హిందువుల సంఘటన బలం దేనికోసం ?

Vishwa Bhaarath
0
హిందువుల సంఘటన బలం దేనికోసం ? - Incident strength Of the Hindus

సంఘటన బలం దేనికోసం ?

    'జీవోజీవస్య జీవనమ్‌”- ఇది మొదటినుండి ప్రపంచంలో ఉన్న ఆనవాయితీ. పెద్ద జీవి తనకంటే చిన్నవైన జీవులను ఆహారం చేసుకొంటుంది. పెద్ద చేపల పొట్ట నిండటం చిన్న చేపలను మింగటం ద్వారానే జరుగుతుంది. బలవంతులైన వాళ్ళు చాతీవిరుచుకొని తిరుగుతుంటారు. బలహీనులైనవారు తలవంచుకొని, ఒదిగిఒదిగి నడుస్తుండవలసి వస్తుంది. బలహీనులైనవారు బలవంతులైనవారిపట్ల ఉండే భయంతో తప్పుకొని తిరుగుతారు. లేదా వారి గుప్పిట్లో చిక్కుకొని, వారికి దాసులై, జీవితం గడపవలసివస్తుంది. దుర్చలుల ఈ స్థితికి బలవంతులను తిట్టిపోయటం ప్రయోజనకరంకాదు. శక్తిమంతుడు, మహత్వాకాంక్షి అయినవానికి ఆక్రమణలు చేసేవిధంగా ప్రోత్సాహమిస్తున్నదెవరు ? వారిని ఆవిధంగా ప్రేరేపిస్తున్న దెవరు ? ఆ పాపం దుర్చల సమాజాలదే. దుర్చలత్వమే ఒక మహాపాపం. సమాజాలు దుర్చలంగా శక్తిహీనంగా ఉంటూజఉంటే, వాటిని దిగమింగాలనే కోరికలతో యుద్ధ దుందుభులు మైోగుతూ ఉంటాయి. ఈ యుద్దాల పాపభారాన్ని దుర్చల సమాజములనెత్తినే వేయవలసి ఉంటుంది. ప్రపంచంయొక్క గగనతలంలో అలుముకొంటున్న ఆపదలమేఘాలను చెల్లాచెదరు చేయాలంటే, ప్రపంచంలోని సమాజాలన్నీ బలిష్టమైనవి, సంఘటితమైనవి కావాలి. దీనికి ఇది ఒక్కటే పరిష్కారం. దుర్చల సమాజాన్ని సంఘటితం చేయటమన్నది ప్రపంచంలో అశాంతిని తొలగించగల సంజీవని మూలిక.

