సమతకు మారుపేరు "జగద్గురు రామానుజులు" - Jagadguruvulu Ramanuja Acharya

0
సమతకు మారుపేరు "జగద్గురు రామానుజులు" - Jagadguruvulu Ramanuja Acharya
జగద్గురు రామానుజులు
బండారి రమేశ్‌, విహాచ్‌ప తెలంగాణ ప్రాంతకార్యదల్శి

“ఓం నమో నారాయణాయ"
ఇదొక మంత్రం..
మనిషికి మోక్షాన్ని ప్రసాదించే గొప్ప తంత్రం...

  ఈ మంత్రాన్ని గురువు గోష్టిపూర్జుల వారు శిష్యుడు రామానుజులకు చెవిలో రహస్యంగా ఉపదేశించారు. ఈ మంత్రం ఒకసారి వింటే లేక పఠిస్తే మనిషికి మోక్షం లభిస్తుందన్నారు. కానీ ఈ మంత్రాన్ని నువ్వు వేరేవారికి చెపితే నరకానికి పోతావని హెచ్చరించారు. అయితే శిష్యుడు రామానుజులు ఆ మరుసటిరోజే గుడి గోపురం ఎక్కి ఆ చుట్టుపక్కల ప్రజలందరినీ పిలిచి "ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని అందరికీ వినబడేలా బిగ్గరగా చెప్పాడు. ఈ మంత్రం పఠిస్తే అందరికీ మోక్షం లభిస్తుందనీ చెప్పాడు. ఈ విషయం గురువు గోష్ఠిపూర్ణుల వారికి తెలిసింది. ఆయనకు శిష్యునిపై కోపం వచ్చింది, ఉగ్రుడయ్యాడు. శిష్యుని పిలిపించాడు, ఎందుకు అలా చేశావని ప్రశ్నించాడు. శిష్యుడు రామానుజుడు అతి శాంతంగా చెప్పిన సమాధానం విని గురువు మరింత 'ప్రసన్నుడయ్యాడు. 'నువ్వు కారణ జన్ముడివి అంటూ ప్రశంసించాడు. ఇంతకీ ఏమిటా సమాధానం ? 
   రామానుజుడు ఏం సమాధానం చెప్పాడో అందరికీ తెలిసినదే. “అందరికీ మోక్షం ప్రసాదించే మంత్రాన్ని బహిర్గతం చేసిన తనకు నరకం ప్రాప్తించిన ఫరవాలేదు” అనేదే ఆ సమాధానం. ఇదీ రామానుజుల గొప్పతనం. అందుకే ఆయన జగద్గురువులయ్యారు. అలా అందరూ సమానులే, అందరి భావం ఆయనలో పుట్టుకతోనే కలిగింది. క్రీ.శ 1017లో తమిళనాడులోని నేటి శ్రీ పెరంబదూరులో జన్మించిన రామానుజులు చిన్ననాటనే సన్యాసం స్వీకరించి తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేశారు. రామానుజులు పెద్దవారయ్యాక ఆయన వద్దకు వచ్చే ఒక శిష్యురాలు తనకు మోక్షం ప్రసాదించమని ఆ రంగనాథ స్వామికి చెప్పమని రామానుజులను వేడుకుంది. ఆ కోరిక విని ఆశ్చర్యపోయిన రామానుజులు “తాను చెపితే ఆ రంగనాథుడు మోక్షం ప్రసాదించడు” అని, తాను రంగనాథ స్వామికి చెప్పగలిగేంత వాడిని కాదని చెప్పారు. అయితే ఆ శిష్యురాలు పట్టుబట్టింది. ఆ కోరికను పదే పదే కోరింది. అయినా రామానుజులు పట్టించుకోలేదు. చివరికి ఆమె “ఈమెకు మోక్షం ప్రసాదించండి” అని ఒక కాగితం మీద రాసివ్వండి అని అడిగింది. ఇక ఆమె పట్టుదలను కాదన లేక రామానుజులు ఆమె అడిగిన విధంగానే 'ఈమెకు మోక్షం ప్రసాదించవలసింది అని కాగితంపై రాసి ఇచ్చారు. = ఆ కాగితాన్ని ఆమె రంగనాథ స్వామి విగ్రహం వద్ద పెట్టగానే ఆమెకు మోక్షం లభించింది. రామానుజులు కేవలం కాగితం మీద రాసినంతనే ఆ రంగనాథ స్వామి ఆమెకు మోక్షం ప్రసాదించాడు. అంతటి గొప్ప భక్తుడు, మహనీయుడు, బుషి జగద్గురు రామానుజులు.

