డా॥ హెడగేవార్ జీవిత సంగ్రహం (మూడవ భాగము) - Dr. Hedgewar Biography

Vishwa Bhaarath
0
డా॥ హెడగేవార్ జీవిత సంగ్రహం (మూడవ భాగము) - Dr. Hedgewar Biography

దృఢ నిశ్చయం

శరీరం ఆరోగ్యంగా ఉన్నంతకాలం నాగపూర్‌లోవున్నాా మరి ఎక్కడవున్నా, ఆయన నిత్యమూ ఆయా స్థానిక సంఘస్థానాలకు తప్పకుందా వెళుతూందేవారు. మంచంపట్టిన తరువాత మాటవేరు. 1930 అహింసాయుత సహాయనిరాకరణోద్యమం రోజులవి. ఎటుచూచినా సభలు, ఊరేగింపులూ, కోలాహలాలే. గంభీరంగా, నిగ్రహంతో పనిచేసే యువకుల హృదయాలుకూడా చలించడం
మొదలైనవి. అప్పుడే ఒక శాఖ సంఖ్య కమేపీ తగ్గుతూ శూన్యంలోకి దిగింది. అన్నివిధాలా ఆశలుడిగి ఆ వూరి సంఘ చాలక్‌గారు ఏమిచేయాలో తోచక దాక్టర్‌జీని సలహా ఇవ్వమని ప్రార్ధించారు. “ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా నాల్గునెలలదాకా మీరు మాత్రం నియమానుసారం, సరియెనవేళకు ధ్వజారోహణా, ప్రార్థనా చేస్తూవుండండి. ఇక ఇందులో ఒక్క నాగాకూడా ఉండకూడదు. కొన్ని రోజుల్లో నిష్టతో మీవెనుక ప్రార్ధనచేస్తూ నిల్చుని ఉన్న స్వయం సేవకుల నెందరినో చూస్తారు.” సంఘచాలక్‌ ప్రశ్నకు దాక్టర్‌జీ సందేహించకుండా ఇచ్చిన సమాధాన ఇది. ఆ సంఘచాలక్‌ ఒక నెల అలా చేశారో లేదో ! ఆ నెలసరి నివేదికలో శాఖ సంఖ్య 150కి మించిందని వ్రాయవలసి వచ్చింది.

అపోహలు

వృద్ధింగతమవుతూన్న సంఘాన్ని రక్షిస్తూ పోషిస్తూ వుండడానికి ఎన్ని కష్టాలు అనుభవించాలో, ఎంత రక్తాన్ని నీరుగా ధారపోయాలో కార్యకర్తలకే ఎరుక. సంఘం ఆరంభించిన రోజుల్లో హితాన్ని కోరేవారికి కూడా ఎన్నో విధాల అపోహలు ఉండేవి. సంఘం ఒక వ్యాయామశాల అని కొందరనుకునేవారు. కొందరు స్వచ్చంద సేవకదళ మనుకునేవారు. కొందరు సేవాసమితి అనేవారు. సంఘానికి తమకూ ఉన్న సంబంధాన్ని పురస్కరించుకుని తమ యింట జరిగే పెండ్లిళ్ళ శోభకు మెరుగులు దిద్దేందుకు “సంఘ బ్యాండు తప్పక రావాలని బలవంతం చేసేవారు కొందరు. మరికొందరు తెలివిగల పెద్దలు సంఘాన్ని మందుగుండు సామాగ్రి పోగుచేసే విప్రవసంఘమని బెదిరి తప్పుకున్నారు. ఇలా సంఘాన్ని గురించి వ్యాపించిన అపోహలను చూచినప్పుడల్లా దాక్టర్‌జీ హృదయం శేదపడదేది. అలాంటివాళ్ళను చూస్తే జాలికలుగుతుంది, నవ్వూ వస్తుంది. అవకాశం లభించినప్పుడల్లా సంఘ ఉత్సవాలలో ఉపన్యాసాలద్వారా సంఘం ఎందుకు అవసరమో సంఘ ధ్యేయమూ వైఖరి ఏమిటో స్పష్టీకరించడానికి ఎప్పుడూ డాక్టర్‌జీ వెనుకాడలేదు. ఐనా సంఘం వ్యతిరేకులకన్నా సంఘ సానుభూతిపరులకే, సంఘం అంటే ఏమిటో ఏమి చేయదలచుకున్నదో తెలుసుకోడానికి ఎక్కువకాలం పట్టింది. ఇది హిందూజాతి దౌర్భాగ్యమనే అనాలి.
   ప్రాంతీయ శాసనసభలో హోరాహోరీగా వాదోపవాదాలు చెలరేగాయి. చివరకు ఈ సమస్యపైన అప్పట్లోఉన్న 'శరీఫ్‌” మంత్రివర్గం పతనమైంది. సంథు వ్యతిరేకులూ, చాటుమాటున విమర్శించేవారూ హతాశులైనారు. సంఘ సిద్ధాంతాలూ, కార్యపద్ధతి ఈ కష్టాలన్నింటినీ ఎదుర్మోగల్లింది. ఆ తరువాత మధ్యప్రాంతంలో, తదితర స్థలాలలోనూ సంఘం మహావేగంగా వృద్ధిచెందింది. ఈ సంఘ నౌకను కౌశల్యంతో సామర్థ్యంతో నడిపించే నావికులు డాక్టర్‌జీ. జటిల ప్రశ్నల్తో, భయంకర పరిస్థితుల్లో, ఆందోళనల్లో చెక్కుచెదరక ఎదురునిల్చి స్వీయసిద్ద్ధాంతాలనుంచి ఒక అంగుళంమేరకూడా చలించక సంఘనౌకను తుఫాన్లలో సుడిగుండాలలో జాగ్రత్తతో నడపటంలో ఆయనది అందెవేసిన చేయి. మరి సంఘ పురోగమనాన్ని ఆపడం సాధ్యమా !

