శివాజీ మహరాజ్ నుండి ప్రేరణ పొందుదాం : ప.ఫూ. డాక్టర్‌ హెడ్గెవార్‌. పుణే 1935 - We are inspired by Shivaji

0
శివాజీ మహరాజ్ నుండి ప్రేరణ పొందుదాం - We are inspired by Shivaji

శివాజీనుండి ప్రేరణ పొందుదాం

మన చరిత్ర ఎంతో ఉజ్జ్వలమైనది. శ్రేష్టులైన మన పూర్వీకులు, దీనిని ఎంతో గౌరవాన్వితం చేశారు. తమ వీరకృత్యములతో విభూషితులైన అనేక వందలమంది చక్రవర్తుల సామ్రాజ్యాలు ఈ భూమిపై విరాజిల్లినవి. దిగ్విజయ యాత్రలు చేసిన సషమ్రాట్టులు ఒక సుదీర్ధమైన పంక్తిగా ఏర్చడియున్నారు. అమూల్యమైన రత్నాలతో, ముత్యాలతో అలంకరింపబడిన కిరీటాలను ధరించి భూపతులు ఎవరి చరణాల మోల నతమస్తకులై సాష్టాంగపడుతారో, అటువంటి తపోధనులైన బుషులు, మునులూ తమ పుణ్యకర్మలద్వారా తపస్సుద్వారా సంపాదించిన శక్తితో ఆశీస్సులందజేయుటకు మనవెనుక ఉన్నారు. మనమేమీ మరీ ప్రాచీనమైన చరిత్రలోకి వెళ్ళి వెదికి వెదికి పట్టుకోవలసిన అవసరం లేదు. కేవలం మూడువందల సంవత్సరాల క్రిందటి విషయాన్ని గమనిస్తే చాలు. మృతప్రాయంగా ఉన్న అంతఃకరణాలలో సైతం చేతనత్వాన్ని నింపగల చరిత్రను మనం మరిచిపోయామా ? శివాజీ మహారాజు విజయాలకు మూలమైన బీజం ఎక్కడుందో గమనిస్తే, మరీలోతుకు పోవలసిన అవసరం లేకుండా పైపైన చూసినప్పటికీ మనం ఈ నవీనకాలంలో పనిచేయడానికి స్ఫూర్తి, ఆత్మవిశ్వాసానికి అవసరమైన ఆధారమూ లభిస్తాయి. శివాజీ కాలంలో మహారాష్ట్ర మంతటా అశాంతి అనే అగ్ని మండుతూ ఉంది. అనేకచోట్ల ముస్తింలద్వారా అత్యాచారాల పొగలులేస్తున్నవి. ప్రాణాలకుగాని, ఆస్తులకుగాని ఏమాత్రం భద్రత ఉండేదికాదు. మానవతులపై అత్యాచారాలు చేయడానికి దుర్మార్గులైనవారు నిర్భయంగా, నిర్లజ్జగా ఉచ్చులుపన్నుతూ దాడులు చేస్తుండేవారు. హిందూధర్మంపట్ల, హిందూదేవతలపట్ల అమానుషమైన కుట్రలు, కుయుక్తులూ ప్రయోగింవబడుతుండేవి. మరి అటువైవున హిందూసమాజం ఒకటిగా కలసికట్టుగా ఉండేదికాదు. అటువంటి పరిస్టితులమధ్య శివాజీ తన పనిని ప్రారంభించాడు. “గుట్టుగా, ఏవిధమైన చప్పుడూ చేయకుండా సంసారంచేసుకోండి, ఎవరివంకా చూడకండి. మరొకరి జోలికి పోకుండా, ఎంతకాలం బ్రతకగల్లితే, అంతకాలం బ్రతకండి. చివరికి ఏదో ఒకరోజున కుక్కలాగ నిశ్శబ్దంగా మరణించంది' ఈ విధమైన ప్రవృత్తి హిందువులలో ఆనాడూ ఉంది.
