డా॥ హెడ్గేవార్ జీ పై బ్రిటీషు ప్రభుత్వ “రాజద్రోహా” నేరవిచారణ - British government prosecutes on Dr. K. B. Hedgewar ji

0
డా॥ హెడ్గేవార్ జీ పై బ్రిటీషు ప్రభుత్వ “రాజద్రోహా” నేరవిచారణ - British government prosecutes Dr. K. B. Hedgewar ji

“రాజద్రోహానికి” నేరవిచారణ

నాగపూర్‌లో సహాయ నిరాకరణోద్యమం అపూర్వమైన రీతిలో సఫలం కావటం బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని అధికారవర్దాన్ని బాగా కుదిపివేసింది. ఉద్యమాన్ని కుంటుపరచడానికి ప్రభుత్వం ఎన్నో అవరోధాలను ప్రయోగించినా అవేవీ పనికి రాలేదు. సభల మీద, ఊరేగింపులమీద, ఉపన్యాసాలమీద నిషేధాలు, 144 సెక్షను, ఉద్యమకారులపై బలప్రయోగము మొదలైన అణచివేతచర్య లేవీ ఉద్యమాన్ని బలహీనపరచలేకపోగా, ఉద్యమం మరింత పట్టుదలగా బలం పుంజుకోవడానికి దారితీశాయి. చివరికి ప్రభుత్వం ప్రజలను నడిపించుతున్న ప్రముఖనేతల మీద రాజద్రోహ నేరాన్ని మోపి, వారిపై కేసులు నడిపించి, వారిని జైళ్ళకు పంపే పనిని చేపట్టింది. ఉద్యమంలో పాల్గొనేవారిని భయఖీతులను చేయటమూ, ఉద్యమానికి నాయకులు లేకుండా చేయటమే వారి ఉద్దేశ్యం. 1921 జనవరి నుండి మే నెలవరకు మధ్యప్రాంతాలకు చెందిన ఏడుగురు వ్యక్తులపైన రాజద్రోహ నేరంపై కేసులు నడిపించింది".. వారిలో నాగపూర్‌ నుండి డా॥ హెడ్గేవార్ కూడా ఉన్నారు.
    ఆయనమీద క్రిమినల్‌ ప్రాసీజర్‌ కోడ్‌లోని 108వ సెక్షన్‌ క్రింద 1921 మే నెలలో కేసు దాఖలు చేయబడింది. రానురాను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చురుకుగా నిర్వహిస్తున్నందున ఆయనను ఎలాగైనా శిక్షింపజేయాలని సామ్రాజ్యవాద ప్రభుత్వం గట్టినిర్ణయంతో వ్యవహరించింది. కాబట్టి అప్పటికి ఆరునెలల క్రిందట (1920 అక్టోరులో) కాటోల్‌లోను, భరత్‌వాడలోనూ జరిగిన సభలలో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలను తమ కేసుకు ఆధారంగా పేర్ళొున్నారు. ఆయన ఈ రెండుచోట్ల సభలకు అధ్యక్షత వహించారు. బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారని, ద్వేషాన్ని వ్యాపింపజేశారని,
  1. ఫైల్‌ నంబరు 28/1921 పొలిటికల్‌-1వ భాగం-పేరా 17 రాష్ట్రీయ అభిలేఖాగారము, న్యూఢిల్లీ.
  2. 2మహారాష్ట్ర పత్రిక 1921 జూన్‌ 15 పుట-4
తిరుగుబాటుకు పిలుపునిచ్చారని ఆయనపై ఆరోపణలు చేయబడ్డాయి. గతంలో మహారాష్ట్ర పత్రికలో తీవ్రమైనధోరణిలో వ్యాసాలు వ్రాసినందుకు 1908లో బాలగంగాధర్‌ తిలక్‌పై కేసు నడిపించబడింది. కేసు విచారణలో వాదప్రతివాదాలు జరిగే సమయంలో తిలక్‌ తననుతాను సమర్థించుకొంటున్నట్లుగా సామ్రాజ్య వాదిమైన ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వపు అణచివేతవిధానాలమీద దాడిచేశాడు. తిలక్‌ తననుతాను స్వయంగా వాదించుకొన్న ఆ కేసు భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా ప్రసిద్ధిగాంచింది. డా॥ హెడ్గేవార్ పై విచారణ జరిగిన ఈ కేసుకూడా దానితో సమానంగా ప్రేరణ దాయకమైన ఘట్టమే. విచారణ సందర్భంగా న్యాయస్థానంలో నిలబడి బ్రిటీషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన వాజ్మూలం-దేశ స్వాతంతంత్య్ర సాధనకు బలం చేకూర్చుతూ ఇచ్చిన రాజీలేని బలమైనవాదన, అప్పటి నడుస్తున్నచరిత్రకు భాష్యం చెప్పే చారిత్రకపత్రం.

దీనితోపాటుగా గమనించవలసిన మరో సత్యమూ ఉంది. స్వాతంత్రోద్యమ సందర్భంలోని అనేకమైన ప్రేరణదాయకమైన ఘట్టాలు అభిలేఖాగారంలోని కాగితాల కట్టల్లో పాతర అయిన విధంగానే, ఈ నేరవిచారణ వివరాలు కూడా దశాబ్దాల తరబడి ఫైళ్ళలో అడుగునపడి ఉండిపోయాయి. పరిశోధనలో ఇటువంటి దాచినా దాగని సత్యాలు వెలికి వచ్చినపుడు క్షణక్షణమూ ఉత్కంఠ కలిగే తీరులో నడిచిన ఆ ఘటనాక్రమాన్ని ఇప్పుడు మన కళ్ళముందు జరుగుతున్న తీరులో వివరంగా చెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్నిగురించిన వ్యాఖ్యలు, స్వరూప స్వభావాలపై క్రొత్త వెలుగు ప్రసరిస్తుంది. డా॥ హెడ్గేవార్పై కేసు విచారణ కూడా ఒక చారిత్రక ఘట్టంగా కథలా చెప్పుకోదగి ఉంది.