    మనం సంఘటనా కార్యం చేస్తున్నది ఇతరులు ఎవరిమీదనో దాడి చేయడానికి, వారి సంపదను దోచుకొనడానికీ కాదు. వారిని నామరూపాలు లేకుండాచేసి, వారి సంపదను మన స్వాధీనం చేసికొని ధనవంతులై కులకడానికి కాదు. ఇతరులలో ఉన్న అన్యాయపూర్ణమైన ఆక్రామక వృత్తిని రూపుమాపటంకోసం మనం సంఘటిత మవుతున్నాం. ఇప్పటివరకు, మన దౌర్చల్యాన్ని చూసి అనేకులు మనపై అత్యాచారాలు చేయడానికి ఆకృష్ణులవుతూ ఉన్నారు. కాని అటువంటి దుస్సాహసాలకు వారుపూనుకోకుండా, వారిలోని ఆదుర్మార్గపు కోరికలను వదలగొట్టడానికి మనం సంఘటనా కార్యం చేస్తున్నాం. సంఘటన అనేది ఒక నివారక ఉపాయం (Preventive measure ) నగరంలో అంటువ్యాధులు ప్రబలతున్నప్పుడు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈనాటి యుగంలో అన్యాయాలు, అక్రమణల రూపంలో ఒక మహామారి వ్యాపిస్తూ ఉన్నప్పుడు సంఘటన కార్యం టీకాలవంటి నివారకచర్య అవుతుంది. టీకాలు వేసినపుడు మానవునిశరీరంలో ప్రతీకారశక్తి నిర్మాణమవుతుంది. 
     విషాన్ని చిమ్మే రోగాణువులను చంపటంవల్ల మనకు పాపంరాదు. ఎందుకంటే, ఆ ప్రత్యేకమైన రోగాలన్ని పుట్టించి తద్వారా రోగకారకాలైన జీవాణువుల దుష్పరిణామం మనపైన పడకుండా, టీకాలు వేయించుకోవటం మానవులందరికీ ఉందే సహజమైన హక్కు అంతేకాదు, అది ఒక పుణ్యకార్యం కూడా. 'శరీరమాద్యం ఖలు ధర్మసాధనం” అనేది మన ధర్మం మనకు బోధించే ప్రాథమిక పాఠాలలో ఒకటి. ఆక్రామకప్రవృత్తి గల్గిన వారెవరైనా సరే, మనమీద ఆక్రమణ చేసినట్లయితే, హిందూసమాజంలోని జీవనశక్తి దానికి ప్రతీకారం చేసి, వారిని హతప్రభులుగా చేసే విధంగా రూపుదిద్దుకొని ఉండాలి. అంతటి బలిష్టమైన సంఘటితమైన ప్రభావవంతమైన సమాజంగా రూపొందటం మన సంఘటనా కార్యానికి ధర్మహేతువు. ఇతర సమాజములు మనపైన ఆక్రమణలు చేయనపుడు మనశక్తివల్ల వారికి కలిగే బాధ ఏమీ ఉండదు. ఒకరితో ఒకరు తలపదడవలసిన అవసరమే ఉండదు. రాతిగోడ ఎవరిమీదా ఆక్రమణ చేయదు. కాని ఎవడైనా మూర్చుడు వచ్చిదానిని డీకొట్టినట్లయితే వాని తలపగులుతుంది. మనం ఈ విధమైన రాతిగోడవంటి సుదృఢమైన, సుస్థిరమైన, అభేద్యమైన సంఘటనను నిర్మించుకోవాలి. మనం సంఘంద్వారా ఎటువంటి హింసనూ చేయబోవటం లేదు. చేయపనిలేదు. కాని ఎవరైనా గాని అన్యాయంగా మనలను హింసించబూనినట్లయితే, వారికి గుణపాఠం తప్పక నేర్పవలసి ఉంటుంది.
     అందువల్ల సంఘంయొక్క ధ్యేయం-మనధర్మాన్ని, మన సమాజాన్ని మన సంస్కృతిని రక్షించుకొనడానికి హిందువులను సక్షమమైన సంఘటనగా తీర్చిదిద్దటం- ఇంత మాత్రమే. ఈ విధమైన సంఘటన నిర్మాణమైనపుడు హిందూసమాజం తనకాళ్ళపై తాను లేచి నిలబడి నడవగల్లుతుంది; బయటిదేశాల వారికికూడా వినబడేలా ఆకాశాన్ని చీల్చుతూ ఉచ్చస్వరంలో మాట్లాడగల్లుతుంది; అప్పుడు హిందూసమాజం కోల్పోయిన ఆత్మవిశ్వాసం మరల జాగ్భతమవుతుంది. ఈ సామర్థ్యంముందు ఆక్రామక సమాజముల ఉద్దండ మనోవృత్తి వీగిపోతుంది. అప్పుడు వారు మనపై దాడిచేయాలనే ఆలోచనలను దరిచేరనీయరు. ఇంతటి ఉచ్చతమమైన ఏ ధ్యేయాన్ని మనం మనముందుంచుకున్నామో, దానిని మనం సాధించితీరాలి. ధ్యేయం అనేది సాధించుకోవటం కోసమే మన ముందుంచుకున్నాం. కాబట్టి దానిని సాధించేదిశలో పట్టుదల సడలనివ్వకుండా కార్యరతులమై మనం సాగిపోతుండటం అవసరం. ఏ ధ్యేయశిఖరాన్ని చేరడానికై మనం సంఘాన్ని ఏర్పరుచుకున్నామో, ఆధ్యేయాన్ని సాధించటం మన అందరికీ కర్తవ్యం.
     ఈ పని ఒక్కరుగానో, నల్గురైదుగురో, పాతికమందో, యాబైమందో చేసేదికాదు. ఒక మనిషి ఎంత కర్తవ్య నిష్టగల్గినవాడైనా, ఎంత కర్మశీలియైనా, ఎంతశక్తిమంతుడైనా అతని శక్తి సామర్ధ్యాలకు పరిమితులుంటాయి. మొత్తం రాష్ట్రంయొక్కపనిని ఒకే ఒక వ్యక్తి తన నెత్తిన పెట్టుకోజాలడు. ఈ పనికి రాష్ట్రంలోని ప్రజలందరూ కలతచెంది ఆతురతతో ఒక్కుమ్మడిగా విరుచుకుపడాలి. ఎందుకంటే, ఏవిధంగా చూసినా ఇది రాష్టంయొక్క జీవితానికి సంబంధించిన ప్రశ్న రాష్ట్రం జీవించి ఉండాలంటే, మనం ముందు చెప్పుకున్న ధ్యేయాన్ని సాధించితీరాలి. అందుకని సంపూర్ణ రాష్ట్రాన్ని లేదా మొత్తం హిందూ సమాజాన్ని ఈ సంఘటనా కార్యంలో భాగస్వాములను చేసి, బలశాలిగా, అభేద్యంగా చేసే కార్యాన్ని సంఘం తనదిగా స్వీకరించింది.