     అటువంటి సమయంలో శివాజీ ఎటువంటి కార్యం చేశాడో ఒకసారి పరిశీలించి చూడండి. మరీ ప్రాచీనంకాని-ఇటీవలి కాలపు చరిత్రలో హిందూ సమాజానికి ఆదర్భంగా నిలిచే ఏకైక మహాపురుషుడు శివాజీమహరాజ్‌. ఇప్పుడు దేశంలో నడుస్తున్న ఉద్యమాలతో, ఆందోళనలతో దేశానికి ఏమీ మేలు జరగటం లేదు. వాటిని పాతిపెట్టటం మేలు. గడచిన యాబై సంవత్సరాల చరిత్రలో విపరీతమైన కల్పనలు కొన్ని పుట్టుకొని వచ్చాయి. ఇవి లజ్ఞాస్పదమైనవి, జుగప్సాకరమైనవి. ఈ ఆర్బశతాబ్టిలో జరిగిన ఆందోళనలతో దేశానికి లాభంకలగదడానికి బదులుగా విపరీతమైన హాని జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆదర్శపురుషులను గుర్తించడానికి యత్నించినట్లయితే ఈ రహస్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోగల్డుతాము.

  ధర్మ సంస్థాపన ధ్యేయాన్ని ముందుంచుకొని శివాజీ కార్యానికి పూనుకొన్నప్రుడు ఆ కాలంనాటి అవగాహనారహితులైన వ్యక్తులు శివాజీని ఎన్నో విధాల నిందించారు. ఆనాడు లబ్దిప్రతిష్టులుగా ఉన్నతస్థానాలలో ఉన్నవారు ఉదాసీనులుగా ఉండిపోయారు. కొందరైతే శివాజీ కార్యకలాపాలకు ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేశారు. శివాజీ తాను చేస్తున్న పనులను తన స్వార్థంకోసమే చేస్తున్నాడని వారు అనుకునేవారు. శివాజీ ధర్మస్థాపనకై పనిచేస్తున్నాడనే అంశాన్ని గ్రహించగల బుద్ధి హిందూసమాజంలో ఎక్కడుంది ? వ్యక్తిగా శివాజీ స్థితిగతులను గురించి ఆలోచిస్తే, సుఖంగా ఉండడానికి అవసరమైన వస్తువుల లోటేమీ లేదతనికి. తగినంత సంపద అతనివద్ద ఉన్నది. అతడు ఒక పెద్ద జాగీర్టార్‌ కుమారుడు. అతదు హోదా, పదవులు, ప్రతిష్టవంటివి కావాలని కోరుకొనికుంటే, మహమ్మదీయపాలకుల కొలువులో చేరినట్లయితే పదవులు, హోదాలు, స్తోత్రపాఠాలువంటి ఆర్భాటాలు, పేరు ప్రతిష్టలు లభించేవేకదా ! కాని సుఖభోగాలు, అధికారహోదాలూ వడ్డించిన పల్లాన్ని విసరికొట్టి, తనముందు ఒక ధ్యేయం నిలుపుకున్నాడు. స్వరాజ్యన్థాపన అనే ధ్యేయం. నిత్యమూ యుద్దాలలో గడిపే రణయబజ్ఞానికి సంసిద్దుడయ్యాడు. ఆనాటి స్వాభఖిమానశూన్యులైన ఇతర హిందువులతో పోల్చిచూస్తే, బహుధా సమర్శుదైన శివాజీ మహారాజు అధికారవైభవాలను మాత్రమే కోరుకుని, ఆ లాలసతో మహమ్మదీయ మతాన్ని స్వీకరించి యున్నట్లయితే, ఆయన అనుభవించగల వైభవానికి హద్దులు ఉందేవి కావు. కాని ఆయనకు అటువంటి ఊహ మరణసమానమైనదిగా అనిపించింది.
