ఆవు ఒక్కటే... ఆక్సిజన్‌ పీల్చి వదిలేది: చర్చనీయాంశమైన అలహాబాద్‌ హైకోర్టు జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలు - Scientists Believe Cow Only Animal That Inhales, Exhales Oxygen: Allahabad HC,

0
ఆవు ఒక్కటే... ఆక్సిజన్‌ పీల్చి వదిలేది: చర్చనీయాంశమైన అలహాబాద్‌ హైకోర్టు జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలు - Scientists Believe Cow Only Animal That Inhales, Exhales Oxygen: Allahabad HC,

ఆవు ఒక్కటే... ఆక్సిజన్‌ పీల్చి వదిలేది: చర్చనీయాంశమైన అలహాబాద్‌ హైకోర్టు జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలు

అలహాబాద్‌, సెప్టెంబరు 3, 2021: ప్రపంచంలో ఆక్సిజన్‌ పీల్చి... ఆక్సిజన్‌ను మాత్రమే వదిలేసే జీవి ఈ భూమ్మీద " అవు-గోవు" ఒక్కటేనని శాస్త్రవేత్తలు విశ్వసిస్తారంటూ ఇటీవల అలహాబాద్‌ "హైకోర్టు పేర్కొనడం చర్చనీయాంశం అవుతోంది.

గోవును అపహరించి చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ వాసి జావేద్‌ అనే వ్యక్తి, బెయిల్‌ కోనం అర్జీ పెట్టుకోగా దాన్ని తిరస్కరిస్తూ జడ్డి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా 'గో'సంరక్షణ అవశ్యకతను చెబుతూ ఉచ్వాస, నిశ్వాసల పరంగా అవుకు ప్రత్యేకత ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారంటూ బెయిల్‌ నిరాకరణ ఉత్తర్వులో ఆయన ప్రస్తావీంచారు.

ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో ఇదే మాట అన్నారు. గోవులకు దగ్గరగా ఉంటే క్షయ వ్యాధి నుంచి కోలుకోవచ్చునని చెబుతూ అవు నిశ్వాసలోనూ ఆక్సిజనే ఉంటుందని రావత్‌ చెప్పారు.

జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌, గోరక్షణ పరంగా పురాణాల్లో, చరిత్రలో ఉన్న ప్రాధాన్యాన్ని 12 పేజీల ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు:
 'హిందూయిజం ప్రకారం 33 కోట్ల దేవుళ్లు, దేవతలు, అవులోనే నివసిస్తారు. శ్రీకృష్ణుడు అవు పాదాల నుంచే జ్ఞానాన్ని పొందాడు. మనిషికీ గోవు ఓ నేస్తమని గౌతమ బుద్దుడు ఉద్భోధించాడు. "నన్ను
చంపండి గానీ. గోవును చంపకండి"అని స్వాతంత్ర్య సమర యోధుడు బాలగంగాధర తిలక్‌
అన్నారు. మొఘల్‌ చశ్రవర్హులైన బాబర్‌, హుమాయున్‌, అక్చర్‌ తమ రాజ్యంలో గోవులను వదధించొద్దని చెబుతుండేవారు. ముస్లిం నేతల్లో ఎక్కువమంది గోవధపై నిషేదం విధించాలనే డిమాండ్‌కు ఎప్పుడూ మద్దతుగా ఉన్నారు' అని జడ్జి శేఖర్‌ పేర్కొన్నారు.

Tags

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top