినీ ప్రసాదించాడు. ఇవి తప్పితే ఆయనకు మరేసాధన సహాయాలు లేవు. ఏ నాయకుడూ ఆయన ప్రారంభించిన పనిని మెచ్చుకొని సాయపడలేదు. ఏ కుబేరుడూ అండగా నిలబడలేదు. ఆరోజుల్లో 'హిందూదేశం హిందువులది” అని ఉచ్చరించడం మాట అటుంచి 'నేను హిందువును' అని నిర్భీకంగా చెప్పుకోడమే పంచమహా పాతకాలకూ మూల స్వరూపమని భావింపబడేది. తనవద్ద మరియెట్టి ఉపకరణాలూ లేవు. ఏది లేకపోయినా ఆ మహాపురుషునిదగ్గర “సత్వ మనే మహత్తరమైన గుణం ఒకటి వున్నది. దీనిసాయంవల్లనే ఆయన ఈ మార్గాన్ని విజయవంతంగా సాహసంతో దాటగిలిగారు. “క్రియాసిద్ధిః సత్వేభవతి మహతాం నోపకరణే” అనే సంస్కృత లోకోక్తికి డాక్టర్‌జీ ప్రత్యక్ష ఉదాహరణంగా ప్రకాశించారు.

మోహితేవారి శిథిలాలలో

పైన చెప్పినట్లు ప్రతికూల పరిస్థితుల మధ్యనే డాక్టర్‌జీ ధైర్యంతో సంఘకార్యాన్ని ఆరంభించారు. 'సర్వారంభాస్తండులాః ప్రస్థమూలాః, అని లోకోక్తి. కాని డాక్టర్‌జీ రః సిద్ధాంతానికి స్వస్తిపలికి తండుల (ధనం) రహితంగానే కార్యారంభం జేశారు. 
    మానవులలో బెదార్యమే ఉంటే ధనానికి కొరత ఏర్పడుతుందనే అనుమానం ఆయనకు మొదటినుంచీ లేదు. అందుకని ధనసేకరణకై 'పెనుగులాడక నిజాయితీ గల ఉదార హృదయాలను ఒకచో చేర్చడానికే యావజ్జీవితం కృషిచేశారు. ఇలా భగవద్ధ్వజం నీడలో వేలకొలది వ్యక్తులను సమైక్యమొనర్చి లోకోత్తరఖ్యాతిని సముపార్దించుకున్నారు. మొదట్లో పని నెమ్మగిగా సాగింది; కాని వృద్ధిపరచడంకన్నా ఉత్తమ హృదయములను నిర్మించడానికే ఎక్కువ శ్రద్ధ చూపా రానాడు డాక్టర్‌జీ. తమకు లభించినవారు క్రమేపి నిష్టావంతులౌతూ సంఘంలో లీనమౌతూ ఉండాలని ఆయన స్పష్టీకరిస్తూండేవారు. ఆయన సంకల్పించింది పనికిరాని వాక్ళూరులనూ, శబ్ద్బశూరులనూ నిర్మించడానికి కాదు. ఆయనకు అవసర మైంది వజతుల్యమైన హృదయమూ, ఉక్కుకండలూ, సంఘటన సామర్థ్యమూ కలిగిన కర్మవీరులు. మోహితేవారి తోటలో ఆ ప్రోగుపడిన శిథిలాల్లో ఆడుకుంటూ వికసించి, ననలు సాగే సంఘ స్వయంసేవకుల ధ్యేయనిష్టా, పరస్పర ప్రేమా, సాహసమూ, ఉప్పాంగే ఉత్సాహమూ, చూస్తే-స్వయంగా తాము తారుణ్యం నుంచి ప్రాధస్థాయికి చేరుకుంటున్నా-భారతవర్నానికి భవిష్యత్తులో ఎంత వైభవంరాబోతున్నదో స్పష్టంగా దాక్టర్‌జీకి కన్పిస్తుందేది.