    స్వరాజ్యాన్నిసాధించుకోవటమనే కష్టాలతో నిండిన మార్గ్దంముందు సుఖభోగాలతో కూడిన సరళమైనమార్గం తుచ్చమైనదిగా భావించినందున ఆదారిలో పోవాలన్న ఆలోచననే ఆయన దరిచేరనీయలేదు. ధర్మంపట్ల అభిమానం అనే జ్యోతి ఆయన మనస్సులో ఎల్లవేళలా మండుతునే ఉండేది. ఆ జ్యోతి ఎంతతీవ్రంగా ప్రజ్వలిస్తూ ఉందేదంటే- తన దగ్గరకు వచ్చిన ప్రతి హిందువునూ తాను చేపట్టిన కార్యంకొరకు సంసిద్దమొనర్చుకొనేవాడు. ఒక దీపంతో వేల దీపాలను వెలిగించవచ్చుననే సూక్తికి తార్మాణం ఆయన. చదువుసంధ్యలు లేని హిందువుల ద్వారా హిందూస్టాన్‌లో ఇంతటి చరిత్రను శివాజీ సృష్టించాడు. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత, ఎవరి సహాయంకోసమో ఎదురుచూస్తూ కూర్చోవటం అతని స్వభావంలోనే లేదు. హిందూసమాజంలోనుండే తన కార్యాన్ని విరోధించేవారు ఉన్నప్పటికీ, వారి వ్యతిరేకతలను లెక్కచేయలేదు. ఎవరి రక్తనాళాలలో నిజమైన హిందూరక్తం ప్రవహిస్తున్నదో, అటువంటివారిని తన వెంట తీసుకొని, అతడు తన కార్యాన్ని నిర్వర్తించాడు.
     తన అంతఃకరణంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నికి అనుగుణంగానే ఆయన పనిచేస్తూ వచ్చారు. ఎవరోవచ్చి సహాయంచేస్తారని ఎదురుచూస్తూ, ఏనాడూ శివాజీ వేచివుండలేదు. ఎటువంటి క్లిష్టమైన సమయాలలోనైనా గాని తన సిద్దాంతాలను బలియివ్వడానికి అతడు ఏనాడు అంగీకరించలేదు. అందుకు కారణం ఏమిటి ? ఇటువంటి పురుషులు ఏనాడూ తమమార్లంనుండి వైదొలగలరు. శివాజీమహారాజ్‌ పదహారు సంవత్సరాల వయస్సులో ముసల్మానులనుండి తోరణదుర్దాన్ని జయించి, స్వరాజ్యధ్వజాన్ని ఆవిష్కరించాడు. నేను చెప్పుతున్నది అంతా చరిత్ర. ఏదో ఒక కాల్చనికమైన చారిత్రక నవలకాదు. పదహారేళ్ళవయస్సులోనే ఇంత తెగువను, సాహసాన్ని ప్రదర్శించ గలిగినాదంటే, ఎంత చిన్నవయస్సులో అతనిలో దేశభక్తి ఉత్సాహం పొంగులువారిందో, ఎంతగా గూడుకట్టుకొనిఉందో ఊహించుకోవలసిందే. భగవంతుడిచ్చిన దేహంయొక్క ఉపయోగం ధ్యేయసిద్ధికోసం కృషిచేయటం కోసమే. జీవించటమూ దేశంకోసమే, మరణించటమూ దేశంకోసమే-ఇదీ ఆయనకున్న నిశ్చయం. అటువంటి నిశ్చయం ఉన్న కారణంగానే శివాజీ తన కార్యంలో సఫలుడైనాడు.

   ఆనాటి రోజులకు, ఈనాటి రోజులకూ పెద్దగా తేడా ఏమీలేదు. ఇప్పటి రోజులతో పోలిస్తే, ఆ రోజులలో ఆటంకాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పటి రోజులు అహింసాజపం చేస్తున్న రోజులు. కాగా అప్పటి రోజులు కరుయ్త్వశీలతకు ప్రాధాన్యమిచ్చినరోజులు. అప్పటి రోజుల్లో సమాజం ఇప్పటిమాదిరిగా వివేకరహితంగా లేదు. అయితే వ్యక్తులకు తమపైన తమకు ఆత్మవిశ్వాసం ఉందా లేదా అనేది కీలకమైన అంశం. దానిపైనే మొత్తం ఆధారపడి ఉంటుంది. దేశంలో రాకపోకలకు సరియైన సదుపాయాలు లేనిరోజులలో శివాజీ మహారాజు ఈ అసాధ్యమైన కార్యాలు నిర్వహించాడని గుర్తుంచుకోవాలి. అత్యాచారాలపుట్టయైన మొగలుల పాలనలో తన అభిప్రాయాలను ప్రకటించటం, వ్యాపింపజేయటం సరళమైన పనేమీకాదు. అయినా అటువంటి పరిస్థితులమధ్య శివాజీ, ఆయన సహచరులు తమధ్యేయాన్ని సాధించారు. ఇప్పుడైతే మనదేశంలో రాకపోకల కుపకరించే అనేక సాధనాలున్నాయి. మహమ్మ దీయుల పాలనకంటే ఆంగ్లేయుల పాలన ఎంతో మెరుగైనది. మనం ఇప్పుడు ఇరవయ్యవశతాబ్దంలో ఉన్నాం. అయినప్పటికీ మనం మన ధ్యేయాన్ని సాధించు కొనడానికి మరెవరిదో సహాయం ఎందుకు అవసరమవుతున్నది ? మనం కావాలను కున్నది సాధించుకోగలమనే ఆత్మవిశ్వాసం మనలో ఎందుకు లేదు ? శివాజీ మహారాజుకు తోడుగా మహారాష్ట్రలోని మావళ్‌ ప్రాంత ప్రజానీకమే సహాయంగా ఉండినారు. కాగా ఈనాడు మనం 25 కోట్లమంది హిందువులం ఉన్నాం.