నాగపూర్‌ న్యాయస్థానంలో న్యాయమూర్తి సిరాజ్‌ అహమద్‌ సమ్ముఖాన 1921 మే 21న అభియోగంగురించిన విచారణ మొదలైంది. ప్రారంభంలో ఉండే తంతు ముగిసిన పిదప విచారణకు జూన్‌ 18వ తేదీని నిర్ణయించారు. ఆ రోజున కేసును స్మెలీ అనే ఆంగ్రేయుడు న్యాయమూర్తిగా ఉన్న కోర్టుకు బదిలీ చేశారు. డా॥ హెడ్గేవార్ తరఫున నాగపూర్‌లోని ప్రముఖ న్యాయవాదులు బోబడే, విశ్వనాథరావ్‌ కేల్కర్‌, బాబాసాహెబ్‌ పాథ్యే, బల్వంతరావ్‌ మండలేకర్‌, బాబూరావ్‌ హర్మరేలు న్యాయస్థానంలో వాదించడానికి హాజరైనారు. జూన్‌ 18న ప్రభుత్వం తరఫున కాటోల్‌ పోలీసు సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఆబాజీ సాక్ష్యమిచ్చారు. ఆ మరుసటి రోజు జూన్‌ 14న బోబడే పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టరును ప్రశ్నలడిగారు (క్రాస్‌ ఎగ్జామినేషన్‌)

డా॥ హెడ్గేవార్ తరఫున న్యాయవాది అడిగిన ప్రతి ప్రశ్నకూ న్యాయమూర్తి అభ్యంతరం చెప్పసాగాడు. బోబడే ప్రశ్నలు అడగటం ప్రారంభిస్తూనే “డాక్టర్‌ హెడ్గేవార్ ఈ కేసును పైఅధికారుల ఒత్తిడి కారణంగా దాఖలుచేశారా లేక మీ అంతట మీరే నిర్ణయం తీసుకొని చేశారా ?” అని ఆ పోలీసు అధికారిని అడిగారు. “నా అంతట నేను కేసు దాఖలు చేయలేను. నాకు పైనున్న ఉన్నతాధికారినుండి అనుమతి ఒక నెలక్రిందట వచ్చింది” అని ఆబాజీ జవాబిచ్చాడు. అప్పుడు న్యాయమూర్తి కల్పించుకొని ఈ విషయమై ఇంక ఏ ప్రశ్నా అడగకూడదని బోబదేని హెచ్చరించాడు.

బోబడే ప్రశ్నించిన మీదట తాను నిమిషానికి 80 నుండి 40 శబ్దాల వరకూ వ్రాసికోగలనని ఆబాజీ చెప్పాడు. డా॥ హెడ్గేవార్ఉపన్యాసం ఆనాటి రాజకీయ పరిణామాలమీద, సమస్యలమీద కేంద్రితమై ఉంటుంది గదా, మరి వాటిని అర్ధం చేసికొని, వాటిని గురించి వ్యాఖ్యానించగల కనీస రాజకీయ పరిజ్ఞానము, అవగాహన అవతలి వ్యక్తికి ఉండాలిగదా- ఈ అభిప్రాయంతో శ్రీ బోబదే ప్రభుత్వ సాక్షిని ఇలా ప్రశ్నించారు.
“రాజకీయ విషయాలగురించి వ్రాసే వార్తాపత్రికలు, వ్యాఖ్యలు చేసే వారపత్రికలు, పక్షపత్రికలు మీరు చదువుతారా ?”
“కాంగ్రెసు ఆమోదించిన సహాయ నిరాకరణోద్యమాన్ని గురించిన తీర్మానాన్ని మీరు ఎన్నిసార్లు చదివారు ?”
“మీరు గాంధీజీ వ్రాసిన వ్యాసాలేవైనా చదివారా ?”
న్యాయమూర్తి ప్రతి ప్రశ్నకూ అభ్యంతరం చెప్తూ ఉన్నాడు. అయినా బోబడదే తన ప్రశ్నలు సమంజసమైనవేనని వక్కాణిస్తూ వచ్చాడు. చివరికి వివశుడై న్యాయమూర్తి తన అభ్యంతరాన్ని ఉపసంహరించుకోవలసి వచ్చేది. అప్పుడు బోబడే ఆబాజీని ఇలా ప్రశ్నించాడు - “సహాయ నిరాకరణోద్యమాన్ని శాంతియుతంగా, ఏమాత్రం హింసకు తావులేని విధంగా నడిపించాలని నిర్ణయించుకొన్నట్లుగా మీకు తెలుసా ?” ప్రభుత్వ సాక్షి దీనికి ఏమి జవాబు చెప్పాలో తెలియని స్థితిలో పడ్డాడు. ప్రభుత్వం తరపు న్యాయవాదినుండి సహాయం కోరాడు. " ఈ ఉద్యమంద్వారా ప్రజలు ఏమి సాధించాలనుకుంటున్నారు ?”అని ప్రశ్నించాడు బోబడే. ఈ ప్రశ్నకు మళ్లీ అడ్డుపడ్డాడు న్యాయమూర్తి. “ప్రజలు ఏవిధమైన స్వరాజ్యం కోరు కొంటున్నారు?” మళ్లీ బోబడే ప్రశ్న. “స్వరాజ్యమంటే ప్రజల పాలన గదా” అని జవాబిచ్చాడు. పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌. బోబడే అడుగుతున్న ప్రశ్నలతో న్యాయమూర్తికి చీకాకు పెరిగిపోయింది. “అర్థంలేని ప్రశ్నలు, అసందర్భమైన ప్రశ్నలు, అనుచితమైన ప్రశ్నలు” అంటూ కేసును 20వ తేదీకి వాయిదా వేశాడు.

జూన్‌ 20న విచారణ నాటకీయమైన మలుపు తిరిగింది. బోబడే న్యాయమూర్తితో గొడవపడ్డాడు. సాక్షిని ప్రశ్నలడిగే సమయంలో “ డా॥ హెడ్గేవార్ తన ఉపన్యాసంలో భారతదేశం కేవలం భారతీయులకే చెందుతుందని చెప్పటం నిజమే కదా ?” అని ఆబాజీని బోబడే ప్రశ్నించాడు. అప్పుడు న్యాయమూర్తి అంతకు ముందు మాదిరిగానే ఆ ప్రశ్న అప్రస్తుతమంటూ అడ్డుపడ్డాడు. ఆ ప్రశ్నను వ్రాసికొనడానికి నిరాకరించాడు. న్యాయస్థానం విచారణ చేయకుండానే నిర్ణయానికి వచ్చినట్లుగా ఉందని, విచారణీయమైన అంశాలను చర్చించనీయకుండా అద్దుపడుతోందని ఆరోపిస్తూ బోబడే తన కోపాన్ని ప్రదర్శించాడు. తాను ఇంక ఈ విచారణలో పాల్గొనదలచలేదంటూ న్యాయన్థానం బయటకు నడిచివెళ్లాడు. ఆ తర్వాతకూడా జరిగిన ఘటనలతో కలిపి పరిశీలిస్తే ఇదంతా ఒక పథకం ప్రకారం బోబడే కావాలని చేసినట్లుగా అనిపించుతుంది. 

    డా॥ హెడ్గేవార్ కేసువిచారణ పగ్గాలను తన చేతిలోకి తీసుకొని తానే స్వయంగా సాక్షిని ప్రశ్నించడానికి నిర్ణయించుకున్నారు. ఆయన ఎన్నడూ న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసినవారు కాదు. న్యాయస్థానంలో అది తొలి అనుభవమే. అయితే మాత్రం దేనికి భయపడాలి ? బ్రిటీషు రాజ్యాధికారానికి, సామ్రాజ్యవాదానికి, వారి కుటిలన్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా వాటిని ఎండగట్టడానికి ఒక రాజకీయవేదికగా న్యాయస్థానాన్ని ఉపయోగించుకోవాలని ఆయన అనుకొన్నారు. ఆ విధంగా ఆయన చేసి చూపించారు.