  ఆయన మోక్షం కలిగించే మంత్రాన్ని అందరికీ చెప్పటమే కాదు, ఆ రోజుల్లో ఆలయ ప్రవేశానికి నోచుకోని, పంచమ కులంగా భావించేవారందరికీ ఆలయ ప్రవేశం కల్పించి, అందరికీ సమానత్వం కల్పించారు. ఇటువంటి సమానత్వం దేశవ్యాప్తంగా అందరికీ కల్పించాలనే గొప్ప సంకల్పంతో దేశవ్యాప్తంగా పర్యటించారు. దేశంలోని అన్ని దివ్యక్షేత్రాలను తన శిష్య బృందంతో కలిసి కాలి నడకన పర్యటించి, దర్శించారు. జగద్దురు ఆదిశంకరాచార్యులు జన్మించిన సమయంలో హిందుత్వంలో పొడసూపిన ఎన్నో మూఢ నమ్మకాలను శంకరులు నిర్మూలించి హిందుత్వాని కొత్త చైతన్యాన్ని కలిగించారు. ఆ తరువాత మళ్లీ రామానుజులు జన్న్మించేనాటికి హిందుత్వంలో మళ్లే ఎన్నో మూఢ నమ్మకాలు పొడసూపాయి. అనేకమంది వులు తమ కులం చేత ఆలయ ప్రవేశానికి దూరం అయ్యారు. సమాజంలో ఎక్కడ చూసినా వివిధ పంథాలనుసరించే వారి మధ్య విభేదాలు పొడసూపాయి. వేర్వేరు శాఖలు వేర్వేరు సిద్ధాంతాలను ప్రవచిస్తూ తమ సిద్ధాంతమే గొవ ఉటంకిస్తూ మూల ఉపనిషత్సారాన్ని ప్రజలకు దూరం చేశారు. ఇలా వారి విభేదాలు తారాస్థాయికి చేరాయి. వీటన్నిటినీ నిర్మూలించి సమాజాన్ని మళ్లీ ఐక్యం చేయ సంకల్పించారు జగద్గురు రామానుజులు. అంతకుముందు జగద్గురు ఆదిశంకరులు ప్రవచించిన అద్వైత సిద్ధాంతానికి మరింత పదును పెట్టి విశిష్టాద్వైతాన్ని ప్రవచించారు. నాడు తమలో తాము కొట్టుకుంటున్న బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక సంస్కృతికి చెందినవేనని, ఇవన్నీ దైవాన్ని కొలవటానికే తప్ప వేర్వేరు మార్గాలు కావని స్పష్టం చేశారు. అలా విశిష్టాద్వైతంతో దేశవ్యాప్తంగా హిందుత్వంలోని వివిధ పంథాలు, శాఖల మధ్య సమన్వయం కుదిర్చి హిందుత్వానికి మళ్లీ పునర్‌ వైభవం చేకూర్చారు.. అయన జన్మించి నేటికి వేయేళ్లు దాటినప్పటికీ ఆయన చూపిన మార్గం సమాజానికి అనుసరణీయంగా ఉంది.

సమతామూర్తి జగద్గురు రామానుజులకు తెలంగాణ రాష్ట్రంలో శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి ఆశ్రమంలో వేయి అడుగుల విగ్రహం నెలకొనడం, దానిని మన ప్రధాని నరేంద్రమోదీ వసంత పంచమి రోజున ఆవిష్కరించడం మన రాష్ట్ర ప్రజలందరి అదృష్టం. 

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top