సంఘకార్యమే జీవిత లక్ష్యం

సంఘటిత జీవనం వుంటేనే ఏ సమాజమైనా జీవించివున్నదని అనగలం. ఏ పనిచేసినా ఎన్ని అల్లకల్లోలాలను లేవదీసినా, ఎంత ప్రచారంచేసినా, పురుగుల్లా ఆత్మార్పణం చేస్తూపోయినా సంఘటనను నిర్మాణం చేస్తే తప్ప రాష్ట్రంకోరే అంతి మోద్దేశాన్ని సాధించలేము. అందుకని తన జీవితానికి ఏకైకకార్యం సంఘమేనని ఆయన నిశ్చయించుకున్నారు. సంఘస్థాపనానంతరం ఆయన సర్వస్వం సంఘానికే వినియోగ పడేది. ఒక్కొక్క నెత్తురు చుక్కతో తడిపి, భూమిని సారవంతమొనరించి, భారతోద్యాన వనంలో ఒక మనోహరమైన లతా నికుంజాన్ని ఆయన నిర్మించారు. చక్కని తోటమాలిగా మనఃస్ఫూర్తిగా బహుకౌశలంతో పనిచేశారు. అంతులేని ఆయన ప్రయత్నాలవల్ల వసంతం తొంగిచూచింది. లతా నికుంజంలో కొమ్మకొమ్మ మీద, రెమ్మరెమ్మమీద రెక్కలు విచ్చి ఒళ్ళువిరిచి వికసించిన పూలసౌొరులో దేశం మునిగితేలింది. ఇతర బంధనాలను తెగత్రైంచుకొని ఆయన తమ సర్వశక్తులూ సంఘానికే అర్చించారు. సభలూ, సమ్మేళనాలూ, ఎన్నికలూ, పార్టీ రాజకీయాలూ మొదలైనవాటిని వదులు కున్నారు. శబ్బాలమీద కొట్లాడడంవల్ల భేదభావాలు నశించడంమాటపోయి అనేక అపోహలు వ్యాపిస్తాయని స్వానుభవంద్వారా ఆయన (గ్రహించారు. అందుకే ఈ 'ఛాఛా, ఛీభి లకు దూరాన వుంటుందేవారు.