న్యాయమూర్తిని అపహాస్యం చేస్తూ విచారణలో తన భాగానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఎక్కడైనా, ఏ న్యాయమూర్తినైనా అయోగ్యుడు, అజ్ఞాని, అపాత్రుడు అని ప్రకటించడానికి ఎంత సాహసం ఉందాలి ? విశుద్ధ జాతీయవాది అయిన వ్యక్తి మాత్రమే అలా చేయగలడు. డా॥ హెడ్గేవార్ ఆ విధంగానే నిర్ఫీతిని, ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. న్యాయమూర్తిని మార్చవలసిందిగా తాను దాఖలు చేసికొనబోతున్న అర్జీపై చివరినిర్ణయం జరిగేవరకు కేసువిచారణ కార్యక్రమాన్ని నిలిపి ఉంచవలసిందిగా ఆయన న్యాయమూర్తి స్మెలీని కోరారు. అవమానకరము, సిగ్గుచేటు అయిన ఆ స్థితికి స్మెలీ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. డా॥ హెడ్గేవార్ కోరికను న్యాయస్థానం అనుమతించింది.

జూన్‌ 25న డా॥ హెడ్గేవార్ జిల్లా సెషన్స్‌ జడ్జి అయిన ఇర్విన్‌వద్ద ఈ విషయమై పత్రాన్ని అందజేశారు. ఇటువంటి అర్జీ దాఖలు చేయబడటం ఇంతకుముందెన్నడూ లేదు. ఒక భారతీయునిపై జరిగే కేసులో విచారణకు వచ్చే అంశాలను విని నిర్ణయాలను ప్రకటించటంలో బ్రిటీషు న్యాయమూర్తి పనికిరాడని దానిలో ఫిర్యాదు చేశారు. ఇర్విన్‌ నిర్ణయం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కాగా స్మెలీని శిఖండివలె అడ్డుపెట్టుకొని బ్రిటీషు న్యాయవ్యవస్థను ఎండగట్టటం డా॥ హెడ్గేవార్ ఉద్దేశ్యం. ఆయన పెట్టుకొన్న అర్జీ సారాంశమిది.

"శ్రీ స్మెలీకి మరాఠీ భాషలో కనీస పరిజ్ఞానం లేదు. పని నడిపించుకొనేపాటి భాషాజ్ఞానం కూడా లేదు. ఉపన్యాసమూ, వాజ్మూలము మరాఠీలో ఉన్నాయి. కాబట్టి కేసును అర్థం చేసికొనటం ఆయనకు సాధ్యపడదు. కాబట్టీ ఈ కేసు విచారణకు ఆయన తగినవ్యక్తి కాదు. ఆయన వ్రాసికొంటున్న నోట్‌ పుస్తకమే ఇందుకు ప్రమాణం. జూన్‌ 14వళతేదీనుండి సాక్షిని ప్రశ్నించే కార్యక్రమం సుదీర్హంగా జరుగుతున్నప్పటికీ ఆయన ఒక్క ముక్కకూడా వ్రాసికొనలేకపోయారు.

అంతేకాదు, శ్రీ స్మెలీకి రాజకీయ పరిజ్ఞానం, అవగాహనకూడా శూన్యమే. నిందితుని తరఫు న్యాయవాది అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ ఆయన అభ్యంతరం చెప్పుతున్నారు. ప్రతి ప్రశ్ననూ అభియోగంతో సంబంధంలేని ప్రశ్నగా, అసందర్భమైన ప్రశ్నగా, అసంగతమైన ప్రశ్నగా ప్రకటిస్తున్నారు. ఆ ప్రశ్నలను తిరస్మరించకుండా, ప్రభుత్వసాక్షి ఆ ప్రశ్నలకు జవాబు చెప్పవలెనని అనుమతించినట్లయితే నా ఉపన్యాసంలో 'రాజద్రోహికరమైన అంశాలేవీ లేవని రుజువవుతుంది.

   జూన్‌ 27న ఇర్విన్‌ పైఅర్దీని త్రోసిపుచ్చుతూ “సదరు కేసును విచారించడానికి స్మెలీ పూర్తిగా తగినవాదే” అని నిర్ణయం తెలియజెప్పారు.
   జూన్‌ 28న స్మెలీగారి న్యాయస్థానంలో కేసు మరల మొదలయ్యింది. అవమానంతో, క్రోధంతో ఉడికిపోతున్న స్మెలీ డా॥ హెడ్గేవార్ను లిఖీతపూర్వకంగా వాబ్మూలం ఈయవలసిందిగా సూచించాడు. డా॥ హెడ్గేవార్ న్యాయమూర్తి ఆదేశాన్ని వ్యతిరేకించుతూ ప్రభుత్వ సాక్షులందరూ చెప్పే సాక్ష్యాలను వినే హక్కు తనకు ఉందని, వారందరూ తమ సాక్ష్యాలను ముగించిన తర్వాతనే తాను లిఖీత పూర్వకంగా వాజ్మూలం అందజేయగలనని చెప్పారు. నిందితునినుండి లిఖితపూర్వకమైన వాజ్యూలాన్ని కోరే హక్కు న్యాయస్థానానికి ఉందని న్యాయమూర్తి అంతకుముందు చెప్పిన విషయమే మళ్ళీ చెప్పగా-ినేను చెప్పవలసింది చెప్పేశాను, నేను నామాట మీదనే నిలబడతాను. నా లిఖితపూర్వక వాజ్బూలాన్ని చివర్లోనే ఇస్తాను” అని మొహం పగిలేలా డా॥ హెడ్గేవార్ జవాబిచ్చారు. ఈ విధంగా కొట్టబోయినట్లుగా నిర్భయంగా మాట్లాడటం ఆయనకుగల సహజమైన వ్యక్తీకరణ పద్ధతిని, ఆయనలోని అచంచలమైన సంకల్పబలాన్ని వెల్లడి చేస్తుంది.

న్యాయస్థానం ఆయన మాటకు అంగీకరిస్తూ కేసు విచారణను జూలై 8వ తేదీ వరకు నిలిపివేసింది. జూలై 8న కేసు విచారణలో డా॥ హెడ్గేవార్ ప్రభుత్వంతరపు సాక్షులలో రెండవవాడైన కాటోల్‌ సర్కిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ గంగాధరరావును ఇలా ప్రశ్నించారు. డా॥ హెడ్గేవార్ - సభ ఎప్పటివరకు జరుగుతూ ఉంది ? ఉపన్యాసాన్ని వ్రాసికొనే పని ఎలా సంభవమైంది ?
  1. హారాష్ట్ర 1921 జూన్‌ 29 డా॥ హెడ్గేవార్ యాంచా ఖటాలా-పుట-4.
రావ్‌ - సభ సుమారుగా పావుతక్కువ ఎనిమిది గంటలకు ముగిసింది. మేము టార్చిలైట్‌ వెలుతురులో ఉపన్యాసాన్ని వ్రాసికొంటున్నాం.