     ఆంగ్లేయులు అధికంగా బలం కల్గినవారు, యుద్ధశాస్త్రనిపుణులు, వారివద్ద శక్తిమంతమైన ఫిరంగులు, తుపాకులూ ఉన్నవి- అయినా మనం మనధ్యేయాన్ని నెరవేర్చుకొనడానికి సాయుధ యుద్ధమే చేయవలసిన అవసరం లేదు. అటువంటి సమయంలో యుద్ధసామగ్రి ఏమి ఉంది, ఏమి లేదు అనే ప్రశ్నలు తలెత్తవలసిన అవసరమే లేదు గదా! ఆంగ్రేయులవద్ద ఉన్నట్లుగానే, మనవారివద్దకూడా ఆయుధాలు ఉన్నప్పడుకూడా మనం రాజ్యాలను కోల్పోలేదా? దీనినిబట్టి గ్రహించవలసిందేమిటంటే- మహత్వం శస్తాలలో ఉండదు, నిజమైన శక్తి ఫిరంగులలోనో, తుపాకులలోనో ఉండదు. ఇది స్వభావానికి సంబంధించిన ప్రశ్న మనుష్యుని అంతఃకరణంలో ఉన్న భావన ఉపయోగకరమైన రీతిలో ఉన్నదా లేదా అనేదే విచారణీయమైన ప్రధానప్రశ్న  It is not the gun that fights, but the man behind it, not even the man but the timy little organ called heart within the man behind it, that fights.  (యుద్ధం చేసేది తుపాకీకాదు, దానివెనుక ఉండే మనిషి. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే, యుద్ధం చేసేది మనిషికూడా కాదు, అతనిలో ఉండే ఒక చిన్న అవయవం-గుండె అది యుద్ధం చేస్తుంది).
     మనం యోధవరుల అంతఃకరణాన్ని రూపొందించుకోవాలి. ఎప్పటివరకైతే మనిషియొక్క మనస్సులో తదేకధ్యాస నిర్మాణం కాదో, అప్పటివరకు అంతా వ్యర్థమే. మనిషిలో ఎప్పటివరకైతే ఆత్మవిశ్వాసం నిర్మాణంకాదో అప్పటివరకు అతడు ఏవేవో కుంటిసాకులు వెదుకుతునే ఉంటాడు. ఈ దుర్చలత్వంనుండి మనం బయటపడాలంటే, మొట్టమొదటగా మనం మన మనస్సులో మార్చు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరి మనస్సును ధర్మంపట్ల అభిమానంతో ప్రఫుల్లితం (బాగా వికసించినదిగా) చేసుకోవాలి. ఇటువంటి అంతఃకరణాలు కల్గిన స్వదేశ ప్రేమికులైన యువకులు సంఘానికి అవసరమైయున్నారు. అంతకరణంలో దేశంపై ప్రేమలేకుండా, కేవలం ఖద్దరువస్తాలు ధరించినంత మాత్రానికే ఎవరూ దేశభక్తులు కాజాలరు. స్పదేశీభావనతో నిండిన మనస్సు లేకుండా, స్వదేశీ (ఖద్దరు) వస్త్రాలు ధరించటం కపటత్వం, వంచన, రా్రానికి 'సేవచేయటంలో, సమాజాన్ని సంఘటితపరచటంలో, ధర్మాన్ని పునరుద్ధరించుకోవటంలో ఈ విధమైన కాపట్యాలు, వంచనలూ ఏవిధంగానూ సహాయకారులు కాజాలవు. ఆ లక్ష్యం నెరవేరడానికి స్వదేశీ అంతఃకరణాలు కావాలి; అవికూడా ఒకరిలోనో, పదిమందిలోనో నిర్మాణమైతే చాలదు, యావత్తు సమాజం ఈవిధమైన ఆలోచన గలదిగా, ఈ ప్రవృత్తి కలిగినదిగా రూపొందించుకోవాలి. ఇటువంటి పుష్పాలను వేలకొలదిగా చేర్చి మాలలుగా గ్రుచ్చికూర్చుకొని రాష్టదేవత పూజచేయాలని సంఘంయొక్క సాత్సికమైన ఆకాంక్ష్మ.