     మనలను మనం సంరక్షించుకోవాలన్నాా ఇతరులలోని ఆక్రమణ వృత్తిని తొలగించాలన్నాా మనం శక్తి సంపన్నులం కావలసి ఉంటుంది. ఈ శక్తి లేనపుడు మనం మాట్లాడే మాటలకు అర్థమే ఉండదు, బొత్తిగా విలువ ఉండదు. అవి కేవలం కప్పల బెకబెక శబ్బాలవంటివే అవుతాయి. మనం మన ధర్మాన్ని ఆచార విచారాలను, సంస్మ్కారాలనూ సరిగ్గా నిర్వహించుకొంటూ వాడుకలో నిలిపి ఉంచుకొనడానికి, మన శక్తిని తేజోవంతమైన రూపంలో ప్రకటించుకొనడానికి మనం బలశాలురం కావాలి. శక్తిహీనులైనవారు ధర్మాన్ని రక్షించుకోజాలరు. “నాయమాత్మ్నా బలహీనేన లభ్యః” అనేది మన ధర్మం స్పష్టంగా చెప్పే సిద్ధాంతం. హిందూసమాజం అవమానాలకు గురవుతున్న వాతావరణంలో, హిందూ సమాజంపై అత్యాచారాలు జరుగుతున్న పాలనలో, హిందువుల ధార్మిక భావనలపై అవరోధాలు, నిషేధాలు విధింపబడుతున్న పరిస్థితులలో శక్తిశాలి అయిన సంఘటనగాక మరో ఉపాయమేదీ లేదు. ఈనాటి ఇటువంటి పరిస్థితులమధ్య ధర్మరక్షణకు, సంస్కృతి రక్షణకు ప్రబలమైన సంఘటన నిర్మాణం చేయటం మన పరమ కర్తవ్యం. ఈ పరిస్థితులలో ధర్మాచరణ అనేమాటకు అర్థమిదే. దీనికిమించిన ధర్మకార్యమేదీ మనకు తెలియదు. ఇదిగాక మరేధ్యేయమూ మన దృష్టిలో లెక్కకు రాదు.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top