డా॥ హెడ్గేవార్ - వారు చీకట్లో కూర్చున్నారు. వారివద్ద లాంతరుగాని, టార్చిలైట్‌గాని లేనే లేదు. నేను ఎప్పుడూ శుద్ధమైన మరాఠీనే మాట్లాడుతాను. 'బాయకోచా పోర్‌ వంటి అశుద్ధమైన మరాఠీ శబ్దాలను నేను మాట్లాడినట్లుగా నావికాని మాటలను నా నోట్లో జొప్పించారు. ఈ సాక్షి ఏ మాత్రం చదువురానివానిగా రుజువవుతోంది.

రావ్‌ - నాకు వ్యాకరణజ్ఞానం లేదు. నేను మా తల్లిగారితో తెలుగులో మాట్లాడుతాను. నా భార్యతో మరాఠీలో మాట్లాడతాను. నేను నిమిషానికి సరాసరిన 25 నుండి 30 శబ్దాలను వ్రాయగలుగుతాను. ఒక్కొక్కప్పుడు పూర్తివాక్యాన్నిి ఒక్కొక్కప్పుడు సారాంశాన్ని వ్రాసుకొంటాను. సారాంశాన్ని వ్రాసుకొనడానికి మొత్తం వాక్యం వినవలసిన అవసరంలేదు. నాకు అర్థంకాని విషయాలనుగాని, మరచిపోయిన విషయాలనుగాని మరొకరి సహాయంతో వ్రాసుకొంటాను. డాక్టర్‌ నిమిషానికి 25 నుండి 80 మాటలు మాట్లాడేవారు.
    డా॥ హెడ్గేవార్ జోక్యంచేసికొంటూ ఉపన్యాసాన్ని వ్రాసుకోవటంలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంత ప్రతిభావంతుడో పరీక్షించాలని న్యాయస్నానాన్ని కోరారు. న్యాయస్థానం అనుమతించలేదు. సాక్షి చదువుకు సంబంధించిన వివరాలను డా॥ హెడ్గేవార్ కోరారు. సాక్షి గంగాధరరావు ఇలా జవాబిచ్చాడు-చోనేను గత 24 సంవత్సరాలుగా ప్రభుత్వం కొలువులో ఉన్నాను. నేను ఇంటర్‌ పరీక్షలో 'ఫెయిలయ్యాను. మొదట నా నియామకం హెద్‌కానిస్టేబిల్‌గా వచ్చింది. ఆ తర్వాత సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషను వచ్చింది. మళ్లీ ప్రమోషన్‌ తర్వాత ఇప్పుడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాను. డా॥ హెడ్గేవార్ తోపాటుగా ఆలేకర్‌, ఓగ్లే సభలో ఉన్నారా లేదా, ఇంకెవరున్నారు అనే విషయాలు నాకు తెలియవు. డా॥ హెడ్గేవార్ ఉపన్యాసానికి ఇతరులు ప్రభావితులైనట్లుగానే, నేనూ ప్రభావితుడనైనాను. అయితే వక్త పూర్తిగా అబద్దాలు మాట్లాడుతున్నాడని నాకు తెలుసు”.

డా॥ హెడ్గేవార్ - న్యాయస్థానంవారి సమ్ముఖంలో ప్రవేశపెట్టినది నా ఉపన్యాసం కానే కాదు. నేను నిమిషానికి 200 మాటలు మాట్లాడుతాను. నా ఉపన్యాసానికి నివేదిక తయారుచేయడానికి 'లాంగ్‌హేండ్‌'లో వ్రాయదలచిన, క్రొత్తగా రిపోర్టు వ్రాయటం ప్రారంభించినవారు నేను చెప్పిన దానిలో ఎనిమిదవవంతు కూడా వ్రాసికోలేరు. కాబట్టి వాదివైపునుండి ప్రవేశపెట్టబడిన రిపోర్టు సగంసగం వాక్యాలతో, తలాతోక లేని మాటలతో, అసమగ విషయాలతో నిండి ఉంది. అంతేకాదు, రిపోర్టు పూర్తిగా అబద్దాలగుట్ట. యోగ్యతలేని సిపాయీలు నా ఉపన్యాసం రిపోర్టు తయారుచేయడానికి తమ కల్పనాచాతుర్యాన్ని, జ్ఞాపకశక్తిని బాగా ఉపయోగపెట్టుకొన్నారు. ఈ రిపోర్టు చదివిన ఏ వ్యక్తి అయినా సరే నేను ఏ విషయంమీద ఏమి చెప్పానో, ఎలా చెప్పానో కొంచెంకూడా అంచనా వేయలేదు. భరత్‌వాడాలో నా ఉపన్యాసాన్ని వ్రాయటం అసంభవం. ఆ రాత్రివేళ ఉన్న దట్టమైన చీకట్లో కాగితం, పెన్సిల్‌ కూడా కనబడవు. పోలీసులదగ్గర వెలుతురుకోసం ఏ విధమైన ఏర్పాటు లేదు. కాబట్టి నా ఉపన్యాసం యొక్క రిపోర్టుగా సమర్పించినది కేవలం కల్పితం. “ప్రజాఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసువారు ఎంత కష్టపడుతున్నారో చూపించే యత్నం మాత్రమే. విద్యావంతుడైన ఏ వ్యక్తి అయినా సరే ఈ రిపోర్టును పైపైన చూసినా సరే-ఇందులోని వాస్తవ మేమిటో వెంటనే తెలిసిపోతుంది. రిపోర్టులో కొంతభాగాన్నైనా న్యాయస్థానంలో చదవకపోవటానికి ఈ భయంతో పీడింపబడటవే కారణమైైనట్లుగా కనిపించుతోంది. ఇది స్పష్టం- నిజాయితీగా విచారణ జరిపించినట్లయితే వాదివైపునుండి చేస్తున్న వాదంలోని లొసుగులు బయటపడతాయి. వారి వాదం కుప్పకూలిపోతుంది. రిపోర్టు తీసికొనే పద్ధతిగురించి, నా ఉపన్యాసంలో ఉండే వేగంగురించి గంగాధరరావు చెప్పిన హాస్యాస్పదమైన విషయాలు పరిశీలించినపుడు న్యాయసమ్మతమైన దృష్టిగల ఏ వ్యక్తికైనాసరే వాదిపక్షంవారి రిపోర్టులో ఏమాత్రం దమ్ము లేదని, బొత్తిగా పనికిమాలినదని తెలిసి వస్తుంది. ఇటువంటి సభలలో నా ఉపన్యాసాలు సాధారణ వేగంతో సాగిపోతూ ఉంటే, సాక్షులు ఎన్ని మాటలు వ్రాసుకోగలరు అనేది చూపించడానికి అవకాశమిచ్చినట్లయితే పోలీసు అధికారుల అబద్ధాలతోపాటు, దిగజారుడుతనమూ అందరి దృష్టికి వచ్చి ఉండేది. కాగా ఆశ్చర్యాన్ని బాధను కలిగించే విషయం-కేసు విచారణలో ఎన్నో అవరోధాలను తీసికొనిరావటం. నేను న్యాయస్థానంలో విరోధించిన దాని ప్రభావం మాతృభూమి భక్తులను దమనకాండలో నలగగొట్టే ప్రభుత్వంమీద ఏమీ ఉండబోదని నాకు బాగా తెలుసు. నేను ఇప్పుడూ చెప్తన్నాను-హిందూస్థానం హిందూస్థానీయులదే. స్వరాజ్యం సాధించటం మా అంతిమ ధ్యేయం. ప్రభుత్వం నా ఉపన్యాసాన్ని రాజద్రోహకరంగా అర్థం చేసుకోగల్లుతున్నదీ అంటే దాని అర్థం నేటివరకు బ్రిటీషు ప్రధానమంత్రి ద్వారా, ప్రభుత్వంద్వారా స్వయంనిర్ణయములగురించి చేసిన ప్రకటనలు కపటంతో కూడిన పైపైమాటలే నన్నమాట. కాని నాకు సర్వశక్తిమంతుడైన ఈశ్వరుని న్యాయం మీద అచంచలమైన విశ్వాసం ఉంది.”