దినచర్య

దాక్టర్‌జీ దైనికజీవితం అందరికీ తెలిసినదే. నిదురలేచింది మొదలు, తిరిగి నిద్రించేవరకు ప్రతినిమిషం సంఘానికే వినియోగించేవారు. ప్రతిభ గల శిల్పి నిర్దీవశిలను తొలచి మూర్తిని నిర్మిస్తూ ఎలా తన్మయుడౌతాడో అలాగే, సుత్తి దెబ్బతో వన్నైదిద్దు తున్నట్సు, మాటలతోనే నిష్ధావంతులైన స్వయంసేవకులను నిర్మించడానికే ఎక్కువ సమయం గడిచిపోతూందేది. సంఘానికి సంబంధించిన విషయాలను చదవడం వినా ఇతర విషయాలను చదివేంత అవకాశమైనా ఆయనకు లభించకపోయేది. గురిచూడడానికి ఎంత ఏకాగ్రత అవసరమో, చేపట్టిన కార్యాన్ని నెరవేర్చడానికి శారీరక మానసిక శక్తులన్నిటినీ అలా ఆ పనికై వినియోగించడమూ అంతే ఆవశ్యకం. కేవలం ఒక్క సంఘ కార్యాన్నే చేస్తున్నందుకు “ఏకాంతవాసులనే నేరంకూడా కొందరు ఆయనపై మోపకపోలేదు. తమదగ్గరకు ఎవరువచ్చినా సంఘకార్యానికనే వస్తారని ఆయన విశ్వాసం. అటువంటివారు ఎవరైనా తమను కలసికోకుండా తిరిగిపోవడమనేది వారెలా సహించగలరు ! అందుకని విస్తరి తలుపు దగ్గరగా వేయించుకొనేవారు. భోజనంచేసే సమయంలో కూడా రాకపోకలు విధినిషేధాలు లేకుండానే జరిగేవి. డాక్షర్‌జీ ఇంటివాకిటి గోడకు ఆయన పేరుతోవున్న ఒక బల్లవుండేది. దానిపై “ప్రవేశించవచ్చు” అనే ఎల్లప్పుడూ ఉండాలని ఆయన అదేశించారు. గోష్టీ కార్యక్రమాల్లో వాదోపవాదాలు జరగడం అరుదు. 
   తమ ప్రయాణపు వర్ణనలూ, సంఘన్థాపనకు పూర్వ రాజకీయ ఘట్టాల వర్ణనలూ, జైళ్ళలోని స్వానుభవాలూ, సమకాలికులైన మహాపురుషుల జీవితాలలో స్మరింప దగిన ఘట్టాలూ ఇవీ సాధారణంగా విన్సించే విషయాలు, గోష్టీ అంతా ప్రసం గానుకూలంగా, సంతోషంగా ఉత్సాహకరంగా, బోధదాయ కంగా నడుస్తూండేది. అందుకే గోష్టిలో పాల్గొనేవాళ్ళు నవ్వులు వెదజల్లుతుందేవారు. ఎప్పుడుచూచినా జనం కిటకిట లాడుతుందేవారు. నిరాశ అలుపూ విసుగూ మచ్చుకైనా కన్పించక పోయేది. అందుకే ప్రతిగోష్టి కొన్ని గంటలు సాగుతుండేది. డాక్టర్‌జీ స్మరణశక్తి ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది. స్వయంసేవకు లెవరైనా సరే ఒకసారి ఆయన గోష్టిలో పాల్గొనడం జరిగితే మళ్ళీ అతని పేరు మరువక పొయ్యేవారు. అప్పుడప్పుడు ప్రయాణంలో చిన్ననాటి మిత్రులు కలుస్తుండేవారు. ఆ మిత్రులు డాక్టర్‌జీని 'నన్ను గుర్తించావా” అని ప్రశ్నించగానే కొద్దిసేపాలోచించి దాక్టర్‌జీ సరిగా పేరుచెబుతుండేవారు.

నిరాడంబరత్వం

డాక్టర్‌జీ చాలా నిరాడంబరంగా ఉండేవారు. అన్యప్రాంతీయుల కిది ఆశ్చర్యం కలిగింపజేస్తూ ఉందేది. ఆశ్చర్యం కలగడమనేది సహజమే. ఎందుకంటే నాయకులంటే ఇతర ప్రాంతాలలో ఏవో వేరు వేరు భావాలు ఉండేవి. డాక్టర్‌జీ మూడవతరగతిలోనే ప్రయాణం చేస్తూందేవారు. చిన్నా పెద్దా అనే విచక్షణలేకుండా స్వయంసేవకు లందరితోనూ సమానమైన ఆత్మీయభావంతో మాట్లాడుతూ ఉండేవారు. పూలమాలలను ధరించే మోజులేదు. కెమెరాలకు కోసులదూరాన ఉండేవారు. స్వదేశ వస్తువులను ఉపయోగించందని స్వయంసేవకులకు చెప్పడం అనవసరమని వారంటుందేవారు. రెండుపూటల భోజనం చేయందనిచెప్పడం ఎలాగైతే అనవసరమో, అలాగే స్వదేశ వస్తువుల నుపయోగించందని చెప్పడంకూడా అనవసరమేనని ఆయన విశ్వాసం. స్వదేశీవస్తువుల ఉపయోగం అంతటి సహజ విషయమని ఆయన భావిస్తుందేవారు. ఇలాంటి మహాపురుషులు నిరాడంబరులుగా ఉన్నారంటే ఆశ్చర్యమేమున్నది ? ఇంత నిరాడంబరత, ఇంత ఉత్తమ విశ్వాసమూ కల్గిన మహాపురుషులు మనలో ఎందరున్నారు?

