ఆం‌ధప్రదేశ్‌ ‌మీద (ముస్లిం లీగ్-ఎస్‌డీపీఐ) పడగ, హిందువులకు ముంచుకొస్తున్న ముప్పు - (Muslim League-SDPI) in Andhra Pradesh , a threatening threat to Hindus

Vishwa Bhaarath
0
ఆం‌ధప్రదేశ్‌ ‌మీద (ముస్లిం లీగ్-ఎస్‌డీపీఐ) పడగ, హిందువులకు ముంచుకొస్తున్న ముప్పు - (Muslim League-SDPI) in Andhra Pradesh , a threatening threat to Hindus

ఆం‌ధప్రదేశ్‌ ‌మీద ఎస్‌డీపీఐ పడగ!

వేసుకున్నది రాజకీయ ముద్ర. పేరు కూడా భారత సామాజిక, ప్రజాస్వామిక  పార్టీ. కానీ నమ్మేది హింస. ప్రేరేపించేది మతోన్మాదం. ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యం మీదే హేయమైన దాడి. ముస్లిం మతరాజ్యం స్థాపన కోసం రక్తపాతం. మొత్తంగా చూస్తే కరుడగట్టిన హిందూ వ్యతిరేకత. అదే అసలు అజెండా కూడా. దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పటికే కేరళలో స్వైర విహారం చేస్తూ కర్ణాటక, తమిళనాడులలో ఉనికిని గణనీయంగా చాటుకుంటున్న సోషల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా (ఎస్‌డీపీఐ) జాడ ఇప్పుడు ఆంధప్రదేశ్‌లోనూ స్పష్టంగా కనిపించింది. ఆ సంస్థ ఇక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు చేపట్టిన సంగతి రుజువైంది. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఇటీవల జరిగిన ఘర్షణ, పోలీసుస్టేషన్‌ ‌మీద మూకుమ్మడి దాడి, బీజేపీ నాయకుడిని చంపేస్తామంటూ పోలీసుల ఎదుటే వీరంగం వేయడం ఇందుకు నిదర్శనం. దీనికి కేంద్రబిందువు అనుమతి లేకుండా సాగుతున్న మసీదు నిర్మాణం. హిందువులు అధికంగా నివశించే ప్రాంతంలో మసీదు నిర్మాణాన్ని ఆరంభించింది. దీనికి అనుమతులు ఏవీ అంటూ ప్రశ్నించేటట్టు చేసుకుంది. తద్వారా చెలరేగిన ఘర్షణలో రెచ్చిపోయి ఎస్‌డీపీఐ అలా తన ఉనికిని బహిర్గతం చేసుకున్నది.

రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు అండగా ఉన్న ముస్లింలు నేడు స్వతంత్రులుగా ఎదిగి తామేమిటో రుజువు చేసుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి అభిప్రాయాలతో ఉన్న ముస్లింలకు అండనివ్వడానికి ఇప్పుడు అంతర్జాతీయంగా ముఠాలు పనిచేస్తున్నాయి. అందులో ఎస్‌డీపీఐ ఒకటి. బీజేపీ ప్రభుత్వాన్నీ, మోదీనీ, ఆర్‌ఎస్‌ఎస్‌నూ ద్వేషించే ఎస్‌డీపీఐ అండగా రాయలసీమలో ఈ పని ఆరంభమైంది. భారతదేశం నలుమూలలా జరుగుతున్న తంతు ఇదే కూడా. దేశమంతటా కశ్మీరాలు, ఈశాన్య భారత ప్రాంతాలు సృష్టిస్తూ అల్లకల్లోలం చేయడమే ఎస్‌డీపీఐ అసలు ఉద్దేశం. వ్యూహం ప్రకారమే తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న రాయలసీమను సంస్థ ఎంచు కుంది. అంటే బుజ్జగింపు ధోరణులనే నమ్ముకున్న రాజకీయ నేతలు, ఏలికలు ఉన్న రాష్ట్రాన్ని చూసుకుంది. మత కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపించే ముస్లిం యువతను గుర్తించి హిందువుల పట్ల ద్వేషభావాన్ని నింపడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆత్మకూరులో మసీదు నిర్మాణ ఘటనలో నాయకులు, పోలీస్‌స్టేషన్‌పై దాడి జరగడం.. అందులో కొందరు వ్యక్తులకు ఎస్‌డీపీఐ శిక్షణ ఇచ్చిన వాస్తవం వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే రెండేళ్లుగా కర్నూలు, కడప జిల్లాల్లో తరచుగా జరుగుతున్న మత ఘర్షణల్లో కూడా ఎస్‌డీపీఐ హస్తం ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. సోషల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా ప్రబోధనలు ముస్లింలపై ఈ రకంగా పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వర్గాలకే అనుకూలంగా ఉండటం ఎస్‌డీపీఐ వంటి సంస్థలకు అదనపు బలంగా మారింది.

