సంత్ రవిదాసు - Sant Ravidas

Vishwa Bhaarath
0
సంత్ రవిదాసు - Sant Ravidas
సంత్ రవిదాసు

సంత రవిదాసు, చర్మ కార వృత్తి అవలంబిస్తూనే గొప్ప సాధకుడయ్యాడు.” భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు.ఆయన సృష్టించిన ఈ మనుషులకు కులతత్వపు అడ్డు గొడలెందుకు? అని ప్రశ్నించారు.తన గుణ కర్మల చేతనే ఉత్తముడవుతాడాని  చాటి చెప్పిన మహాత్ముడు సంత రవిదాసు.

ఆగ్రా పట్టణానికి సమీపం లోని దాస పుర గ్రామం లో చెప్పులు కుట్టే కులం లో జన్మించిన రవిదాస్ క్రీ.శ.1376-1527 మధ్య జీవించాడు. తండ్రి మరియు అన్న పోషణ లో పెరిగాడు.తాను కుట్టిన చెప్పుల జత ను అమ్మడానికి వెళ్లినప్పుడు ఒక బీదవానిని చూసి మనసు చలించి,చెప్పులు అతనికి దానం చేశాడు.దాంతో తండ్రి ఇంటి నుండి తరిమేశాడు . ఊరి చివర ఓ గుడిసె వేసుకుని,దైవ నామ స్మరణ తో కాలక్షేపం చేసేవాడు.ప్రజలలో శాంతి,ప్రేమ లను అందిస్తూ బోధన చేసేవాడు.ఒక రోజు దేవుడే రవిదాస్ ని పరీక్ష చెయడానికి వచ్చాడు.రవిదాస్ వద్దన్నప్పటికి,అన్ని కోర్కెలు తీర్చే “పరుసవేది “అను విలువైన వస్తువును ఇచ్చినా చేతితో ముట్ట లేదు. దేవుడు దానిని గుడిసె చూరు లో పెట్టి వెళ్లి,12ఏళ్లకు తిరిగి    వచ్చినప్పటికి,రవిదాస్ దాని వైపు చూడనైనా చూడలేదు.సామాన్య జీవితంలో అసామాన్య వ్యక్తిగా ఎదిగిన రవిదాస్ గొప్ప ఙ్ఞాని, గొప్ప కవి.

వారణాసి రాజ దర్బార్ లోనూ,అలాగే ప్రయాగ కుంభ మేలా లోనూ రవిదాసు ససత్సంగం నిర్వహించినట్లు చెప్తారు.చిత్తడ్ రాణి ఝాలీ, మీరాబాయి అలాగే కాశీ రాజు మొదలైన వారు  సంత రవిదాస్ యొక్క శిష్యరికం తీసుకున్నట్లు కూడా చెబుతారు. స్వామి రామానంద్,సంత కబీర్ మరియు ఇతర సాధు సంతు లతో ధర్మ రక్షణ కు యాత్ర లు చేశాడని ప్రతీతి.

సంత రవిదాస్ జన్మించిన కాలం లో    ఇస్లాం వ్యాప్తి కోసం హిందువులపై  మొఘలుల దౌర్జన్యాలకు అంతు లేదు.అలాగే హిందూ సమాజం లోని అగ్రవర్ణాల ఆధిపత్యం కూడా తక్కువేమీ కాదు. భక్తి ఉద్యమం ద్వారా    భేద భావాలు లేని సమాజ నిర్మాణానికి స్వామి రామానంద ఆధ్వర్యంలొ తీవ్ర ప్రయత్నం జరుగుతున్నది. ఆయనకున్న ప్రముఖమైన శిష్యులలో సంత రవిదాస్  ఒకరు.

ఈ శిష్యులందరూ సుమారుగా నిమ్న వర్గానికి చెందిన వారే. వీరందరూ సామాన్య ప్రజల మధ్య సరళమైన భాషలో ధర్మ సందేశం అందించటం విశేషం. సంత రవిదాస్ ‘భగవాన్ నామ స్మరణ’ యే మూల మంత్రం గా జపిస్తూ జీవించారు. రవిదాస్ నామ స్మరణ యే హారతిగా,పూజగా,పూల మాలగా తులసీ చందనం గా భావించారు.చదువుకున్నది తక్కువైనా గురువుల ద్వారా,సాధు సంతుల సాంగత్యము అపరిమిత జ్ణానం పొందాడు. కామ,క్రోధ,మోహ,అహంకారాలు ఎప్పటికీ  అతని దరి చేరలేదు. ప్రపంచంలోని అన్ని ప్రాణులలో పరమాత్మ వున్నాడని విశ్వసించే నిర్గుణ బ్రహ్మ ఉపాసకుడు సంత రవిదాస్. బ్రాహ్మణులు కూడా రవిదాస్ పాండిత్యాన్ని చూసి సన్మానించారు.

సంత రవిదాస్ సాహిత్యాన్ని ప్రముఖంగా వెలుగులోనికి తెచ్చిన ప్రముఖ రచయిత డా.వేణీ ప్రసాద్ వర్మ ఏమంటారంటే ” రవిదాస్ మనుశ్యుందరినీ కుల భేదం,చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ గౌరవించే వారు. అలాగే కుల భేదాలు తొలగనంత వరకు మానవులు ఏకం కాలెరని రవిదాస్  విశ్వసించారు. బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర కులాల వారంతా ఒకే జాతి కి చెందిన వారని, పుట్టుకతో కాదు,చేసిన కర్మ ఆధారంగా కులానికి గౌరవం ఏర్పడిందని అంటారు. కొద్ది మందీ పండితుల అభిప్రాయం ప్రకారం రవిదాస్ తండ్రి పేరు ‘రఘు’,  తల్లి పేరు దుర్వినియ , భార్య పేరు ‘లేనా , . అతని కుమారుడి పేరు విజయ దాస్’ అని తెలుస్తున్నది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top