నేను హిందువును. నా శరీరంలోని అఖరినెత్తుటిబొట్టు హరించుకుపోయేవరకు నేను హిందుధర్మాన్ని ప్రాణంపోయినా వదిలేది లేదు అనే మనఃప్రవృత్తి మనలో ఉండాలి. అప్పుడు మన ధ్యేయాన్ని సిద్ధించుకోవటం సుగమమవుతుంది. (నడచిచేరుకోగలదవుతుంది) కత్తి మెనతో చరిత్ర పుటలలో శివాజీమహారాజు ఎటువంటి చిత్రాన్ని వ్రాసిపెట్టాదో-అందుకు అతనిలోని ఏ మనఃప్రవృత్తి ఆధారమైందో, అటువంటి దోషరహితమైన, నికార్సయిన వృత్తి మాత్రమే ఏదైనా నిర్మాణం చేయటంలో సమర్థమవుతుంది. అందుకే ఈ యుగంలో మనకు అవసరమైన ఆదర్శపురుషుడు శివాజీమహారాజ్‌ అని చెప్పుతూ ఉంటాం.
స్వరాజ్యం విషయంలో ఈనాడు రెండు రకాల ఆలోచనలు ప్రచలితమౌతూ ఉన్నవి. స్వరాజ్యం సాధించాలంటే ఒక తరం తర్వాత మరొక తరంగా, శతాబ్దాలపాటు ప్రయత్నం చేస్తూపోవలసి ఉంటుంది - అని కొందరు భావిస్తున్నారు. మరోవైపున ఉన్న మరి కొందరేమో కేవలం ఆరునెలలు, తప్పితే ఒక సంవత్సరం ప్రయత్నంతోనే స్వరాజ్యం సాధించగలమని అంటున్నారు. శివాజీమహారాజు చరిత్రమనకు ఏమి చెప్పుతున్నదో [గ్రహించండి.. ఒక తరం తర్వాత మరొక తరంగా వందల సంవత్సరాలు గడిచిపోవటం అవసరమని అది మనకు చెప్పటం లేదు. అదే ప్రకారంగా మృతప్రాయమైయున్న హిందూసమాజాన్ని సంఘటితం చేసే పని ఆరునెలల్లోనో, ఏడాదిలోనో అయిపోతుందనీ అది మనకు చెప్పటం లేదు. ఇవి రెండూ రెండుకోసల్లో ఉన్న హద్దులు-ఒకటి అనాచారణకు, మరొకటి అత్యాచరణకు ప్రాతినిధ్యం వహించేవి. మనం ఈ రెండింటిలో దేనినీ కాకుండా యాచిదేహి యాచి డోళా (ఈ ఒంటితో, ఈ కంటితో) అయిదు-ఇరవై ఐదు సంవత్సరాలలోనే ధ్యేయసిద్ధిని పొందాలనే ఆకాంక్షతో ఒళ్ళు దాచుకోకుండా నిర్విరామమైన కృషి చేయటంద్వారా సఫలత పొందగల్గుతాము. -శివాజీనుండి మనం ఈవిధమైన స్ఫూర్తిని పొందాలి. మనం స్వార్దాన్ని త్యజించి పనిచేస్తూ, తరుణ వయస్ముల మనస్సులపై యోగ్యమైన సంస్కారాలను ముద్రించేటట్లయితే ఈ పని తీవ్రగతితో సత్వరమే ముందుకు పోగల్టుతుంది. వయస్సుమీరిన తర్వాత రక్తం చల్లబడుతుంది. భావనలు కూడా చల్లబడిపోతాయి. దుర్చలత చెప్పే తర్మం ప్రభావం చూపనారంభిస్తుంది. కాబట్టి ఆ వయస్సులో ఉత్సాహం తెచ్చుకోవటం
కష్టమవుతుంది.

