నియంత్రణలేని జనాభా, ప్రమాదంలో సమైక్యతాభావం - Uncontrolled population, sense of unity in danger

0
నియంత్రణలేని జనాభా, ప్రమాదంలో సమైక్యతాభావం - Uncontrolled population, sense of unity in danger

జనాభా నియంత్రణలో ఎవరిపాత్ర ఎంత?

భారతదేశం అధిక జనాభాకల్గిన దేశం. వివిధ మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలున్నా అది విభక్తత కాదు, మన విశేషత. ప్రపంచ జనాభా 700 కోట్లు, భారత దేశం జనాభా 135 కోట్లు. జనాభా నియంత్రణ విషయంలో జనతా ప్రభుత్వ హయాంలోనే 1977-80 ప్రాంతంలో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్వర్గీయ రాజ్‌నారాయణ్‌ ‌కుటుంబ నియంత్రణ పేరును మార్చి కుటుంబ సంక్షేమం అన్నారు. అయినా తమకున్న ప్రత్యేక పౌరచట్టం అండతో భారతదేశంలో ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించడం లేదు. అనేక నిఖాలు చేసుకుని యిబ్బడి ముబ్బడిగా పిల్లలు కంటున్నారు. 1901-2011 మధ్య జనాభా పెరుగుదల గమనిస్తే, 1951-2011 మధ్య ముస్లింల జనాభా పెరుగుదల 16.1%, 1971- 2011ల మధ్య 16.7% వుంది. కానీ హిందువుల జనాభా 78% నుంచి 77.4%కి పడిపోయింది. సంతాన ప్రాప్తి వేగం ముస్లింలలో అధికంగా ఉండడమే జనాభా పెరుగుదలకు కారణమని గణాంకాలు చెబుతున్నాయి. 
    ముస్లింలలో 2.61గా, హిందువులలో 2.13గా ఇది నమోదైంది. దీనితో పాటు జీవితకాలం కూడా హిందువులకు 67.8 సంవత్సరాలుగా ఉంటే ముస్లింలకు 68.4 సం।।లు ఉంది. దీనివల్లనే వారి జనాభా పెరుగుతోంది. ప్రపంచ జనాభాలో 24.1% ఉన్న ముస్లింలు 2060 వరకు 31.1 శాతానికి చేరుకుంటారని అంచనా. భారత్‌లో 1951లో 10% ఉన్న ముస్లింలు నేడు 2020 వరకు 15.5%కు చేరింది. ప్రపంచ ముస్లిం జనాభాలో భారత్‌లో ఉన్నా ముస్లింలు 11% ఉంటారు. 2001-2011 మధ్య ముస్లిం జనాభా ఏడాదికి 2.2% పెరిగితే, హిందువుల జనాభా కేవలం 1.4 మాత్రమే పెరిగింది.

అసలు ఈ చర్చ ఎందుకంటే జనాభా నియత్రణ విషయంలో ఈ మధ్య దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలిచ్చిన ఆదేశాలు ముస్లిం వర్గాలలో, కుహనా మేధా వర్గాలలో చర్చకు తెరతీశాయి. ఉత్తర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ 2021-30 ‌మధ్య జనాభా పెరుగుదల రేటును 2026 వరకు 2.1 (వెయ్యిమందికి), 2030 వరకు 1.9కు తగ్గించాలన్న ప్రభుత్వ విధానాన్ని ప్రకటిం చారు. ప్రపంచ జనాభా దినోత్సవం జూన్‌ 11‌న ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం యూపిలో యిది 2.7గా వుంది. పెరిగే జనాభా వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారాయన. ఇందుకోసం ఇద్దరు పిల్లల పాలసీ ప్రకటించారు. దీన్ని ఉల్లంఘించిన వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేరని, ప్రభుత్వోగా లకు అనర్హులని, ప్రభుత్వ సబ్సిడీలు వారికి లభించవని అన్నారు. 
    అలాగే అస్సాం ముఖ్య మంత్రి ముస్లిం అధిక జనాభా ప్రాంతాలలో జనాభా నియంత్రణ కోసం 1000 యువకులతో అవగాహనా కార్యక్ర మాలు నిర్వహిస్తామన్నారు. అస్సాం అసెంబ్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు. మధ్యఅస్సాం, పశ్చిమ అస్సాం ప్రాంతాలలో జనాభా విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు. 1000 మంది ఆశావర్కర్ల ద్వారా జనాభా నియంత్రణపై అవగాహన పెంచుతామన్నారు. 2001 నుంచి 2011 మధ్య ముస్లింల జనాభా అస్సాంలో 29% పెరిగిందని, హిందువుల జనాభా 10% మాత్రం పెరిగిందని ఆయన అన్నారు. జనాభా నియంత్రణ అస్సాంలో ఇద్దరు పిల్లల పాలసీ అమలు చేస్తామన్నారు. ఇందుకోసం ఆయన ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ విషయమై ఇద్దరు ముఖ్యమత్రులు తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాల్సిందే! అసదుద్దీన్‌ ‌వంటివారు ఇది రాజ్యాంగపు ఆర్టికల్‌ 21 ‌కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని పెడార్థాలు తీస్తున్నారు. జనాభా పెరిగితే వనరుల పై ఒత్తిడి పెరుగుతుంది, అందని వనరులతో పేదరికం పెరుగుతుంది. చదివించే పరిస్థితి లేక నిరక్షరాస్యత పెరుగుతుంది. వనరులన్నీ కొందరికే పరిమితమవుతాయి,అందుతాయి. సమైక్యత ప్రశ్నార్థకమవుతుంది. సమానత్వం సాధించడం కష్టమవుతుంది.

– హనుమత్‌ ‌ప్రసాద్‌ లోకహితము

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top