ఆత్మకూరులో ఏం జరిగింది?

కర్నూలు జిల్లా, ఆత్మకూరు పట్టణంలో హిందువు లుండే ప్రాంతంలో కొద్దికాలం క్రితం ఒక ముస్లిం కుటుంబం ఉండేది. వారికి పిల్లలు లేరు. వృద్ధాప్యంతో భర్త, తర్వాత భార్య మరణించారు. ఆ స్థలంలోనే కొందరు ముస్లింలు ప్రభుత్వ అనుమతి లేకుండా మసీదు నిర్మించడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన బీజేపీ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి వాస్తవ పరిశీలించడానికి వెళ్లారు. మసీదు నిర్మిస్తుండటం చూసి పశ్నించారు. ఇంతలోనే ఒక్కసారిగా అక్కడ మూడు వేలమంది వరకు ముస్లిం యువత పోగయ్యా రంటే నెట్‌వర్క్ ఎం‌త వేగంగా పనిచేస్తోందో, ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది. వారంతా శ్రీకాంత్‌ ‌రెడ్డిపై మూకుమ్మడిగా డాడిచేశారు. గాయపడ్డ శ్రీకాంత్‌రెడ్డి తన వాహనంలో వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన అల్లరిమూక శ్రీకాంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు పంపాలని పోలీసులను హెచ్చరిం చారు. పోలీసులు అల్లరిమూకలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయినా ఫలితం కనిపించలేదు. పైగా పోలీస్‌స్టేషన్‌, ‌పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనలో స్టేషన్‌ అద్దాలు పగిలాయి. ఫర్నిచర్‌ ‌ధ్వంసమయింది. పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టే ప్రయత్నం చేసేసరికి అల్లరిమూక మరింత రెచ్చిపోయారు. బయట పార్క్ ‌చేసిన శ్రీకాంత్‌రెడ్డి వాహనానికి, అక్కడున్న పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. దాంతో పోలీసులు స్టేషన్‌లోకి పారిపోయి తలదాచుకున్నారు.

ఏపీలో నిషిద్ధ ఎస్‌డీపీఐ

సోషల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా ఉనికి ఆంధప్రదేశ్‌లో ఉన్నట్లు పోలీసులు ప్రకటించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కర్నూలు, కడప జిల్లాల్లో జరిగిన మత ఘర్షణల్లో వీరి పాత్ర ఉందనే అంశంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా (ఎస్‌డీపీఐ) ఒక రాజకీయపార్టీగా నమోదైనా, దీని మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి. భారత్‌లో అస్థిరత సృష్టించి, ముస్లిం ఆధిపత్యం తీసుకురావాలనేది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని కేంద్ర హోంశాఖ గతంలోనే గుర్తించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో మనుగడ సాగిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు ఏపీలోను వేళ్లూను కోవడం ఆందోళన కలిగిస్తోంది. హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ; బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌విశ్వహిందూ పరిషత్‌లపై దృష్టి కేంద్రీకరించి చురుకుగా ఉండే పార్టీ నాయకులు, సభ్యులను హతమార్చడం వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. కేరళలో జరుగుతున్నది ఇదే. 2020లో ఆగస్టులో కర్ణాటకలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టి ప్రభుత్వ, ప్రజల ఆస్తులు ధ్వంసం చేయించడం, ఇద్దరి హత్య ఘటనలో పోలీసులు జరిపిన విచారణలో సోషల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా హస్తం ఉన్నట్లు గుర్తించారు. దీనితో సంస్థను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వీరు కార్యకలాపాలు నిర్వహిస్తూ, హింసాత్మక రాజకీయాలు చేయడం విస్తుగొలుపుతోంది. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో తిష్టవేసి మతోన్మాదానికి ఆకర్షితులు కాగల యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ధనం, మద్యం అలవాటుచేసి శిక్షణ కార్యక్రమాలకు రప్పించి భారత్‌ ‌వ్యతిరేక విధానాలు నూరిపోసి వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసే ఏ చట్టమైనా వ్యతిరేకించడం వీరి పని. పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ ‌రద్దు వంటి చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందినపుడు ముస్లింలలో వాటిపట్ల అనుమానాలు రేకెత్తించి, వ్యతిరేకత సృష్టించి, రెచ్చగొట్టి ప్రభత్వంపై తిరగబడేలా చేశారు. కేరళలో ఈ పార్టీ చేస్తున్న హింసాత్మక కార్యకలాపాలతో విసుగుచెందిన ప్రభుత్వం దీనిని ఇస్లామిక్‌ ‌స్టేట్‌కు భారతరూపంతో పోల్చింది. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాయకులు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుని హత్యలో ఈ పార్టీ నాయకులే ప్రధాన నిందితులుగా కేసులు నమోదు చేశారు.