   శివాజీమహారాజు మరికొన్ని నాళ్లు జీవించి ఉన్నట్లయితే, యమధర్మరాజు ఆయనను తీసుకొనిపోవడానికి తొందరపడి ఉండకపోతే, ఆ మహాపురుషుని ప్రయత్నాలతో మన పరమ పవిత్ర భగవాధ్వజము ఆసేతు హిమాచలమూ ఎగురుతూ ఉండగా మనం చూసి ఉందేవాళ్లంగదా, అని మనం అనుకోవచ్చు. కాని ప్రకృతియొక్క స్వభావము, నడక అలా వుండదు. ఒక వ్యక్తియొక్క పరాక్రమము, కర్తవ్యనిష్ట ఎంతగా గొప్పవెనప్పటికీ, రాష్ట్రంయొక్క అన్ని సమస్యలు ఆ వ్యక్తి ద్వారానే పరిష్మరింపబడవనే కటువైన సత్యాన్ని పరమేశ్వరుడు మనకు నేర్పినాడు. శివాజీ అనే ప్రచండభానుని అస్తమయం తర్వాత అలుముకున్న నైరాశ్యమనే అంధకారం యీనాటికీ తొలగిపోలేదు. మనం హిందూస్థానంయొక్క సంతానం, శివాజీ వారసులం. శివాజీ మరణించినాదే-అంటూ ఏడుస్తూ కూర్చోవటం తగదు. ఆయన అసంపూర్ణంగా మిగిల్చిన కార్యాన్ని పూర్తిచేయడానికి, మనం చేపట్టిన కార్యంలో అంకితమైన ఉపకరణములుగా మనలను మనం రూపొందించుకొని, ఇనుమడించిన ఉత్సాహంతో, పూర్తి శక్తిని వినియోగించి పనిచేయవలసి ఉంది. హిందువులుగా మనకు ఇది ప్రథమ కర్తవ్యం. నేను మిగిల్చిన పనిన ఎవరో తప్పక పూర్తి చేస్తారు.
     హిందువుల పరమపవిత్ర భగవాధ్వజం కన్యాకుమారి -రామేశ్వరములనుండి కళ్శీరువరకు సమున్నతంగా ఎగురవేయబడే భాగ్యశాలి దినములను ఈ భారతభూమిలో ఎవరో ఒకరు తప్పక తీసుకురాగలరనే ఆశా-ఆకాంక్షలతో శివాజీ మహారాజు మనవైపు చూస్తున్నాడు. దట్టమైన అడవిలో వ్యాపించియున్న చెట్లమధ్య సందులోనుండి తొంగిచూసిన క్షణకాలపు వెన్నెల కనబడినపుడు, దానిని పట్టుకొనడానికి మనిషి ఎలా ఆరాటపడతాడో, ఆ విధంగా శివాజీ మహారాజు మనవంక చూస్తున్నారు. శివాజీ మహారాజు కారణంగానే ఈనాడు హిందూధర్మం బ్రతికి బట్టకట్టి మనగల్గుతున్నదని మనందరికీ తెలిసిన విషయమే. హిందూధర్శ్మంకోసం శివాజీ మహారాజు తన ప్రాణాలనే ఆహుతి ఇచ్చారని చరిత్ర ముక్తకంఠంతో ఘోషిస్తున్నది. ఆయన వంశజులైన మనవంటి వాళ్ళం ఈ విషయమై దృష్టి నిలిపి పట్టించుకోవాలి.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top