ఆంతరంగిక సౌందర్యము

కల్లాకపటం లేని డాక్టర్‌జీని స్నేహితులూ, విరోధులూ సమానంగా ఆదరించారు. ఆయన మానసిక, శారీరక ప్రవృత్తులను చూచిన వారికి సిద్ధాంతాలకూ, ఆచరణకూ భేదం కల్పించకపోగా పరస్పరం ఎంత సమైక్యాన్ని పొందాయో కన్పించేది. దూరానవుండి చూస్తేనే ఏవస్తువైనా అందంగా కన్పిస్తుందని అంటారు. కాని డాక్టర్‌జీ సాన్నిధ్యంలో ఉండి ఆయన హృదయాన్ని గ్రహించగలిగిన వారిక్కే ఆయన అంతరంగిక సౌందర్యం ఎంత మనోహరంగా ఉండేదో కన్పించేది. తెరిపిలేకుండా ఆయన చేస్తూ వచ్చిన కార్యక్రమానికి అనురూపంగానే ఆయన సద్గుణాలు కూడా ప్రకాశిస్తూండేవి. ప్రతిభావంతమైన వ్యక్తిత్వం, కనివిని ఎరుగని సంఘటనా కౌశల్యం, అపారమైన ధీశక్తి, అసమాన గంభీరమైన నీతిజ్ఞత, అచంచలమైన ధైర్యం, మహోదాత్తమైన లోక సంగ్రహశక్తి. ఈ గుణాలన్నీ చక్కని మణిమాలలా దాక్టర్‌జీలో వెలుగొందుతూ ఉండేవి.

ఆంతరంగిక సౌందర్యము

కల్లాకపటం లేని డాక్టర్‌జీని స్నేహితులూ, విరోధులూ సమానంగా ఆదరించారు. ఆయన మానసిక, శారీరక ప్రవృత్తులను చూచిన వారికి సిద్ధాంతాలకూ, ఆచరణకూ భేదం కల్పించకపోగా పరస్పరం ఎంత సమైక్యాన్ని పొందాయో కన్పించేది. దూరానవుండి చూస్తేనే ఏవస్తువైనా అందంగా కన్పిస్తుందని అంటారు. కాని డాక్టర్‌జీ సాన్నిధ్యంలో ఉండి ఆయన హృదయాన్ని గ్రహించగలిగిన వారికే ఆయన అంతరంగిక సౌందర్యం ఎంత మనోహరంగా ఉండేదో కన్పించేది. తెరిపిలేకుండా ఆయన చేస్తూ వచ్చిన కార్యక్రమానికి అనురూపంగానే ఆయన సద్గుణాలు కూడా ప్రకాశిస్తూండేవి. ప్రతిభావంతమైన వ్యక్తిత్వం, కనివిని ఎరుగని సంఘటనా కౌశల్యం, అపారమైన ధీశక్తి, అసమాన గంభీరమైన నీతిజ్ఞత, అచంచలమైన ధైర్యం, మహోదాత్తమైన లోక సంగ్రహశక్తి. ఈ గుణాలన్నీ చక్కని మణిమాలలా దాక్టర్‌జీలో వెలుగొందుతూ ఉండేవి.

అమృతమూర్తులు

అంతిమ విశ్వాసంవరకు ఆయన హృదయం మాతృదాస్య విమోచనానికై తపించి పోయింది. చివరకు జన్మభూమి సౌభాగ్యానికి తమరక్తాన్ని ధారవోసి, జీవిత సర్వస్వాన్ని సహితం ఆహుతిగా అర్చించారు. డాక్టర్‌జీ జీవితమే ఒక మహాయజ్ఞం. అందు ఆత్మార్పణ మొనర్చి తనను తాను జ్వలింపచేసుకొని హిందూ రాష్ట్రానికి ఒక అపూర్వమైన వెలుగును ప్రసాదించారాయన. ఒక నూతనదృష్టి సృష్టించి ఇచ్చారు. హిందూరాష్ట్ర చరణాలపై డాక్టర్‌జీ అర్పించిన అమూల్యమైన కానుక రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. దాక్టర్‌జీ స్వర్గస్తులైనారు. ఐనా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం '“అమరంి కావున వారు అమరులైనారనటం సమంజసం.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top