ప్రచారకులకు స్వయం సేవకులకు లోగిలివరకూ సంబంధం నెలకొల్పుకోవాలి - Pracharaks should be associated with Swayam Sevaks

0
ప్రచారకులకు స్వయం సేవకులకు లోగిలివరకూ సంబంధం నెలకొల్పుకోవాలి - Pracharaks should be associated with Swayam Sevaks

లోగిలివరకూ సంబంధం నెలకొల్పుకోవాలి

ప్రచారకులకు స్వయం సేవకులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి? వారి ఇండ్లలోకి ఎలా వెళ్తున్నాం? ఎలా కూర్చుంటున్నాం? - ఈ ప్రశ్నలుకూడా ఎంతో మహత్వం కల్గినవి. సంఘంలో ఒకరికొకరు పరస్పరం సన్నిహితులం కావటానికి ప్రయత్నిస్తుంటాం. లోగిలి (మండువా) వరకు సంబంధం ఏర్పరుచుకొనే ప్రయత్నం చేయాలి. అటువంటి సంబంధం ఏర్పరచుకొనే సమయంలో కూడా పూర్తి సావధానతతోనూ మెలకువగానూ ఉండాలి. మనం వ్యవహరించే తీరు విశుద్ధమైనదిగాను, చుట్టుప్రక్కలవారుకూడా సరిగా అర్థం చేసుకోగలదిగాను ఉండాలి. వారి మనస్సులలో ఎటువంటి భ్రమలుగాని నిర్మాణమయ్యేందుకు అవకాశమిచ్చేదిగా ఉండరాదు. 

    ఈ విషయాన్ని ఇంతగా ఆలోచించట మెందుకంటే, సమాజంలో ప్రజలకు రకరకాలుగా ఎటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయో, ఆ దృష్టితోనే మనందరివంక చూస్తుంటారు. ప్రచారకులు పురుషులుతో మాట్లాడినట్లుగానే, స్త్రీలతోనూ మాట్లాడే సందర్భాలు సంభవిస్తూ ఉంటాయి. చిన్న పిల్లలతోనూ, పెద్దవయసు వారితోనూ మాట్లాడే సందర్భాలూ ఉంటాయి. ఇటువంటి అన్ని సందర్భాలలోనూ ఎంతో మెలకువ అవసరం. మాట్లాడే మాటల్లోగాని, నిలబడే తీరులోగాని, ఇతరత్రా వ్యవహారంలోగాని, చిన్న చిన్న తప్పులు జరిగినా, వాటి కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రచారకులపట్ల ప్రజలలో ఇప్పటివరకు నెలకొని ఉన్న గౌరవభావమే, మనకార్యసాఫల్యానికి, యశస్సుకి ఆధారమవుతుంది. ఈ భావానికి ఏకొంచెం దెబ్బతగిలినా, ప్రచారకులపట్ల ఉన్న సద్భావమంతా గంగలో కలసిపోతుంది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top