    జూలై 9న డా॥ హెడ్గేవార్ తిరిగి ప్రశ్నలడగడానికిగాను ప్రభుత్వ సాక్షులను మరల పిలిపించవలసిందిగా న్యాయస్దానాన్ని కోరారు. తన తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని బహిష్కరించిన కారణంగా ఆ సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయటం జరగలేదని ఆయన వాదించారు. కాని 108వ సెక్షన్‌ ప్రకారం ఆ సాక్షులను మళ్ళీ పిలవటం కుదరదని న్యాయమూర్తి జవాబిచ్చారు. డా॥ హెడ్గేవార్ న్యాయస్థానంలో అనేక సాక్ష్యాధారాలను చూపించి తరచి తరచి ప్రశ్నించటం తనకు సహజమైన హక్కు అని చెప్పారు. దీనికి ప్రభుత్వంతరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పాడు. చట్టం ప్రకారం సాక్షులను విచారించే విషయంపట్ల దృష్టి పెట్టకుండా న్యాయస్థానంలో డా॥ హెడ్గేవార్ ప్రవర్తనమీదనే దృష్టి నిలిపి వాదించసాగాడు. జూన్‌ 13 తర్వాత ఏ సాక్షిని ప్రశ్నించేందుకు అనుమతి లేదని న్యాయమూర్తి ప్రకటించిన దరిమిలా జూలై 9న డా॥ హెడ్గేవార్ తన లిఖిత వాజ్మూలాన్ని ఇచ్చారు.

క) నా ఉపన్యాసం చట్టరీత్యా ఏర్పడిన బ్రిటీషు ప్రభుత్వంపట్ల అసంతృప్తిని, ద్వేషాన్ని, ద్రోహాన్ని రెచ్చగొట్టేదిగా ఉన్నదని, హిందూస్థానీయులకు, యూరోపియన్‌ ప్రజలకు నడుమ శత్రుత్వాన్ని సృష్టించేదిగా ఉందని ఆరోపిస్తూ సంజాయిషీ చెప్పుకోవలసినదిగా నన్ను కోరారు. ఒక భారతీయుడు చేసిన ఒక కార్యాన్ని గురించి ఒక పరాయి ప్రభుత్వం నిర్దెతగా కూర్పోవటం నాకు, ఎంతో గొప్పదైన నా దేశానికి అవమానకరమని నేను భావిస్తున్నాను.

ఖ) నేడు హిందూదేశంలో న్యాయసమ్మతమైన ప్రభుత్వమేదీ లేదని నా విశ్వాసం. ఉన్నదని ఎవరైనా అంటే నా కాశ్చర్యం కలుగుతుంది. నేడిక్కడ ఉన్నది పశుబలంతో మా నెత్తిన రుద్దబడుతున్న భయప్రమాదముల సామ్రాజ్యం మాత్రమే. చట్టం దానికి బానిస, న్యాయస్థానాలు ఆ ప్రభుత్వపు కీలుబొమ్మలు. ప్రపంచంలో ఎక్కడైనా - ఏ ప్రభుత్వానికైనా-పరిపాలనార్ధ్హత ఉండాలంటే అది ప్రజలచేత ప్రజలలోనుండి ప్రజల నిమిత్తమై ఏర్పడిన ప్రభుత్వమై ఉండాలి. అలా ఏర్పడని ప్రభుత్వాలు దేశాలను దోచుకొనదానికి ధూర్తులు ఒక ఎత్తుగడతో నడిపే కపటనాటకాలకు చిహ్నాలు మాత్రమే.

గ) నేను నా దేశ సోదరులలో మాతృభూమిపట్ల అమితమైన భక్తిని మేల్మొల్పడానికి ప్రయత్నించాను. హిందూస్థానం హిందూస్థానీయులది అనే భావాన్ని నా ప్రజల హృదయాలపై ముద్రించడానికి ప్రయత్నించాను. ఒక భారతీయుడు రాజద్రోహం చేయనిదే ఈ భావాలు నిర్మించలేని స్థితి ఏర్పడిందంటే, భారతీయులకు ఐరోపా ప్రజలకు మధ్య శత్రుత్వం రెచ్చగొట్టనిదే సత్యాన్ని స్పష్టంగా ప్రకటించలేని స్థితి దాపురించిందంటే, తమను భారతప్రభుత్వంగా చెప్పుకొనే యూరోపియనులు ఈ హెచ్చరికను గుర్తించి ఇప్పుడు వారు తిరిగి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించాలి.

