ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం!

Vishwa Bhaarath
0
ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం - Women's freedom in Afghanistan!
  • ఆఫ్ఘ‌న్‌లో ఇళ్ళ‌కే ప‌రిమిత‌మైన బాలిక‌లు
  • తాలిబాన్లు ఆదేశాలు జారీ
న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం ప‌డింది. తాలిబన్ల పాలనలో బాలికలు, మహిళలు ఇళ్లకే పరిమితమ‌య్యారు. 6-12 తరగతుల అబ్బాయిలు, పురుష ఉపాధ్యాయులు శనివారం నుంచే త‌ర‌గ‌తుల‌కు హాజరుకావాలని ఆదేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది విద్యాశాఖ. శుక్రవారం ఈ ప్రకటన ఫేస్​బుక్​లో దర్శనమిచ్చింది. అబ్బాయిల గురించే ఇందులో ఉంది. అమ్మాయిల గురించి ఎలాంటి ప్రకటన లేదు.

   మార్గదర్శకాల్లోనూ వారి ప్రస్తావన లేకపోవడం.. బాలికలు, మహిళలపై కఠిన ఆంక్షలు ఉంటాయన్న వాదనలకు మరింత ఊతమిస్తోంది. గత తాలిబన్ల పాలనలో ఇటువంటి కఠిన వైఖరే ఉండేది. అయితే, అప్పుడు కనీసం 1-6 తరగతుల బాలికలను చదువుకోనిచ్చేవారు. ఆ తర్వాత పాఠశాలలు, పని ప్రదేశాల్లోకి వారికి అనుమతులు లేవు. అఫ్గాన్​లోని కొన్ని రాష్ట్రాల్లో అనేకమంది మహిళలు ఇప్పటికీ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆసుపత్రి, విద్య, ఆరోగ్యశాఖలో పనిచేసే కొందరికి మాత్రమే అనుమతులుండేవి.

.......విశ్వసంవాద కేంద్రము 

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top