భిన్నత్వం మరియు ఐక్యత - Diversity and unity

0
భిన్నత్వం మరియు ఐక్యత - Diversity and unity
Dr. Mohan Bhagwat

"భిన్నత్వం మరియు ఐక్యత
ప.పూ "మోహన్ భాగవత్ జీ" గారి ఉపన్యాసం 16-12-2015

వైవిధ్యానికి మారుపేరు మనదేశం. భాషలో, సంప్రదాయాల్లో, రుచుల్లో, అభిరుచుల్లో, ఆహారపు అలవాట్లలో, వాతావరణ పరిస్థితులలో, సామాజిక పరిస్థితులలో, దైవారాధన పద్ధతులలో అంతా వైవిధ్యమే. అంతా భిన్నత్వమే. మరే ఇతర దేశంలోనూ ఈ స్థాయిలో వైవిధ్యం ఉండదు. ఈ వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాలి. వైవిధ్యం ఒకరకంగా మనకు దేవుడిచ్చిన వరం. అయితే వైవిధ్యం ఐకమత్యాన్ని దెబ్బతీయకూడదు. ఐకమత్యాన్ని దెబ్బతీయాలనుకొనే శక్తులు వైవిధ్యాన్ని ఆధారంగా చేసుకొని వేర్పాటువాదనలు చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టుతున్నారు. భాషపేరుతోనో, కులంపేరుతోనో, మతంపేరుతోనో, సాంప్రదాయంపేరుతోనో వేర్పాటుభావనలను రెచ్చగొట్టి మన భిన్నత్వంలోని ఏకత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిపట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మన వైవిధ్యాన్ని కాపాడుకోవటానికి, సమాజాన్ని ఐక్యంగా ఉంచటానికి మనం చేస్తున్న కృషిని కొనసాగించాలి. ఎదుటివారి ఆచార్యవ్యవహారాలను, సాంప్రదాయాలను జీవనసరళిని, అవి మనకు భిన్నంగా ఉన్నప్పటికీ, గౌరవించటాన్నీ మనం నేర్చుకోవాలి. సమానత్వం ప్రాతిపదికగా ప్రతి వ్యక్తి ఎదుటివ్యక్తులను గౌరవించటం, వారి ఆకాంక్షలను, ఆశలను అర్ధంచేసుకోవటం చాలా అవసరం.

మనదేశంలో విభిన్న కులాలు ఉన్నాయి. ప్రతి కులంలోనూ అనేక ఉపకులాలు ఉన్నాయి. కులవివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాజిక సమరసత సాధన దిశగా కుల వివక్షను రూపుమాపటం అనేది మనముందు ఉన్న పెద్ద సవాలు. కులవివక్ష పెద్దపెట్టున ఉన్న విషయం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవగతం అవుతుంది. అయితే చాలామంది ఈ వాస్తవాన్ని చూడటానికి నిరాకరిస్తున్నారు. నిరాకరణ, తిరస్కారం సమస్యను దాటవేసే ధోరణే తప్ప సమస్యకు పరిష్కారంకాదు. కులవివక్ష ఉంది కాని, తీవ్రమైన స్థాయిలోలేదని కొందరు అంటుంటారు. అయితే అలాంటి ఆలోచనాధోరణులు (నిరాకరణ, తిరస్కరణ ధోరణులు) అనారోగ్యకరమైనవి. అలాంటి ధోరణులవలన సామాజిక అసమానతలకు, కులవివక్షతకు సమర్థకులుగా మనకు ముద్రపడుతుంది. కొద్దిమంది దాటవేసేవారివల్ల, అసలు సమస్యే లేదనేతిరస్మారవాదులవలన సమస్య తీవ్రతను అర్ధం చేసుకోలేకపోవటమూ జరుగుతుంది. అంతేకాక కొందరు రాజకీయనేతలు సమస్యను తమ స్వప్రయోజనంకోసం వాడుకొని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో తీవ్రమైన కృషి జరగనప్పుడు, కులవివక్షవలన బాధితులైనవారు మిగిలిన సమాజంపట్ల తీవ్ర ఆగ్రహవేశాలను భ్యత్తపరస్తాళరూరు వారి ధర్మాగ్రహానికి అర్థమూ ఉంది. ఆధారమూ ఉంది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top