చక్కని పాఠం

ప్రతినిత్యమూ ప్రతిఒక్కరూ సంఘస్టానానికి వచ్చితీరాలని ఆయన పట్టుదల. అప్పటి 99మందిలో 99మందీ తప్పకుండా వస్తూనే ఉండేవారు. ఆదివారం “పెరేడు' విషయంలో మరీ కచ్చితంగా ఉందేవారు. ఎవరైనా స్వయంసేవకుడు ఏదైనా పనిమీద పొరుగూరికి వెళ్ళినా ఆనాటికి తప్పకుండా వచ్చితీరాలని ఆయన కోరిక. ఈ విషయంలో ఒకసంగతి ఎప్పుడూ జ్ఞప్తికి వస్తూవుంటుంది. అందుకని దాన్ని ఉదాహరించడం మంచిది. ఒక శనివారంనాడు డాక్టర్‌జీ ఏదో పనిమీద “అడేగాంవ్‌ అనే గ్రామానికి కొంతమంది స్వయంసేవకులతో వెళ్లారు. ఆవూరు నాగపూరుకు 32 మైళ్ళ దూరంలో 'నాగపూర్‌-అమరావతి రోడ్డుకు తొమ్మిది పదిమైళ్ళ దూరాన ఉన్నది. అక్కడే ప్రొద్దుగూకింది. ఆ సందే చీకటిలోనే స్వయంసేవకులతో కలసి 'బజార్‌గామ్‌” దాకా నడిచివచ్చారు. మరునాటి 'పెరేడొకు హాజరుకావాలని వారి దృధనిశ్చయం. కాని అప్పటికే చాలా చీకటిపడ్డందువల్ల బంధ్లుగాని, బస్సులుగానీ దొరకలేదు. దాక్టర్‌జీ నడక ఆరంభించారు. కటికచీకటి, దారి అంతా బురద, కాళ్ళు బురదలో పాతుకు పోవడం; ఇవిచాలవన్నట్లు కాలిలో ఒక ముల్లుగుచ్చుకుంది. అడుగులో అడుగు వేసు కుంటూ నెమ్మదిగా నడిచినా ఇలాంటి ప్రయాణం ప్రయాసే. అయినా కలోరకష్టాల్నికూడా కాలదన్ని ముందడుగు వేయడం డాక్టర్‌జీకి అలవాటైపోయింది. సంఘమార్గంలో ఇలా ఎన్నో బాధలు ఉంటాయని, అడుగడుగునా ముళ్ళకంచెలు అడ్డగిస్తాయనీ ఆయనికి తెలియనిది కాదు. అందుకే వడివడిగా నదవడం ఆరంభించారు. వెంటవున్నవాళ్ళు ఆపాలని ప్రయత్నం చేశారు. కానీ ఏమీ లాభించలేదు. ఆయనిది ఒకటే నిశ్చయం- “వేకువనే అయిదున్నరకు సంఘస్థానంలో ఉండితీరాలి.” అర్ధరాత్రి ౩2మైళ్ళ కటిక ప్రయాణంచేసి గమ్యం జేరుకోడానికి పూనుకొన్న దాక్టర్‌జీ నిశ్చయానికి వెంటనున్న స్వయంసేవకుల హృదయాలు జోహార్లర్చించాయి. రాత్రి పదిన్నర గంటలకు ప్రయాణం మొదలైంది. కాని ఈ బాధ వీరినెక్కువసేపు పరీక్షించలేదు. పరమేశ్వరుడే స్వయంగా ఆయన ధైర్యాన్ని పరీక్షించాలనుకున్నాడేమో ! పరీక్షలో దాక్టర్‌జీ ఉత్తీర్ణులైనారు; కొన్ని మైళ్లు ఇలా నడిచిన తరువాత, నాగపూర్‌ పోతున్న ఒక “బస్సు” తటస్థపడ్డది. అందులోనూ జనం కిక్కిరిసి ఉన్నారు. ఐనా డ్రైవరు దాక్టర్‌జీని గుర్తించి బస్సు నాపి, అందరినీ ఎక్కించుకున్నాడు. లోపల స్ధలం లేనందువల్ల ఏదోవిధంగా బస్సు ఫుట్‌బోర్జుపై నిల్చుని రాత్రి రెండున్నర గంటలకు నాగపూర్‌ చేరుకున్నారు. నిశ్చయానుసారం దాక్టర్‌జీ ఆ మరునాడు సంఘనస్ఫానానికి హాజరు కాగలిగారు.


Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top