ఘ) నా ఉపన్యాసానికి నోట్స్‌ పూర్తిగాగాని, సరిగాగాని వ్రాయబడలేదు. నా ఉపన్యాసానికి ముక్కలు చెక్కలుగా సమన్వయం లేని తీరులో, నిరర్ధ్థకంగానో లేదా విపరీతార్థాలు తీస్తూనో వివరణ ఇచ్చారు. కాని దీనిగురించి నాకు విచారం లేదు. రెండు జాతులమధ్య సంబంధాలు ఏ మౌలికతత్వాన్ని ఆధారంచేసికొని నిర్ణయింపబడుతాయో, దానిని ఆధారం చేసికొనే బ్రిటన్‌ ప్రజలతోగాని, ఇతర యూరోపియన్‌ దేశాల ప్రజలతోగాని నేను మాట్లాడుతాను. నేను ఏది మాట్లాడినా అది మనదేశవాసుల అధికారాన్ని స్వాతంత్ర్యాన్ని ప్రస్థాపించటం నేను సహర్షంగా సిద్ధమైయున్నాను. నామీద ఆరోపించబడిన అంశాలగురించి నేనేమీ చెప్పదలచ లేదుగాని, నా ఉపన్యాసాలలోని ప్రతి ఒక్క అక్షరాన్ని సమర్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవన్నీ పూర్తిగా న్యాయోచితమైనవేనని వక్కాణిస్తున్నాను.”
    ఆగస్టు ర్‌న న్యాయమూర్తి స్మెలీ మరల విచారణ చేపట్టినపుడు తనపై ఆరోపణలకు జవాబు చెప్పడానికి డా॥ హెడ్గేవార్ కి అవకాశమిచ్చాడు. అప్పుడు డా॥ హెడ్గేవార్ విపులంగా, సంవేదనశీలమైన, వివేకపూర్ణమైన శైలిలో సామ్రాజ్యవాదపు దుస్తంత్రాన్ని ఎండగట్టారు. ఆ వివరణ నిజంగా భారత జాతీయత యొక్క ఉన్నతస్థాయి ప్రకటీకరణం. అందులో ఇలా అన్నారు.

    “నేను ప్రభుత్వాన్ని, ఉద్యోగుల వర్గాన్ని-ఇద్దరినీ తప్పుబట్టవలసి వస్తోంది. నేను చెప్తే బ్బ ఈ మాటలను మీరు ప్రభుత్వసేవకులనే మాట మరచిపోయి మామూలు వ్యక్తులుగా కొద్దిసే సపు శ్రద్ధగా వినండి. ప్రభుత్వం నా కేసు విచారణలో ముగ్గురు పోలీసులను సాక్షులుగా ప్రవేశపెట్టింది. నా ఉపన్యాసం గురించిన పోలీసు సు రిపోర్ట మాత్రమే కేసుకు ఆధారమని పోలీసులు అంగీకరించారు. కాబట్టి వారిని సాక్షులు అనటం కంటే వాదులు అనటం సమంజసంగా ఉంటుంది- వారు ప్రభుత్వానికి పూర్తిగా దాసులు. తమ పొట్ట నింపుకోవటంకోసం వారు ప్రభుత్వంపై ఆధారపడినవారు. కాబట్టి వారు ప్రభుత్వం తరపున అబద్దాలసాక్ష్యాన్ని చెప్పటంలో ఆశ్చర్యమేమీ లేదు. వాదిపక్షం తక్కువలో తక్కువగా ఒకరినైనా ప్రభుత్వసేవకులు కాని వ్యక్తిని సాక్షిగా పిలిచి ఉండవలసింది. కాని తమ తరఫున ఇచ్చకాల రాయుక్షైన సేవకులుతప్ప మరెవరూ సాక్షిగా ఉండరని ప్రభుత్వానికి తెలుసు”.

    డా॥ హెడ్గేవార్ న్యాయమూర్తి స్మెలీ గతంలో చేసిన కొన్ని నిర్ణయాలను ఉదహరించి తాను చెప్పే విషయానికి బలం చేకూర్చుకొన్నారు. ఇటువంటి కేసులో పోలీసు అధికారులకంటే స్వతంత్రసాక్షులు అధికంగా విశ్వసనీయులు” అని డా॥ ఎం. ఆర్‌. చోల్మర్‌ కేసులో స్మెలీ, నారాయణరావ్‌ వైద్య కేసులో జ్యుడీషియల్‌ కమీషనరు-చెప్పిన విషయాన్ని గుర్తుచేసి మూడునెలల క్రిందట తానేర్చరచిన పద్ధతిని ఈ కేసులో స్మెలీ స్వయంగా కొట్టిపారేస్తున్నారని, ఎత్తిచూపించారు. బ్రిటీషు ప్రభుత్వం నాగపూర్‌ జాతీయవాదులలో డా॥ హెడ్గేవార్ మీదనే ప్రముఖంగా గురిపెట్టిందని గుర్తించడానికి ఈ నిదర్శనం చాలు.

ఈ విధంగా ప్రశ్నలపర్వం తరువాత డా॥ హెడ్గేవార్ ప్రజలతోను, న్యాయవాదుల తోనూ క్రిక్కిరిసి ఉన్న న్యాయస్థానంలో జాతీయవాదాన్ని గురించి గొంతెత్తి చెప్పారు. “హిందూస్థానం హిందూస్థానీయులదే -కాబట్టి మనకు స్వరాజ్యం కావాలి” అన్నది సాధారణంగా నా ఉపన్యాసాలలో ఉండే విషయం.
  అయితే ఇంతమాత్రమే చెప్తే సరిపోదు. స్వరాజ్యం ఎలా సంపాదించుకోవాలి, స్వరాజ్యాన్ని సాధించుకొన్న తర్వాత మనం ఎలా మెలగాలి- ఈ విషయంకూడా ప్రజలకు అవగతం చేయాలి. అది జరగకపోతే “యథారాజా, తథా ప్రజా” అన్న సామెత ననుసరించి ప్రజలు ఆంగ్లేయులను అనుసరించటం మొదలుపెట్టారు. ఇటీవల ప్రపంచయద్ధం సందర్భంలో- ఆంగ్రేయులు తమ రాజ్యంతో సంతృప్తి చెందరని, ఇతరుల దేశాలను ఆక్రమించుకొని వాటిని అధీనంలోకి తెచ్చుకొంటారని, వాటిపైన తమపాలనను రుద్దుతారని, కాని తమ స్వాతంత్ర్యం ప్రమాదంలో పడినప్పుడు వారే ఆయుధాలు పట్టుకొని, రక్తపుటేరులు ప్రవహింపజేయడానికి సందేహించని ప్రజలందరికీ అర్ధమైంది.
    కాబట్టి ఆంగ్రేయుల సైతాన్‌ నాగరికతను అనుకరించవద్దు అని మేము మా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఏర్పడింది. మనం స్వాతంత్రాన్ని శాంతియుతంగా సంపాదించుకోవాలి, స్వాతంత్ర్యాన్ని సాధించుకొన్న తర్వాత మనం ఇతరదేశాలపై దురాక్రమణ పాల్పదడకూడదు, మన రాజ్యంతో మనం సంతృప్తి చెందాలి” అని మేము మా ప్రజలకు చెప్పాలి. ఈ విషయం వారికి బాగా అవగాహన కావటం కోసం ఒక దేశం మరొక దేశంపై (ఒక జాతి మరొక జాతిపైన) పాలన సాగించటం అన్యాయమని చెప్పటం కూడా అవసరమమౌతోంది. అలా చెప్పే సమయంలో ఈనాటి రాజకీయ పరిణామాలను చర్చించటం అత్యంత సహజమైన విషయం.