రాయలసీమలో పాగా


ఆత్మకూరు ఘటనపై బీజేపీ, హిందూ సంస్థలు చేస్తున్న ఒత్తిడి ఫలితంగా పోలీసులు విచారణ జరిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అల్లరి మూకలను పట్టుకుని విచారించగా వారిలో ఏడుగురు ఎస్‌డీపీఐ సభ్యులున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ వెలుగోడు, నంద్యాలల్లో ఇటీవల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి యువతపై ప్రభావం చూపిస్తున్నట్లు స్వయంగా కర్నూలు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌మీడియా సమావేశంలో వెల్లడించారు. దీనిని బట్టి సోషల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా రాయల సీమలో పాగా వేసి అలజడులకు కారణమవుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు రాక తప్పలేదని అనిపిస్తుంది. ఇటీవల కర్నూలు, కడప జిల్లాల్లో ఏర్పడిన మత ఘర్షణలు వీరి చలువే అనేది స్పష్టం. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో బక్రీద్‌ ‌సందర్భంగా జరిగిన మత ఘర్షణల్లో వీరి హస్తం ఉన్నట్లు హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. వధించేందుకు ఆవులను తరలిస్తున్నా రన్న సమాచారంతో హిందూ యువత పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు అక్కడికొచ్చి కూడా పట్టించుకో లేదు. తమపై ఫిర్యాదు చేయడంపై మండిపడిన ముస్లింలు హిందూ యువతపై దాడులు చేయగా కొందరు ఆసుపత్రి పాలయ్యారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా స్థానిక ఎమ్మెల్యే తనకు తెలీనట్టు ప్రవర్తించి తర్వాత మీడియాతో గోవధను ఆపలేమని, అందువల్ల గోవధ రద్దు చేసే చట్టాన్ని చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్‌ ‌విగ్రహం ఏర్పాటు చేస్తామని స్వయంగా స్థానిక ఎమ్మెల్యే ముందుకు రావడం, ముస్లింలకు అన్నివిధాల సహకరించడం, దీనిని వ్యతిరేకిస్తున్న హిందువులను దుర్భాషలాడటం వంటివి ఇటీవల జరిగిన పరిణామాలు.

ప్రముఖ హిందూక్షేత్రాల్లో కూడా సోషల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా వంటి శక్తులు తిష్టవేసి తమ ఎజెండా అమలుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో జరుగుతున్న ఘటనలే ఇందుకు సాక్షీభూతాలు. ఇక్కడ దుకాణాలను ముస్లింలకు కేటాయించడంలో స్థానిక ఎమ్మెల్యేదే ప్రధాన పాత్ర. దేవస్థానానికి సంబంధించిన కాంట్రాక్టు పనులు కూడా ఏదో పేరుతో వీరే చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పైగా ఇక్కడ భారీగా ముస్లింలకు ప్రభుత్వ ఇళ్లు కేటాయించి వారికి ఈ ప్రాంతాన్ని అడ్డాగా చేసే పనులు జరుగుతున్నాయి. ఈ చర్యలన్నీ ఆయా జిల్లాల్లో ఎస్‌డీపీఐ ఉనికిని బయటపెడితే, మిగతా జిల్లాల్లో ఏ విధంగా ఉన్నదీ అన్న సంగతిపై ఒక అవగాహనకు రావచ్చు.


ప్రభుత్వ ఉదాసీనతే కారణం

వివిధ మతాల మధ్య ఘర్షణలు జరిగి ఉద్రిక్త తలు పెరిగి సమాజం అశాంతికి గురికావడానికి ప్రభుత్వ ఉదాసీనతే కారణంగా ప్రజలు ఆరోపిస్తు న్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు హిందూమతంపై దాడులు, మతధర్మంపై అవమానాలు, అణచివేత చర్యలు పెరిగాయి. ముస్లింలు, క్రైస్తవులు తమకు వందశాతం ఓట్లు వేశారనే కృతజ్ఞతతో వారికి అన్ని విధాలుగా మేలు చేయడంతో పాటు వారికి సంతృప్తి కలిగించే మత అంశాలపై తమ వంతుగా ప్రోత్సాహం కలిగించే ఏ అవకాశాలను ఈ ప్రభుత్వం వదులుకోవడం లేదని అందరూ విమర్శిస్తున్నారు. క్రైస్తవుడైన రాజశేఖరరెడ్డిని తమ నాయకుడిగా ఆ మతం వారు భావిస్తే, తమ వర్గానికి రిజర్వేషన్‌ ‌ప్రయోజనం కల్పించినట్లు ముస్లింలు భావిస్తున్నారు. అందుకే 2009లో రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌; 2014, 2019 ఎన్నికల్లో వైకాపా.. చర్చిలు, మసీదులు నుంచి మద్దతు పొందినట్లు ఈ రెండు పార్టీలే కాదు ఆయా మత సంస్థల యాజమాన్యం కూడా బహిరంగంగా చెప్పుకుని మురిసిపోయారు. గెలిచాక సంబరాలు, సన్మానాలు చేసుకున్నారు. వీరికి కృతజ్ఞతలు చెప్పే క్రమంలోనే ఫాస్టర్లు, ముల్లాలకు జీతాలు ఇవ్వడం, పెంచడం వంటివి వైకాపా ప్రభుత్వం చేస్తోంది. ఇక ప్రతి నియోజకవర్గంలో చర్చిలను ప్రభుత్వ సొమ్ముతో నిర్మిస్తున్నారు.

 ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను మత వ్యవహారాలకు ఖర్చుచేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ విమర్శిస్తోంది. అయినా వైకాపా ప్రభుత్వం అవేమీ లెక్కచేయడం లేదు. అసలు వైకాపాలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఎన్నికైన దాదాపు అభ్యర్థులంతా మతాలు మారినట్లు బీజేపీ ఆరోపణ. దీంతో అసలైన ఎస్సీ, ఎస్టీ హిందువులకు అన్యాయం జరుగుతున్నట్లు కూడా వాపోయింది. వైకాపాకు దమ్ముంటే ఈ అంశంపై విచారణ జరిపించాలని కూడా డిమాండ్‌ ‌చేసింది.

హిందువులపై ప్రతాపం

ప్రభుత్వం తమకు అన్నివిధాలుగా ప్రోత్సాహం ఇస్తుంటే కొన్ని పిడివాద ముస్లిం మతసంస్థలు, క్రైస్తవ చర్చిలు హిందువులపై తమ ప్రతాపాన్ని చూపిస్తు న్నాయి. హిందువులను మతం మార్చేందుకు, హిందూమతాన్ని అవమానించేలా వారి మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో ఇప్పటికి వందకు పైగా ఆలయాలపై దాడులు చేశారు. రథాలు, విగ్రహాలు ధ్వంసంచేశారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని నరికివేశారు. కొండ బిట్రగుంట, అంతర్వేదిలో స్వామివారి రథాలు అగ్నికి ఆహుతి చేశారు. ఆలయాల ధ్వంసం కేసులో దోషులను పట్టుకోక పోవడాన్ని బీజేపీతో పాటు హిందువులు ప్రశ్నిస్తు న్నారు. ఆలయాలపై దాడుల కేసుల్లో ప్రభుత్వం కావాలనే దోషులను దాస్తోందని, తమను లెక్క చేయడం లేదని, తమ కంటే ఇతర మతస్తులే ఓటుబ్యాంకుగా కనిపిస్తున్నారని హిందువులు భావిస్తు న్నారు. 2017లో తెదేపా ప్రభుత్వ హయాంలో ముస్లిం మూక గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై దాడిచేస్తే కేసులు పెట్టారు. వైకాపా ప్రభుత్వం ఆ కేసులను ఉపసంహరించుకుని విధేయతను చాటుకుంది. అయితే కోర్టులు అదేశించడంతో మరల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం, వైకాపా ప్రజా ప్రతినిధులు, పోలీసులు సహా ముస్లింలు, క్రైస్తవులకు పూర్తి అండగా ఉండటంతో ఎస్‌డీపీఐ వంటి అతివాద పార్టీలు ఆయా వర్గాలను రెచ్చగొట్టి వారి మనసులను కలుషితం చేస్తున్నట్లు హిందూ సంస్థలు విమర్శిస్తున్నాయి. వాటి ఫలితమే కర్నూలు, కడప జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలు.

నిందితులపై చర్యలేవి?

ఈ సంఘటనలో నిందితులను వదిలేశారు. అనుమతులు లేకుండా, హిందూ జనావాసాల మధ్య మసీదు నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు బీజేపీ నాయకుడు శ్రీకాంత్‌ ‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టారు. ఈ పరిణామాలను విమర్శించినందుకు కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు హరీష్‌రెడ్డిపై కూడా కేసు పెట్టారు. శ్రీకాంత్‌రెడ్డి కుటుంబసభ్యును పరామ ర్శించేందుకు, వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఆత్మకూరుకు వెళ్లగా ఆయనను కూడా నిర్బంధిం చారు. రిమాండ్‌ ‌పేరుతో జిల్లా కారాగారంలో ఉంచిన శ్రీకాంత్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ ‌తదితరులు పరామర్శించారు. శ్రీకాంత్‌రెడ్డిని తక్షణం విడుదల చేయాలని, అక్రమ కేసులు కొట్టివేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఇంత జరిగినా ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల కోసం నిందితులపై చర్యలు తీసుకోలేదు.

వ్యాసకర్త: – తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్ - జాగృతి. (full-width)

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top