“మన ప్రియతమ మాతృభూమిమీద పరాయివారు పాలన సాగిస్తూ ఉండటం దురదృష్టకరం. ప్రభుత్వ న్యాయవాదిగారు, మిమ్మల్ని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతాను- ఒకజాతి ప్రజలమీద మరొకజాతి ప్రజలు ప్రభుత్వం చలాయించడానికి అధికారమిచ్చే చట్టం ఏదైనా ఉందా ? మీరు నా ప్రశ్నకు జవాబివ్వగలరా ? ఇటువంటి విషయాలు సహజసిద్ధమైన నియమాలకు వ్యతిరేకం కాదా ? ఒక జాతి ప్రజలకు మరో జాతి ప్రజలపై ప్రభుత్వం చలాయించే అధికారం లేనపుడు ఆంగ్లేయులకు హిందూస్టానీయులను తమ కాళ్ల క్రింద త్రొక్కిపడవేస్తూ పాలన సాగించే అధికారం ఎవరిచ్చారు ? ఆంగ్రేయులు మన దేశానికి చెందినవారు కానే కాదు. మరివారు భారతీయులను బానిసలుగా పడి ఉండడానికి బాధ్యులుగా చేస్తూ, ఆంగ్రేయులు పశుబలాన్ని ఉపయోగించి తమకు తాముగా పాలకులమని ప్రకటించుకొన్నారు. ఇది న్యాయాన్ని నీతిని, ధర్మాన్ని హత్యచేయటం కాదా ?

   “ఇంగ్లాండును పారతంత్ర్యంలోకి నెట్టి, వారిమీద రాజ్యం చేయాలనే కోరిక మనకు ఏనాడూ లేదు. అయితే బ్రిటన్‌ ప్రజానీకం బ్రిటన్‌ను ఎలా పరిపాలించు కొంటున్నారో, జర్మనీ ప్రజానీకం జర్మనీని ఎలా పరిపాలించు కొంటున్నారో, మనం కూడా అదేవిధంగా మన దేశంమీద మన జాతీయుల పరిపాలనే ఉండాలని కోరుకొంటున్నాం. మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావలసిందే. ఈ విషయంలో ఎలాంటి రాజీ సాధ్యం కాదు.”
   ముగింపులో ఆయన ప్రభుత్వ న్యాయవాదిని మరల సారగర్భితంగా ఇలా ప్రశ్నించారు- “స్వాతంత్రేచ్చ కలిగిఉండటం చట్టవిరుద్ధమా ? నీతిబాహ్యమా ? చట్టాలను నైతికతను రక్షించడానికి రూపొందించుతారేగాని, నైతికతను చంపివేయడానికి కాదని నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది '.
   డా॥ హెడ్గేవార్ ఉపన్యాసం ముగిసిన తర్వాత వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వ న్యాయవాది ఇలా అన్నాడు “డాక్టర్‌ హెడ్గేవార్ గారి ఉపన్యాసం సూటిగా, సరళంగా, స్పష్టంగా ఉంది. అయితే సభల్లో ఉపన్యసించేటప్పుడు ఇందుకు భిన్నంగా ఉంటుందేమో ! నోట్సు వ్రాసికొనే పోలీసు అధికారులు తప్పుడుబుద్ధితో వ్యవహరించవలసిన కారణమేమి లేదు.”
   కేసులో తీర్చు చెప్పవలసిన తేదీగా ఆగస్టు 19ని నిర్ణయించారు. ఈ రోజున న్యాయస్థానం లోపల, బయటా కూడా అనూహ్యమైన రీతిలో పెద్ద గుంపుగా ప్రజలు వచ్చారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు స్మెలీ నిర్ణయాన్ని ప్రకటించాడు. డా॥ హెడ్గేవార్ ఇచ్చిన వాజ్మూలాన్ని ప్రస్తావించి “ఏ ఉపన్యాసాన్ని గురించి విచారణ జరుపుతున్నామో దానికంటే మించి రాజద్రోహకరంగా ఉంది ఈ ప్రకటన” అని వ్యాఖ్యానించాడు. తన నిర్ణయాన్ని వినిపిస్తూ “మీ ఉపన్యాసం నిస్సందేహంగా రాజద్రోహకరంగా ఉంది. కాబట్టి ఒక సంవత్సరంవరకు ఈ తరహా ఉపన్యాసాలు చెప్పనని హామీ ఇస్తూ దానికి జమానతుగా ఒక్కొక్కటి వెయ్యేసి రూపాయలకు ఇరువురి నుండి హామీ పత్రాలను కూడా దాఖలు చేయాలని, మరో వెయ్యి రూపాయలకు వ్యక్తిగత హామీపత్రాన్ని వ్రాసి ఇవ్వాలనీ”
ఆదేశించారు.
  1. మహారాష్ట్రపత్రిక 1921 ఆగస్టు 10, పుట-5
   డా॥ హెడ్గేవార్ మరోసారి వలసవాద ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు- “మీరు ఏమి నిర్ణయం చేసికొంటారో చేసికోండి. నేను దోషిని కాదు. నేను నిర్ణోషినని నా అంతరాత్మ ఫఘోషిస్తోంది. ప్రభుత్వం ఈ విధమైన దమనకాండద్వారా ఇప్పటికే ప్రజ్బరిల్లుతున్న అగ్నిలో అజ్యం పోసే పనిచేస్తోంది. ఈ విదేశీ ప్రభుత్వం ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన రోజు త్వరలోనే వస్తుందని నా విశ్వాసం. సర్వశక్తి మంతుడైన ఈశ్వరుని న్యాయంమీద నాకు విశ్వాసముంది. అందువల్ల జమానతు, హామీపత్రాలు ఇవ్వటం నాకు అంగీకారం కాదు.”

ఆ తర్వాత వారికి ఒక ఏడాదిపాటు కఠిన కారాగారవాస శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రకటించాడు.
  న్యాయస్థానం నుండి డా॥ హెడ్గేవార్ బయటకు రాగానే నాగపూర్‌ కాంగ్రెస్‌ ప్రముఖ నాయకులందరూ పూలమాలతో వారిని స్వాగతించారు. వేలాదిమంది జయజయధ్వానాలు చేశారు. నగర్‌ కాంగ్రెస్‌ తరఫున వచ్చిన వారిలో శ్రీ గోఖలే, డా.ముంజే, విశ్వనాథరావు కేల్కర్‌, దామూ దేశ్‌ముఖ్‌, హర్శరే, సమీయుల్లాఖాన్‌, అలేకర్‌, వైద్య, మండలేకర్‌ తదితర ప్రముఖులున్నారు. డా॥ హెడ్గేవార్ పినతండ్రి మోరేశ్వర్‌ డా॥ హెడ్గేవార్, అన్నగారు సీతారామపంత్‌లు కూడా ఉన్నారు. డా॥ హెడ్గేవార్ వారందరిని ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించిన తర్వాత జైలుకుపయనమైనారు. ఆనాటి రాజకీయాలలో తిష్టవేసికొని ఉన్న రెండు రకాల భ్రమలను తొలగించే ప్రయత్నం ఆయన తన ఉపన్యాసంద్వారా చేశారు. న్యాయస్థానంలో సాక్షులను, ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించి, నిందితుడు తమను రక్షించుకొనడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా దానిని దోషంగా భావిస్తూ ఉండటం మొదటి భ్రమ కాగా, జైలుకుపోవడాన్ని స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి పర్యాయపదంగా భావించటం రెందవది.
    ఆయన ఇలా ప్రసంగించారు - “రాజద్రోహ నేరాన్ని ఆరోపించిన ఈ కేసులో నేను నా వాదాన్ని వినిపించాను. రక్షించుకొనడానికి వాదించినవాడు దేశద్రోహి అనే అభిప్రాయం నేడు చాలామందిలో ఉంది. ఆత్మరక్షణ చేసికొనకుండా నల్లిలా నలిపివేయబడటం సమంజసమని నేను భావించబడటం లేదు. ప్రభుత్వం యొక్క
  1. కేసరి 1921 ఆగస్సు 28 మరియు 380 పుట-7
నీచబుద్ధిని మనం తప్పక బహిర్గతం చేయాలి. ఇందులోనూ దేశసేవ ఉంది. ఆత్మరక్షణకు యత్నించకపోవటం ఆత్మమాతక మవుతుంది. రక్షణకు వాదించటంలో మీకు ఆనందం లేకపోతే, అందుకై యత్నించవద్దు, కాని రక్షణకు వాదించేవారిని అసహ్యించుకొనే చులకనదృష్టిలో చూడటం తగదు.
    “మాతృభూమి రక్షణలో జైలుకు వెళ్ళటం మాత్రమే కాదు, ద్వీపాంతరవాస శిక్షలకు, ఉరికంబాలనుండి వ్రేలాడదీయబడడానికి కూడా సంసిద్ధులం కావాలి. అయితే జైలుయాత్ర అంటే స్వర్గప్రాప్తి అని గాని, అదే స్వాతంత్ర్య ప్రాప్తి అనిగాని భ్రమలలో విహరించవద్దు. కేవలం జైలుకు వెళ్ళకుండా, బయటనే ఉండి, అనేక రకాలుగా దేశసేవ చేయవచ్చు. నేను ఒక ఏడాదిలో తిరిగి వస్తాను. అప్పటివరకు దేశం తీరుతెన్నెలు నాకు తెలుస్తూ ఉండకపోవచ్చును. అయితే హిందూదేశానికి పూర్ణనస్వాతంత్ర్యం సాధించే ఉద్యమం ప్రారంభమవుతుందని నా విశ్వాసం. హిందూ దేశాన్ని ఇంకా విదేశీప్రభుత్వంయొక్క అధీనంలో ఉంచటం సాధ్యం కాదు. ఇంకా బానిసతనంలోనే త్రొక్క్మిపట్టి ఉంచటం కుదరదు. నేను మీ అందరికీ బుణపడి ఉన్న విషయాన్ని మనస్ఫూర్తిగా గ్రహించుకొని ఒక ఏడాదికోసం సెలవు వేడుతున్నాను.”

   డా॥ హెడ్గేవార్ అరెస్టు కావడంతో మధ్యప్రాంతాల రాజకీయజీవనంలో ఒక ప్రేరణదాయకమైన ఊపు వచ్చింది. ఆగస్టు 19న నాగపూర్‌లో ఆయనకు మద్దతుగా ఒక పెద్దసభ జరిగింది. గోవిందరావ్‌ దేశముఖ్‌ అధ్యక్షత వహించారు. ప్రాంతస్థాయి ప్రముఖ నాయకులందరూ హాజరైనారు. నవయువకుల నిజమైన నేత అంటూ ఆయన త్యాగం మాటలలో వివరించేది కాదని అలేకర్‌ అన్నారు. కేసరి, మహారాష్ట్ర యంగ్‌ పేట్రియాట్స్‌ ఉదయ మొదలైన ప్రాంతీయ వార్తాపత్రికలు ఆయన న్యాయస్థానంలో వీరత్వాన్ని దర్శింపజేస్తూ ఉన్నత స్థాయిలో వినిపించిన వాదనను, ఉపన్యాసాన్ని ఎంతగానో మెచ్చుకొన్నాయి. అమరావతి నుండి వెలువడే '“ఉదయి ఆయనను శ్లాఘిస్తూ ఇలా సంపాదకీయం వ్రాసింది. న్యాయస్థానంలో డా॥ హెడ్గేవార్ ప్రకటన స్పష్టంగా, సూటిగా ఉంది. డా॥ చోల్మర్‌ వలెనే ఈయన కూడా స్వాతంత్ర్యం యొక్క లక్ష్యాన్నే ప్రతిపాదించారు. అయినప్పటికీ ఈయనకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ విధమైన శిక్ష ఉన్నత ఉద్యోగివర్గంమీద ఆధారపడిన పాలనవ్యవస్థకు వ్యతిరేకంగా ఆక్రోశము, దేషము చోటు చేసుకొనకుండా ఆపలేదు.

ఈ కేసుకు మరింత ప్రాధాన్యం, విశేషత సంతరించుకొనడానికి మరో కారణమూ ఉంది. డా॥ హెడ్గేవార్ ఎక్కడా, ఏ క్షణంలోనూ పూర్ణస్వాతంత్ర్యమనే భవ్యమైన కల్పననుండి ఒక్క మెట్టు దిగిరాలేదు. రాజీపడదలచుకోలేదు. సామ్రాజ్య వాదాన్ని ఆయన ప్రతి ఘటించినది తాత్కాలిక ఆవేశంతోనో, మనోభావనల ఆధారంగానో కాదు. న్యాయశాస్తపరంగా, నైతికంగా, రాజకీయంగా, ఆర్థికశాస్త పరంగా అన్నివిధాలా సామ్రాజ్యవాదం ప్రకృతి నియమాలకు విరుద్ధ మైనదని డా॥ హెడ్గేవార్ స్పష్టీకరించారు. వలసపాలన కాలంలో సామ్రాజ్యవాదాన్ని సిద్ధాంత పరంగా విరోధించిన చరిత్రకు ఇది ఒక దృష్టాంతం. ఆనాడు ఆయన జాతీయస్థాయి నాయకుడు కాదు. కాని ఆయన త్యాగము, న్యాయస్థానంలో ఆయన ఇచ్చిన దేశభక్తి పూరితమైన వాబ్మ్మూలమూ ఆయన విశ్వసనీయతను, జనాదరణను ఎంతగానో పెంపొందించాయి. ఆయన చేసిన పని ప్రాంతంలోని యువ జాతీయవాదులకు ఎంతో శక్తిని ఉత్సాహాన్ని (ప్రేరణను ఇచ్చిన ప్రోతస్సుగా రూపుదిద్దుకొంది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top